భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "ఆ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

ఆడవాళ్ళ వయస్సు, మగవాళ్ళ సంపాదన అడగకూడదు.

ఆకలి ఆకలి అత్తగారు అంటే రోకలి మింగమన్నదట

మార్చు

ఆడవాళ్ళ వయస్సు, మగవాళ్ళ సంపాదన అడగకూడదు.

మార్చు

ఆకాశానికి నిచ్చెన వెయ్యడం

మార్చు

అత్యాశ గలవాడు చేసె పనులను గూర్చి సామెత వాడుతారు.

ఆకాశం మీదికి ఉమ్మేస్తే అది మన ముఖం మీదె పడుతుంది

మార్చు

ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పుణ్యం

మార్చు

విస్తరాకు ఉన్నప్పుడే భోజనం వడ్డించటం తినటం జరుగుతుంది.అవకాశాలను ఉపాయాలను ఎదుటివారికి తెలియచెప్పి వారి జీవితం సుఖంగా సాగేందుకు తోడ్పడాలని

అంతా ఆ తాను ముక్కే

మార్చు

ఇది సాధార‌ణంగా రాజ‌కీయ‌నాయ‌కులు వాడుతారు ఈయ‌న‌ అదే పార్టీకి చెందిన‌ వాడు అని చెప్ప‌డం టాను అంటే వ‌స్త్ర‌ము యొక్క‌ పెద్ద‌ క‌ట్ట‌ అని అందులోంచి చిన్న‌ముక్క‌ క‌త్తించినా అది దానిలోదే అవుతుంది

ఆ మొద్దు లోదే ఈ పేడు

మార్చు

"అంతా ఒక్క‌టే" అనే అర్థాన్ని క‌లిగించే సామేత‌ ఇది మొద్దు అంటే పెద్ద‌ కొయ్య‌, అందులోంచి తీసిన‌ చిన్న‌ ముక్క‌ అంటే పేడు

అండలుంటే కొండలైనా దాటవచ్చు

మార్చు

ఒంటరిగా కన్నా మరొకరి సహాయంతో ఎంత పనైనా సులభముగా చేయ వచ్చునని ఈ సామెత అర్థం.

ఆంబోతులా పడి మేస్తున్నావు

మార్చు

ఆంబోతులను ప్రాథమికంగా పని చేయించకుండా, సంతానవృద్ధి కొరకు బాగా మేపి ఆరోగ్యవంతంగా ఉంచుతారు. కానీ, ఇదే విషయాన్ని ఓ పనీపాట లేకుండా తిని తిరిగే వ్యక్తిని ఉద్దేశించి వ్యంగ్యంగా ఈ సామెత ద్వారా దెప్పిపొడుస్తారు.

ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు

మార్చు

ఎంతటి అత్యవసరమయిననూ, కొన్ని పనులు పరిమితులను అతిక్రమించి ప్రకృతి విరుద్ధముగా చేయరాదు. ఈ సామెత కూడా అటువంటి ఒక ఉదాహరణను గుర్తు చేస్తోంది. అమితమైన ఆకలిగా ఉన్నదని భోజనము రెండు చేతులతో చేయలేము కదా. కారణము పెట్టే చేతులు రెండైనా తినగలిగే నోరు ఒక్కటే కదా!

ఆకలి ఆకాశమంత... గొంతు సూది బెజ్జమంత

మార్చు

ఆశ ఎక్కువ అవకాశాలు మాత్రం చాలా తక్కువ

ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు

మార్చు

బాగా ఆకలి వేసి ఉన్నప్పుడు తిన్న తిండి ఎలా ఉన్నప్పటికినీ ఎంతో రుచిగా అనిపిస్తుంది. అలాగే బాగా అలసినప్పుడు మంచం, పరుపు, దిండు, ఫ్యాన్ మొదలైనవి లేకపోయినా కటికనేల మీద పడుకున్నా మంచిగా నిద్ర పడుతుంది అనే భావంతొ ఈ సామెత వాడతారు. రైలులో దూర ప్రయాణం చేసేవారు ఎలాగో ఒకలా కునుకు తీస్తారు. వారికే ఇంట్లో అన్ని సదుపాయాలున్నప్పటికీ నిద్ర పట్టపోవచ్చును. "ఆకొన్న కూడె అమృతము" అని సుమతీ శతకములో ఒక పద్యం ఉంది. ఆరోగ్యరీత్యా కూడా ఆకలి లేనప్పుడు అన్నం తినకూడదు. శ్రమ చెయ్యకుండా సరైన నిద్ర రాదు.

ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట

మార్చు

ఇది ప్రాస కొరకు వాడిన మాట. ఆకారం చూసిఆశపడితే సహకారంసూన్యమైంది.== పైకి మేకపోతు గాంభీర్యాన్ని ఒలకపోస్తూ, లోపల ఏమాత్రం విషయం లేని వానిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు.

ఆకారపుష్టి నైవేద్యనష్టి

మార్చు

పైకి మేకపోతు గాంభీర్యాన్ని ఒలకపోస్తూ, లోపల ఏమాత్రం విషయం లేని వానిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు.

ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం

మార్చు

ఓ బలహీనుడు తనకు తానుగా బలవంతునితో తలపడినా, లేదా బలవంతుడే వచ్చి బలహీనునితో తలపడినా జరిగే నష్టం బలహీనునికే. కావున బలహీనుడు తన పరిమితులను గుర్తెరిగి ప్రవర్తించవలెను. ఆకు వెళ్ళి ముల్లు మీద పడినా.... లేదా ముల్లు వచ్చి ఆకు మీద పడినా చిరిగేది ఆకు మాత్రమే. ముల్లుకేమి నష్టము లేదు.

ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వచ్చాడట

మార్చు

మిక్కిలి కష్టములలో ఉన్న వ్యక్తి వద్దకు మరొకడు సహాయమును ఆశించి వచ్చినపుడు, కష్టములో నున్న వ్యక్తి వ్యంగ్యముగా ఆ రెండవ వ్యక్తికి తన పరిస్థితిని ఈ సామెత ద్వారా తెలియచేయుట పరిపాటి.

ఆకులేని పంట అరవైఆరు పుట్లు...

మార్చు

ఉప్పు పంట

ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు

మార్చు

స్త్రీ, పురుషుల విధులను పూర్వకాలంలో ముందుగానే నిర్వచించారు. దాని ప్రకారం స్త్రీ ఇంటికి పరిమితమయ్యేది, పురుషుడు సంపాదనకై బయటకు వెళ్ళి వచ్చేవాడు. బయటకు వెళ్ళే స్త్రీని చెడుగానూ, ఇంటిపట్టునే ఉండే పురుషుణ్ణి అసమర్ధునిగానూ చిత్రీకరించేవారు. ఈ భావాన్నే ఈ పై సామెత తెలుపుతుంది.

ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...

మార్చు

ఆడపిల్ల పెళ్ళి, నీటి జాడే కానరాని బావి రెండూ అత్యంత కఠినమయిన కార్యములు అని ఈ సామెత తెలుపుచున్నది.వరకట్నం, బంధువులకు, స్నేహితులకు పెట్టిపోతల వంటి ఖర్చులూ ఆడపిల్ల తండ్రిని విపరీతంగా కుంగదీస్తాయి.ఎంతలోతుగా వెళ్ళినా బావి అడుగు తగలకపోతే బావి తవ్వుతున్న వ్యక్తికి ప్రాణాంతకంగా పరిణమించే స్థితి కలిగినట్లుగానే, ఆడపిల్ల పెళ్ళికోసం పిల్ల తండ్రి డబ్బు సమకూర్చటం కానీ, పిలుపులు, మర్యాదలు వంటివి చెయ్యటంకానీ మొదలుపెడితే వాటికి ఎక్కడా అంతం ఉండదని, అలా అవి పెరిగిపోతూ చివరకు ఆ తండ్రిని శారీరకంగా, మానసికంగా ఎంతగానో పిండివేస్తాయని ఈ సామెత భావన.

