జాతీయములు - డ, ఢ
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ-ఘ |
చ-ఛ జ ఝ |
ట ఠ డ-ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ-ష స-హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
డ
మార్చుడక్కా మొక్కీలు తిన్నాడు
మార్చుజీవితంలో చాల దెబ్బలు తిన్నాడు: ఉదా: వాడు చాల డక్కా మొక్కీలు తిన్నాడు.
డప్పుకొట్టుకోవడం
మార్చుతన గురించి తాను గొప్పలు ప్రచారం చేసుకోవడం
డబల్ ధమాఖా
మార్చుమంచి లాభం: వ్వాపార ప్రకటన.
డబ్బా మోత
మార్చుఆచరణ శూన్య ప్రచారం .పనికొచ్చేది ఏమీ ఉండదు
డబ్బా కొట్టుకోవటం
మార్చుప్రగల్భాలు పలకటం, ఆచరణకు పనికిరాని మాటలు మాట్లాడటం
డబ్బురాని విద్య
మార్చుదరిద్రపు చదువు
డాగుపడిన పండు
మార్చుబాగాలేదంటారు
డాబుసరి
మార్చుబడాయికోరు
డ్రామాలేస్తున్నాడు
మార్చునాటకాలేస్తున్నాడు: ఉదా: వాడి మాటలు నమ్మకు, వాడు డ్రామాలేస్తున్నాడు.
డీ అంటే డీ అంటున్నారు
మార్చుపోట్లాటకు సిద్దం అంటున్నారు: ఉదా: వారు కొట్టు కోడానికి డీ అంటే డీ అంటున్నారు.
డుమ్మాకొట్టాడు
మార్చుబడి పిల్లలు బడికి రాక పోతె "డుమ్మా కొట్టాడు" అని అంటారు.
డూడూ బసవన్న
మార్చుగంగిరెద్దులా తలూపేవాడు
డేగ చూపు
మార్చుసునిశిత పరిశీలనా జ్ఞానం, సూక్ష్మ దృష్టి, జాగ్రత్తగా గమనిస్తూ ఉండటం
డేగకన్ను
మార్చుడేరా ఎత్తేశారు
మార్చుమోసగించి పారి పోయారు: ఉదా: వారు రాత్రికి రాత్రే డేరా ఎత్తేశారు.
డొంకలో దాక్కొన్నట్లు
మార్చుతప్పించుకోజూడటం
డొల్లకబుర్లు
మార్చుపసలేని మాటలు, కాలక్షేపానికి చెప్పే మాటలు .డొల్ల కావటమంటే లోపల ఏమీ లేకుండా ఖాళీగా ఉండటం. చెప్పే కబుర్లలో కూడా పనికొచ్చే విషయాలు ఏవీ లేనప్పుడు వాటిని డొల్లకబుర్లు అంటారు.
డొంక తిరుగుడు సమాధానం చెప్పుతున్నాడు
మార్చుసరైన సమాధానం చెప్పడం లేదని అర్థం: ఉదా: వాన్ని నమ్మడానికి వీల్లేదు: వానివి అన్ని డొంక తిరుగుడు సమాదానాలె.