తెవికీ సోదర ప్రాజెక్టులు/వికీకామన్స్

వికీమీడియా కామన్స్ ను కామన్స్ లేదా వికీకామన్స్ అనికూడా అనవచ్చు. ఇది వికీమీడియా ఫౌండేషను ప్రాజెక్టు. ఇది ఉచితంగా అందుబాటులో ఉండే చిత్రాలు, బొమ్మలు, పుస్తకాలు, వ్రాతప్రతులు,  శ్రవణ, దృశ్య మాధ్యమం వంటి మల్టీమీడియా వనరుల భాండాగారం. ఈ ప్రాజెక్టు 2004 సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. దీనికి సంబంధించిన సాంకేతికమైన పని 2004 అక్టోబర్‌కు పూర్తయింది. 2006 నవంబర్ 30 నాటికి ఒక మిలియన్ ఫైళ్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కామన్స్ లో 110,592,266 ఫైళ్లు ఉన్నాయి.  

వికీమీడియా కామన్స్

ఈ ఖజానాలో ఉన్న ఫైళ్ళను వికీపీడియా, వికీబుక్స్, వికీ వ్యాఖ్య, వికీసోర్స్ వంటి ఏ వికీమీడియా (భాషా) ప్రాజెక్టులోనైనా ఎవరైనా  నేరుగా ఉపయోగించుకోవచ్చు. ఒకే ఫైలును వివిధ ప్రాజెక్టుల్లో వాడేటపుడు ప్రతీ ప్రాజెక్టులోకీ ఆ ఫైలును అప్‌లోడు చేసే డూప్లికేషనును నివారించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ఇతర మీడియా భాండాగారాల వలే కాకుండా ఇక్కడి మీడియా ఫైళ్లు ఎవరైనా ఉచితంగా, స్వేచ్చగా ఉపయోగించుకోవచ్చు. సవరించడానికి అదే స్వేచ్ఛతో మెరుగుదలలను (కాపీలు) ఇతరులకు విడుదల చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే మూలానికి, కంట్రిబ్యూటరుకి తగిన విధంగా గుర్తింపు (క్రెడిట్) ఇవ్వవలసి వస్తుంది. ప్రతి ఒక్క మీడియా ఫైల్ లైసెన్స్ పరిస్థితులను వాటి వివరణ పేజీలో కనుగొనవచ్చు.

భాండాగారంలో  ఎవరు చేర్చుతారు

మార్చు

నాణ్యమైన దస్తాలను (ఫైలు) ఎవరైనా చేర్చవచ్చు. వికీమీడియా కామన్స్ భాండాగారంలో (డేటాబేస్), దానిలోని ఫైళ్లు పబ్లిక్ డొమైన్ లో కానీ, క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్స్ కి అనుగుణంగా కానీ ఎక్కిస్తారు.  

భాండాగారంలో  ఎలా చేర్చుతారు

మార్చు

కాపీరైట్ పరిధిలోకి రానివి, కాపీరైట్ హక్కుదారుల నుంచి అనుమతులు లభించినవి మాత్రమే అప్లోడ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ లో అనుమతిస్తారు.

కాపీరైట్ పరిమితులు అస్పష్టంగా ఉంటే ఏమి చేయాలి

మార్చు

కాపీరైట్ పరిమితులు అస్పష్టంగా ఉన్నా, కామన్స్ విధానాల ప్రకారం అనుమతింపబడనివి అయినప్పుడు స్థానికంగా అప్‌లోడు చేసుకునే సౌకర్యం పరిమితంగా ఉంది. అది స్థానిక ప్రాజెక్టుల ఉపయోగానికి, విధానాలకు అనుగుణమైన వాటికే వాడాలి (ఫెయిర్ యూస్ విధానం).

ఈ మీడియా ఫైళ్ళను వికీ ప్రాజెక్ట్ లలో ఏవిధంగా ఉపయోగించాలి?

మార్చు
  • వికీపీడియాలోకి అప్‌లోడు చేసిన బొమ్మను వ్యాసంలో ఇముడ్చేందుకు సరిఐన స్థానం చూసి చొప్పించాలి.  సమాచార పెట్టె లోకూడా బొమ్మను చొప్పించవలసి ఉంటుంది.  
  • వ్యాసంలో ఉన్న సందర్భం అనుసరించి బొమ్మ తెలుగు వికీపీడియాలో ఉంటే దాన్ని చూపిస్తుంది. లేదంటే కామన్స్ లో ఉన్న బొమ్మను చూపిస్తుంది. బొమ్మను పేజీలో చొప్పించేందుకు కింది లింకును వాడాలి: [[బొమ్మ:file.jpg]] or [[బొమ్మ:file.png|alt text]]   file అంటే ఫైలు పేరు. లేదంటే పరికరం (విజార్డ్) ద్వారా ఫైల్ పేరుతో  చొప్పించవచ్చు.  
  • అనువాద పరికరం ద్వారా ఇతర భాషలనుండి వ్యాసాలు అనువదించేటప్పుడు ఈ పబ్లిక్ డొమైన్ లోని మీడియా ఫైళ్లు కూడా అనువాదవ్యాసం లోకి యాంత్రికంగా చేరుతాయి.

వనరులు

మార్చు
  • https://commons.wikimedia.org/wiki/Commons:Welcome
  • https://commons.wikimedia.org/wiki/Main_Page