ఆడబోయిన తీర్థమెదురైనట్లు

మార్చు

వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనే సామెత కూడా ఇదే కోవకు చెందినది. మనమేదైతే కోరుకుంటున్నామో అది అయాచితంగా, అప్రయత్నంగా లభ్యమైతే ఈ సామెతను ఉటంకిస్తారు.

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు

మార్చు

తాను సరిగా పాట పాడలేక, మద్దెలను బాగా వాయించలేదని నిందించాడు ఓ ఘనుడు. తన అసమర్ధతకు ఇతరులను నిందించే వాణ్ణి ఉద్దేశించి ఈ సామెతను వాడటం పరిపాటి. మద్దెల దరువుకు తగినట్టు నాట్యం చేయాలి. అందుకే అతడు మద్దెల వాయిస్తున్నాడు. ఆడే వాడు మద్దెల దరువుకు తగినట్టు ఆడడంలేదు. ఏమయ్యింది అలా ఆడు తున్నావంటే అతడు "నేను బాగానె ఆడుతున్నాను, నీ మద్దెలే ఓడు బోయి. సరిగా పలకడం లేదు" అన్నాడు. అనగా తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఇతరులపై నెపం మోపేవారిని గురించి ఈ సామెత పుట్టింది. "ఆడ లేక మద్దెల ఓ డన్నట్టు"

ఆడువారి మాటలకు అర్ధాలే వేరు

మార్చు

స్త్రీలు పురుషులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేరు. మనసులో ఒకటి ఉంచుకొని పైకి మరోటి చెప్పుతారు. అంటే ఆడవారు పురుషులకు తేలికగా అర్ధం కారని ఈ సామెత చెబుతుంది.

ఆడువారు అలిగినా అందమే

మార్చు

ఆత్రగాడికి బుద్ది మట్టం

మార్చు

ఎప్పుడు చూసినా తొందరగా పని ముగించుకోవాలని చూసేవాడు లోతుగా ఆలోచించలేడని దీని భావం.

ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు

మార్చు

వెనకటికి ఆత్రంగా ఉన్న పెళ్ళికొడుకు ఒకడు తాళి తీసుకొని కాబోయే భార్యకి బదులు అత్తకి కట్టేశాడు. తొందరపాటుతో చేసే పనులు ఎప్పుడూ సక్రమంగా జరగవు అని ఈ సామెత చెబుతోంది.

'ఆదివారం అందలం ఎక్కనూ లేదు, సోమవారం జోలె కట్టనూ లేదు

మార్చు

జీవితంలో ఎప్పుడూ ఒకే స్థితిలో ఆనందంగా కాలం గడపటం

ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట

మార్చు

పెళ్ళి అయిన తరువాత శోభనం ముచ్చట జరుపుతారు. శోభనం కార్యక్రమంలో ముందు పూజ, తరువాత ముత్తయిదువులకు తాంబూలం వంటి ఆచారాలు ఉంటాయి. ఇవి అయినతరువాతనే అమ్మాయిని అబ్బాయిని గది లోకి పంపుతారు. ఈలోపున, పెళ్ళికొడుకుకి ఆత్రం ఎక్కువయి, అంతవరకు ఆగలేక, పేరంటానికి వచ్చిన మహిళల వెంట పడ్డాడట. ఈ సామెత ఏదయినా పని సాంతము జరిగేవరకు ఆగలేక, ఫలితం కొరకు ఊరికే ఆత్రపడే వారి గురించి గేలి చెయ్యటానికి ఈ సామెతను వాడతారు.

