భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "క" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి. సాయి విజ్ఞేష్ మాడ ని నోట్లో పెట్టినట్టు

కంగారులో హడావుడి అన్నట్లు

మార్చు

కంచం అమ్మి మెట్టెలు కొన్నట్టు

మార్చు

అనవసరపు ఖర్చు చేసే వారినుద్దేశించి ఈ సామెత చెప్తారు.

కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు

మార్చు

బాగా అవసరమయిన వాటిని అవివేకముతో నిర్లక్షముచేసి, అనవసరమయిన వాటిని కూడబెట్టు వానిని ఉద్దేశించి ఈ సామెతను చెప్పుదురు.

కంచం నిండా తిని, మంచానికి అడ్డంగా పడుకున్నట్లు

మార్చు

ఏ పని చెయ్యకుండా, తిని పడుకునే వాళ్ళ గురించి ఇలా అంటూ ఉంటారు.

కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని

మార్చు

ఒకరు సంపదను కూడబెడితే మరొకరు దానిని వృధా చేస్తే ఆ సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

కంచానికి ఒక్కడు - మంచానికి ఇద్దరు

మార్చు

కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు

మార్చు

అత్యంత అమాయకపు చక్రవర్తిని గురించి ఈ సామెత వాడతారు.

కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?

మార్చు

పైపై దర్పం ప్రదర్శించేవారు తమలో ఏమీ లేకపోయినా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. బుద్ధిమంతులయినవారు తమకు ఎంతో తెలిసినా గర్వం ప్రదర్శించకుండా సౌమ్యంగా ఉంటారు. ఇది వేమన శతక పద్య భాగము.

కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే

మార్చు

ఏ విధముగా నయితే కంచె లేని చేను రక్షణ లేక పశువుల పాలవునో, అటులనే తల్లి అండ లేని బిడ్డ అధోగతి పాలవునని ఈ సామెత అర్థం.

కంచేచేను మేసినట్లు

మార్చు

కంచె అంటే చేనుని రక్షించేది, కాని ఆ కంచే చేనుని మేసిందంటే చేనుకి మఱి రక్షణ లేదుకదా? అలాగే రక్షణ కల్పించ వలసిన వారే ఆపద కలిగించినప్పుడు ఈ సామెతను వాడుతారు.

కంచే చేనుమేస్తే కాపేమి చేయగలడు?

మార్చు

దొంగ పశువులు పంటను మేయకుండా పంట చేలకు కంచె వేస్తారు. కానీ ఆ కంచే చేను మేస్తే ఎవరు ఏమి చేయలేరని భావము.

కంచె మంచిది కాకపోతే చేను కొల్లబోతుంది

మార్చు

ఇది వ్యవసాయదారుల సామెత. పొలానికి కంచె గట్టిగా వుండాలి. లేకుంటే దొంగ గొడ్లు వచ్చి పంటను నాశనం చేస్తాయని దీనర్థం.

కంచెమీద పడ్డ గుడ్డను మెల్లగా తీయాలి

మార్చు

ముళ్ళ కంప పైన పడిన గుడ్డను మెల్లగా తీయాలి. లేకుంటే చిరిగి పోతుంది. అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా మెలగి దానినుండి బయట పడాలని ఈ సామెత అర్థము.

కంచె వేసినదే కమతమన్నట్లు

మార్చు

కంటికి ఇంపైతే నోటికీ ఇంపే

మార్చు

తినే పదార్థము ఏదైననూ ముందుగా నోటికంటే కూడా కంటికి బాగుండాలి (శుచి, శుభ్రముగా ఉండాలి). ఆపైనే అది నోటికీ ఇంపుగా ఉంటుంది. అదే అసలు కంటికే బాగా లేకపోతే, రుచితో నిమిత్తం లేకుండా పారవేచెదరు.

కంటికి తగిలే పుల్లను - కాలికి తగిలే పుల్లను కనిపెట్టి తిరగాలి

మార్చు

తన చుట్టుప్రక్కల పొంచి వున్న ప్రమాధములను కనిపెట్టుకొని తిరగాలని దీని అర్థము

కంటికి రెప్ప కాలికి చెప్పు

మార్చు

కంటికి రెప్ప ఏ విధముగా నయితే రక్షగా ఉండునో, చెప్పు కాలికి అదే విధముగా రెప్పవలె ఉండునని ఈ సామెత అర్థం.

కంటికి రెప్ప దూరమా

మార్చు

కంటి రెప్ప కంటిపైనే వుండి కంటికి రక్షణగా వుంటుంది. అది దూరము కాదు అనే అర్థంతో ఈ సామెతను ఉపయోగిస్తారు.

కంటివంటి ప్రకాశం లేదు - మంటివంటి ఆధారం లేదు

మార్చు

కండలేని వానికే గండం

మార్చు

బలం లేని వారికే ప్రమాదమని ఈ సామెత అర్థం.

[[కంతి](కణితి)] తలగడ కాదు చింత తీరిక కాదు

కణితి లావుగా ఉంది కదాని అదంతా శరీర బలానికి సంబంధించింది కాదు. అలాగే చింత విచారం కలిగిన మనిషి వూరకనే ఖాళీగా కూర్చున్నాడు కదా అని అనుకుంటే అది పొరపాటే. పరిశీలించి జాగ్రత్తగా వాస్తవాలను తెలుసుకోవాలని, భ్రమలకు గురికాకూడదని

కందకి లేని దురద కత్తిపీట కెందుకు?

మార్చు

కందను కత్తిపీటతో తరిగి వంట చేస్తారు. తరగబడ్డ కందకు లేని బాధ, తరిగిన కత్తిపీటకు ఉండదు కదా. ఈ విషయాన్నే, ఎవడైనా బాధితుడికి, తాను పడిన కష్టం తాలూకు బాధ లేకపోయిన సందర్భములో ఈ సామెతను వాడెదరు.

కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద

మార్చు

ఇదే అర్థము తెలియచేసే మరో సామెత చూడండి. కందకి లేని దురద కత్తిపీటకెందుకు?

  • కంద దుంప, చేమ దుంపకు కొంత దురద వుంటుంది......

కంది పండితే కరువు తీరుతుంది

మార్చు

కందం చెప్పినవాడు కవి - పందిని పొడిచినవాడు బంటు

మార్చు

కందెన వేయని బండికి కావలసినంత సంగీతం

మార్చు

కందెన వేయని బండి నడుస్తున్నప్పుడి ఇరుసు ఒరిపిడికి కీస్ స్ స్స్ అనే శబ్దం నిరంతరాయంగా వస్తుంటుంది. దానికి కందెన వేస్తే ఆ శబ్దం రాదు. ఆవిదంగా వచే శబ్దాన్నే సంగీతం పాడుతున్నదే ఈ బండి అని వేళాకోలంగా అంటుంటారు.

కంపలో పడ్డ గొడ్డు వలె

మార్చు

ముళ్ళకంపలో పడిన గొడ్డు, తెలివిలేక తప్పించుకును ప్రయత్నములో మరింత బాధకు లోనవును. అదే విధముగా అవివేకులయిన వారు, కష్టములనుండి బయటపడు మార్గము తెలియక మరింత కష్టముల పాలగుదురు. అటువంటి సందర్భంలో చెప్పేదే ఈ సామెత.

కంప తొడుగు ఈడ్చినట్లు

మార్చు

కంసాలింటికెడితే బంగారమంటదుగానీ, కుమ్మరింటికెడితేమాత్రం మట్టి అంటుకుంటుంది

మార్చు

కంసాలికూడు కాకులు కూడా ముట్టవు

మార్చు

కంసాలి బర్రెనమ్ముతున్నాడు, లోపల లక్కవుందేమో చూడరా అన్నట్లు

మార్చు

కంసాలి దొంగతనం కంసాలికే తెలుస్తుంది

మార్చు

కంసాలి అనగా బంగారపు పనిచేసే వాడు. అతను చేసే బంగారము దొంగతనము ఎవరు కనిపెట్టలేరనిదీనర్థం.

కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు

మార్చు

కక్కిన కుక్క, అప్పుడే కనిన కుక్క రెండునూ తీవ్రమయిన బాధలో ఉండును. అటువంటి స్థితిలో వాటి వద్దకు వెళ్ళుట ప్రమాదహేతువు. ఆ ప్రమాదము ఎంతటి తీవ్రమంటే, శతృవుని కూడా ఆ కుక్క దరికి పంపలేనంత తీవ్రమయినది.

కక్కిన కూటికి ఆశించినట్లు

మార్చు

అతి నీచమైన బ్రతుకు మనపై ఇష్టం లేని వారి వద్ద ఎదైనా ఆశించడం.

కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్పిబాధ ఎరుగడు

మార్చు

డబ్బుకు కక్కుర్తి పడే మొగుడు, పెళ్ళానికి కడుపు నొప్పి వచ్చినా, డబ్బు ఖర్చు అవుతుందని ఆమె బాధను ఎరగనట్టు నటించును. డబ్బుకు కక్కుర్తి పడే వాళ్ళను ఉద్దేశించి ఈ సామెతను వాడెదరు. ==కక్కుర్తి పడ్డా కడుపు నిండాలి == ఆకలి మంట ముందు కక్కుర్తి కానరాదని అర్ధం

కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు

మార్చు

కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగవు అంటే ఏదైనా పని జరిగే సమయం ఆసన్నమైనప్పుడు ఆ పని జరగక మానదు. కొన్ని పనులు ప్రారంబమైతే ఆతర్వాత ఆ పనులు ఎవరి ప్రాబల్యంలేక పోయినా అవి పూర్తవుతాయి. అలాంటి సందర్భంలో చేప్పేదే ఈ సామెత.

కటికవానికి కత్తి అందించినట్లు

మార్చు

కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము

మార్చు

వరద కట్ట లేని నది అదుపు లేని నోరు ప్రమాదములే అని ఈ సామెత అర్థము. కట్టిన యిల్లు - పెట్టిన పొయ్యి

కట్టిన యింటికి వంకలు చెప్పేవారు మెండు

మార్చు

కట్టిన వారు ఒకరైతే కాపురంచేసేవారు ఇంకొకరు

మార్చు

కట్టినవాని కొక యిల్లయితే అద్దెకున్న వానికి అన్నీ యిళ్ళే

మార్చు

కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట

మార్చు

సొంత వాళ్ళని పట్టించుకోక గాలికి వదిలేసి, పరాయి వారికి సేవలు చేసే బుద్ధిలేని వానిని ఉద్దేశించి ఈ సామెత చెప్పుదురు.

