భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


తంజావూరి సత్రం

మార్చు

తంతే పరుపులో పడ్డట్టు

మార్చు

ఒకచోట తిరస్కారం పొందినవాడు ఇంకోచోట గొప్ప గౌరవాన్ని పొందటం

తంతే బూరెల బుట్టలో పడ్డట్టు

మార్చు

అవమాన పడినా లాభం పొందటము

తండ్రి చాటు కొడుకు

మార్చు

తల్లిచాటు బిడ్డ . నిర్ణయాలు తీసుకొనే శక్తి, స్వేచ్ఛలేని అమాయకుడు.

తండ్రి తవ్విన నుయ్యి

మార్చు

తండ్రి పై ఎంత ప్రేమాభిమానాలున్నా తండ్రి తవ్విన నుయ్యి కదాయని అందులో దూకలేము. ఇలాంటిదే మరొక జాతీయము.... తన దీపమని ముద్దుపెట్టుకున్నట్టు

తందాన పలకటం

మార్చు

అనుకూలంగా మాట్లాడటం.బుర్రకథలో ప్రధాన కథకుడు తందాన తాన అంటే... వంతలు కూడా తందాన తాన అంటూ ఉంటారు. ఇలాగే ఒక వ్యక్తి చెబుతున్న విషయాన్ని అతడి పక్కనున్నవారు సమర్థించటం

తగిలించు కోకు

మార్చు

దారిన పోయె కంపను ముడ్డికి తగిలించు కోకు, అనగా అనవసరమైన విషయాలలో వేలు పెట్టకు అని అర్థం.

తడి ఆరని సొంపు

మార్చు

ఎన్నేళ్ళయినా చక్కగా అందంగా ఉండటం

తడిక లేని ఇల్లు

మార్చు

సొమ్మును చాలా తేలికగా కాజేయవచ్చు,

తడి గుడ్డతో గొంతులు కోసే రకం

మార్చు

ఆధారాలు లేకుండా ఇతరులకు హాని చేసె వాడు.

తడిబట్టేసుకోవటం

మార్చు

చేయాల్సిన పనులేవైనా ఉన్నా వాటన్నిటినీ పక్కనపెట్టి హాయిగా విశ్రాంతి తీసుకోవటం లేదా నిద్రపోవటం

తడిసి మోపెడైంది

మార్చు

చాల ఎక్కువైందని అర్థం: ఉదా:....... నీవు చేసిన చిల్లర అప్పులన్ని తడిసి మోపెడైంది.

తాతాచార్యులవారి ముద్ర

మార్చు

తథాస్తు పలకడం

మార్చు

ఆమోదించటం, అట్లే అగుకాక అని అర్థం. తథాస్తు దేవతలుంటారన్నది ఓ నమ్మకం. మనుషులు ఏది అనుకుంటున్నా దానికల్లా ఆ దేవతలు తథాస్తు అని అంటుంటారని కనుక ప్రతివారు చెడు అనుకోకుండా మంచిమాత్రమే అనుకోవాలని, సర్వ వేళలలోకూడ మంచి ఆలోచనలు కలిగి వుండాలని ఈ జాతీయములోని అంతరార్థము.

తథాస్తు దేవతలు

మార్చు

తద్దినం నాటి జంధ్యం

మార్చు

తద్దినం పెట్టేవాడి తమ్ముడు

మార్చు

తప్పులతడక

మార్చు

సన్నటి, పల్చటి రకరకాల వెదురు బద్దలు విడివిడిగా ఉన్నప్పటి కన్నా తడికెగా అల్లిన తర్వాతలాగా విడివిడిగా జరిగిన తప్పులు అంతగా గుర్తింపులోకి రాకపోయినా ఒకదాని వెంట ఒకటి వరుస క్రమంలో..ఓ రూపానికొచ్చి గట్టిగా ఉన్నట్టనిపిస్తాయి.

తప్పలు తర్రలు

మార్చు

లెక్క కోసం కనిపిస్తున్నా దేనికీ పనికి రాని డొల్లలు తడిసి ముక్కిపోయిన గింజలు.తప్ప తాలు, నాణ్యత లేకపోవటం . లోపల గింజేమీ లేకుండా కేవలం పైతొక్కు, పొట్టుతో మాత్రమే ఉండటం.విలువ లేని తనం

తర్రవడ్లకు నీళ్ళ కల్లు

మార్చు

పిండికొద్దీ రొట్టె, గంతకు తగ్గ బొంత . ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది, ఎంత ఎక్కువ ఇస్తే అంత బాగా పని చేస్తారు.తర్ర అంటే తాలు, తప్పు, నాణ్యత లేని, సారం లేని, గట్టిగా లేనివి. తర్రవడ్లు అంటే నాణ్యత లేని ధాన్యం . ఓ వ్యక్తి కల్లు దుకాణం దగ్గర తర్రవడ్లునిచ్చి కల్లు పోయమన్నాడట. ఆ దుకాణదారుడు కూడా దానికి తగ్గట్టుగానే మంచి కల్లును కాక నీళ్ళు కలిపిన కల్లును ఇచ్చాడట.

తలవొగ్గు

మార్చు

తలవొగ్గు అనగా ఓడిపోవడము అని అర్థం. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆ పరిస్థితులకు ఎదురొడ్డక తల వంచుకొని వెళ్ళి పోవడమే మంచిదని ఈ జాతీయానికి అర్థం.

తలకిందులవ్వటం

మార్చు

ఉండాల్సిన తీరులోకాక అందుకు భిన్నంగా ఉండటం, అనుకోని సంఘటనలు జరిగి సాధారణ స్థితిగా కాక అసాధారణ స్థితిగా కనిపించటం, ప్రవర్తించటం . ఖంగుతినటం, డీలాపడిపోవటం

తలకిందులుగా జపం చేయటం

మార్చు

పట్టుదలతో కృషి చేయటం = ఉదా: నీవు తలకిందుల జపం చేసినా నానుండి ఏమి రాలదు.