ఆదిలోనే హంసపాదు

మార్చు

ఏదైనా పని మొదలు పెట్టిన వెంటనే విఘ్నాలు కలిగితే ఈ సామెతను వాడతారు. దేవాలయాలలో జరిగే ఉత్సవాల సమయంలో ఉత్సవ మూర్తులకు వివిధ వాహనాలపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. గ్రామోత్సవ సమయంలో వాహనాన్ని కొంతమంది భక్తులు తమ భుజంపై మోస్తూ ఉంటారు. గ్రామోత్సవం జరుగుతున్నంత సేపు వాహన బరువు మోతాన్ని తమ భుజముపై ఉంచడం చాలా కష్టం కాబట్టి కొంత వెసులు బాటు కోసం ఏర్పరచుకున్న పరికరాన్ని హంసపాదు అంటారు. హంసపాదు T, Y ఆకారానికి మధ్యస్తంగా ఉంటుంది. వాహనసేవ జరిగే సమయంలో వాహనాన్ని సరిగా నిలబెట్టేందుకు 4 నుంచి 8 హంసపాదులు అవసరమవుతాయి. ప్రారంబంలోనే అవాంతరం ఏర్పడితే ఈ సామెతను ఉపయోగిస్తారు.

ఆపదలో మొక్కులు... సంపదలో మరపులు

మార్చు

ఆపదలలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్మరించి, ఆపదల నుంచి బయటపడ్డ నాడు దేవుని మరవటం అన్నది స్వార్థం, అవకాశవాదం అని ఈ సామెత ద్వారా తెలుయుచున్నది. ఎవరికైనా ఆపదలోనె దేవుడు గుర్తుకి వస్తాడు. అన్ని సక్రమంగా జరుగు తుంటే దేవున్ని మరిచిపోతారు. ఇది మానవ నైజం. ఆ విధంగా పుట్టినదె ఈ సామెత.

ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు

మార్చు

రాకరాక అల్లుడు వస్తే సిగ్గుపడి అందరూ దాక్కున్నారు అని దీనర్ధం. (Ranganadh़రంగనాధ్)

ఆ మరకా ఈ మరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి

మార్చు

ఆయనే ఉంటే మంగలి ఎందుకు

మార్చు

ఆయనే ఉంటే మంగలెందుకు అనేది తెలుగు భాషలో వాడే ఒక సామెత. అనవసరపు సలహాలు ఇవ్వరాదు అనే దానికి ఈ సామెత ఉదాహరణ.

సామెత వెనుక కథ

పాత కాలం నాటి ఒక ఆచారం ఆధారంగా వాడుక లోకి వచ్చిన సామెత ఇది. పూర్వకాలంలో భర్త చనిపోయిన స్త్రీ బొట్టు, పూలు, ఆభరణాలను విసర్జించటంతో పాటు నెత్తిమీద జుట్టును కూడా కూడా త్యజించవలసి వచ్చేది. (వితంతువులు జుట్టు పెంచుకోకూడదనే నియమముండేది.) నిందార్థకంగా వాడే "బోడి ముండ" అనే మాట కూడా ఈ ఆచారంలో నుంచి పుట్టిందే. వాళ్ళకున్న కట్టుబాట్లకు తోడు వీధిలో వాళ్ళకు ఎదురైన వాళ్ళు "అపశకునం" అని ఈసడించుకునే వాళ్ళు. అందువల్ల జుట్టు పెరిగినప్పుడల్లా వితంతు స్త్రీలు గుండు చేయించుకోవడానికి మంగలి దగ్గరకు వెళ్ళలేరు. అందుబాటులో ఉన్న చిన్న పిల్లలను పంపి మంగలిని ఇంటికి పిలుచుకురమ్మనే వాళ్ళు. ఒకసారి అలా జుట్టు పెరిగిన వితంతువు ఒకామె మంగలికి కబురు చేయబోతే, అందుబాటులో చిన్న పిల్లలెవరూ లేరట. అప్పుడామె "నా మొగుడే బ్రతికి ఉన్నట్లైతే వెళ్ళి పిలుచుకు వచ్చేవాడు కదా?" అని వగచిందట - ఆయనే ఉంటే తాను గుండు చేయించుకోవలసిన అవసరమే ఉండేది కాదని మరిచిపోయి.

