సామెతలు - ఎ
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ-ఘ |
చ-ఛ జ ఝ |
ట ఠ డ-ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ-ష స-హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]
ఇక్కడ "ఎ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.
రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
మార్చుఒకడి సుఖము మరొకడి కష్టము అని ఈ సామెత అర్థము. కొన్ని సందర్భాలలో,ఒకరికి సుఖం ఆతనికి తెలియకుండానే మరొకనికి కష్ట కారణమగును. ఆ సందర్భమున ఈ సామెత వాడుట పరిపాటి.
ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు
మార్చుఎంగిలాకులు ఎత్తమంటే లెక్క పెట్టినట్లు
మార్చుపరమ లోభి, పిసినారిని ఇలా వర్ణిస్తారు. కాకిని తోలేందుకు ఎంగిలిచేతిని విదిలిస్తే ఆ చేతికి అంటుకుని ఉన్న అన్నపు మెతుకులు రాలిపోతాయేమోనని ఆలోచించేవాడని దీనర్థం. దీనికి సమానార్థకమైన సామెత మరొకటుంది/పిల్లికి బిచ్చం పెట్టనివాడు
ఎంగిలికి ఎగ్గు లేదు - తాగుబోతుకు సిగ్గు లేదు
మార్చుఎంచపోతే మంచమంతా కంతలే
మార్చుఎంచిన ఎరువేదంటే యజమాని పాదమే అన్నట్లు
మార్చుఎంత చెట్టుకు అంత గాలి
మార్చుఎవరి ఆర్థిక పరిస్థితుల కనుగుణంగా వారు నడుచు కోవాలి. గొప్పలకు పోకూడదని ఈ సామెత అర్థం. పిండి కొద్దీ రొట్టె... అనేది కూడా దీనికి సమానర్థమె.
ఎంత నేర్చినా, ఎంత జూచినా,ఎంత వారలైనా కాంతా దాసులే
మార్చుదీనికి సమానార్థంలో మరొక సామెత వున్నది: అది. ఎంతవాడయినా ఆడదానికి లోకువే ఒక చిత్ర గీతంలో ఈ సామెత ..... "ఎంత వారు గాని, వేదాంతులైన గాని వాలు చూపు సోక గానె తూలి పోదురూ..."
ఎంత కరవొచ్చినా పులి గడ్డి మేయదు
మార్చునీతిమంతుడు ఎంత కరవుకాలం, కష్టకాలం వచ్చినా అవినీతికి మాత్రం పాల్పడడని, నీతినిజాయతీలతోనే ఉంటాడని
ఎంత పెరిగినా గొర్రెకు బెత్తెడే తోక
మార్చుఎంత ప్రొద్దుండగా లేచినా సందు చివరే తెల్లవారినట్లు
మార్చుఎంత ప్రాప్తమో అంతే ఫలం
మార్చుతన ప్రాప్తాన్ని బట్టి ఫలితముంటుందని దీనికి అర్థం.
ఎంతమంచి గొల్లవాడికైనా వేపకాయంత వెర్రి వుండకపోదు
మార్చుకులానికి సంబంధించినది ఈ సామెత. గతంలో గొల్లల్లో తెలివిమంతుడుండరని ఒక నమ్మిక. అదే అర్థాన్ని ఈ సామెత చెప్పుతున్నది. ఇక్కడ వెర్రి అనగా తెలివి లేని తనం.
ఎంతయినా పరాయి సొమ్ము పరమాన్నమన్నట్లు
మార్చుపరాతు సొత్తుకు ఆశపడే వారిని గురించి ఈ మాటను ఉపయోగిస్తారు.
ఎంతవాడయినా ఆడదానికి లోకువే
మార్చుదీనికి సమానార్థంలో మరొక సామెత ఉంది. ఎంత నేర్చినా, ఎంత జూచినా,ఎంత వారలైనా కాంతా దాసులే
ఎంత వాడయినా కాంతా దాసుడే
మార్చుఎంత వెలుగుకు అంత చీకటి
మార్చుఎంత సంపదో అంత ఆపద
మార్చుసంపద ఎక్కువయితే ఆపద ఎక్కువని దీనర్థం. సంపదను దోచుకోడానికి వచ్చే దొంగల వల్ల ప్రాణ భయమున్నదని ఈ సామెత అర్థం.