తలకెక్కిందా

మార్చు

అర్థమయిందా? ఉదా: అయ్యవారు చెప్పింది నీకేమైనా తలకెక్కిందా?

తల కొట్టేసినట్టుంది

మార్చు

అవమానమైనది: అర్థమయ్యిందా? అని అర్థం ఉదా: వాడు చేసిన పనితో నా తల కొట్టేసి నట్టుంది.

తలగడ కింద పాము

మార్చు

(పక్కలో బల్లెం ..... అలాంటిదే ఈ జాతీయం)

తల తోక లేని పనులు చేయకు

మార్చు

పనికి రాని పనులు చేయకు అని అర్థం. ఉదా: వాడు చేసే పనులన్నీ తలాతోకా లేనివి............ అని అంటుంటారు.

తల గట్టి.. కడుపు గుల్ల

మార్చు

తెలివితేటలుండి సంపాదన సరిగా లేనివాడిని ఉద్దేశించి ఈ మాట వాడతారు

తల తీసేసినట్టు

మార్చు

పరువు పోయినట్టు, అవమానం జరిగినట్టు, తల కొట్టేసినట్టు, మరణ శిక్ష అనుభవించినట్టు

తల తోక లేని పనులు

మార్చు

ఉపయోగం లేని పనులు. ఉదా: వాడు చేసె పనులన్ని తలా తోక లేని పనులే..

తల దించుకోవటం

మార్చు

అవమానంగా భావించుకోవటం, అవమానం పాలు కావటం ఉదా:... నీవు చేసిన పనులకు సమాజంలో నేను తల దించు కోవలసి వచ్చింది.

తల పండటం

మార్చు

ఎక్కువ అనుభవం కలిగి ఉండటం.జ్ఞాన వృద్ధులు, అనుభవం సంపాదించి ఉండటం, పక్వం చెందటం పరిపూర్ణతను సాధించటం, ఫలవంతం కావటం, జుట్టు తెల్లబడటాన్ని కూడా తలపండటం అంటారు.

తలపగ తోకచుట్టం

మార్చు

అయినవాళ్ళకు ఆకుల్లో కానివాళ్ళకు కంచాల్లో.సొంత రక్తసంబందీకులను శత్రువుల్లాగా చూస్తూ పరాయివాళ్ళను మిత్రులుగా చూడటం

తలపై తల రావటం

మార్చు

ఇక్కడ తల వున్నది అంటే తెలివి వున్నదని అర్థం. ఉన్న తలగాక దాని పై మరొక తల వచ్చిందని అంటే అధికంగా తెలివి రావటమని అర్థము. రెండు తలలు అనగ తెలివి రెట్టింపు కావడమని అర్థం. అత్యధిక తెలివిగా ప్రవర్థింస్తుంటె ఈ జాతీయాన్ని వాడుతారు.

తల తాకట్టు పెట్టైనా

మార్చు

ఎట్టి పరిస్థుతులలోను.... ఉదా: తల తాకట్టు పెట్టైనా నీ అప్పు తీరుస్తాను.

తల దూరుస్తున్నాడు

మార్చు

వారితో కలుస్తున్నావు: ఉదా: నీవు అనవసరంగా వారి పనిలో తల దురుస్తున్నావు.

తలపెట్టడం

మార్చు

శిరస్సు తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టడం .తలపు+పెట్టడం తలపెట్టడం= ఏదైనా ఒక పని చేయాలన్న ఆలోచనకు రావటం

తలపొగరు ఎక్కువైంది

మార్చు

తలబిరుసు

మార్చు

కఠినంగా వ్యవహరించటం, పొగరుగా ప్రవర్తించటం ఉదా: వానికి తలబిరుసు తనం ఎక్కువ.

తలలు పట్టుకోవటం

మార్చు

ఏమీ తోచని దిక్కుతోచని స్థితిలో ఉండటం. జుట్టు పట్టుకోవటంమంటే తగాదా పడటం, పోట్లాడుకోవటం.

తలలు మార్చటం

మార్చు

నాయకత్వాన్ని మార్చటం (నిందా వాచకంగా కూడా దీన్ని వాడతారు.. ఉ:.. వాడు తలలు మార్చే రకం: మోసగాడని అర్థం.)

తల వంచడము

మార్చు

ఒకరికి దాసోహమనడము

తలవాచి పోవటం

మార్చు

తల దాచుకోను తావె లేదు

మార్చు

నిరాశ్రయుడు అని అర్థం.

తలలో జేజెమ్మ దిగి రావాలి

మార్చు

ఉదా: నన్ను ఓడించాలంటే నీ తల్లో జేజెమ్మ దిగి రావాలి. విపరీతంగా విసుగు పుట్టడం, భరించలేని స్థితి (ఉదా: వాడి తల వాచి పోయేటట్లు చీవాట్లు పడ్డాయి)

తలాతోకాలేని

మార్చు

తలారి పగ

మార్చు

అర్ధంలేని, ఆదీ అంతంలేని.. ఉ: వాడి మాటలకు తలా తోకా వుండదు.

తలూపటం

మార్చు

అనుమతివ్వటం, ఒప్పుకోవటం. ఉదా: వాడు అన్నింటికి తలూపు తున్నాడు. నమ్మడం ఎలా?

తల్లి చాటు పిల్లవాడు

మార్చు

చాల చిన్న పిల్లావాడని అర్థం.

తల్లి గాసం

మార్చు

ప్రధానమైన ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాలు.అమ్మకు పెట్టే అన్నం.