కట్టుకొన్న పెండ్లామే చేయాలి - కన్నతల్లే చేయాలి

మార్చు

కట్టుకొన్న మగడు - పెట్టెనున్న నగలు

మార్చు

కట్టుకొన్న వాడికంటే వుంచుకున్న వాడి మీదే ప్రేమ ఎక్కువ

మార్చు

కట్టు లేని ఊరు - గట్టు లేని చెరువు

మార్చు

ప్రతి వూరికి కొన్ని కట్టుబాట్లు వుండాలి. అనగా కొన్ని పద్ధతులు. అలా లేకపోతే ఆ వూరు చెడిపోతుందని దీని అర్థము. ఎలాగంటే గట్టులేని చెరువు నిండదు కనుక.

కట్టె వంకరను పొయ్యి తీరుస్తుంది.

మార్చు

కట్టేవి కాషాయాలు - చేసేవి దొమ్మరి పనులు

మార్చు

శ్రీరంగడు అంటే శ్రీ మహా విష్ణువు. శ్రీరంగనీతులు అంటే శ్రీ మహా విష్ణువు పేరుతో చెప్పే నీతులు. దొమ్మరి కులస్తులలో కొంత మంది పేదరికం, ఆకలి వల్ల మనసు చంపుకుని వ్యభిచారం చేస్తారు. కొంత మంది తాము గౌరవంగల మనుషులమని చెప్పుకుంటూనే అందుకు విరుద్ధంగా వ్యభిచారిణులతో పడుకుంటారు. శ్రీరంగ నీతులు చెపుతూ దొమ్మరి గుడిసెలలో దూరడం అంటే దేవుని పేరుతో నీతులు చెపుతూ అందుకు విరుధ్ధముగా పాడు పనులు చెయ్యడం అని అర్థం.

కడగా పోయే శనీశ్వరుడా మా యింటిదాకా వచ్చి పొమ్మన్నట్లు

మార్చు

ఏరి కోరి కష్టాలు కొని తెచ్చుకునేవారినుద్దేశించి చెప్పిన సామెత ఇది.

కడచిన దానికి వగచుట యేల?

మార్చు

గతం గతః. గతించిన దానికి చింతించి ప్రయేజనము లేదని ఈ సామెతకు అర్థం.

కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే

మార్చు

గుమ్మడికాయ కూరగాయలలో పెద్దది. ఐనా కత్తి పీటతో దానిని తరగటం సులభమే. అలాగే, బయటి వారిలో ఎంత పేరుప్రతిష్ఠలు సంపాదించినా ఇంట్లో వారు చనువుగాను కొన్ని సందర్భాలలో చులకనగాను చూస్తారు. అలాంటి సమయంలో ఈ సామెత చెప్తారు.

కడివెడు పాలలో ఒక్క ఉప్పుకల్లు

మార్చు

కడివెడు పాలలో అయినా ఒక్క చిన్న ఉప్పు కల్లు పడితే ఆ పాలన్ని విరిగి పోతాయి.

కడుపా కళ్ళేపల్లి చెరువా?

మార్చు

బాన కడుపు వున్నవారినుద్దేశించి చెప్పినదీ సామెత.

కడుపా - చెరువా?

మార్చు

తిండి ఎక్కువ తినే వారినుద్దేశించి చెప్పినది ఈ సామెత.

కడుపుకు పెట్టిందే కన్నతల్లి

మార్చు

కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది

మార్చు

కడుపు చించుకున్నా గారడీ విద్యే అన్నట్లు

మార్చు

కడుపుతో ఉన్నామె కనక మానుతుందా

మార్చు

కడుపుతో వున్నామె తప్పక కంటుంది. ఇది తప్పక జరుగు తుంది అని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతారు.

కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకు ఏడ్చి నట్ట్లు

మార్చు

ఎవరి అవసరం వారిది. అవసరం లేనిదాన్ని ఎంతిచ్చినా వృధా.

కడుపు నిండిన వానికి గారెలు చేదు

మార్చు

సంతృప్తిగా తిన్నవారికి మరేది రుచించదు. ఎంత రుచిగా వున్నా మరేమి తినలేరు. ఆ సందర్భంలో చెప్పేదే ఈ సామెత.

కడుపు నిండితే గారెలు వగరు

మార్చు

కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?

మార్చు

ఈ సామెత పైపై ప్రేమలు ప్రదర్శించే వారికి వర్తిస్తుంది. మనసులో ఎలాంటి ప్రేమ లేకపోయినా ప్రజల మెప్పు కోసం బాధల్లో ఉన్నవారిని కౌగిలించుకున్నంత మాత్రాన వారికి సాంత్వన చేకూరదు. లేని ప్రేమలు ప్రదర్శించవద్దని దీని అర్థం.

కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది

మార్చు

కడుపును నిజంగా చించుకున్నట్లయితే, పడేదేదయినా మన కాళ్ళ మీదే కదా! నష్టం మనకే కదా. ఈ విషయాన్నే, మనకే నష్టం కలిగించే నిజాన్ని ఇతరులకు తెలియచేసే సందర్భంలో ఈ సామెత ద్వారా చెప్పుచున్నారు.

కడుపు నొప్పికి కంట్లో కలికం పెట్టినట్లు

మార్చు

కడుపున పుట్టిన బిడ్డ - కొంగున కట్టిన రూక ఆదుకుంటాయి

మార్చు

కడుపు నిండిన బేరాలు - కడుపు నిండిన మాటలు

మార్చు

కడుపులో ఎట్లా వుంటే కాపురమట్లా వుంటుంది

మార్చు

కడుపులో చల్ల కదలకుండా

మార్చు

ఏమాత్రం కష్టం చేయకుండా..... అని అర్థము.

కడుపులోని మంట కానరాని మంట

మార్చు

కడుపులో మంట కనబడదు/

కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా?

మార్చు

కడుపులో లేని శాంతి కౌగిలింతలో దొరుకుతుందా?

మార్చు

కడుపు వస్తే కనే తీరాలి

మార్చు

కడుపే కైలాసం - యిల్లే వైకుంఠం

మార్చు

తిండి ద్యాస ఎక్కువ వున్నవారినుద్దేశించి చెప్పినది ఈ సామెత.

కణత తలగడ కాదు. కల నిజం కాదు

మార్చు

కలలు నిజమవుతాయని నమ్మేవారి నుద్దేశించి చెప్పినది ఈ సామెత.

కతికితే అతకదు

మార్చు

కత్తిమీద సాము చేసినట్లు

మార్చు

కత్తిమీద సాము చేస్తే తెగుతుంది. ప్రమాధకరమైన పనిచేస్తున్నవారినుద్దేశించి చెప్పే సామెత ఇది

కత్తి తలగడకాదు - కల నిజం కాదు

మార్చు

కత్తిపోటు తప్పినా కలం పోటు తప్పదు

మార్చు

కత్తిమీద సాము

మార్చు

చాల ప్రమాధకరమైన పని అర్థము,

కత్తు కలిస్తే పొత్తు నిలుస్తుంది

మార్చు

కత్తెరలో వాన కనకపు పంట

మార్చు

ఇది వ్యవసాయ ధారుల సామెత. కత్తెర కార్తె పంటలు వేయడానికి చాల మంచి అధను అని దీని అర్థము.

కథ అడ్డం తిరిగింది

మార్చు

కథ కంచికీ - మన మింటికీ

మార్చు

కదిపితే కందిరీగల తుట్టె

మార్చు

కదిలిస్తే కంపు

మార్చు

కదిలిస్తే గచ్చపొద

మార్చు

కథకు కాళ్ళు లేవు - ముంతకు చెవులు లేవు

మార్చు

కని గ్రుడ్డి, విని చెవుడు

మార్చు

కనిపెంచిననాడు కొడుకులుగానీ, కోడళ్ళు వచ్చాక కొడుకులా?

మార్చు

కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండు

మార్చు

కొబ్బరి కాయ (కొబ్బరికాయకు మూడు కన్నులుంటాయి... )

కనుమునాడు కాకి అయినా కదలదు

మార్చు

కనుమునాడు కాకి గూడా మునుగుతుంది

మార్చు

కనుమ పండగనాడు అందరూ స్నానం చేయాలని చెప్పే సామెత ఇది.

కనుమునాడు మినుము కొరకాలి

మార్చు

కన్నతల్లికి కడుపుకు పెడితే, పినతల్లికి పిర్రకాలిందట

మార్చు

కన్నతల్లికైనా మరుగుండాలి

మార్చు

కన్నమ్మకే పొగరు - ఉన్నమ్మకే పొగరు

మార్చు

కన్నామేగానీ, కడుపులో పెట్టుకుంటామా?

మార్చు

కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు...

మార్చు

కన్నుబోయేటంతటి కాటుక అనవసరమన్నట్టు. అతి ఎప్పుడు అనర్థమే అని. ఎప్పుడైనా, ఎక్కడైనా ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటేనే క్షేమదాయకమని ఈ సామెత అర్థం.

కన్నామేగానీ, కడుపులో పెట్టుకుంటామా?

మార్చు

కన్ను ఎరుగకున్న కడుపు ఎరుగుతుంది

మార్చు

కన్ను గుడ్డిదయితే కడుపు గుడ్డిదా?

మార్చు

కన్ను చూచి కాటుక - పిర్ర చూచి పీట

మార్చు

కన్ను చూచిన దానిని నమ్ము - చెవి విన్నదానిని నమ్ము

మార్చు

చెప్పుడు మాటలు విని చెడిపోవద్దని హెచ్చరించే సామెత ఇది.

కన్నె నిచ్చినవాణ్నీ, కన్ను యిచ్చినవాణ్నీ కడవరకూ మరువరాదు

మార్చు

కన్నూ మనదే - వేలూ మనదే అని పొడుచుకుంటామా?

మార్చు

కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు

మార్చు

కన్యలో చల్లితే ఊదుకుని తినటానికయినా ఉండవు

మార్చు

కన్యా రాసిలో పంట పెడితే ఫలితముండని తెలియ జెప్పే సామెత ఇది.

కన్నొకటి లేదు గానీ కాంతుడు కాడా?

మార్చు

కపటము బయట దేవుడు - ఇంట్లో దయ్యము

మార్చు

కప్పకాటు - బాపనపోటు లేవు

మార్చు

కప్పలు కూస్తే వర్షం పడుతుంది

మార్చు

ఇది వ్యవసాయధారుల సామెత. కప్పలు అరిస్తే వర్షం వస్తుందని రైతుల నమ్మిక.

కప్పి పెట్టుకుంటే కంపు కొట్టదా?

మార్చు

కమ్మ అండ గాదు - తుమ్మ నీడ కాదు

మార్చు

కమ్మకు వరస లేదు - కప్పకు తోక లేదు

మార్చు

కమ్మగుట్టు గడప దాటదు

మార్చు

ఇది కులాల గురించి చెప్పిన సామెత. కమ్మవారి ఇండ్లలోని విషయాలు బయటకు తెలియవు అని దీని అర్థం.