ఒకవితంతువు గుండు చేయించుకోవటం కోసం మంగలిని పిలువవలసిందిగా దారిన పోయే దానయ్యను అడిగింది. అతను విసుగుగా నాకు చెప్పకపోతే మీ ఆయనకు చెప్పరాదా అన్నాడు. దానికి ఆవిడ ఆయనే ఉంటే మంగలి ఎందుకు అని అన్నది. అంటే ఆయన (భర్త) ఉంటే మంగలిని పిలిచి గుండు చేయించుకునే అవసరమే రాదుకదా! ఉచిత సలహాలు ఇవ్వటం ఎందుకు? అనేదానికి ఈ సామెత చెబుతారు.

వాడుక

ఇలా కార్య-కారణ సంబంధాన్ని మరచిపోయి ఆలోచించేటప్పుడు ఈ సామెతను వాడుతారు.

'ఆయన' (అనగా ఆమె భర్త) ఉన్నప్పుడు మంగలితో అవసరమేమిటి? ఏదైనా పూర్తికాని పనిని ఇలా ఫలాన వస్తువుతోనో, ఫలానా వ్యక్తుల సహాయ సహకారాలతో, ఇలాకాకుండా వేరే విధంగా సాధించవచ్చుకాదా అన్నవారికి అసహనంతో ఈ సామెతను ఉదహరిస్తారు. ఉదాహరణకు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే, గ్యాసు పొయ్యిమీద చెయ్యవచ్చుగదా అంటే "గ్యాసు పొయ్యే ఉంటే కట్టెల పొయ్యి ఖర్మ యెందుకు"?

ఒక వ్యక్తి బాగా డబ్బు అవసరం ఉండి బ్యాంకుకు వెళ్ళి అప్పు అడిగాడు. అప్పుకు హామీగా ఏవైనా "ఫిక్స్‌డ్ డిపాజిట్లు" చూపగలరా అని బ్యాంకు మేనేజరు అడిగాడు. ఆయనే ఉంటే మంగలెందుకు? - నా దగ్గర డబ్బులు నిలవ ఉంటే అప్పు ఎందుకడుగుతాను? అని అర్ధం.

ఆస్తి మూరెడు ఆశ బారెడు

మార్చు

తన ఆర్థిక స్తోమతను బట్టి అలవాట్లు లేని వారిగురించి ఈ సామెత వాడతారు. పిండికొద్ది రొట్టె అనే సామెత దీనికి సమానార్థం]]

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ

మార్చు

దీపం ఆరిపోయేముందు తనలో ఉన్న తైలాన్ని (శక్తి) ఒక్కసారిగా మండించి పెద్ద వెలుగు వెలుగుతుంది. అదే విధముగా నిజజీవితంలో సర్వశక్తులు ఒడ్డి పోరాడి ఓటమి ముంగిట ఉన్న వానిని ఉద్దేశించి ఈ సామెతను వాడుదురు.

ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు

మార్చు

విభిన్నమయిన వ్యక్తులు కలిసి కొంతకాలం ఉంటే, ఒకరి గుణాలు (మంచైనా, చెడైనా) మరొకరికి అలవడతాయి అని చెప్పటమే ఈ సామెత యొక్క సారాంశము.

ఆరు రాజ్యాలు జయించవచ్చును కానీ అల్లుణ్ణి జయించలేము

మార్చు

అల్లుళ్లతో విసిగి వేసారి వారిని సంతృప్తిపరచటం తమవల్ల కావటం లేదని అనుకోటం. ఇది చాల కష్టమైన పని అని అర్థం చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.

ఆరోగ్యమే మహాభాగ్యం

మార్చు

ఆరోగ్యం (Health) లేకుండా ఎన్ని సిరిసంపదలున్నా వాటిని అనుభవించలేము. ఆరోగ్యం లేని భాగ్యము దరిద్రంతో సమానము. కాన ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు అనుభవజ్ఞులైన పెద్దలు.