తలుపులు మూయటం

మార్చు

అరికట్టడం, తలుపులకు గడియలు పెట్టడం

తవ్విన చెలమ

మార్చు

గుంట చిన్నదిగానే ఉన్నా అందులో చల్లని, తియ్యని నీరు తవ్విన కొద్దీ వూరుతూనే ఉంటుంది.విద్య ధర్మం చేసిన కొద్దీ చలమలో నీరు వూరినట్టే వృద్ధి చెందుతుందని అర్ధం

తలెత్తుక తిరగాలి

మార్చు

గర్వంగా.... ధైర్యంగా.. ఉదా: వాడు చేసిన వెదవ పనికి నేను సమాజంలో తలెత్తుక తిరుగ లేకున్నాను.

తక్షకులు

మార్చు

హాని కలిగించేవారు, యజమానికి కూడా దెబ్బలు తగిలేలా చేసేవారు

తవుడు గాసం

మార్చు

ధాన్యం కాక తవుడు మాత్రమే ఆహారంగా లభించడం, హీనస్థితి.వెట్టిచాకిరీ.ఇళ్లలో పని చేయించుకొని కూలి కింద ధాన్యాన్ని ఇవ్వకుండా లోభగుణంతో ఉండే యజమానులు తవుడు తీసుకువెళ్ళమని కూలీలను బెదిరించేవారు.పశువులు తినే తవుడు ఆహారపదార్థంగా ఇంటికి తీసుకువెళ్ళి పిల్లాపాపలతో ఎలా తినాలా అని కూలి వ్యథ చెందుతూ ఉండేవాడు.ఎంత కష్టించి పనిచేసినా కష్టానికి తగిన ప్రతిఫలంకాక హీనమైన ప్రతిఫలం లభించటం

తాడే పామై కరుస్తుంది

మార్చు

కాలం కలసి రాకుంటే తాడె పామై కరుస్తుందంటారు.

తాబేలునడక

మార్చు

చాలా నెమ్మదిగా నడవటం, నత్తనడక (పెండ్లినడక)

తాకట్టుతనం

మార్చు

మోసగించే మనస్తత్వం.తాకట్టు పెట్టుకున్న వ్యక్తి అప్పు తీసుకొనేవాడి అవసరాన్ని, ఆత్రాన్ని గమనించి అధిక వడ్డీ కోసం మోసం చేస్తాడు.పెళ్ళాన్నికూడా తాకట్టు పెట్టే రకం కొందరు.

తాటాకు మంట

మార్చు

ఎవరికైన పెద్దగా కోపం వచ్చి వెంటనే శాంత పడితే వారిని గురించి ఈ జాతీయాన్ని వాడు తుంటారు. దీనికి సమానార్థంలోనే మరొక జాతీయమున్నది. అది వరిగడ్డి మంట

తాటతీస్తా

మార్చు

తోల వలుస్తా అని అర్థం. కోపంతో అనే మాటలు. నీ తాట తీస్తా....... అని అంటుంటారు

తాటికాయంత

మార్చు

పెద్ద పెద్దవి, చక్కగా దూరానికి కూడా కనబడేవి. ఉదా: వాడు వ్రాసే అక్షరాలు తాటికాయలంత వుంటాయి.

తాటిపట్టెకు ఎదురు దేకినట్టు

మార్చు

మూర్ఖంగా ప్రవర్తించటం

తాడు చాలక నుయ్యి పూడ్చమన్నట్టు

మార్చు

అసంబద్ధమైన, లోభ పూరితమైన పనులు. చేంతాడుకు బావిలోని నీరు అందకపోతే.... బావిని కొంత మేర పూడిస్తే ఆ నీరు కొంత పైకి వస్తుంది.... అప్పుడు చేదకు నీరు అందుతుంది అని మోసపూరిత సలహా చెప్పేవారిని గురించి చెప్పే సామెత ఇది.

తాడు బొంగరం లేనివాడు

మార్చు

వెనక ముందు ఎవరు లేని వాడు. జులాయిగా తిరిగే వాడని అర్థం. ఉదా: వాడికేం తాడు బొంగరము లేని వాడు. తాడు తెగిన గాలి పటం లాగ::: ఒక గమ్యం లేక వ్వర్థంగా తిరిగే వాడిని ఇలా అంటారు.

తాడో పేడో తేల్సు కోవాలి

మార్చు

ఏదో ఒకటి తేల్చు కోవాలి: ఉదా: ఈ రోజు వానితో తాడో పేడో తేల్చు కోవాలి.

తాత జాగీరు

మార్చు

ఏమాత్రం కష్టపడకుండా సంక్రమించే ఆస్తి. నిజాం ప్రభువుల పరిపాలనా కాలంలో కొంతమందికి జాగీరులుగా కొన్ని గ్రామాలను ఇస్తుండేవారు. వారు రాజుకు కప్పం చెల్లిస్తూ ఉండేవారు. ఆ గ్రామాల మీద అధికారం, మిగిలిన ఆదాయం అంతా ఆ జాగీరును పొందిన జాగీర్దారులకే ఉండేది. అదంతా ముత్తాత నుంచి తాతకు, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుకుకు ఆనువంశికంగా వస్తుండేది. కొడుకు తరం వారు జాగీరును సంపాదించటానికి ఎలాంటి కష్టమూ పడాల్సిన అవసరం ఉండదు. ఏ శ్రమా లేకుండా వచ్చే ఆస్తి అని

తాత చస్తే బొంత నాది

మార్చు

ఒకరికి నష్టం కలిగించి లాభం పొందడము.

తాన అంటే తందాన అంటాడు

మార్చు

ఒకరు చెప్పినదాని వంత పాడడం/ స్వంత అభిప్రాయం లేని వారి గురించి ఈ మాట అంటారు. బుర్ర కథ జట్ట్లు లోని ముగ్గిరిలో కథకుడు ఏది చెప్పినా తనకిరువైపులా వున్నవారు తందాన అని అంటుంటారు. ఆ విధంగా ఎవరేమి చెప్పినా దానికి సరే నని వంత పాడేవారిని గురించి చెప్పే జాతీయం ఇది. అంటే వానికి స్వంత అభిప్రాయము అనేది అసలు లేదని అర్థము.