కమ్మని రోగాలూ, తియ్యని మందులూ వుంటాయా

మార్చు

కమ్మనీ, తుమ్మనీ నమ్మరాదు

మార్చు

కమ్మరి వీధిలో సూదులమ్మినట్లు

మార్చు

కమ్మరి అంటే ఇనుప వస్తువులను తయారు లేదా సరి చేసేవాడు. ఇంగ్లీషులో blacksmith అంటారు. కమ్మరులు నివాసముండే చోట సూదులు ( ఇనపవేగా ఇవి కూడా) అమ్మబోవటం తెలివితక్కువ పని.

ఇంగ్లీషులో ఇలాంటి సామెత ఒకటున్నది. 'Carrying coal to NewCastle' అని. అంటే న్యూకాజిల్ అనే ఊరికి బొగ్గు మోసుకు పోయినట్టు అని. ఇంగ్లండులో న్యూకాజిల్ అనేది బొగ్గు గనులకు ప్రసిద్ధి.

కయ్యానికైనా, వియ్యానికైనా సమవుజ్జీ కావాలి

మార్చు

కరక్కాయ - కన్నతల్లి

మార్చు

కరక్కాయ ఆయుర్వేధంలో వాడే ఒక దినుసు కాయ. ఇది వంటికి చాల మంచి చేస్తుంది. ఎలాగంటే తల్లి లాగ అని దీని అర్థము.

కరణం, కాపూ నా ప్రక్కనుంటే కొట్టరా మొగుడా ఎట్లా కొడతావో చూస్తా అందట

మార్చు

కరణంతో కంటు కాటికి పోయినా తప్పదు

మార్చు

కరణం సాధువూ కాడు - కాకి తెలుపూ కాదు

మార్చు

కరణము ఏనాటికి మంచి వాడు కాడు. తెల్లని కాకి ఎలా వుండదో మంచి కరణం కూడా వుండడని దీని అర్థం.

కరణానికీ కాపుకీ జత - ఉలికీ గూటానికీ జత

మార్చు

కరణానికి తిట్టు దోషం - చాకలికి ముట్టు దోషం లేదు

మార్చు

కరణం చేసే మోసపు పనులకు అతని ఇలాక లోని ప్రజలందరు తిడుతారు. చాకలి అన్నిరకాల బట్టలను ఉతుకు తాడు. అలా..... కరణానికి తిట్టు దోషం, చాకలికి ముట్టు దోషం వుండదని అర్థం.

కరణాన్ని, కంసాలిని కాటికి పోయినా నమ్మరాదు

మార్చు

ఇది కులాలకు సంబంధించిన సామెత. కరణం ఎప్పుడు ఒకరికొకరికి తగాదాలు పెట్టుతుంటాడు. అదే విధంగా కంసాలి అనగా బంగారపు పని చేసే వాడు..... ఇతడు తన తల్లి తాళిబొట్టులోనుండి కూడా కొంత బంగారాన్ని తస్కరిస్తాడని నానుడి. ఈవిధంగా ఈ సామెత పుట్టింది.

కరణాలూ కాపులూ ఏకమయితే కాకులు కూడా ఎగురలేవు

మార్చు

కరణము, కాపు (మునసబు) వీరిద్దరు గ్రామ పెద్దలు. వీరిద్దరు కలిస్తే ఏమైనా చేయగలరిని దీనర్థం.

కరతలామలకము

మార్చు

కరతల (అరచేతిలోని) ఆమలకము (ఉసిరికాయ) వలె. స్పష్టముగనున్నదని భావము.

కరస్థబిల్వన్యాయము : నిశ్శేపోపనిషత్సార స్తదేత దితి సాంప్రథమ్‌, ఉక్త్వా విష్క్రియతే సాక్షా త్కరవిన్యస్తబిల్వవత్‌

కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం

మార్చు

ఒక కప్పని పాము నోటిలో కరుచుకోని ఉన్నదంట అటువంటి సమయంలో అటుగా వెళ్తున్న దానయ్యని తీర్పు అడిగినాయంట పామేమో తినాలి అదే న్యాయం, ఇది నా ఆహారం అని అన్నదంట! కప్పేమో నేను బలహీనుడిని, మైనారిటీ వాడిని నన్ను కాపాడాలి రాజ్యాంగం ప్రకారం అన్నదంట! దానయ్యకేమి చెప్పాలో అర్థం కాలేదంట, అందుకే అతను ఉన్న స్థితిలో ఎవరు ఉన్నా ఇలా అంటారు "కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం"

కరువుకాలంలో ఒల్లనివాడు పంటకాలంలో పంపమని వచ్చాడట

మార్చు

కరువుకు గ్రహణాలు మెండు

మార్చు

కరివేపాకు కోసేవాడే వాడినట్లు

మార్చు

కరువుకు దాసరులైతే పదాలెక్కడ వస్తాయి?

మార్చు

కరువునాటి కష్టాలుండవు గానీ కష్టాలనాటి మాటలుంటాయి

మార్చు

కరువులో అధికమాసం అన్నట్లు

మార్చు

కరువు మానుప పంట - మిడతల మానప పంట

మార్చు

కరువులో అరువు అన్నట్లు

మార్చు

కరువులో కవల పిల్లలు

మార్చు

కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది

మార్చు

పరిస్థితులు అనుకూలముగా లేనపుడు, ఎన్నడూ కూడా జరగని విచిత్ర పరిస్థితులను ఎదురుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్నే, చేతిలో కర్ర లేని కాపరికి సాధు జంతువయిన గొర్రె కూడా కరుస్తుంది, అన్న నిత్యజీవిత సత్యము ద్వారా ఈ సామెత వివరిస్తోంది.

కర్ర విరగకుండా - పాము చావకుండా

మార్చు

ఎటూ తేలని వ్యవహారము గురించి చెప్పినది ఈ సామెత.

కర్రు అరిగితేనే కాపు బ్రతుకు

మార్చు

కర్మకి అంతం లేదు

మార్చు

కర్కాటకం చిందిస్తే కాటకముండదు

మార్చు

కర్కాటకం కురిస్తే కాడిమోకు తడవదు

మార్చు

కర్మ ఛండాలుని కంటే - జాతి ఛండాలుడు మేలు

మార్చు

కర్ణుడు లేని భారతం - శొంఠి లేని కషాయం ఒక్కటే

మార్చు

కర్ణునితో భారతం సరి - కార్తీకంతో వానలు సరి

మార్చు

కలకాలం ఆపదలు కాపురముంటాయా?

మార్చు

కలకాలపు దొంగ ఒకరోజు దొరుకుతాడు

మార్చు

కల్పవృక్షాన్ని కాఫీపొడి అడిగినట్లు

మార్చు

కలిగినింటి బిడ్డ కాకరకాయ పైకి కనపడవు

మార్చు

కాకరతీగకు కాసే కాయలు ఆకులు దట్టంగా ఉండటం వల్ల ఆకు మాటున ఉండి పైకి వెంటనే కనిపించవు. అలాగే ధనవంతుల ఇంట పుట్టిన బిడ్డ సామాన్య ప్రజల బిడ్డలాగా వీధుల్లో అంత తొందరగా కనిపించడు.

కలల అలజడి కవ్వింతల రాజ్యం అన్నట్లు

మార్చు

కలలో జరిగింది ఇలలో జరగదు

మార్చు

కలలో భోగం కలతోటే సరి

మార్చు

కలవారింటి ఆడపడుచుకు కాకరకాయ కానరాదు

మార్చు

కల్ల పసిడికి కాంతి మెండు

మార్చు

కలిగినదంతా కడుపు కోసమే - ఎంత పెంచినా కాటి కోసమే

మార్చు

కలిగిన వారికి అందరూ చుట్టాలే

మార్చు

కలిగినమ్మ గాదె తీసేటప్పటికి లేనమ్మ ప్రాణం పోయిందట

మార్చు

కలిగినమ్మ రంకు - కాషాయ బొంకు ఒక్కటే

మార్చు

కలిపి కొట్టరా కావేటి రంగా!

మార్చు

కలిమి ఉన్నంత సేపే బలగము

మార్చు

కలిమికి పొంగరాదు - లేమికి క్రుంగరాదు

మార్చు

కలిమి గలవాడే కులము గలవాడు

మార్చు

కలిమిగల లోభికన్నా పేద మేలు

మార్చు

కలిమిలేములు కావడి కుండలు

మార్చు

కష్టలు ఎల్లకాలముండవని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

కలిసొచ్చే కాలానికి కుందేలు వంటింట్లోకి వస్తుంది

మార్చు

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు

మార్చు

కల్ల పసిడికి కాంతి మెండు

మార్చు

నకిలి బంగారానికి మెరుగు ఎక్కువని అర్థం.

కలసి ఉంటే కలదు సుఖం

మార్చు

కలిసిమెలిసి వుంటే వారికి సుఖం వుంటుంది. విడిపోతే కష్టాలు తప్పవు. అలా పుట్టింది ఈ సామెత. ఇలాంటిదే మరో సామెత; 'ఐకమత్యమే మహా బలం'

కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు

మార్చు

పుట్టుకతోనే ఏ బిడ్డా నడవలేడు. కానీ ఈ సామెతను (కాలం కలిసివస్తే నడిచివచ్చే కొడుకు పుడతాడు) అనుకోనిరీతిలో సహాయం కలిసివచ్చే సందర్భములో ఉదహరిస్తారు. అనగా కష్టకాలములో అందిన ఆశించని సహాయము, నడచి వచ్చే కొడుకు యొక్క పుట్టుకతో సమానము అని పోల్చుచున్నారు.

కలుపు తీయని మడి - దేవుడు లేని గుడి

మార్చు

కలుపు తీయనివారికి కసువే మిగుల్తుంది

మార్చు

కల్లు త్రాగిన కోతిలా

మార్చు

అసలే అది కోతి, అది చేసే పనులు అల్లరి చిల్లరగా వుంటాయి. అలాంటిది కల్లు తాగితే ఇక దానిని ఆపడం ఎవరి తరం కాదు. ఈసామెతను ఇంకొంత పొడిగించి ఇలా కూడా అంటుంటారు. అసలే కోతి.... కల్లు తాగింది.... దాన్ని తేలు కుట్టింది,,, పైగా నిప్పు తొక్కింది;; అతిగా ఆగడం చేసె వాళ్లకు ఈ సామెత వర్తిస్తుంది.