దీనినే ఆంగ్లంలో "Health is Wealth" అంటారు.

ఆలస్యం అమృతం విషం

మార్చు

వివరణ:... దేవ... దానవులు పాల సముద్రాన్ని చిలికి నప్పుడు అమృతము పుట్టింది. దానిని దేవ దానవులకు పంచడానికి శ్రీహరి పూనుకున్నాడు. మహావిష్ణువు ముందుగా దేవతలకు అమృతాన్ని పంచుతు.. మధ్యలో దానవులు వస్తే ఆగమని చెప్పుతూ వచ్చాడు. వారు ఆలాగె ఆగారు. చివరకు అమృతం అంతా దేవలకే సరిపోయింది. దానవులకు మిగలలేదు. తీసుకోవడములో ఆలస్యం చేస్తే అమృతం విషం అవుతుందని ఈ సామెత పుట్టింది. ఆలస్యం చేస్తే అమృతం అయినా విషం అవుతుందని ఈ సామెతకు అర్థం. చేయవలసిన పని నిర్దిష్ట సమయానికి చేయని యెడల జరుగు అనర్థమును హెచ్చరించు సందర్భములో ఈ సామెతను వాడెదరు.

ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె

మార్చు

పెళ్ళి అయిన తర్వాత అప్పటి వరకు అమ్మ చీర కొంగు పట్టుకుని తిరిగే మగ పిల్లలు పెళ్ళాం మోజులో పడి అమ్మని నిర్లక్ష్యం చేస్తారు.ఆలి మాటకి విలువ ఇస్తూ అమ్మ మాటని పెడ చెవిన పెట్టే కొడుకులను ఉద్దేశించి ఈ సామెత వాడతారు. ఆలి తీపి (బెల్లం), అమ్మ ఘాటు (అల్లం) లా అనిపిస్తోంది అని ఈ సామెత అర్ధం.

ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట

మార్చు

కొంత మంది తను చేయాల్సిన కనీస బాధ్యతలు చేయడం కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటారు. భార్యను పోషించడం భర్త కనీస బాధ్యత. తను, తన సంసారం కాకుండా, లోకానికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తే అర్ధం ఉంది. కాని, తన వాళ్ళకి పెట్టుకుని లోకాన్ని ఉద్దరించినట్టు మాట్లాడే వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ సామెత చెప్తారు.

ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.

మార్చు

తన ఇంటిని చక్కదిద్దుకోకుండా ఊళ్ళో వాళ్ళ బాగోగులు చూసొస్తా అంటూ బీరాలు పలికేవాడిని ఉద్దేశించి పలికే సామెత ఇది. ఇతరులకు నీతి చెప్పే ముందు నిన్ను నీవు సరిదిద్దుకో అన్న భావంలో కూడా ఈ సామెతను వాడవచ్చు.

ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం

మార్చు

ఏమీ లేకుండా గాలిలో మేడలు కట్టేవారిని గురించి ఇలా అంటారు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే అసలు పెళ్ళి చేసుకోకుండా, ఆవిడకి కడుపు రాకుండానే, కొడుకు పుట్టక ముందే వాడికి ఏమి పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నాడు అని భావము.

కథ

సామెతకు ఒక కథ చెబుతారు (చాలా రూపాంతరాలున్నాయి)

ఒకడు ఒక మట్టి ముంతలో పెట్టుకొని పేలాల పిండి అమ్మడానికి వెళుతున్నాడు. దారిలో ఒకచెట్టుక్రింద ఆగి విశ్రాంతి తీసుకుంటూ పగటికలలు కనసాగాడు.

ఈ పేలపిండి అమ్మితే నాకింత డబ్బొస్తుంది. దానితో మరింత పిండి కొని, అమ్మి బాగా డబ్బు సంపాదిస్తాను. ఆ డబ్బుతో ఒక ఆవునుకొని, పాల వ్యాపారం చేసి, గొప్ప పశుసంపదను సాధిస్తాను. ఇంకా వ్యాపారాలు చేసి, బాగా ధనవంతుడనై మేడలూ, మిద్దెలూ, వస్తువాహనాలూ కూర్చుకొంటాను.