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనె రకం

మార్చు

మొండి వాడు, తాను చెప్పినదే వేదం అనే రకం. (దీనిని సామెతగా కూడా వాడతారు.)

తాపత్రయం

మార్చు

తాబేలుతీరు

మార్చు

తాబేలు అతి మెల్లగా నడుస్తుంది. ఆవిధంగా మెల్లగా నడిచే/ పనిచేసే వారినుద్దేశించి ఈ జాతీయాన్ను ఉపయోగిస్తారు. రెండో విధం: తాబేలు తనకు ఏదైన ఆపద కలిగితే తన అవయవాలను తన డిప్పలోనికి లాక్కొని నిచ్చలంగా రాయిలాగ పడి వుంటుంది. ఆ పరిస్థితిలో దానికి ఎలాంటి ప్రమాదము జరగదు. ఇలాంటి జాగ్రత్త మానవులకు అవసరమిని కూడా ఆయా సందర్భంలో ఈ జాతీయాన్ని వుపయోగిస్తారు.

తామరతంపర

మార్చు

త్వాష్ట్రం

మార్చు

తారా స్థాయికి చేరు కున్నాడు

మార్చు

అత్యున్నత స్థాయికి చేరుకున్నాడని అర్థం:

తాలెస్సయితే మాలెస్స

మార్చు

మనిషిలోని స్వార్థ గుణం. తాను లెస్సగా ఉంటే మిగతా వారంతా మహా లెస్సేనని. తాను బాగుంటే మిగతా అంతా బాగేనని భావించటం ఎదుటి వాడి బాధలను గ్రహించుకోక స్వార్థంతో ప్రవర్తించటం

తాళాధ్యాయం

మార్చు

తాళం పట్టటం

మార్చు

తాళం వేసే వాడు

మార్చు

ఒకరు చెప్పినదానికి వంత పాడే వాడు. స్వంత అభిప్రాయం లేని వాడు

తార్పుడుగాడు

మార్చు

ఇదొక నీచపు మాట. తిట్టుతో సమానం. దీనిని నిందా వాచకముగా వాడుతుంటారు.

త్రాసులో ముల్లు

మార్చు

తరాజు ముల్లు తీరు, ధర్మం తప్పని మనిషి, కచ్చితంగా ఉండేది. ధర్మం తప్పకుండా నీతి నిజాయితీతో వ్వవహరించే వారినుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు.

తాళం వేయటం

మార్చు

సమర్ధించటం, వంత పలకటం. పాడుతున్న రాగానికి అనుగుణంగా ఉండే తాళం వేయటం. స్వంత వ్వక్తిక్తం లేని వారని అర్థము. ఉదా: వీడు వాడు చెప్పినదానికంతా తాళం వేస్తుంటాడు.

తిక్క తిన్నగా కుదురింది

మార్చు

బాగ అయ్యింది., తగిన శిక్ష పడింది. ఉదా: వాడు చేసిన వెదవ పనికి తిక్క తిన్నగా కుదిరింది.

తిక్క తిక్కగా వున్నదా?

మార్చు

ఏం పొగరుగా వున్నాదా అని అడగడం.....

తిక్క శంకరయ్య

మార్చు

తిండార్నెల్లు, పడకార్నెల్లు

మార్చు

జీవిత కాలాన్ని ఏ పనీ చేయకుండా, సోమరిగా ఉంటూ తింటూ గడపటం.బకాసురుడి తిండి ఆరు నెలలు. పడక మరో ఆరు నెలలు.సగం నిద్రకు మరో సగం తిండికి సరిపోతే చేసేది ఏమీ లేదు.

తిట్లకు నీవు... తిండికి నేను

మార్చు

ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఏదైనా పని చేసుకురావాలనుకున్నప్పుడు ఒక్కోసారి కష్టాలు, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి కష్టనష్టాలను ఎదుటివారు అనుభవించి కార్యాన్ని సాధించుకొస్తే దాని వల్ల కలిగే సత్ఫలితాలను అనుభవించటానికి స్వార్థబుద్ధితో ప్రవర్తించే వ్యక్తులు అప్పుడు ముందుకొస్తుంటారు. కష్టాల నుంచి తప్పించుకుంటూ స్వార్థబుద్ధితో ప్రవర్తిస్తూ తేరగా ఫలితాలను తాము అనుభవిస్తూ అందులో వచ్చిన దుష్ఫలితాలను ఎదుటివారిపైకి తోసేస్తూ వుంటారు. వారినుద్దేశింది ఈ జాతీయాన్ని వాడుతారు.

తిట్టను పోరా గొల్లిగా

మార్చు

తన తప్పులను దాచి ఎదుటి వారి తప్పులను చూపడం. తాను తిట్టుతూ తిట్టనని చెప్పడం.

తిత్తిగాడు

మార్చు

సొంత వ్యక్తిత్వం లేనివాడు, ఎప్పుడూ ఎవరి మీదనో ఆధారపడి జీవించే తక్కువ స్థాయి వాడు. సన్నాయికి శ్రుతి పెట్టే తిత్తిగాడు మేళంలో సొంత రాగాలు తీయలేడు.

తిన్నది అరగడం లేదా?

మార్చు

నిందించడము: ఉదా: అనవసరమైన పనిచేస్తున్నావు.. ఏం తిన్నది అరగడము లేదా?

తిని తిట్టినట్టు

మార్చు

కృతజ్ఞత లేకుండా ప్రవర్తించటం . తమకు కావాల్సినవన్నీ సమకూర్చుకొనే దాకా ఎంతో వినయంగా ప్రవర్తించి చివరకు కనీసం కృతజ్ఞత అయినా ప్రకటించకుండా పైపెచ్చు తమను సరిగా చూడలేదని తిట్టి వెళ్లిపోతుంటారు. తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టడం, పాలుతాగి రొమ్ము గుద్దటం లాంటిదే ఇది.