కలిగిన వానికి అందరూ చుట్టాలె

మార్చు

ఇది లోక సహజం: ధనవంతుని అందరు చుట్టాలే. అందుకే సుమతీ శతక కారుడన్నాడు:... ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బందువులు వత్తురు అని

కల్యాణానికి ఒకరు వొస్తే కన్నం వేయటానికి ఇంకొకరొస్తారు

మార్చు

కళ్ళలో నీటిని తుడవగలంగానీ కడుపులో బాధ తుడవలేం

మార్చు

కళ్ళు ఆర్పే అమ్మ ఇళ్ళు ఆర్పుతుంది

మార్చు

కళ్ళు ఉంటేనే కాటుక

మార్చు

కళ్ళు కళ్ళు సై అంటే కౌగిళ్ళే మల్లెపందిరి అన్నట్లు

మార్చు

కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది

మార్చు

ఆశకొద్దీ ఎక్కువ పదార్థాలు వడ్డించుకున్నా తినలేకపోటం. ఆకలితో వున్నప్పుడు ఎంతో తినాలని ఆశ పడతారు. తీరా తినడానికి కూర్చున్నాక తన కడుపు పట్టినంత మాత్రమే తినగలరు. ఆ వుద్దేశముతో చెప్పినదే ఈ సామెత.

కళ్లు పెద్దవి కడుపు చిన్నది

మార్చు

ఎక్కువ ఆశపడి తక్కువ ఫలితం పొందటం. కంటికి కనిపించిందంతా సొంతం కాదు.

కళ్ళు కావాలంటాయి - కడుపు వద్దంటుంది

మార్చు

కళ్ళు నెత్తి కొచ్చినట్లు

మార్చు

కళ్ళు పెద్దవి - కడుపు చిన్నది

మార్చు

కళ్ళుపోయిన తర్వాత సూర్యనమస్కారాలు చేసినట్లు

మార్చు

కళ్ళెం - పళ్ళెం పెద్దవిగా ఉండాలి

మార్చు

కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ వుండాలంటారు.

మార్చు

ఏపని చేయడానికైనా తనకు సమానమైన వాడిని ఎంచు కోవాలని

కవికీ - కంసాలికీ సీసం తేలిక

మార్చు

కవితకు మెప్పు - కాంతకు కొప్పు అందం

మార్చు

కవ్వింతల అల్లరికి కౌగిలింతల ఖైదు

మార్చు

కసవులో పనసకాయ తరగినట్టు

మార్చు

చెడు పనులకు, దుర్మార్గాలకు అవకాశం ఇవ్వటం. పనస కాయను కసవున్నచోట తరిగితే దుమ్మూధూళి అంటుకొని అది తినటానికి పనికిరాకుండా పోతుంది.

కసిపోనమ్మ మసి పూసుకున్నదట

మార్చు

కష్టపడి ఇల్లు కట్టి, కల్లుతాగి తగలబెట్టినట్లు

మార్చు

కష్టపడి సుఖపడమన్నారు

మార్చు

కష్ట సంపాదన - యిష్ట భోజనం

మార్చు

కష్టాలు కలకాలం కాపురం ఉండవు

మార్చు

కష్టే ఫలి

మార్చు

కష్టంచేయ కుండా ఎవరికి ఫలితము దక్కదు. వూరక సంపదలు కలుగవు కష్టపడితేనె ఫలితముంటుందని చెప్పేదే ఈ సామెత అర్థం.

కాకి అరిస్తే చుట్టాలు వస్తారు

మార్చు

కాకి పిల్ల కాకికి ముద్దు

మార్చు

తల్లికి బిడ్డ ఎల్లప్పుడూ ముద్దే అని దీని అర్ధం. నల్లగా లేదా అంద విహీనంగా ఉన్న బిడ్డను ఎదుటి వారు చిన్నచూపు చూసినా ఆ తల్లికి మాత్రం బిడ్డ ముద్దుగానే ఉంటుంది. అందుకే ఎదిటి వారికి ఆ తల్లీ బిడ్డల ముద్దుముచ్చట్లు కాకి పిల్ల కాకికి ముద్దు లా అనిపిస్తాయి

కాకి గూటిలో కోయిల పిల్లలాగా

మార్చు

కాకి ముక్కుకు దొండ పండు

మార్చు

సమంగా లేని జంటను ఇలా అంటారు.

కాకి అరిస్తే భయపడి పక్కింటాయన్ని కౌగలించుకున్నదట

మార్చు

కాకులను కొట్టి గద్దలకు వేయడం

మార్చు

ఫలితం లేని పనిచేసి నప్పుడు ఈ మాటను వాడుతారు. నీపని ఎలా వుందంటే కాకులను కొట్టి గద్దల కేసి నట్టుంది.

కాకున్నది కాక మానదు

మార్చు

కాకుల మధ్య కోయిల లాగా

మార్చు

కాకై కలకాలం మన్నేకంటే - హంసై ఆరునెలలున్నా చాలు

మార్చు

కాగల కార్యం గంధర్వులే తీర్చారు

మార్చు

ఇది మహాభారతంలోని ఓ ఘట్టం నుండి వచ్చింది. పాడవులు అరణ్యవాసం చేస్తూ ఉండగా, వారికి తమ గొప్పదనం చూపించి అవమానించటానికి దుర్యోధనుడు తదితరులు ఘోషయాత్ర పేరిట వారున్న అరణ్య ప్రాంతానికి వస్తూ ఉండగా, గంధర్వ రాజు వారిని ఎదిరించి, యుద్ధం చేసి, ఓడించి, తన రథంలో కట్టిపడేసి తీసుకొనివెళ్ళిపోతాడు. ఈ హడావిడిలో, దుర్యోధనుడి అనుచరుడు ఒకడు తప్పించుకొని, పాండవులను శరణుజొచ్చి, తమ రాజును కాపాడమని కోరతాడు. గంధర్వుల చేతిలో పరాజయం పాలయిన దుర్యోధనుడి భంగపాటును పాండవులు చర్చించుకునే సందర్భంలో, భీముడు అన్న మాటలివి. అనగా మనం ఏదైనా కార్యాన్ని తలపెట్టినపుడు అనుకోకుండా అది మరో విధంగా లేదా మరొకరిచే విజయవంతంగా పూర్తిచేయబడటం.

కాచె చెట్టుకే రాళ్ల దెబ్బలు.

మార్చు

కాయలు కాచే చెట్టుకు రాళ్లు కొట్టి కాయలను రాల్చు కుంటారు పిల్లలు. కాయలు కాయని చెట్టుకు కాయలు లేవు... రాళ్ల దెబ్బలు వుండవు. అదే విదంగా ఇంకో సామెత కూడా ఉంది. 'దున్నే ఎద్దునే పొడుస్తారు' ఆ విధంగా పుట్టినదే ఈ సామెతకాటికి కాళ్ళు చాచినా కుటిలత్వం పోలే

కాటికి కాళ్ళు చాచినా కుటిలత్వం పోలేదు

మార్చు

కాటికి పోయినా కరణాన్ని నమ్మరాదు

మార్చు

కాటికి పోయినా కాసు తప్పదు

మార్చు

కాటిదగ్గర మాటలు కూటి దగ్గర వుండవు

మార్చు

కాటుక కళ్ళ వాడూ - కళ్ళార్పు వాడూ కొంపలు ముంచుతారు

మార్చు

కాడిక్రిందకు వచ్చిన గొడ్డు - చేతికంది వచ్చిన బిడ్డ

మార్చు

కాడిని మోసేవాడికి తెలుస్తుంది బరువు

మార్చు

కాని కాలానికి కర్రే పామై కరుస్తుంది

మార్చు

కాని కూడు తిన్నా కడుపు నిండాలి

మార్చు

కాని పనికి కష్టం మొండు

మార్చు

కానీకి కొబ్బరికాయ యిస్తారని కాశీదాకా పోయినట్లు

మార్చు

కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది

మార్చు

పచ్చగా కాపురం చేయాలని వచ్చిన పెళ్ళి కూతురు అతి జాగ్రత్తగా అందంగా కాళ్లకు పారయణం పెట్టుకొని వస్తుంది. ఇష్టంలేని పెళ్ళికూతురు ఏదో మొక్కుబడిగా పారాణి పెట్టుకొని వస్తుంది. ఆ విషయం గ్రహించిన పెద్దలు ఈ సామెతను చెప్తారు.

కాపు - కరణం ఏకమయితే నీళ్ళు కూడా దొరకవు

మార్చు

కాపుకు విశ్వాసం లేదు - కందికి చమురు లేదు

మార్చు

కాపు బీదైతే కళ్ళం బీద

మార్చు

కాపురం గుట్టు - రోగం రట్టు

మార్చు

కాపురం చేసే కళ కాలు త్రొక్కేవేళే తెలుస్తుంది

మార్చు

కాపుల కష్టం - భూపుల సంపద

మార్చు

కాపుల చదువులు కాసుల నష్టం - బాపల సేద్యం భత్యం నష్టం

మార్చు

కాపుల జాతకాలు కరణాల కెరుక

మార్చు

కామానికి సిగ్గూ లజ్జా లేవు

మార్చు

కామానికి కండ్లు లేవు

మార్చు

కామి గాక మోక్షగామి కాలేడు

మార్చు

కాముని పట్నంలో కౌగిలి కట్నాలన్నట్లు

మార్చు

కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడుతుంది.

మార్చు

దొంగోనికి అందరు దొంగల్లాగా.... మంచోనికి అందరు మంచి వారుగా కనబడతారు. అలా పుట్టిందే ఈ సామెత.

కాయని కడుపూ - కాయని చెట్టూ

మార్చు

కాయలో పత్తి కాయలో ఉండగానే సోమన్నకు ఆరుమూరలు నాకు పదిమూరలు అన్నట్లు

మార్చు

కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు

మార్చు

కార్చిచ్చు అడవికి ఓ అనర్ధము, దానికి గాలి కూడా తోడైతే ఇక అంతా భస్మీపటలమే. ఒక కష్టానికి మరొకటి తోడైన సందర్భములో ఈ సామెతను ఉదహరిస్తారు.

కారణం లేకుండా కార్యం పుట్టదు

మార్చు

కారాని కాలానికి రారాని పాట్లు

మార్చు

కారుచిచ్చుకు గాలి తోడైనట్లు

మార్చు

కార్యం అయ్యేదాకా తలవంచుకుంటే, కలకాలం తలెత్తుకు తిరగవచ్చు

మార్చు

కార్తీక మాసాన కడవలు కడిగే పొద్దుండదు

మార్చు

కార్తె ముందు ఉరిమినా, కార్యం ముందు వదరినా చెడుతాయి

మార్చు

కాలం గడిచి పోతుంది - మాట నిలిచిపోతుంది

మార్చు

కాలం తప్పిననాడు పై బట్టే పామై కరుస్తుంది

మార్చు

కాలం వచ్చి చిక్కింది గానీ లేడికి కాళ్ళు లేక కాదు

మార్చు

కాలమొక్కరీతిగా గడిపిన వాడే గడిచి బ్రతికిన వాడు

మార్చు

కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు

మార్చు

కాలికి దూరమయితే కన్నుకు దూరమా?

