భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "ల" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

లంకలో పుట్టినవాళ్ళందరూ రాక్షసులే మార్చు

లంఖణం పరమౌషధం మార్చు

లంఖణానికి పెడితేగానీ పథ్యానికి రాదు మార్చు

లంచం లేనిదే మంచ మెక్కనన్నట్లు మార్చు

లంజకు నిక్కు - సంసారికి సిగ్గు మార్చు

లంజకు పిల్ల తగలాటము మార్చు

లంజకు పెట్టిన సొమ్మూ - గోడకు వేసిన సున్నం తిరిగి రావు మార్చు

లంజకు మొగుడొకడా? మార్చు

లంజకు సిగ్గు తెగులు మార్చు

లంజ చెడి యిల్లాలయినట్లు మార్చు

లంజను లంజా అంటే రచ్చకెక్కుతుంది - ఇల్లాలిని లంజా అంటే యింట్లో దూరుతుంది మార్చు

లక్కవంటి తల్లి - రాయివంటి బిడ్డ మార్చు

లగ్నంలో తుమ్మినట్లు మార్చు

లక్షాధికారయినా కావాలి - భిక్షాధికారయినా కావాలి మార్చు

లాభం గూబల్లోకి వచ్చింది మార్చు

లాభంలేని శెట్టి వరదకు పోడు మార్చు

లావు మీద వంపు తెలియదు మార్చు

లుక్కులు గాదు లిప్పులు కావాలన్నాడట మార్చు

లెక్క చూస్తే బొక్క పగులుతుంది మార్చు

లేడికి లేచిందే పరుగు మార్చు

ఏదైనా పని ప్రారంభించే ముందు, దాని గురించి సరిగా అలోచించ కుండా పని మొదలు పెట్టినప్పుడు ఈ సామెత వాడతారు

లేడిని చూచినవాళ్ళంతా వేటగాళ్ళే మార్చు

లేని దాత కంటే ఉన్న లోభి నయం మార్చు

లేనిదాని కోసం పోతే ఉన్నది కాస్తా ఊడిపోయిందట మార్చు

లేనిపోని పీకులాట ఎందుకట! మార్చు

లేనివాడి తెగింపు కంటే ఉన్నవాడి పిరికితనం మేలు మార్చు

లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాటట మార్చు

లేవలేని అత్తకు వంగలేని కోడలు మార్చు

లొసుగుల బేరం కాసుల చేటు మార్చు

లోకులు పలుకాకులు మార్చు

లోకం మూయను మూకుడున్నదా? మార్చు

లోగుట్టు పెరుమాళ్ళ కెరుక మార్చు

మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడే వారిని గురించి చెప్పిన సామెత.

లోభికి ఖర్చెక్కువ - ఏబ్రాసికి పనెక్కువ మార్చు

లోభికి నాలుగందాల నష్టం మార్చు

లోభికి ధర్మచింతన మెండు మార్చు

లోభి సొమ్ము దొంగపాలు మార్చు

లంకలో హరి శబ్దం మార్చు

హరి నామం లంకలో వినపడకూడదు అని రావణాసురుడు శాసించాడు. అందువలన 'హరి' అనే శబ్దం (పేరును బయటకు అనడం) లంకలో వినపడదు. అయితే తలవకూడని వ్యక్తి గురించి ఎవరైనా ఎక్కడైనా తలచుకుంటే దానిని 'లంకలో హరిశవబ్దం'లాగ అంటాం.

లంక మేత..... గోదారి ఈతకు సరి పోయింది మార్చు

గోదావరి గట్టున వుండే పల్లెల లోని గేదెలు నది మధ్యలో వుండే లంకలలోని ఏపుగా పెరిగిన పచ్చ గడ్డిని మేయడానికి అంత దూరం గోదావరి ఈదు కుంటూ వెళ్లి బాగా మేసి తిరిగి గోదారిని ఈదు కుంటూ ఇంటికి వస్తాయి. ఆ పచ్చ గడ్డిని మేయగా వచ్చిన శక్తి గోదారిని ఈదడానికి సరిపోతుంది. పలితమేముంది. ఆ సందర్భంగా పుట్టిందే ఈ సామెత. ఫలితం లేని పని చేసే వారిని గురించి ఈ సామెత చెప్తారు.

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikibooks.org/w/index.php?title=సామెతలు_-_ల&oldid=21509" నుండి వెలికితీశారు