తిని తిరిగేవాడు

మార్చు

మంచి ఆరోగ్య వంతుడు ఏ శారీరక, మానసిక బాధలు లేని వాడని అర్థం.

తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు

మార్చు

(దీన్ని సామెతగా కూడా వాడవచ్చు) మోస గాడని అర్థం.

తిన్నమ్మకు తినబెట్టడం

మార్చు

బోడి తలకు నూనె పెట్టటం లాంటిది.వృథా తప్ప ప్రయోజనమేమీ ఉండదు.

తిమతిమ

మార్చు

నాలుక మీద వచ్చే దురద.నోటి కొచ్చినట్లు మాట్లాడటం .ఒంటి మీద ఇతర ప్రదేశాలలో వచ్చే దురద చిమచిమ.

తిమ్మరాజు - పోతురాజు

మార్చు

తిమ్మిని బమ్మిని చేయ గలడు

మార్చు

తలలు మార్చే రకం, మోస గాడు. ఉదా: వాడు తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడు.

తిమురు పట్టిన వాడు

మార్చు

పొగరెక్కిన వాడు. ఉదా: వానికి బాగా తిమురు పట్టినట్టుగా ఉంది.

తియ్యని మాటలు చెప్పేవాడు

మార్చు

లోన దురుద్దేశము పెట్టుకొని పైకి మంచిగా మాట్లాడే వాడు.

త్రిశంకుస్వర్గం

మార్చు

ఎటూ కాని పరిస్థితి అని అర్థం

తిరగా బోర్లా వేయటం

మార్చు

సునిశితంగా పరిశీలించటం

తిరిపెం కోసం వచ్చి బేరమాడినట్టు

మార్చు

అసందర్భంగా ప్రవర్తించడం, లేనిపోని గొప్పలకు పోయి కావలసిన పనిని చెడగొట్టుకోవటం

తిరుక్షౌవరం అయింది

మార్చు

సగం పని.పూర్తిగా నష్టపోవటం.తిరుపతిలో క్షురకుడు ఒక భక్తుడికి సగం క్షౌరం చేసి అక్కడికి ఆపి, మరో భక్తుడిని లాక్కొచ్చి కూర్చోపెట్టి క్షౌరం ప్రారంభింస్తే మొదటి భక్తుడు సగం క్షౌరంతో అలాగే కూర్చోవలసి వచ్చేది.తిరుమలకు వెళ్ళి తలనీలాలర్పించే భక్తులు సంపూర్ణంగా గుండు గీయించుకుంటారు కాబట్టి పూర్తిగా మునిగిపోయినవాడికి తిరుక్షౌరం అయ్యింది అంటున్నారు.

తిరుపతి క్షౌరం

మార్చు

పూర్తిగా నష్టపోయాడని అర్థం

తిలతండులాలు

మార్చు

తిలోదకాలు

మార్చు

తీతువు పిట్ట రాయబారం

మార్చు

తీర్థకాకం

మార్చు

తుకతుక

మార్చు

తుకపెక.పదార్థాలను ఉడికించేటప్పుడు వచ్చేశబ్దం. ఎవరైనా బాగా ఉడుక్కుంటున్నారు అని . అన్నం గిన్నెలో తుకపెకలాడుతోంది, వాడి మనస్సు తుకతుకలాడుతోంది అంటారు

తుట్టిలో బాగోతం

మార్చు

నష్ట, కాలంలోనే అధికమైన ఖర్చులు, అవసరాలు రావటం. తుట్టి అంటే నష్టం . నష్టంలో నష్టమని అనుకొని చందా ఇవ్వటం.

తుని తగవు

మార్చు

తుమ్మడు జగ్గడు

మార్చు

వూరు, పేరు లేనివారు, జనాభా లెక్కల కోసమని ఉండే వారు

తుమ్మితే వూడే ముక్కు

మార్చు

స్థిరం లేనిది, ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది

తుర్రుమనడం

మార్చు

వెంటనే వెళ్లిపోవడం, ఎగిరిపోవటం

తులంతో కులం

మార్చు

కులం కంటే ధనమే విలువైనది. ఒకే కులం వారు కలిసికట్టుగా ఉంటూ ఒకరికొకరు సాయం చేసుకున్నా ఈ సాయం పేదవారికి కాక ధనవంతులకే అందటం జరుగుతుంటుంది. తులం అంటే తులం బంగారం అని. 'ఎంత కులమున్నా తులం లేకపోయే సరికి వాళ్ళనెవరూ లెక్క చేయరు.

త్రుటి

మార్చు

చాలా తక్కువ కాలం.రెండు పరమాణువులు ఒక అణువు. మూడు అణువులు ఒక త్రసరేణువు. మూడు త్రసరేణువులు ఒక త్రుటి. ఉదా: వాడు త్రుటిలో తప్పించు కున్నాడు. (కాలమానం:::తామర తూడును త్రెంచ డానికి పట్టే కాలం.)

తుర్ర్ ర్ మని పారి పోయాడు

మార్చు

ఉదా: ఆ పిల్ల వాడు తుర్ర్ ర్ మని పారి పోయాడు.

తుపాకి తూటాకు కూడ దొరకడు

మార్చు

వాడిక దొరకడు.

తుప్పు వదిలింది

మార్చు

తగిన శాస్తి జరిగింది. ఉదా: ఈ దెబ్బతో వాడి తుప్పు వదిలింది. రోగం కుదిరింది.

తుమ్మితే ఊడే ముక్కు

మార్చు

శాశ్వతం కానిది.

తుంగ లో తొక్కాడు

మార్చు

వృధా చేశాడు అని అర్థం: ఉదా: నేను చెప్పిన మంచి మాటలన్నీ వాడు తుంగలో తొక్కాడు.