మార్చు

కాలికి రాని చెప్పును కడగా వుంచమన్నారు

మార్చు

కాలికి వేస్తే మెడకు - మెడకు వేస్తే కాలికి

మార్చు

కాలికి బలపం కట్టుకు తిరిగినట్లు

మార్చు

కాలిది తీసి నెత్తికి రాచుకున్నట్లు

మార్చు

కాలు కాలిన పిల్లిలా

మార్చు

కాలు కాలిన పిల్లి ఒక చోట నిలవకుండా, అటూ ఇటూ తిరుగుతూ గంతులు వేయును. ఈ విషయమునే ఓ నిలకడలేని వ్యక్తిని ఉద్దేశించి వ్యంగ్యముగా ఈ సామెతను పలికెదరు.

కాలూ, చెయ్యి ఉన్నంతకాలం కాలం గడుస్తుంది

మార్చు

కాలు జారితె తీసుకోవచ్చు.... నోరుజారితె తీసుకోలేరు

మార్చు

నోరు జారడమంటే ఒక మాట అనడము. మాట బయటకు వచ్చిందంటే అది ఎవరో ఒకరు వింటారు. దాన్ని వెనక్కి తీసుకోలేము అనగా ఆమాట అనలేదు అని అనలేరు. అని అర్థము

కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది

మార్చు

కాలం కలిసి రాకపోతే ఏ పని చేపట్టినా అది పూర్తి కాదు సరికదా వ్యతిరేక ఫలం వస్తుంది కర్రే పామై కరిచినంత విచిత్రంగా!

కాలు తడవకుండా సముద్రం దాటొచ్చుగానీ కన్ను తడవకుండా జీవితం దాటలేం

మార్చు

కాలంకలిసిరాకపోతే తాడే పామై కరుస్తుంది

మార్చు

ఏపని కావాలన్నా శ్రమతో పాటు కాలంకూడ కలిసి రావాలనే చేప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతారు.

కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది

మార్చు

ఇదే అర్థం చెప్పే మరో సామెత కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు.

కాలువ దాటలేని వాడు కడలి దాట గలడా

మార్చు

(ఉట్టికెక్కలేనమ్మ స్వర్గాని కెక్కగలదా..... అలాంటిదే ఈ సామెత కూడా)

కాలు త్రొక్కిన వేళ - కంకణం కట్టినవేళ

మార్చు

కాలు నొచ్చినా, కన్ను నొచ్చినా చేసేవాళ్ళు కావాలి

మార్చు

కాలె కడుపుకు గంజే పానకం

మార్చు

ఆకలి రుచి ఎరుగదు అనే సామెత లాంటిదే ఈ సామెత కూడ. కడుపు ఆకలితో కాలుతుంటే ఏదైనా తిని ఆకలి తీర్చుకోవాలి అని అర్థం.

కాలే గుడిసెకు పీకే వాసమే లాభం

మార్చు

కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ

మార్చు

వేడిచేసినప్పుడు కళ్ళమంటలు, ఒళ్ళు నొప్పులు లాంటి బాధలు కలుగుతుంటాయి. ఆముదాన్ని అరికాళ్లకు మర్దన చేస్తే ఆ వేడి తగ్గి కళ్లమంటలు పోయి చల్లగా హాయిగా ఉంటుంది. అరికాలిలో శరీరానికి సంబంధించిన నాడీమండలం కేంద్రీకృతం అయి ఉంటుంది. ఆముదం మర్దించినందువల్ల నాడీ మండలం ద్వారా నాడులు చల్లబడి దాని ద్వారా వేడి తగ్గుతుందని చిట్కా వైద్యం ఈ సామెత.

కావడి వంకరైనా గమ్యం చేరడం ముఖ్యం

మార్చు

కావలసినవన్నీ తాకట్టు పెడతా స్వంతం చేసుకుంటావా అందిట

మార్చు

కాళ్ళ తంతే పెరిగేది పుచ్చకాయ - కుళ్ళేది గుమ్మడి కాయ

మార్చు

కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరం కాశీకి వెళ్ళినా దొరకదు

మార్చు

కాళిదాసు కవిత్వం కొంత - నా పైత్యం కొంత అన్నట్లు

మార్చు

కాశీకి పోయి కొంగ పియ్య తెచ్చినట్లు

మార్చు

కాశీకి పోయినవాడూ - కాటికి పోయినవాడూ ఒక్కటే

మార్చు

ఒకప్పుడు... యాత్రలు చేయడానికి ఇప్పుడున్నన్ని ప్రయాంణ సాధనాలు లేవు. యాత్రీకులు ఎడ్లబండ్లమీదను, కాలి నడకనో తీర్థ యాత్రలకు వెళ్ళేవారు. తెలుగు రాష్ట్రానికి కాసి చాల దూరం. కనుక కాశీకి వెళ్ళడానికి కొన్ని నెలలు పట్టేది. కనుక ఆ వెళ్ళిన వారు తిరిగి రావచ్చును, లేదా అక్కడే మరణించ వచ్చు. పైగా కాసీలో మరణిస్తే పుణ్యమని ప్రజల నమ్మిక. ఆ విధంగా పుట్టినది ఈ జాతీయము.

కాశీకి పోయినా కర్మ తప్పదు

మార్చు

కాసిలో దొంగతనం చెయ్యడానికి ఇక్కడి నుండే వొంగొని వెళ్లాడట

మార్చు

కాసుకు గతిలేదుకానీ... నూటికి ఫరవాలేదన్నట్లు

మార్చు

మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె లాగా కొంతమంది చేతిలో ఏ కొద్దిపాటి ధనం లేకపోయినా గొప్పలు చెప్పుకుంటూ బ్రతుకుతుంటారు. అలాగే ఆదాయానికి ఎటువంటి అవకాశం, వనరులూ లేకపోయినా ముందుచూపు లేకుండా స్థాయికి మించిన అప్పులు చేస్తుంటారు. దగ్గర కనీసం నామమాత్రంగా ధనం లేకపోయినా ఎంతెంతో సంపద ఉన్నట్లు ఆడంబరంగా పలికే పద్ధతి మంచిది కాదని ఈ సామెత.

కాసుకు కాలెత్తేదానికి కాశీ ఎందుకు?

మార్చు

కాసుకు గతి లేదు గానీ కోటికి కొంగు పట్టాడట

మార్చు

కాసులుగలమ్మ కట్టా విప్పా - వేషంకలమ్మ విడవా మడవా

మార్చు

కాసులు గలవాడే రాజు

మార్చు

కాస్త ఓడంటే అంతా ఓడినట్లు

మార్చు

కాషాయంపైన, కషాయంలోపల వుంటే ప్రయోజనం లేదు

మార్చు

కాంతా కనకాలే కయ్యాలకి మూలాలు

మార్చు

కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు

మార్చు

ఇతరులకై కాయలు కాసే చెట్టు ఆ కాయలు తినాలనుకునే వారిచేతనే రాళ్ళదెబ్బలు తింటుంది. అంటే, పరోపకారి అయినా కష్టాలపాలు అవుతోంది. అలానే, మెత్తనివాళ్ళనే లోకులు వారి మంచితనం ఆసరాతో మోసగిస్తారు. ఈ విషయాన్నే ఈ సామెత తెలియజేస్తోంది.

కావడి వంకరైనా గమ్యం చేరడం ముఖ్యం

మార్చు

కాంతా కనకాలే కయ్యాలకి మూలాలు

మార్చు

క్రింద పడ్డావేమంటే?.... మీసాలకు మట్టి అంట లేదుగా అన్నాట్ట

మార్చు

తాను చేసిన చెడుపనిని కూడా సమర్థించుకునే వారి గురించి ఈ సామెతను ఉటంకిస్తారు

క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడట

మార్చు

ఓటమిని అంగీకరించని వితండ వాధుల నుద్దేశించి చెప్పినదీ ఈ సామెత

కింద పెట్టిన పంటలుండవు - పైన పెట్టిన వానలుండవు

మార్చు

కిష్కింధాపుర అగ్రహారీకులు లాగా

మార్చు

కీడెంచి మేలెంచవలె

మార్చు

కీలెరిగి వాత పెట్టాల

మార్చు

ఏ పనైనా సమయం చూసి అనుకూలమై నప్పుడే చేయాలని ఈ సామెత అంతరార్థం.

కుంచమంత కూతురుంటే మంచంలోనే కూడు

మార్చు

'కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?' అంటే 'స్వరూపాలెంచటానికి అందిట.

మార్చు

కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు

మార్చు

వెనకటికి ఎవరో కుంచెడు తిండి గింజల కోసము కూలికెళితే, ఇంట్లోని తూమెడు గింజల్ని దూడ మేసిందిట. అనగా, సంపాదించిన దాని కన్నా ఎక్కువ పోగొట్టుకున్నదనమాట. ఈ సామెతను ఈ విధమయిన సందర్భములో వాడెదరు.

కుంటికులాసం ఇంటికి మోసం

మార్చు

కుంటి గాడిదకు జారిందే సాకు

మార్చు

కుంటివాడి తిప్పలు కుంటివాడివి - గూనివాడి తిప్పలు గూనివాడివి

మార్చు

ఎవరి తిప్పలు వారికుంటాయి అని ఈ సామెతకు అర్థము.

కుంటి సాకులు - కొంటె మాటలు

మార్చు

కుంటి వాడయినా ఇంటి వాడే మేలు

మార్చు

కుండ ఎప్పుడు వేరో కుదురూ అప్పుడే వేరు

మార్చు

కుండల దుమ్ము రోకళ్ళతో దులిపినట్లు

మార్చు

కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె

మార్చు

కుండలో కూడు కుండలోనే ఉండాలి, బిడ్డలు మాత్రం దుడ్డుల్లాగా ఉండాలి ఇంట్లో వున్న తిండి గింజలు ఖర్చు కాకుండా అనగా అన్నం వండకుండానే పిల్లలు మాత్రం లావుగా తయారు కావలని కోరుకోవడం లాంటి వారిని గురించి ఈ సామెత వాడతారు.

కుండలు మూయను మూకుళ్ళున్నాయి కానీ - నోళ్ళను మూయ మూకుళ్ళు లేవు

మార్చు

కుండలు, చాటలు లేవని వండుకుతినటం మానుతామా?

మార్చు

కుండలో కూడు కుండలో వుండాలి - బిడ్డలు గుండ్రాయిల్లాగా వుండాలి

మార్చు

కుండల్లో గుర్రాలు తోలినట్లు

మార్చు

కుండ వేరయితే కులం వేరా?