అప్పుడు నాకు చక్కని చుక్కతో పెళ్ళి అవుతుంది. మాకు పుట్టే కొడుకుకు సోమలింగం అని పేరు పెట్టుకుంటాను. ఎప్పుడైనా నా భార్య కొడుకును కోప్పడితే, దానిని ఇలా కొడతాను. - అనుకొంటూ వాడు తన కాలును జాడించాడు. దాంతో పేలపిండి ముంత కాస్తా ముక్కలయ్యింది.

ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?

మార్చు

తల్లి తండ్రులు పిల్లలకు మంచిబుద్ధులు చెప్పాలి. కొంతమంది పెద్దవాళ్ళు పెడత్రోవన పడుతుంటారు వారిని చూసి వారి పిల్లల్లుకూడా కొన్ని సమయాలలో పెడత్రోవన పడ్తే వారిని చూసి ఈసామెత చెప్తారు.

ఆవు పాతిక బందె ముప్పాతిక

మార్చు

ఇదే అర్థంతో మరొక సామెత ఉంది. అది అసలు కన్న కొసరు ఎక్కువ మరొక సామెత: కోడి చారణా.... మసాలా బారణా

ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?

మార్చు

ఆవలింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు

మార్చు

ఎవరైనా ఆవలించారంటే పక్కన వాళ్ళకు కూడా ఆవులింతలు రావడం మీరు చాలా సందర్భాలలో గమనించే ఉంటారు. కానీ తుమ్ముకు అలా కాదు. ఈ సామెతకు ఆధారం అదే.

ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం

మార్చు

చిన్నపాటి కలయిక లేక కొద్దిపాటి సాంగత్యం చేతనే ఎదుటి వ్యక్తిని పరిపూర్ణముగా ఆకళింపుచేసుకొను గుణముగల వ్యక్తిని ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. కడుపులో ఉండే ప్రేగులను నోటి ఆవులింత ద్వారా లెక్క వేయ గల సమర్థత కల వ్యక్తి (బాగా సూక్ష్మ దృష్టి కలవాడు) అని భావము. చిన్న సంకేతం ద్వారా ఏంతో గొప్ప విషయాన్ని గ్రహించగల మేధావి అని అర్థము.

ఆశ సిగ్గెరుగదు.... ఆకలి రుచి ఎరుగదు

మార్చు
వాడే విధానం

ఆశగలమ్మ దోషమెరుగదు... పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు

మార్చు

దురాశను అణచుకోలేక చెయ్యకూడని పనులు చేస్తూ దోషికావటం.ధర్మసత్రాలలో అన్నదానం జరుగుతుంటే పూటకూళ్లమ్మ పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని అమ్ముకొంటూ ఒక్కముద్ద దానం చెయ్యమని ఎవరడిగినా ధనాశతో కసిరికొడుతుందే తప్ప దానం చెయ్యదు. ధనాశతో ఉన్నవారు దానధర్మాలు చెయ్యలేరు అని ఈ సామెత అర్ధం.

ఆశకు పోతే గోచి ఊడిందట

మార్చు

ఆస్తి మూరెడు... ఆశ బారెడు

మార్చు

తన ఆర్థిక పరిస్థితికి మించి ఆశలు పెట్టుకునే వారిని గురించి ఈ సామెత వాడతారు.

వనరులు

మార్చు
  • లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (సుమారు 3400 సామెతలు) - సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  • సాటి సామెతలు (తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సమానార్ధకాళున్న 420 సామెతలు) - సంకలనం : నిడదవోలు వెంకటరావు, ఎమ్. మరియప్ప భట్, డాక్టర్ ఆర్.పి. సేతుపిళ్ళై, డా. ఎస్.కె. నాయర్ ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikibooks.org/w/index.php?title=సామెతలు_-_ఆ&oldid=21829" నుండి వెలికితీశారు