తృణీకరించడం

మార్చు

తక్కువగా చేసి మాట్లాడడం, గడ్డిపోచకు ఇచ్చే విలువకూడా ఇవ్వకపోవటం

తుంగలోతొక్కు

మార్చు

నియమ నిబంధనలు పాటించకుండా ఉండు; బొత్తిగా ఖాతరు చేయకపోవు

తూ తూ మంత్రంగా

మార్చు

ఏదో పని అయిందని పించడము: ఉదా: వారు ఆ పనిని తూ తూ మంత్రంగా పని కానిచ్చారు.

తూముకాడి పొలం

మార్చు

చక్కటి నీటి వసతి, సకల సౌకర్యాలు గల పొలం. చెరువులో చారెడు నీరు మిగిలినా తూము దగ్గరి పొలానికి అందుతాయి. ఈ పొలానికి నీళ్ళు పెట్టడం మరచిపోయినా పడిన నీళ్ళతోనో, భూమిలో ఉన్న తేమతోనో పండుతుంది.

తూర్పారబట్టు

మార్చు

తూటాలు పేల్చడం

మార్చు

గొడవలు సృష్టించడం. దీనికి మరొక అర్థం: సూటి పోటి మాటలనడం:... (వాడు మాటల తూటాలు పేసుస్తున్నారు.)

తూటు పేరే చిల్లి

మార్చు

వాదోపవాదాలలో ఇరుపక్షాల వారు చెప్పింది ఒకటే అవటం.తూటు, బెజ్జం, రంధ్రం, బొక్క, బొరియ, చిల్లి అర్థం మాత్రం ఒకటే.

తూనీగలాగా

మార్చు

హాయిగా హుషారుగా చలాకీగా తిరుగటం. స్వేచ్ఛగా తిరగటాన్ని తూనీగ గమనంతో పోల్చి చెబుతారు

తూర్పుకు తిరిగి దండం పెట్టాలి

మార్చు

ఇంతటితో వదిలేయాలి. ఉదా: వానికేమైన ఇస్తే ఇక అంతె... తూర్పుకు తిరిగి దండం పెట్టాలి. ఇచ్చింది తిరిగి రాదు అనే భావనతో ఈ మాటలను వాడుతారు.

తూర్పార బట్టారు

మార్చు

చెడామడా తిట్టారు, బాగా చీవాట్లు పెట్టారు: ఉదా: శాసన సభలో ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని తూర్పార బట్టింది.

తృతీయ హస్తం

మార్చు

తృతీయ ప్రకృతి

మార్చు

తెగ పేలు తున్నాడు

మార్చు

అనవసరంగా మాట్లాడు తున్నాడు. ఉదా: వాడు తెగ పేలుతున్నాడు. నోరు అదుపులో పెట్టుకోమను.

తెగితే లింగడు రాయి

మార్చు

తెంపులతాడు

మార్చు

పనికిరాని వస్తువు, నిరుపయోగకరం, చిల్లుల కడవలాగా

తెగిందాకా లాగకు

మార్చు

మంకుపట్టు పట్టి పనిచెడగొట్టటం.గట్టిగా లాగితే తాడు కాస్త తెగి కావాల్సిన పని కాస్త చెడిపోతుంది. ఇరు పక్షాల మధ్య వాదన వచ్చినప్పుడు సామరస్యంగా మాట్లాడి పనులు చక్కబెట్టు కోవాలి. ఏ ఒక్కరు ఒకే పట్టు దలతో వుండకూడదు. పట్టు విడుపు వుండాలి. ఆ సందర్భంలో ఈ మాటను వాడతారు. (ఈ వాఖ్యంలో వాడిన మాట "పట్టు విడుపు వుండాలి అనేది కూడ జాతీయమె.)

తెగిందాక లాగటం

మార్చు

ఇక్కడ తాడు తెగటం కాదు...... అర్థం: ఏదేని ఒక క్లిష్టమైన వ్వవహారం గురించి చర్చింస్తున్నప్పుడు కొంత పట్టు విడుపు ప్రదర్సించి దానికి పరిష్కార మార్గాన్ని కనుగొలాలి. అంతె గాని ఎవరికి వారు పంతానికి పోయి ఇరువైపుల వారు ఏమాత్రం పట్టు సడలక వాగ్వివాదం చేస్తూనె వుంటే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.. అనగా ఇరువైపుల వారు ఎంతో కొంత వారి పంతాన్ని కొంత సడలించితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాకాక చర్చలు అలా సాగుతూనె వుంటె ఒక దశలో ఆ సమస్య కు చిక్కుముడి పడి పోతుంది. ఆ తర్వాత ఎవరు ఏమి చేయ గలిగింది ఏమి వుండదు. అలా తెగిందాక లాగడం అనర్థదాయకం అని అర్థం.

తెగిన గాలి పటంలా

మార్చు

అడ్డు అదుపు లేకుండా... ఉదా: వాడు తెగిన గాలి పటంలాగ పని పాట లేకుండా తిరుగు తున్నాడు. గాలిపటం గాలి వాటంతో ఎగురుతుంది. ఆవిధంగా ఒక గమ్యం లేకుండా తిరిగేవారి గురించి ఈ మాటను వాడుతారు.

తెగిన బొక్కెన నూతిలోకే

మార్చు

కట్టుబాట్లు తెగిననాడు అథోగతిపాలవటం జరిగి తీరుతుంది. తాడు తెగిపోతే నీటితో పైకొచ్చే బొక్కెన బావిలోకి పడిపోతుంది. అలాగే కట్టుబాట్లను, లేదా మంచివారితో బంధాలను తెంచుకొన్న వ్యక్తి అథోగతిపాలవుతాడు.

తెరచి రాజు

మార్చు

తెర దిగక పోవటం

మార్చు

ముగియక పోవటం, సమాప్తం కాకపోవటం

తెరమరుగు

మార్చు

కనిపించకుండా పోవటం

తెరచి రాజు

మార్చు

తోసిరాజు . చదరంగంలో రాజుకు ఎదురుగా ఉన్న పావును పక్కకు తీసి ఆపక్కన ఉన్న ఏనుగు లాంటి వాటితో ఎదుటి రాజును బంధించటాన్ని తెరచి రాజు అంటారు.ఎత్తుకుపై ఎత్తు వేస్తూ ఎదుటి వారిని కష్టాల పాలు చేయటం.