మార్చు

కుందేటి కొమ్ము సాధించినట్లు

మార్చు

కుక్క కాటుకి చెప్పు దెబ్బ

మార్చు

కుక్క ఎవర్నైనా కరచినప్పుడు దాన్ని చెప్పుతో కొడితే, అది చేసిన తప్పుకు శిక్షించినట్టు అవుతుంది. అదే విధంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు తగ్గ ఫలితం వెంటనే అనుభవిస్తే ఈ సామెతను వాడుతారు.

కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ... చెరకు తీపి తెలుస్తుందా

మార్చు

కుక్క సహజ స్వభావము తోలును తినటము. కానీ, అదే కుక్కకు చెరకు గడ ఇచ్చిననూ అది అయిష్టతచే రుచిచూడదు. కావున ఇక్కడ చెరకుగడ అన్నది కుక్కకు అపాత్రదానము. ఈ విషయమునే ఈ సామెత తెలుపుచున్నది. (వేమన పద్య పాదము: చెప్పుతినెడి కుక్క చెరకు తీపెరుగునా.. విశ్వదాబి రామ వినుర వేమా)

కుక్కకు ఏ వేషం వేసినా మొరగక మానదు

మార్చు

కుక్క తెచ్చేవన్నీ గొద్దెలే

మార్చు

కుక్క తోక చక్కనౌతుందా?

మార్చు

కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు

మార్చు

అసమర్ధుల సహాయం మీద ఆధార పడకూడదని దీని భావం. కుక్కకి ఈదే సామర్ధ్యం తక్కువ. ఆ కుక్క తోకను పట్టుకుని గోదావరిని దాటాలనుకోవటం అసమర్ధుని సహాయంతో మహా కార్యాన్ని సాధించాలనుకోవటంలాంటిదే అని చెప్పడమే ఈ సామెత ఉద్దేశం.

కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు

మార్చు

కుక్కను తెచ్చి అందలంలో కూర్చోపెడితే కుచ్చులన్నీ తెగ కొరికిందట

మార్చు

కుక్కను ముద్దు చేస్తే మూతంతా నాకుతుంది

మార్చు

కుక్క బ్రతుకు - నక్క చావు

మార్చు

కుక్క బుద్ధి దాలిగుంటలో వున్నంతసేపే

మార్చు

కుక్క ముట్టిన కుండ

మార్చు

కుక్కలూ కుక్కలూ కాట్లాడుకుని కూటిలో దుమ్ము పోసుకుంటాయి

మార్చు

కుక్కలు చింపిన విస్తరిలాగా

మార్చు

కుక్క వస్తే రాయి దొరకదు..... రాయి దొరికితే కుక్కరాదు.

మార్చు

అన్ని వసతులు ఒక్కసారి ఒనగూరవని తెలియ జెప్పేదే ఈ సామెత

కుక్కతోక వంకరన్నట్లు... !

మార్చు

కుక్క తోక మనం నిటారుగా ఉంచడానికి ఎంత ప్రయత్నించినా అది మరలా వంగి పోతుంది. అలాగే మూర్ఖుడికి మనం ఎంత చెప్పినా వాడి దారి వాడిదే!

కుండల దుమ్ము రోకలితో దులిపినట్లు

మార్చు

కుండలకు పట్టిన దుమ్ము దులపడానికి మృధువైన బట్టలతో దులపాలి కానీ...... రోకలితో దులపరు.. అల దులిపితే అవి పగిలిపోతాయి. తెలివి లేని వారి చేసే పనులనుద్దేశించి ఈ సామెతను వాడుతారు.

కుచేల సంతానంలాగా

మార్చు

కుట్టని రవిక చేతిలో వున్నా ఒకటే - ఏలని మొగుడు ఊరిలో వున్నా ఒకటే

మార్చు

కుట్టితే తేలు - కుట్టకుంటే కుమ్మరి పురుగు

మార్చు

కుట్టేవాడి కుడిచేతి క్రింద - చీదేవాడి ఎడమచేతి క్రింద ఉండరాదు

మార్చు

కుడవబోతూ రుచు లడిగినట్లు

మార్చు

కుడికాలు పెడితే కుల క్షయం - ఎడమకాలు పెడితే వంశ క్షయం

మార్చు

కుడిచేత్తో యిచ్చి, ఎడమచేత్తో తీసుకున్నట్లు

మార్చు

కుడిచేత్తో చేసే దానం ఎడమచేయికి తెలియరాదు

మార్చు

కుడితిలో పడ్డ ఎలుకలాగా

మార్చు

కుదువ సొమ్ముకు కొంత హాని

మార్చు

కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు...

మార్చు

ఈ సామెత ఒక అవివేకిని ఉద్దేశించి చెప్పబడింది. వెనకటికొకడు, ధాన్యాలు ఉన్న కుప్పను తగలబెట్టి, ఆ కాల్చటము వలన తయారయిన పేలాలు తింటూ కూర్చున్నాడట. కాలిన ధాన్యం విలువ పేలాల కంటే ఎన్నో రెట్లు విలువయినవి కదా. పేలాల కొరకు ధాన్యమును తగులబెట్టుట అవివేకము.

కుమ్మరి పురుగుకు మన్ను అంటుతుందా?

మార్చు

కుమ్మరి వీధిలో కుండలమ్మినట్లు

మార్చు

కుమ్మరాయిలో ఇత్తడి ముంతలు ఏరినట్లు

మార్చు

కుమ్మరి వారి కోడలు ఆము దగ్గరైనా కన్పించదా?

మార్చు

కుర్రవాడి గూర్చి అడగండిగానీ చెవుల కమ్మల విషయం మాత్రం అడగొద్దు అన్నట్లు

మార్చు

కులం కన్నా గుణం ప్రధానం

మార్చు

కులం కొద్దీ గుణం

మార్చు

కులం చెడ్డా గుణం దక్కవలె

మార్చు

కులమింటి కోతి అయినా మేలు

మార్చు

కులుకులాడి సంతకు పోతె ఎక్కా దిగా సరిపోయిందట

మార్చు

కులం చెడ్డా సుఖం దక్కిందన్నాడట

మార్చు

కులము చెరిచేవారే గానీ కూడు పెట్టే వారుండరు

మార్చు

కులము తక్కువ వాడు కూటికి ముందు

మార్చు

కుల మెరిగి కోడలిని - జాతి నెరిగి గొడ్డును తీసుకోవాలి

మార్చు

కులవిద్యకు సాటిలేదు గువ్వల చెన్నా

మార్చు

కుళ్ళే వాళ్ళ ముందే కులకాలి

మార్చు

కుళ్ళే వాళ్ళ ముందే భగవంతుడు కులుకుతాడు

మార్చు

కులహీనమైనా వరహీనం కారాదు

మార్చు

కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసిందట

మార్చు

కూటికి లేకున్నా కాటుక మాననట్లు

మార్చు

ఇదే అర్థము గల మరో సామెత ఇచట ఉంది. మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె

కూటికి తక్కువైనా... గుణానికి తక్కువేం కాదు

మార్చు

కూటికి గతి లేదు గానీ మీసాలకు సంపంగ నూనె

మార్చు

కూటికి తక్కువైతే కులానికి తక్కువా?

మార్చు

కూటికి పేదయినా చేతకు బీద కాదు

మార్చు

కూటికుంటే కోటికున్నట్లే

మార్చు

కూటి కోసం కోటి విద్యలు

మార్చు

కూటి పేద తోడు పోగొట్టుకుంటాడు

మార్చు

కూటి పేద తోడు పోగొట్టుకుంటాడు

మార్చు

కూడబెట్టిన వాడు కుడవ నేర్చునా?

మార్చు

కూడు వండటం గంజికోసమన్నట్టు

మార్చు

అన్నీ ఉన్నా వాటిని అనుభవించక లేనివారిలాగానే ఉండటం. గంజి మాత్రమే దొరికేవారికి బియ్యం సరిపోయినంతగా లభించినా అన్నం వండి, ఆ అన్నం తినకుండా గంజి మాత్రమే తాగి పూర్వంలాగానే లేమితో బాధపడ్డారట.

కూడు తిని కుల మెంచినట్లు

మార్చు

కూడు ఎక్కువైతే కువ్వాడ మెక్కువ

మార్చు

కూడు పెట్టినామెను తొడ పొందు అడిగినట్లు

మార్చు

కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట

మార్చు

కూడూ గుడ్డా అన్నవి మనిషికి కనీస అవసరములు. అవి లేనిచో జీవించుట కష్టము. అవి అడగనిచో బాగుగా చూసుకొందును అనుటలో, ఆ వ్యక్తికి ఇతరులకు సహాయము చేయు ఆలోచన లేదని తెలియుచున్నది. ఈ విషయమునే పై సామెత తెలుపుచున్నది.

కూడే కూడే కాపురాన్ని కూలదొయ్యకపోతే నేను నీ రంకు మొగుణ్ణే కాదు అన్నాడుట

మార్చు

కూతురని కుంచడిస్తే, తల్లని కంచెడు యిచ్చిందట

మార్చు

కూతురి పురుడు యింట్లో - కోడలి పురుడు అడవిలో

మార్చు

కూతురు కనకపోతే అల్లుడిమీద పడి ఏడ్చినట్లు

మార్చు

కూతురు చెడితే తప్పు తల్లిది

మార్చు

కూనను పెంచితే గుండై కరవ వచ్చినట్లు

మార్చు

కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయి

మార్చు

శ్రమించకుండా తాతలు, తండ్రులనుండి సంక్రమించిన ఆస్తులను ఖర్చుపెడుతూ జీవిస్తే అవి ఎంతో కాలం మిగలవు అని చెప్పటానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

కూనలమ్మ సంగీతం వింటూంటే కూడు దొరికినట్లే!

మార్చు

కూపస్థ మండూకం లాగా

మార్చు

కూరకు తాలింపు - చీరకు ఝాడింపు

మార్చు

కూర లేని తిండి కుక్క తిండి

మార్చు

కూరిమిగల దినములలో నేరము లెన్నడును తోచవు

మార్చు

కూరిమి చెడితే అన్నీ దోషాలే

మార్చు

కూర్చుంటే కుక్క కఱవదు

మార్చు

కూర్చుంటే లేవలేడు గానీ, ఎగిరెగిరి తంతాడట

మార్చు

కూర్చున్నవానికి కుప్పలు - తిరిగేవానికి తిప్పలు

మార్చు

కూర్చుని తింటుంటే గుళ్ళూ, గోపురాలూ ఆగవు

మార్చు

కూర్చొని తింటే కొండలయినా కరిగిపోతాయి !

మార్చు

సంపదల వృద్ధికి మూలమయిన శ్రమ చేయకుండా ఉన్న సంపదలు అనుభవిస్తుంటే కొండంత సంపదయినా కొద్ది కాలములోనే నశిస్తుంది అని ఈ సామెత భావము. అంటే శ్రమ చేయకుండా సంపదను అనుభవించే హక్కు ఎవరికీ లేదు అని ఈ సామెత తెలుపుతున్నది.

కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్లు

మార్చు

కూలికి వచ్చి మానం దోచినట్లు

మార్చు

కూలివాడి ప్రొద్దా! కుంకవే ప్రొద్దా!

మార్చు

కృత్తిక, పునర్వసులు సత్తువ పంట

మార్చు

కృత్తికలో కుతికె పిసుకుడు

మార్చు

కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు

మార్చు

కృష్ణా స్నానానికి కొండుభొట్లాజ్ఞా

మార్చు

కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు

మార్చు

కూసే గాడిద అంటే ఏ పనీ పాటా లేకుండా జులాయిగా తిరిగేవారు అనీ, మేసే గాడిద అంటే చక్కగా పని చేసేవారు అని భావము. పనీ పాటా లేకుండా తిరుగుతూ, చక్కగా పని చేసుకుంటున్న వారిని చెడగొట్టే వారి గురించి ఈ సామెత వాడతారు.

కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ

మార్చు

చిన్న వస్తువు కొని పెద్ద వస్తువును కొసరు అడిగే వారుంటారని దీని అర్థం. ఇలాంటిదే మరొక సామెత 'అసలు కంటే కొసరు ఎక్కువ. '

కొంగ జపము చేపల కోసమే

మార్చు

కొంగు తడిస్తే చలిగానీ కోకంతా తడిస్తే చలేమిటి?

మార్చు

కొంగు తాకితే కోటి వరహాలు

మార్చు

కొంగులాగితే రానిది కన్ను గీటితే వస్తుందా?

మార్చు

కొంగున నిప్పు మూట కట్టుకొన్నట్లు

మార్చు

కొంటే రానిదే కొసరితే వస్తుందా?

మార్చు

కొండ ఎక్కేవాడి నడుమును కొడవలి చెక్కినట్టు

మార్చు

అదనపు భారం, పడుతున్న కష్టానికి తోడు మరో కష్టం తోడు కావటం

కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు

మార్చు

చెడిన ఒక పనిని బాగుచేయబోతే, అది బాగుపడకపోగా మరో పెద్ద పని కూడా దాని వలన చెడితే, ఆ సందర్భములో ఈ సామెతలు ఉదహరిస్తారు.

కొండమీద మా గుండోణ్ని చూసారా? అని అడిగి నట్టుంది

మార్చు

తిరుమల కొండ మీద అందరు గుండోళ్లే..... వారిలో వీరి గుండోణ్ని ఎలా గుర్తు పట్టడం? అలాంటి అమాయకులగురించి చెప్పినదే ఈ సామెత.

కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు

మార్చు

ఎవరైనా వారి వారి బుద్ధులను బట్టే కలిసి ఉంటారు. ఇది వేమన సూక్తి.

కొండను త్రవ్వి ఎలుకను పట్టి నట్టు

మార్చు

అతి పెద్ద కష్టమైన పనిచేసి అతి స్వల్ప ఫలితం పొందితే ఈ సామెతను వాడుతారు.

కొండంత తెలివికంటే గోరంత కలిమి మేలు

మార్చు

కొండంత చీకటి - గోరంత దీపం

మార్చు

కొండంత దూదికి కొండంత నిప్పెందుకు?

మార్చు

కొండంత నిరాశ - గోరంత ఆశ

మార్చు

కొండంత దేవుణ్ణి కొండంత పత్రితో పూజించగలమా

మార్చు

కొండంత దేవుడికి గోరంత బెల్లం

మార్చు

కొండంత మొగుడే పోగా లేంది ఇవన్నీ యెందుకు అన్నదట

మార్చు

కొండంత రాగంతీసి గోరంత పదం చెప్పినట్లు

మార్చు

కొండ అద్దంలో కొంచెమే

మార్చు

కొండకు వెంట్రుక ముడివేసి లాగితే, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది

మార్చు

కొండగాలికి పైట జారితే, అందగాడి చూపుకి చీర జారిందట

మార్చు

కొండ నాలుకకి మందువేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట

మార్చు

కొండను తలతో ఢీకొన్నట్లు

మార్చు

కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు

మార్చు

కొండలి మంగలి పనిలాగా

మార్చు

కొండలు మ్రింగేవాడికి గుడులొక లెక్కా

మార్చు

కొండ మీద గోలేమిటంటే కోమటాళ్ళ రహస్యాలన్నట్లు

మార్చు

కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాళ్ళు

మార్చు

కొండలు పిండి కొట్టినట్లు

మార్చు

కొండవీటి చేంతాడులాగా

మార్చు

కొండి మీటుడు - గోడ కెక్కుడు

మార్చు

కొంపకాలి ఏడుస్తుంటే నీళ్ళు కాచుకోనా అని అడిగినట్లు

మార్చు

కొక్కిరాయీ కొక్కిరాయీ ఎందుకు పుట్టావంటే చక్కని వాళ్ళను వెక్కిరించటానికి అన్నదట

మార్చు

కొట్టా వద్దు తిట్టా వద్దు వాడి చావు వాడే చస్తాడన్నట్లు

మార్చు

కొడితే కొట్టాడు కానీ క్రొత్తకోక పెట్టాడు

మార్చు

కొడుకు బాగుండాలి - కోడలు ముండమొయ్యాలన్నట్లు

మార్చు

కొడుకు మనవాడైతే కోడలు మనదౌతుందా?

మార్చు

కొడుకు ముద్దు - కోడలు మొద్దు

మార్చు

కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట

మార్చు

ఈ సామెత ఒక అమాయక మనస్తత్వాన్ని తెలుపుతుంది. భర్త కొట్టిన దెబ్బలు మరచి, ఆతడు తెచ్చిన చీరను చూసుకు మురిసిపోయిందిట వెనకటికొక అమాయకపు భార్య.

కొత్త ఒక వింత పాత ఒక రోత

మార్చు

ఏదైనా కొత్తగా వున్నప్పుడు వింతగాను, ఆనందంగాను వుంటుంది. రాను రాను అది పాతబడితె దానిమీదున్న ఇష్టం రాను రాను తగ్గుతుంది. ఇది లోక రీతి. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత.

కొత్త అప్పుకు పోతే పాత అప్పు పైన బడ్డదట

మార్చు

కొత్త ఆవకాయ - కొత్త పెళ్ళాం

మార్చు

కొత్త కాపురం, కొత్త కత్తిపీట కొత్తలో కంటే కొంచెం పదును పడ్డాకే బాగుంటాయి

మార్చు

కొత్త కుండలో నీళ్ళు, కొత్త పెళ్ళాం బహు తీపి

మార్చు

కొత్తంత పండుగా లేదు - తల్లంత దయా లేదు

మార్చు

కొత్తది నేర్వలేడు - పాతది మరువలేడు

మార్చు

కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుకుపోయినట్లు

మార్చు

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు

మార్చు

కొత్తగా బిచ్చం అడుక్కోటము మొదలు పెట్టిన వాడికి, ఏ సమయములో అడుక్కోవాలో తెలియక పొద్దస్తమానం అడుక్కుంటూ ఉంటాడు. అదే విధముగా, కొత్తగా ఏ పనయినా మొదలు పెట్టినవాడు, అదేపనిగా ఆ పనే చేస్తుంటే ఈ సామెతను వాడటము పరిపాటి.

కొత్త వైద్యుని కంటే పాత రోగి మేలు

మార్చు

కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు

మార్చు

కొత్తగా పెళ్ళి అయినవాడికి, సమయమూ సందర్భమూ లేకుండా సంసారసుఖానికై పరితపిస్తూ ఉంటాడు. అదే విధముగా, కొత్తగా ఏ పనయినా మొదలు పెట్టినవాడు, అదేపనిగా ఆ పనే చేస్తుంటే ఈ సామెతను వాడటము పరిపాటి.

కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు

మార్చు

కొత్తఅల్లుడుకి పూర్వకాలములో అత్తవారింట రాజభోగాలు అమర్చేవారు. కొత్త అల్లుడు పనీ పాటా లేకుండా సపర్యలు అందుకుంటూ ఉండేవాడు. ఇదే విషయముగా, పనీపాట లేకుండా సోమరిగా తిని తిరిగే వాడిని ఈ సామెత ద్వారా దెప్పిపొడుస్తారు.

కొత్త వైష్ణవానికి ఒళ్ళంతా నామాలే

మార్చు

కొత్త సేద్యగాడు పొద్దెరుగడు

మార్చు

కొన్న దగ్గర కొసరుగానీ, కోరిన దగ్గర కొసరా?

మార్చు

కొన్నంగడిలోనే మారు బేరమా?

మార్చు

కొన్నది వంకాయ - కొసరింది గుమ్మడికాయ

మార్చు

కొన్నవాడు తినక మానడు

మార్చు

కొన్నాళ్ళు చీకటి - కొన్నాళ్ళు వెన్నెల

మార్చు

కొని తింటూంటే కోమటి నేస్తం

మార్చు

కొప్పున్నామె ఎటు తిప్పినా అందమే

మార్చు

కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నాడట

మార్చు

దీనికి సమానార్థంలో సంస్కృత న్యాయము: నారికేళతృణన్యాయము=కొబ్బరిచెట్టు నెందుల కెక్కెదవనిన దూడ గడ్డికొఱకు అనినట్లు.

కొమ్ములు చూచి బేరమాడినట్లు

మార్చు

కొయ్యరా కొయ్యరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాడట

మార్చు

కొర్ర గింజంత కోడల్ని చూస్తే కొండంత అత్తకు చలిజ్వరం వచ్చిందట

మార్చు

కొరివితో తల గోక్కున్నట్లు

మార్చు

కొరివి పెట్టేవాడే కొడుకు

మార్చు

కొల్లేటి పంట కూటికే చాలదు

మార్చు

కొల్లేటి వ్యవసాయానికి కోత కూలి దండుగ

మార్చు

కొసరితేగానీ రుచి రాదు

మార్చు

కొసరి భోజనం పెట్టావ్‌ -మరి ఆ ముచ్చట కూడా తీర్చమన్నాడట

మార్చు

కో అంటే కోటిమంది

మార్చు

కోక కేకేస్తే రవిక రంకేసిందిట

మార్చు

కోక ముడి విప్పుతూ వరసలడిగినట్లు

మార్చు

కోకలు వెయ్యి ఉన్నా కట్టుకొనేది ఒకటే

మార్చు

కోకలన్నిటినీ ఒకేసారి కట్టుకోలేరు. ఎన్ని సంపదలున్నా పొట్టపట్టినంత వరకు మాత్రమే ఎవరైనా తినగలరు. అవకాశం ఉన్నంతవరకు మాత్రమే ఎవరైనా ఏపనైనా చేయగలరు

కోకా, రైకా కలవని చోట చూపి ఊరించినట్లు

మార్చు

కోటలో పాగా వేసినట్లు

మార్చు

కోటి విద్యలు కూటి కొరకే

మార్చు

మనిషి ఎన్ని విద్యలు నేర్చినా అవన్నీ కడుపు నింపుకోవడానికి మాత్రమే ఈ సామెత భావం.