ఎంత సంపాదించినా కూటికే - ఎంత బ్రతికినా కాటికే
మార్చుఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు
మార్చుఎందుకు ఏడుస్తున్నావంటే, మొగుడు కొట్టబోయే దెబ్బలకందంట
మార్చుఎండు నేలమీద ఎండ్రకాయ కనబడితే వాన పడుతుంది
మార్చుఎండా వాన కలిసివస్తే కుక్కా నక్కల పెళ్ళంట
మార్చుఎక్కడున్నావె గొంగళి అంటే వేసిన చోటే వున్నానన్నదట
మార్చుకొందరి జీవితాలలో ఎంత మాత్రము ఎదుగు దల వుండదు. వారి ఆర్థిక పరిస్థిలో ఎన్నటికి అభివృద్ధి లేక పోతే.... ఈ సామెతను వాడుతారు.
ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు
మార్చువంగ చెట్టు దురద స్వభావము కలిగి ఉంటుంది అందుకే వంగతోటలో సరసాలు ఆడకూడదు. మరొక అర్థంలో కూడా ఈ సామెతను వాడుతుంటారు. బావ వరస అయిన వాడు వంగ తోట వద్దకు వస్తే ఎక్కడ వంకాయలు అడుగతారేమోనని ముఖం చాటేస్తారని ఈ సామెకు అర్థం.
ఎక్కడికి పోయినా ఏలినాటి శని తప్పదన్నట్లు
మార్చుఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది
మార్చుఎక్కలేని చెట్టు మీద ఏది గుడ్డు పెట్టితే నేమి? అది మనకు అందదు కదా? అలా నిరుపయోగమైన పని అని అర్థం.
ఎక్కడికి పోయినా చేసుకున్న ఖర్మం ఎదురు వస్తుంది
మార్చుఎక్కడిదిరా ఈ పెత్తనమంటే - మూలనుంటే నెత్తినేసుకున్నానన్నాడట
మార్చుఎక్కడి నీరూ పల్లానికే పయనం
మార్చుఇలాంటిదే మరొక సామెత ఉంది. నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు
ఎక్కమంటే ఎద్దుకు కోపం - దిగమంటే కుంటికి కోపం
మార్చుకుంటివాడు నడవలేక పోతుంటే పక్కనే వెళ్ళే ఎద్దును పైకిఎక్కిస్తాడు ఒక దారిన పోయే దానయ్య. కొంత దూరమెళ్ళాక ఇక కుంటివాడిని దిగమనదామనుకుంటాడు. ఆ సందర్భంలో ఆ దానయ్య ఆలోచనే ఈ సామెత. ఎద్దుమీద ఎక్కమంటే........ నామీద బరువు వేస్తావా? అని ఎద్దుకు కోపం వస్తుందని, దిగమంటే కుంటి వాడిని నడవమంటావా అని కుంటికి కోపమొస్తుందని అనుకుంటాడు/
ఎక్కి కాయను చూసి, దిగివచ్చి రాయి రువ్వినట్లు
మార్చుఎక్కినవానికి ఏనుగు లొజ్జు
మార్చుఎక్కువగా తిన్న పొట్ట - ఏకులు పెట్టిన బుట్ట చిరుగవు
మార్చుఎక్కువ తెలివి ఏడ్పుల కారణం - తక్కువ తెలివి తన్నుల కారణం
మార్చుఎక్కువ వెల పెట్టి గుడ్డును, తక్కువ వెల పెట్టి గొడ్డును కొనరాదు
మార్చుఎగదీస్తే బ్రహ్మ హత్య - దిగదీస్తే గో హత్య
మార్చుఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరక దంచినా అంతే కూలి
మార్చుఎగిరి పడే గొడ్డే మరి మానెడు మోస్తుంది
మార్చుఎట్లాంటి కోమటికైనా నిమ్మకాయంత బంగారం వుంటుంది
మార్చుఎంతటి బీద కోమటైనా అతని వద్ద ఎంతైనా కొంత బంగారముంటుందని ఈ సామెత అర్థం.
ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది
మార్చుఅనాచితంగా వచ్చిన సంపద నిలువదు అని అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
ఎడపిల్ల ఏరాలితో సమానం
మార్చుఎడమచేత్తో తెలియక చేసేది కుడిచేత్తో తెలిసి అనుభవించాలి
మార్చుఎవరు చేసిన కర్మ ఫలం వారు తప్పక అనుభవించాలని చెప్పేది ఈ సామెత.
ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది
మార్చుఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు
మార్చుఅవునంటే కాదనే వితండ వాదన చేసే వారితో మాట్లాడటం కష్టం. అనే అర్థంతో ఈ సామెతను వాడ తారు/
ఎంత వుంటేనేం తినేది అన్నమే, బంగారం కాదు
మార్చుఎంత తిన్నా పరగడుపే
మార్చుఎంత ఉప్పు తింటే అంత దాహం
మార్చుఎంత చెట్టుకు అంత గాలి
మార్చుఎంత తొండమున్నా దోమ ఏనుగు కాదు
మార్చుఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితేనేమి?
మార్చుకొత్తగా కాపురానికి వస్తున్న ఆడపడుచును అత్తవారింట ముందుగా కుడికాలు ఇంటిలోపల పెట్టించి ఆహ్వానించటం ఆచారం. కానీ, వివిధ కారణాలచేత కాపురము ఎంతో కాలం సాగదని ముందుగానే తెలిసినపుడు, ఏ కాలు ముందు పెట్టి లోనికి వచ్చినా ఉపయోగం లేదు. ఈ విషయాన్నే ఏదేని మంచికార్యం చెడుతుందని ముందుగానే తెలిస్తే, ఈ సామెతను ఉటంకిస్తారు.
ఎత్తివచ్చిన కాపురానికి ఏ కాలూనినా ఒక్కటే
మార్చుకాపురానికొచ్చిన కొత్త కోడలు తొలిసారి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ...... వారి సంసారం చక్కగా సాగాలని కుడి కాలు ముందు పెట్టి లోపలికి రమ్మనడం ఒక ఆచారం. కాపురం ఎలా అయితేనేం? అనుకొనే వారికి ఏ కాలు పెడితే ఏమి? అనే అర్థం ఈ సామెతలో ఉంది.
ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదు
మార్చుఎత్తుకు పైఎత్తు
మార్చుఎత్తుబారం మొత్తుకోళ్ళు
మార్చుఎత్తువారి బిడ్డ
మార్చుఎత్తెత్తి అడుగులేస్తే పుల్లాకుల మీద పడ్డాయట
మార్చుఒకడు ఎక్కడ బురదలో కాలు వేస్తానో యని అతి జాగ్రత్తగా అడుగులు ఎత్తి ఎత్తి వేస్తూ నడుస్తున్నాడట. చివరకు బురదకన్న హీనమైన పుల్లాకులమీద అతని అడుగు పడిందని ఈ సామెత అర్థం. అతి జాగ్రత్తకు పోతే అనర్థం జరుగుతుందని ఇందులోని పరమార్థం.
ఎత్తేవాడుంటే ఏకులబుట్టా బరువే
మార్చుఎత్తేవాడుంటే ఏకులబుట్టా బరువే
మార్చుఎద పొంగుతోంది - నా వన్నెలు చిన్నెలు చూడమన్నదట
మార్చుఎదురు అన్నది మాట - ఎదాన పెట్టింది వాత
మార్చుఎదురు అన్నది మాట - ఎదాన పెట్టింది వాత
మార్చుఎదుట ఉన్నవాడు పెళ్ళికొడుకు
మార్చుఎదుటి వానికి చెప్పేటందుకే నీతులున్నాయి
మార్చుఎదుట లేకుంటే ఎదలో వుండదు
మార్చుఎదుట ఉన్నవాడు పెళ్ళికొడుకు
మార్చుఎదుట లేకుంటే ఎదలో వుండదు
మార్చుఎదురింట్లో పొయ్యి మండితే తన పొయ్యిలో నీళ్ళు పోసుకున్నట్లు
మార్చుఎదురుగుండా అద్దముంటే వెక్కిరించుకో బుద్ధి
మార్చుఎదురు తిరిగిన కుక్క, ఏదుపంది ఒక్కటే
మార్చుఎదురు పడిన వాడే నా మొగుడు అన్నట్లు
మార్చుఎద్దు ఎండకు లాగు - దున్న నీడకు లాగు
మార్చుఎద్దుకు, ఎనుబోతుకు లంకె వేసినట్లు
మార్చుఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి?
మార్చుఎద్దు కొద్దీ సేద్యం - చద్ది కొద్దీ పయనం
మార్చుఎద్దు క్రొవ్వి ఆబోతుపై రంకె వేసినట్లు
మార్చుఎద్దుగా కలకాలం బ్రతికేకంటే ఆబోతుగా ఆరు నెలలు బ్రతికితే చాలు
మార్చు- అర్ధం
సాధారణంగా ఎద్దులతో వెట్టి చాకిరీ చేయించుకుంటాం వాటికి సరిపడే తిండి మాత్రమే పెడుతూ. కానీ ఆంబోతులు ఏ పనీ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అంటే బానిసగా కష్టాలు పడుతూ ఎక్కువ కాలం ఉండడం కంటే స్వేచ్ఛగా, దర్జాగా కొద్ది కాలం ఉండడం ఉత్తమం అని దీని అర్థం.