తెరలు తొలగటం

మార్చు

సందేహం తీరటం. ఏవో సందేహాలతో ఇంత కాలం ఏదో అనుమానించిన వారు అసలు విషయం తెలుసుకొన్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతారు.

తెరలేపటం

మార్చు

ప్రారంభించటం,తెరతీయటం,మొదలుపెట్టటం.. (ఈ గొడవలకు తెర లేపింది వాడె)

తెర దించడం

మార్చు

ముగింపు పలకడం: ఉ:.. ఈ గొడవకు ఇకనైనా తెర దించు తారా లేదా?

తెలివి తెల్లారి నట్లే వున్నది,,,

మార్చు

తెలివి లేని వాడని అర్థం..... ఎవరైనా తెలివి లేని పని చేస్తే నీతెలివి తెల్లారినట్లే వున్నది అని అంటారు.

తెల్ల ఏనుగు

మార్చు

వృధా ఖర్చు. తెల్ల ఏనుగు అంటే దేవతా ఏనుగు. పూజ్యనీయమైనది. దానితో పని చేయించ కూడడు. అయినా దానికి కావలసిన తిండి మాత్రము ఎక్కువగానె పెట్టాలి. అటు వంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడు తారు.

తెల్ల గుర్రం కొలువు

మార్చు

ఎంత కష్టించి పనిచేసినా యజమానికి తృప్తి లేకపోవటం .తెల్లటి గుర్రానికి ఎంత నూనె రాసి మాలీష్ చేసినా ఎక్కడో చోట మురికి కనిపిస్తూనే ఉంటుంది.యజమానిని సంతృప్తి పరచటం సాధ్యపడదు.

తెల్లనివన్నీ దేవుళ్ళు నల్లనివన్నీ దయ్యాలు

మార్చు

గుడ్డి నమ్మకం వూహామాత్రంగా చెప్పిన విషయాన్ని అదే నిజమని కచ్చితమైనదని నమ్మే అమాయకత్వం.తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అని అనుకోవటం . విషయ పరిజ్ఞానం పూర్తిగా లేకుండా ప్రవర్తించటం

తెల్లనివన్ని పాలు కావు నల్లనివన్ని నీళ్లు కావు

మార్చు

రంగును బట్టి వాటి గుణాన్ని నిర్ణయించలేమని చెప్పేదే ఈసామెత.

తేగల పాతర

మార్చు

ఒకేచోట సులభంగా కావల్సినవన్నీ దొరకడం

తేనె పూసిన కత్తి

మార్చు

అసిధార మధులేపన న్యాయం .పైకి తియ్యని మాటలుచెబుతూ గోతులు తీసేరకం సుఖంతో పాటు కష్టం కూడా కలగటం.పదునెక్కిన కత్తి అంచుమీద ఉన్నది తియ్యటి తేనే కదా అని నాలుకతో నాకితే తేనె తియ్యదనం తెలిసే లోపునే నాలుక కూడా తెగుతుంది. ఓ పని చేస్తే లాభం వస్తుంది కదా అని దిగితే ఆ లాభంతోపాటు నష్టం కూడా కలుగుతుంది.

తేనెలో నీటి బొట్టు

మార్చు

దుష్టుడు చెడగొట్టేది పాడుచేసేది.చెడు బుద్ధితో ప్రవర్తించేవాడు ఒక్కడు చేరితే, మెల్లమెల్లగా మంచి వాళ్ళుకూడా చెడిపోతారు అనే అర్థంతో ఈ మాటలను ఉపయోగిస్తారు. మోస గాడు. లోన దురుద్దేశం వుండి పైకి బాగా మాట్లాడె వాడు. ఉదా: వాడు తేనె పూసిన కత్తి లాంటి వాడు.

తేటతెల్లం చేయటం

మార్చు

ఇంత కాలం రహస్యం వుంచి ఇపుడు స్పష్టంగా వివరించటం

తేట తేటగా

మార్చు

అత్యంత స్పష్టంగా . స్పష్టత, స్వచ్ఛత

తేయంలో కల్తీ

మార్చు

స్నేహాన్ని నటిస్తూ మోసం చేయటం.తీయం/తేయం అంటే తియ్యనిది, మధురమైనది .స్నేహం మధురమైనది, తీయనైనది .

తేర గుర్రం

మార్చు

ఒక వస్తువును ఎవరి దగ్గర నుంచో వూరకనే ఏ ఖర్చు, శ్రమ లేకుండానే తెచ్చుకుని అడ్డదిడ్డంగా వాడుకోటం.

తేర సొమ్ము బీర పీచు

మార్చు

విపరీతమైన వ్యామోహం.ఏ మాత్రం శ్రమపడకుండా వూరకనే వచ్చి పడిన దాని మీద వ్యామోహం ఎక్కువ. తేరగా వచ్చిపడింది పొరపాటున పోతే కలిగే బాధ అంతా ఇంతా కాదు.బీరకాయలో ఉండే పీచు బాగా పెనవేసుకొని ఉంటుంది.

తేలుకు అపకారం చేయాలా?

మార్చు

దుర్మార్గులు కల్పించుకొని తగాదాకు దిగి నష్టపరుస్తుంటారు.తేలు తనకు కనిపించిన వస్తువునల్లా తన కొండితో కొడుతూ వెళుతుంటుంది. అదే తీరులో దుర్మార్గులు ప్రవర్తిస్తుంటారు.

తేలు కొండి తీరు

మార్చు

దుష్ట స్వభావంతో ఉండటం. తేలు అడ్డం వచ్చిన ప్రతిదాన్నీ అవసరం ఉన్నా లేకపోయినా కొండితో కుడుతూనే ఉంటుంది. దుష్ట స్వభావం ఉన్నవాడు కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్లు అనే తేడా ఏమీ చూడకుండా తమకు ఎవరు కనిపిస్తే వారినల్లా బాధిస్తూనే ఉంటారు.