కోడలా! కోడలా! నీ భోగమెంతసేపే అంటే మా అత్త మాలపల్లినుంచి తిరిగి వచ్చిందాకా అందిట

మార్చు

"కోడలా కోడలా నీ భోగ మెన్నాళ్లంటే. ".. ?.... "మా అత్త సంతకు పోయి వచ్చిందాక" అన్నదట

మార్చు

కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్టు

మార్చు

ఒకరికి తప్పు చేయ వద్దని చెప్పి అదే తప్పు చెయ్యటం. తెడ్డు నాకటమంటే అందరూ తినాల్సిన ఆహారపదార్ధాలను ఒకరు ఎంగిలి చేయటం. ఎంగిలి పదార్థాలను వేరొకరికి పెట్టకూడదు. అలా చేస్తే పాపం మూటకట్టుకున్నట్టవుతుంది అని ఓ అత్త తన కోడలికి ముందు బుద్ధులు చెప్పి తర్వాత తానే ఆ పనిచేసిందట. ఎదుటి వారికి నీతులు చెప్పి తాము ఆ నీతులను పాటించకపోవటం

కోడలి కన్నీళ్ళు కనబడతాయిగానీ, అత్త పెట్టే ఆరళ్ళు కనబడవు

మార్చు

కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు

మార్చు

కోడలికి బుద్ధి చెప్పి అత్త ఱంకు పోయిందట

మార్చు

కోడలు గృహ ప్రవేశం - అత్త అగ్ని ప్రవేశం

మార్చు

కోడలు నలుపైతే కులమంతా నలుపే

మార్చు

కోడలు వచ్చిన వేళ - గొడ్డు వచ్చిన వేళ

మార్చు

కోడికి కులాసా లేదు - కోమటికి విశ్వాసం లేదు

మార్చు

కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించదా?

మార్చు

కోడి కాళ్ళకు గజ్జెలు కట్టినా కసువు కుప్పలను కుళ్లగిస్తూనే ఉంటుంది. అలవాటు మారదు.

కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం

మార్చు

కోడిగుడ్డుకి ఈకలే ఉండవు. అలాంటిది వాటి మీద ఈకలు పీకడంలో అర్థం లేదు. కొంతమంది తమ దర్పం చాటుకోవడం కోసం అర్థంలేని వితండవాదం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని ఈ సామెతతో పోలుస్తాం. అక్కడ ఏమి లేకున్నా ఏదో వున్నట్టు బ్రమింప జేసి నమ్మించే ప్రయత్నంచేసే వారిని ఇలాగంటారు. వీడొట్టి కోడి గుడ్డు పనీ ఈకలు పీకే రకం... అని.

కోడి గుడ్డు పగలకొట్టేందుకు గుండ్రాయి కావాలా?

మార్చు

చిన్న పనులకు పెద్ద ప్రయత్నం అనవసరం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా?అల్పులను శిక్షించేందుకు అధికమైన బలం అక్కరలేదని, అల్పుడైన శత్రువును కొట్టడానికి అధిక బలం అనవసరమని

కోడి పియ్య మందు అంటే కొర్రెక్కి ఏరిగిందట

మార్చు

ఇది ఎలా వచ్చిందంటే.. ఎవరో చెప్పారట 'కోడి పియ్య' (కోడి రెట్ట) ను ఏదో రోగానికి 'మందు' గా వాడితే గుణం ఇస్తుంది అని చెప్పారొకరికి. అయితే ఆ వ్యక్తి కోడి పియ్య సేకరంచడానికి కోడి వెనక పరిగెత్తాడు. అది అంతసులభంగా దొరుకుతుందా పట్టుకోవడానికి. ఇల్లంతా తిప్పించి ఆఖరికి 'కొర్రు' (ఎత్తుగా ఉండే పందిరి రాట) మీదకు ఎక్కి అక్కడినుండి రెట్ట వేసింది. ఆ రెట్ట కింద పడి నాలుగు వేపులా తుళ్ళిపోయిందట. ఎవరైనా అతిగా బ్రతిమాలించుకుని లేదా మురిపించుకుని ఆఖరికి ఏదో సాయం చేసాంలే అన్నట్లు కొద్ది సహాయాన్ని అందించే సందర్భంలో ఈ సామెతవాడతారు.

కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు

మార్చు

కోలతో భయపెడితేనే గాని కోతి ఆడమన్నట్లు ఆడదు. ఈ విషయాన్నే, పనిదొంగయై ఎల్లప్పుడూ ఒకరి పర్యవేక్షణలో తప్ప స్వతహాగా పనిచేయలేని వానిని ఉద్దేశించి పాడెదరు.

కోడీ, కుంపటీ లేకపోతే తెల్లారదా?

మార్చు

కోడిగుడ్డుకు ఈకలు పీకినట్టు

మార్చు

కోడి రెక్కారవేస్తే గొప్పవాన

మార్చు

కోతలకు ఉత్తర కుమారుడు

మార్చు

కోతికి అద్దం చూపినట్లు

మార్చు

కోతికి కొబ్బరికాయ దొరికినట్లు

మార్చు

కోతి చస్తే గోడవతల పారేసినట్లు

మార్చు

కోతికి తేలు కుట్టినట్లు

మార్చు

కోతికి పుండయితే గోకా, నాకా

మార్చు

కోతికి బెల్లం, కోమటికి ధనం చూపరాదు

మార్చు

కోతి చావు, కోమటి ఱంకు ఒక్కటే

మార్చు

కోతి పంచాయితీ కొంప తీస్తుంది

మార్చు

కోతి పుండు బ్రహ్మరాక్షసి

మార్చు

కోతి రూపుకు గీత చక్కన - పాత గోడకు పూత చక్కన

మార్చు

కోపం గొప్పకు ముప్పు - హంగు అల్లరికి ముప్పు

మార్చు

కోపానికి పోయిన ముక్కు శాంతానికి రాదు

మార్చు

కోమటి ఊరందరికీ ఇస్తాడు కానీ తాను తినడు

మార్చు

కోమటి యిల్లు కూలినట్లు

మార్చు

కోమటికులం పైసాకు తులం

మార్చు

కోమటికీ కోతికీ ముల్లె చూపరాదు

మార్చు

కోమటితో మాట - కోతితో సయ్యాట ప్రమాదాలు

మార్చు

కోమటికి లేమి - కంసాలికి కలిమి వుండదు

మార్చు

కోమటి సాక్ష్యం - బాపన వ్యవసాయం

మార్చు

కోమట్ల కొట్లాట - గోచీ వూగులాట

మార్చు

కోమట్ల కొట్లాట - గోచీ వూగులాట

మార్చు

కోమలాంగి సోకు కోనసీమ కొబ్బరి లాంటిదిట

మార్చు

కోరి అడిగితే కొమ్మెక్కుతారు

మార్చు

కోరి కొరివితో తల గోక్కున్నట్టు

మార్చు

కొరివితో తల తోక్కుంటే జుట్టు, తల కాలుతాయి. కోరి ఎవరూ ఆ పని చెయ్యరు. ఈ విధంగా ఎవరైనా కోరి ఆపదలుకాని, ప్రమాదముగాని కొనితచ్చుకుంటే ఈ సామెతను వాడుతారు.

కోరి నెత్తికెత్తుకున్న దేవర దయ్యమై పట్టుకున్నట్టు

మార్చు

కోరి పిల్లనిస్తామంటే కులం తక్కువ అన్నట్లు

మార్చు

కోరుకున్న కోడలు వస్తే, నెత్తిమీద నిప్పులు పోస్తుం

మార్చు

కోర్టులో గెలిచినవాడు యింట్లో ఏడిస్తే, ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు

మార్చు

కోర్టు కెక్కినవాడూ, గాడిద నెక్కినవాడూ ఒక్కటే

మార్చు

కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు

మార్చు

కోతి పుండు బ్రంహ రాక్షసి అయినట్టు.

మార్చు

కోతికి పుండు అయితే అది మానదు సరికదా ఇంకా పెద్దదవుతుంది. ఎలాగంటే దాని సహచర కోతులు అన్ని ఆ పుండును గీకి ఏదో బాగు చేద్దామని ప్రయత్నిస్తాయి. ఆ విధంగా ఆపుండు మరింత పెద్దదవుతుంది. అలా పుట్టినదే ఈ సామెత.

కోతికి కొబ్బరి కాయ ఇచ్చినట్లు

మార్చు

కోతికి కొబ్బరి కాయ ఇస్తే దాన్ని తినడానికి చేసే వృధా ప్రయాసతోనే కాలం గడిచి పోతుంది. అలా పుట్టినదే ఈ సామెత.

కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే.... దూడ గట్టి కొసమన్నాడట

మార్చు

ఆబద్దం కూడా అతికినట్టు చెప్పలేని వారి గురించి ఈ సామెత వాడతారు

కోస్తే తెగదు కొడితే పగలదు

మార్చు

నీడ (ఇది పొడుపు కథ. దీనిని పొడుపు కథలు వర్గంలో చేర్చ వచ్చు

కౌగిలించి చేసుకునేవే ప్రేమ వందనాలు

మార్చు

కౌగిట్లో పరువాలు పడతియిచ్చే నజరానాలు

మార్చు

కౌగిలింతకన్న సుఖం లేదు - కాపురమంత మజా లేదు

మార్చు

కౌగిలింతలకే కన్నె తాపాలు (చెల్లు) అన్నట్లు

మార్చు

కౌగిలింతల బిగువెంతంటే నచ్చినవాడి శక్తంత అందిట

మార్చు

కౌగిలిహోరూ మల్లెలజోరూ తప్పితే కడుపుపండే మాటేమైనా వుందా? అందిట

మార్చు

కౌగిళ్ళ కట్నాలే సొగసులకు నజరానాలన్నట్లు

మార్చు

కౌగిళ్ళ గుసగుసలు కాముని దరహాసాలన్నట్లు

మార్చు

కౌగిళ్ళ పందిట్లో పూలంగి సేవలన్నట్లు

మార్చు

కౌగిళ్ళ బంధాలేసి బుగ్గల్లో మందారాలు పూయిస్తే అందాల గంధాలు పూస్తా అందిట

మార్చు

కౌగిళ్ళ స్వర్గాలు కాముని రాజమార్గాలు అన్నట్లు

మార్చు
  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikibooks.org/w/index.php?title=సామెతలు_-_క&oldid=34924" నుండి వెలికితీశారు