- వాడుక
ఒకనికి చిన్నపాటి పెర్మనెంట్ ఉద్యోగం, మంచి హోదా గల తాత్కాలిక ఉద్యోగం - ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను తన మిత్రుని సలహా అడిగితే ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు అని చెప్పాడు.
ఎద్దును అడిగా గంట కట్టేది?
మార్చుఎద్దు పుండు కాకికి ముద్దా?
మార్చుఎద్దున్నవాడి సేద్యం చూడు - మంది వున్నవాడి బలం చూడు
మార్చుఎద్దు బీదదయితే చేను బీద
మార్చుఎద్దు మంచిదయితే సంత కెందుకు వెళుతుందిట?
మార్చుఎద్దులా ఉన్నావు పని చేయలేవా?
మార్చుఎద్దులా తిని మొద్దులా నిద్ర పోయినట్లు
మార్చుఎద్దువలె కుక్కను పెంచి తానే మొరిగినట్లు
మార్చుఎద్దు లేని సేద్యం చద్ది లేని పయనం
మార్చు==ఎద్దు లేని సేద్యం చద్ది లేని పయనం ఎన్నడూ దొరకనమ్మకు ఏగానీ దొరికితే ముడిమీద ముడి ఏడు ముళ్ళు వేసిందట ==
ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
మార్చుఒకరు చెప్పే పచ్చి అబద్ధాన్ని మరొకరు గుడ్డిగా సమర్థిస్తున్నారనే అర్థంలో దీన్ని వాడుతారు. ఎద్దు ఈనడమనేది ప్రకృతికి విరుద్ధం. అది ఘోరమైన అబద్ధం, అసంబద్ధం.. చిన్నపిల్లలు కూడా నమ్మరు. అంతటి దారుణమైన అబద్ధం ఒకరు చెప్తే.. దాన్ని నిజమేనని భావించి గానీ, ఈ అబద్ధానికి గౌరవాన్ని ఆపాదించే ఉద్దేశంతో గానీ, ఇతరులచేత ఈ అబద్ధాన్ని నమ్మించే దురాలోచనతో గాని, దానికి మరింత మసాలా జోడించే సందర్భంలో ఈ సామెతను వాడతారు. సాధారణంగా అబద్ధాన్ని ఇతరులచేత నమ్మించే ప్రయత్నం జరిగిన సందర్భంలోనే వాడతారు.
- ఒక ప్రసిద్ధ ఉదాహరణ
- 2006 జనవరిలో ఆంధ్ర ప్రదేశ్లో మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు బి.వి.రాఘవులు నీటిపారుదల ప్రాజెక్టుల్లో వెయ్యికోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించాడు. మరుసటి రోజు ఈనాడు పత్రిక ఆ విషయానికి సంబంధించి ఒక కార్టూను ప్రకటించింది. అవినీతి ఆరోపణలు సహజంగానే ముఖ్యమంత్రికి నచ్చవు. దీంతో కోపించిన ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈనాడును విమర్శిస్తూ ఎద్దు ఈనిందని రాఘవులన్నాడు, దూడను కట్టెయ్యమని ఈనాడంటోంది, అని అన్నాడు.
ఇటువంటిదే మరో సామెత ఉంది:అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు. అయితే ఇది వాడే సందర్భం మాత్రం వేరు.
ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి?
మార్చుఎద్దు సాధారణంగా అటుకులు దాని జీవితకాలములో రుచి చూడదు. అట్టి దానికి అటుకుల రుచి తెలియదు. ఈ విషయమునే వ్యంగ్యముగా, ప్రావీణ్యతను బట్టి వ్యక్తులను సందేహములు అడుగవలెను అని సామెత రూపములో చెప్పుచున్నారు.
ఎద్దు పుండు కాకికి ముద్దు
మార్చుఎద్దుకు అయిన గాయం కాకికి ఆనందదాయకం. ఎందుచేతంటే, కాకి ఆ గాయాన్ని తొలుస్తూ ఆహారంగా స్వీకరిస్తుంది. ఒకని కష్టం మరొకని సుఖంగా అయిన వేళ ఈ సామెతను ఉదహరించటం పరిపాటి.
ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు
మార్చుసాధారణంగా ఎద్దులతో వెట్టి చాకిరీ చేయించుకుంటాం వాటికి సరిపడే తిండి మాత్రమే పెడుతూ. కానీ ఆంబోతులు ఏ పనీ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అంటే బానిసగా కష్టాలు పడుతూ ఎక్కువ కాలం ఉండడం కంటే స్వేచ్ఛగా, దర్జాగా కొద్ది కాలం ఉండడం ఉత్తమం అని దీని అర్థం.
- వాడుక
ఒకనికి చిన్నపాటి పెర్మనెంట్ ఉద్యోగం, మంచి హోదా గల తాత్కాలిక ఉద్యోగం - ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను తన మిత్రుని సలహా అడిగితే ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు అని చెప్పాడు.
ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా ఆరునెలలు బతికినా చాలు
మార్చుసాధారణంగా ఎద్దులతో వెట్టి చాకిరీ చేయించుకుంటాం వాటికి సరిపడే తిండి మాత్రమే పెడుతూ. కానీ ఆంబోతులు ఏ పనీ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అంటే బానిసగా కష్టాలు పడుతూ ఎక్కువ కాలం ఉండడం కంటే స్వేచ్ఛగా, దర్జాగా కొద్ది కాలం ఉండడం ఉత్తమం అని దీని అర్థం.
ఎద్దుల పోట్లాటలో దూడలు నలిగి పోయినట్లు
మార్చుగొప్పవారు పోట్లాడుకుంటుంటే బీదవారు వారి మధ్యకు వెళ్లకూడదని దీని అర్థం.
ఎనుబోతు మీద వర్షం పడ్డట్టు
మార్చుఒకనికి చిన్నపాటి పెర్మనెంట్ ఉద్యోగం, మంచి హోదా గల తాత్కాలిక ఉద్యోగం - ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను తన మిత్రుని సలహా అడిగితే ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు అని చెప్పాడు.
ఎన్నాళ్ళున్నా అత్తారింటికి పోకతప్పదు
మార్చుఎన్ని పుంగునూరు లైతే ఒక బెంగుళూరుతో సమానం
మార్చుఎన్ని పుటాలు పెట్టినా పుట్టుకతో వచ్చిన బుద్ధి పోదు
మార్చుఎన్ని విద్యలయినా కుల విద్యకు సాటిరావు
మార్చుఎన్నో వ్రణాలు కోసానుగానీ, నా వ్రణమంత బాధలేదు అన్నాడట
మార్చుఎప్పుడు బిచ్చం పెట్టని మహా తల్లి ఈరోజు కూడ బిచ్చం వేయలేదు..... రోజు బిచ్చం పెట్టే ఈ బొచ్చు ముండకు ఈ రోజు ఏమైందో ......
మార్చుతనకు నష్టం కలిగించేదైనా సరే తర తరాలుగా ఆచరిస్తుంటే అదే సిద్దాంతమై కూర్చుంటుంది. ఇది ఆర్థిక శాస్త్రంలో సిద్దాంతం; అలాగే బొచ్చగాడి ప్రతి రోజు బిచ్చం వేసే ఇల్లాలను అది ఆమె విద్యుక్త ధర్మమని అనుకొన్నాడు. ఎప్పుడు బిచ్చం వేయని ఆమెను కూడా అది ఆమె విద్యుక్త ధర్మమని నమ్మాడు. అందు చేత రోజు బిచ్చంవేసే ఆమెను ఒక రోజు వెయ్యక పోతే బొచ్చుముండ అయ్యింది.. ఏ రోజు బిచ్చం వేయని ఆమె మహా తల్లి అయింది.
ఎప్పుడు సంపద కలిగితే అప్పుడు బందువులు వస్తారు
మార్చుసంపద కలిగినప్పుడే బంధువులు వస్తారు. ఇది లోక సహజము: ఇది సుమతీ శతక పద్య పాదము: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులోత్తురు.. అది ఎట్లన్నన్.... తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు చేరు గదరా సుమతీ.....