తొక్కులాడటం

మార్చు

మానసిక ఆందోళన. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురవుతుందని అనుకొన్నప్పుడు గడువు దగ్గర పడుతుండే సరికి పనులు కాలేదనే భావనతో మనిషి అటూ ఇటూ తచ్చాడుతూ తెగ తొక్కులాడుతూ తిరుగుతుంటాడు.

తొట్టి గాంగు

మార్చు

చిల్లర గాళ్ల ముఠా.. ఉదా: మీ పిల్లవాడు ఆ తొట్టిగాంగుతో తిరుగు తున్నాదు. చెడి పోతాడు.

తొడ కొట్టాడు

మార్చు

పోట్లాటకు పిలవడము: ఉదా: వాడు నామీదకు తొడకొట్టి పిలుస్తున్నాడు.

తొడ పరిచయం

మార్చు

ఉదా: తొడ పరిచయము తొంబై ఏళ్లు అని అంటారు. అక్రమ సంబంధం గురించి ఈ మాట వాడతారు.

తొడ మీద అగ్గి

మార్చు

గొప్పల కోసం నష్టపోవటం.భూస్వామికి చుట్ట నోటికందించే వాడొకడు, చుట్టకు నిప్పంటించే వాడొకడు ఇలా ఎందరో ఉండేవారు. ఓ దొర అలా చుట్ట తాగే ప్రయత్నంలో నిప్పు కణిక అతడి తొడ మీద పడి తొడ కాలుతున్నా ఆ నిప్పు కణికను తాను పక్కకు తోసేయకుండా మరొక వెట్టిని పిలిచి నిప్పు కణికను తీసేయమని చెప్పాడట. కొంతమంది ఇలాగే ప్రతి చిన్న పనినీ నౌకర్ల చేత చేయించుకోవటానికి అలవాటు పడి తమకు బాధ కలుగుతున్నా సరే తమ పనులన్నీ ఇంకెవరో చేస్తేనే హుందాతనమని భావిస్తూ గొప్పలకు పోతుంటారు.

తొడిమ వీడడం

మార్చు

మరణించడం. పక్వానికొచ్చిన పండు చెట్టు నుండి తొడిమ వీడి క్రింద పడుతుంది.

తోక కత్తరిస్తా

మార్చు

పొగరణస్తా: ఉదా: నీవు ఎక్కువగా మాట్లాడుతున్నావు: తోక కత్తరిస్తా....

తోక కోసి సున్నం పెట్టాలి

మార్చు

పొగరణచాలి. ఉదా: వానికి తోక కోసి సున్నం పెట్టాలి.

తోకచుట్టం

మార్చు

వేలు విడిచిన బంధుత్వం.అవసరం కోసం తమ పనులు నెరవేర్చుకోవాలన్న స్వార్థం కోసం ఉన్నత పదవులలో, స్థాయిలలో ఉన్నవారిని తమ బంధువులుగా చెప్పుకోవటం.దూరపు బంధుత్వాలను కలిపి చుట్టమని అంటే అదే తోకచుట్టం

తోకపద్యం

మార్చు

తోక పెరగా వున్నదే

మార్చు

పొగరెక్కువవు తున్నదే... అనే అర్థంతో ఈ జాతీయాన్ని వాడుతారు

తోక తొక్కిన పాము

మార్చు

అత్యంత కోపంగా ప్రవర్తించటం ముందు, వెనకలేవీ ఆలోచించకుండా అత్యంత వేగంగా స్పందించి తమ కోపాన్ని ప్రకటించటం, వేగంగా శత్రువును ఎదుర్కోవటం

తోక ముడవటం

మార్చు

ఓడిపోయి వెనుదిరగటం, పరాజయంపాలు కావటం, అసమర్థతను ప్రకటించటం .ఓడిపోయే కుక్క తోక ముడుస్తుంది.

తోచని పనికి తొక్కులాటలాగా

మార్చు

పనికిరాని పనులకు విపరీతంగా హడావుడి . అనవసరమైన ఆయాసం, శ్రమ

తోడిపోయటం

మార్చు

ధారాళంగా, అమితంగా దేన్నైనా, ఎవరికైనా ఇవ్వటం

తోలు తీసి కర్ర కేస్తా...

మార్చు

పొగరణస్తా: ఉదా:>.. నీకు పొగరెక్కువయింది. తోలు తీసి కర్ర కేస్తా... ఏమనుకున్నావో ఏమో..... అబు అంటుంటారు.

తోడు దొంగలు

మార్చు

ఒకరికొకరు తోడుగా వుండడము: (మంచికి, చెడుకి కూడా ఈ పదాన్ని వాడతారు)

తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది...

మార్చు

మానవ శరీరాన్ని పోల్చడము: వైరాగ్యంలో మానవుని పోలికను చెప్పడము.

తోలు బొమ్మలు

మార్చు

ఎదుటి వ్యక్తులు ఎలా చెబితే అలా చేసేవారు .సొంత బుద్ధితో ఆలోచించక ఎదుటివారు చెప్పినట్లు ప్రవర్తించే వారు

తోలుబొమ్మలాట

మార్చు

మానవ దేహం తోలుతో కప్పి ఉంటుంది.మనుషులే తోలుబొమ్మలు.దేవుడు ఇలా ఈ తోలు బొమ్మలను చేసి తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నాడు అంటారు.

తోలుమందం వాడు

మార్చు

బద్దకస్తుడు. ఉదా: వాడు తోలు మందం వాడు. ఏ పనికి ఓ పట్టాన పూను కోడు.

తోలొలవటం

మార్చు

విపరీతంగా బాధించం, శిక్షించటం, ప్రాణాంతకం

తైతక్క లాడుతున్నాడు

మార్చు