ఎముకలేని నాలుక ఎట్లా త్రిప్పినా తిరుగుతుంది
మార్చుఎముక లేని నాలుక ఏమయినా పలుకుతుంది
మార్చుఎరగని ఊళ్ళో మొరగని కుక్క
మార్చుఎరను చూపి చేపను లాగి నట్లు
మార్చుఎరువుసొమ్ములు బరువుచేటు - తియ్యా పెట్టా తీపులచేటు - అందులో ఒకటి పోతే అప్పుల చేటు
మార్చుఎరువు వుంటే వెఱ్ఱివాడూ సేద్యగాడే
మార్చుఎరువు పెట్టిన చేను - ఏలుబడి అయిన కోడలు
మార్చుఎరువు లేని చేను - వేగంలేని ఏరూ ఒకటే
మార్చుఎరువు లేని పైరు - పరువు లేని వూరూ ఒక్కటే
మార్చుఎఱను వేసి చేపను పట్టినట్లు
మార్చుఎఱుక పిడికెడు ధనము
మార్చుఎఱ్ఱ కోమటినీ నల్ల బ్రాహ్మడినీ నమ్మరాదు
మార్చుఎఱ్ఱభూమి పంట ఒకనాటి మాట
మార్చుఎలుకకు పిల్లి సాక్ష్యం
మార్చుఎలుకల పోరు పిల్లి తీర్చినట్లు
మార్చుఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
మార్చుఒక మూర్ఖుడిని మార్చటానికి ఎంత ప్రయత్నించినా అతడు మారడు. ఎలుక తోకని ఎంత ఉతికినా రంగు మారనట్లే మూర్ఖుని మనస్సు ఎంత ప్రయత్నించినా మారదు.
ఎలుకమీద కోపంతో ఇంటికి నిప్పంటించుకొన్నట్లు
మార్చుఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు బండ్లు లేవు తెల్లవార్లూ బాడుగ తోలారుట
మార్చుఎలాంటి వాడికైనా వేపకాయంత వెర్రి వుంటుంది
మార్చుఎంతటి మేధావి అయినా ఒక్కోసారి తెలివి తక్కువ తనం ప్రదర్శిస్తాడని దీని అర్థం.
ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు
మార్చుఎలుకల నివారణకు ఇల్లు తగల బెట్టనవసరం లేదు. అలా చేస్తే తనకే నష్టం. అతి తెలివి తక్కువ పని చేసే వారికి ఈ సామెత వర్తింస్తుంది.
ఎవడి కంపు వాడికింపు
మార్చుఎవడి నోటికంపు వాడికి తెలియదు
మార్చుఎవడు త్రవ్వుకున్న గోతిలో వాడే పడతాడు
మార్చుఎవరికి వారె యమునా తీరే
మార్చుఅందరు కలసి వుంటే దాని భలం అధికం. అలా కాకుండ ఎవరికి వారే వుంటే ఎదుటి వాడిచేత చాల సులభంగా ఓడి పోతారని దీని అర్థం.
- ఎవరికి వారే యమునా తీరే #
ఎవరి దారి వారిది, ఒకరి గురించి ఇంకొకరు పట్టించుకోకపోవటం. ఉదాహరణ:సరయిన రజులేనందువల్ల ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రజలు మారుతారు.
ఎవరి ఏడుపు వాళ్ళకే తగులుతుంది
మార్చుఎవరి పిచ్చి వారి కానందం
మార్చుఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఎక్కి ఏడ్వటానికి?
మార్చుఎవరికి పెట్టావే దండమంటే మీలో బుద్ధిహీనుడికి అన్నదట
మార్చుఎవరి పాపాన వాళ్ళే పోతారన్నట్లు
మార్చుఎవరి ప్రాణం వారికి తీపి
మార్చుఎవరి బిడ్డ వారికి ముద్దు
మార్చుఎవరి ముడ్డి క్రిందకి నీళ్ళు వస్తే వాళ్ళే లేస్తారు
మార్చు==ఎవరు తీసిన గోతిలో వారే పడతారు==. ఎవరికో మోసం చేయాలని తలస్తే వారే మోస పోతారు అనే అర్థంతో దీన్ని వాడుతారు. చెడపకురా చెడేవు" అనే సామెత కూడా ఇలాంటిదె.
ఎవరూ లేకపోతే అక్క మొగుడే దిక్కు
మార్చుఎవడి నెత్తి మీద వాడే చెయ్యి పెట్టుకున్నట్లు
మార్చుభస్మాసురుడు తన నెత్తి మీద తానే చెయ్యి పెట్టుకుని బూడిద అయినట్టు తనకు తానే ప్రమాదం కొని తెచ్చుకొవటం అనమాట.
ఎసట్లో గింజలన్నీ పట్టి చూడాలా?
మార్చు- ↑ లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం