భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "ర" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా?

మార్చు

రంకులాడికి నిష్ఠలు మెండు

మార్చు

రంకు సాగితే పెళ్ళెందుకు?

మార్చు

==రంగడికీ రంగికిస్నేహం - లుంగీకి లంగా కిబంధం

రచ్చకెక్కిన తర్వాత రాయబారమెందుకు?

మార్చు

రతిలో సిగ్గు - రణములో భీతి కొరగావు

మార్చు

రత్నాన్ని బంగారంలో పొదిగితేనే రాణింపు

మార్చు

రత్నాలన్నీ ఒకచోట - రాళ్ళన్నీ మరొకచోట

మార్చు

రవిక సవరిస్తూ కోకముడి విప్పినట్లు

మార్చు

రసదెబ్బ తగలినిదే రంకు పుండు మానదు

మార్చు

రహస్యం ఏమిటంటే, వడ్లగింజలోనిది బియ్యపుగింజ అన్నట్లు

మార్చు

రహస్యం ఏదైనా వుంటే..? అనగా విషయం తెలియకుంటే... అందులో ఏదో వుందని బ్రమపడతారు. అసలు విషయము తెలిశాక ఇంతేనా అని అనిపిస్తుంది.

రక్షించినవాడినే భక్షించినట్లు

మార్చు

రాగల శని రామేశ్వరం వెళ్ళినా తప్పదు

మార్చు

రాగం తీయనివాడు, రోగం రానివాడు లేడు

మార్చు

రాగంలేని భోగం, త్యాగం లేని మనస్సు

మార్చు

ఎంతగా భోగాలను అనుభవిస్తున్నా బంధుమిత్రుల అనురాగం లేకపోతే ఆనందమే ఉండదు.ఎలాంటి త్యాగమూ లేకుండా జీవితం గడుస్తూ ఉంటే మనస్సుకు ఆనందం ఉండదని

రాచపగ - పాము పగ

మార్చు

రాచపీనుగు తోడు లేకుండా పోదు

మార్చు

రాజకీయం తీరెరుగదు - పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు

మార్చు

రాజ్యం వీరభోజ్యం

మార్చు

రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదని

మార్చు

పాత వాసనలు మరవలేని వారి గురించి

రాజ్యాలు పోయినా రాజసాలు పోలేదన్నట్లు

మార్చు

రాజు కొడుకైనా కావాలి - సానిదాని తమ్ముడైనా కావాలి

మార్చు

రాజుగారి పెద్ద భార్య పతివ్రత అన్నట్లు

మార్చు

రాజుగారు వస్తున్నారంటే, పెళ్ళాంవంక అనుమానంగా చూసినట్లు

మార్చు

రాజు గుర్రం గాడిదైనట్లు

మార్చు

రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?

మార్చు

రాజు తలుచుకొంటే ఏమైనా చేస్తాడు అని అర్థం, అలాగే ఉన్నవాడు తలుచు కుంటే కూడా ఎమైనా చేస్తాడు,,,, అని అర్థము

రాజు తలిస్తే రాయికూడా పగులుతుంది

మార్చు

రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే, మొత్తబుద్ది అవుతుంది

మార్చు

రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుంది

మార్చు

సమాజంలో సత్యం, ధర్మం నిరంతరం ఉండాలని.కరవుకాటకాలు దేశంలో ప్రబలుతున్నప్పుడు దానికి కారణం దేశాన్ని ఏలే నేతల అధర్మ ప్రవర్తనేనని.రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలానే ఉంటారు.అంతా అధర్మంతో ఉన్నప్పుడు భూమి కూడా ప్రజలకు సాయం చేయదని, సారం కోల్పోతుంది కనుక దేశనేతలు ధర్మాన్ని తప్పకూడదని హెచ్చరిక.

రాజు మెచ్చింది రంభ

మార్చు

రాజుల సొమ్ము రాళ్ళ పాలు,దొరల సొమ్ము దొంగల పాలు

మార్చు

రాజుల సొమ్ము రాళ్ళ పాలు,బలిజల సొమ్ము భోగాల పాలు

మార్చు

పూర్వం రాజవంశీయులు మనదేశంలో తమ ధనాన్ని ఎక్కువగా రాళ్ళు (అనగా రత్నాలు) కొనుగోలుకు ఖర్చు చేసేవారు. ఈ వజ్రాలు, రత్నాలు క్రయ విక్రయాలు చేసేవారు రత్న బలిజలు అనే వారు. వీరు బలిజలు లేదా వణిజులలో అత్యంత శ్రేష్ఠులు, ధనికులు. వీరు రత్నాలను రాజులకు ధనికులకు విక్రయించి మంచి ధనాన్ని గడించేవారు. ఆ ధనంతో అపారమైన భోగాలు విలాసాలు అనుభవించేవారు. ప్రజలనుండి పన్నులరూపంలో వసూలుచేసిన సొమ్ములు రాజులు ప్రజావసరాలకు ఖర్చు చేయకుండా తమ విలాసాలకు రత్నాలు కొనుగోలు చేయడానికి ఖర్చు చేసేవారు. ఆ రత్నాలు అమ్మి సొమ్ములు గడించే రత్న బలిజలు ఆ సొమ్ములతో ప్రజావసరాలకు ఉపయోగించకుండా రకరకాల భోగాలు అనుభవించేవారు. కడకి ఎవరికీ సొమ్ములు మిగిలేవి కావు. అందుకే రాజుల సొమ్ము రాళ్ళపాలు బలిజల సొమ్ము భోగాల పాలు అని ప్రజలు చెప్పుకునేవారని, అందుకే ఈ సామెత పుట్టిందని గోదావరి జిల్లాల్లో నివసిస్తున్న రత్నబలిజ కులస్తులైన పోలిశెట్టివారి వంశ చరిత్రలో ఉన్నది.

అనగా ఆ ధనాన్ని ప్రజావసరాలకు ఉపయోగించిన సద్వినియోగపడేదని హెచ్చరిక.

రాజుల హృదయం రాతితో సమం

మార్చు

రాత రాళ్ళేరమని ఉంటే... రాజ్యాలెలా ఏలుతారు...?

మార్చు

జ్యోతిష్యం, జాతకాలు నమ్మి జీవితాన్ని గడిపేవాడు కష్టం వాటిల్లినప్పుడు, ప్రయత్నాలన్నీ విఫలమై ప్రయోజనం కలగనప్పుడు బ్రహ్మదేవుడు తనను సృష్టించినప్పుడే రాళ్ళేరుకుని బ్రతకమని రాసివుంచాడని తాను రాజుగా మారి రాజ్యాన్ని ఏలడం అందుకే వీలుపడడంలేదని అంటాడు.

రాతిలో కప్ప రాతిలోనే బ్రతుకుతుంది

మార్చు

రానప్పుడు బ్రహ్మ విద్య - వచ్చినప్పుడు కూసు విద్య

మార్చు

సూక్ష్మముగా పరిశీలించినచో సంహిత బ్రాహ్మణము లును, భగవత్ బోధకములను జ్యోతి సంహితా ప్రతిపాదితములు నగు రహస్యములు ఇందు కనబడును. రహస్యము లని అనినంతనే ఎవరికిని చెప్పదగనివి కాబోలు, అట్టి వున్న నేమి లేకున్ననేమి? అని పలువురు అనుకొనుట వినుచున్నాము. అది లెస్స కాదు. జ్ఞానులందరును ముందు నీ మనమును కనుగొనుము, పిదప నిన్ను కనుగొనుము అని చెప్పుదురు. మనకు మనసే దొరకదాయె; ఇక నేను దొరుకుటెచట? ఇట్టివే రహస్యము లన్నియు. మన అధికారమునకు మించినది రహస్యము. మనకు తెలియినది బ్రహ్మ విద్య; తెలియనిది కూసు విద్య.

రాని అప్పు రాతితో సమానం

మార్చు

రాని వానిని పిలువ వేడుక

మార్చు

రానున్నది రాక మానదు - పోనున్నది పోకమానదు

మార్చు

రామ రామ అంటే రోమ రోమానికీ ఎక్కిందట

మార్చు

రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు

మార్చు

రామాయణం విన్న తరువాత ఎవరైనా రామునికి సీత ఏమౌతుందని అడిగితే ఆ ప్రశ్న విన్నవారికి విచిత్రంగా ఉంటుంది. అదే విధంగా ఏదైనా వెషయం కూలంకుశంగా విన్న తరువాత ఆ విషయం గురించి ఏమీ తెలియనట్టు ఎవరైనా ప్రవర్తిస్తే ఈ సామెతను వాడుతారు.

రామాయణమంతా రంకు.... భారతమంతా బొంకు

మార్చు

రామాయణ కథకు మూలం రంకు. అదే విధంగా భారత యుద్ధానికి అబద్ధం మూలం అని ఈ సామెతకు అర్థం.

రామాయణంలో పిడకల వేట అన్నట్లు

మార్చు

రామాయణంలో పిడకల వేట - ప్రేమాయణంలో పడతుల వేట అన్నట్లు

మార్చు

రామాయపట్నం మధ్యస్థం అన్నట్లు

మార్చు

రామునివంటి రాజుంటే హనుమంతునివంటి బంటూ వుంటాడు

మార్చు

రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు

మార్చు

ఒక పీడ నుంచి ఎంతకు ముక్తి కలగనిచో ఈ సామెతను వాడుతారు.

రావణాసురుడి కాష్టంలాగా

మార్చు

రావాలంటే త్రోవేలేదా, కావాలంటే కరుణే రాదా!

మార్చు

రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టు చుట్టుకూ పొట్ట చూసుకుందట

మార్చు

అతిగా మూడనమ్మకం వున్నవారికి సంబంధించిన సామెత ఇది.

రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకొన్నట్లు

మార్చు

రాసలీల వేళలో రాయబారమన్నట్లు

మార్చు

రాసుకుంటే రంగూకాదు - పూసుకుంటే పుణ్యం రాదు

మార్చు

రుచీపచీలేని కూర కంచానికి చేటు - అందం చందంలేని పెళ్లాం మంచానికి చేటు

మార్చు

రూక లేనివాడు పోకచేయలేడు

మార్చు

రూపాన గర్విష్టి - గుణాన పాపిష్టి

మార్చు

రెక్కాడితే గానీ డొక్కాడదు

మార్చు

రోజూ కాయ కష్టం చేస్తేగానీ కడుపు నిండని పరిస్థితిలో ఎవరైనా ఉన్నప్పుడు ఈ సామెతను వాడుతారు.

రెంటికీ చెడిన రేవడి చందాన

మార్చు

రేవడు అంటే చాకలి అని అర్థము. దీని వెనక ఒక చిన్న కథ ఉన్నది:-

అనగా అనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక రేవు. ఒక చాకలి అతను రోజూ ఆ రేవుకి వచ్చి బట్టలు ఉతుకుతుండేవాడు. ఒకరోజు సగం బట్టలు ఉతికి ఒడ్డున ఆరేస్తుంటే, అకస్మాత్తుగా వాగు పొంగింది. "అయ్యో! అయ్యో! నా బట్టలు" అంటూ, వాగులోనికి పరుగెత్తాడు. కానీ అప్పటికే కొన్ని బట్టలు వాగులో కొట్టుకోని పోయాయి.

ఇంతలో వాగు మరింత ఉదృతంగా పొంగినది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఒడ్డున ఉన్న మిగిలిన బట్టల్ని కూడా వదిలేసి, పరుగెత్తుకొని దగ్గరలోని గుట్ట ఎక్కాడు. వాగు ఉధృతికి మిగిలినా ఆ బట్టలు కూడా కొట్టుకు పోయాయి.

మొదటే ఒడ్డున ఉన్న బట్టలు తీసుకోని పరుగెత్తితే కనీసం అవన్నా దక్కేవి కదా! అందుకే అంటారు "రెడింటికి చెడిన రేవడి " అని.

ఇటువంటి అర్థములోనే మరొక సామెత కూడా వాడతారు ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది అని.

రెంటికీ చెడ్డ రేవడిలాగా

మార్చు

సంస్కృతంలో "రేవణ" శాబ్దానికి సరిగ్గా పోల్చదగిన శబ్దము సాధు శబ్దము. కాని ఏకారణం చేతనో ఇది తెలుగులోకి "రేవడ"గా మారింది. రేవణ శబ్దము పూర్వము ఒక మనుష్యుని పేరు. ఈయన పూర్వమీమాంస పునరుద్ధారణ కర్తలైన శ్రీ కుమారిల భట్టపాదుల శిష్యులని అందురు. కుమారిలానుయూయ లవలంబించే మతానికి భాట్ట మీమాంస అని అంటారు. ఇందులో ఒక కారిక కనబడుతుంది.

ఉంవేకః కారికాం వేత్తి
తంత్రం వేత్తి ప్రభాకరః
మండనం స్తూభయం వేత్తి
నోభయం వేత్తి రేవణః

ఉంవేకునకు కారికము మాత్రము తెలియును. ప్రభాకరునకు తంత్రము తెలియును. మండనునకు ఈ రెండును తెలియును. రేవణునికి ఈ రెండుని తెలియవు అని దీని అర్ధము.

జైమిని వ్రాసిన పూర్వమీమాంస సూత్రములకు శబరస్వామి భాష్యం వ్రాసాడు. కుమారిలభట్టు ఆభాష్యం మీద వార్తికాలు రచించాడు. ఆవార్తికాలను మూదు భాగాలుగా విభజింపవచ్చును. ప్రథమ తర్క పాదానికి కారికా రూపంలో శ్లోకవార్తికం వ్రాయటంచేత దీని కారికా అనేపేరు వచ్చింది. ఈ ఉంవేకుడు మండనుడు కుమారిలుని శిష్యుడు. వీరిరివును పూర్వమీమాంస మీద పనిచేసారు. తంత్ర వార్తికం పూర్తిగా తెలుసుకున్నవాడు ప్రభాకరుడు. ఇతనికే గురు వని ఇంకొక పేరు ఉంది. ఇతని మతాన్ని ప్రభాకర మీమాంస అనీ, గురుమత మనీ వ్యవహరిస్తారు. ఇతడు భాట్ట మీమాంసకుల మతాన్ని ఒప్పుకోకుండా వేరే మతాన్ని స్థాపించటానికి పూనుకొని శ్బరభాష్యానికి వ్యాఖ్య వ్రాసాడు. ఈ వ్యఖ్యనే బృహతీ అని అంటారు. మండనుడు ప్రాంచకరాద్వైతమున బ్రహ్మసిద్ధి వ్రాసినాడు. కుమారిలుని శిష్యుడు. శ్లోకతంత్ర వార్తికాలు రెండును ఇతనికి బాగా తెలుసునట.

రేవణుడు కుమారిలుని శిష్యుడో, పూర్వమీమాంసలో కృషి సల్పినవాడో అయివుంటాడు. ఈయనకు శ్లోక వార్తికము, తంత్ర వార్తికము తెండును తెలియవు. పాపం, ఎన్నేళ్ళు శుశ్రూష చేసినా, ఎంత కాలం చదివినా ఈవంకివేమీ తలకెక్కలేదు. అందుచే ఉభయభ్రష్టుడయినాడు.అందుకే "రెంటికీ చెడ్డ రేవణు" డని సామతలోనికి దిగినాడు.

రెండావుల దూడ

మార్చు

రెండు చేతులు కలిస్తేనే చప్పుడు

మార్చు

రెండు నాలుకలవాడిలాగా

మార్చు

రెండు పడవల పైన కాళ్ళు పెట్టినట్లు

మార్చు

రెండు పడవల పై కాళ్ళు పెట్టి పడవ ప్రయాణము చేయడము అసాద్యమైన పని. అలా అసాద్యమైన పని చేయడానికి పూనుకున్న వారినుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయేగిస్తారు.

రెక్కలు విరిగిన పక్షిలాగా

మార్చు

రెక్కాడితేగానీ డొక్కాడదు

మార్చు

ఏపూటకాపూట కష్టపడితేనే గాని తిండి దొరకనివారి నుద్దేశించి వాడే జాతీయమిది.

రెడ్డొచ్చె మొదలాడు

మార్చు

ఒక నాట్యగత్తె వీధిలో నాట్యమాడు తున్నది. కొంత సమయాని ఆ వూరి రెడ్డి గారు వచ్చారు. ఆ ఆటని తాను మొదటినుండి చూడలేదని మొదటినుండి ఆడమన్నాడట. ఆ తర్వాత కొంత సమయాని మరొక రెడ్డి వచ్చి తాను మొదటినుండి చూడలేదని తిరిగి మొదటి నుండి ఆడమన్నాడట. ఆ విధంగా మళ్లి మళి ఆట పలుమార్లు మొదలెట్టగా ఆ ట పూర్తిగాకుండానే తెల్లారి పోయింది. అలా ఈ నానుడి ప్రచారంలోనికి వచ్చింది.

రెప్పలార్పేవాళ్ళు కొంపలార్పుతారు

మార్చు

రేచీకటి మొగుడికి గుడ్డి పెళ్ళాం

మార్చు

రేపటి నెమలికంటే నేటి కాకి మేలు

మార్చు

రేపటి నొప్పుల మాటెలా వున్నా ఈ పూట ఈ నొక్కుళ్ళే బాగున్నాయి అందిట

మార్చు

రేపల్లెవాడలో పాలమ్మినట్లు

మార్చు

రేపు రేపంటే రేప్‌ చేసి చూపించాడట

మార్చు

రేయంతా సొగసులాట - పగలంతా పరధ్యానం

మార్చు

రేవతి వర్షం రమణీయం

మార్చు

రైతు దున్నితేనే రాజులకు అన్నం

మార్చు

రైతు లెక్కచూస్తే నాగలి కూడా మిగలదు

మార్చు

రొక్కమిచ్చినవాడే వెలయాలికి మన్మథుడు

మార్చు

రొట్టెకు రేపు లేదు

మార్చు

రొట్టెముక్క యిస్తే పండుగ అన్నట్లు

మార్చు

రొట్టెలవాడి పనికంటే ముక్కలవాడి పనిమేలు

మార్చు

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

మార్చు

ఎవరైనా తాము తినాలనుకున్న రొట్టె తనంతట తాను విరిగి నేతిలో పడితే దాని రుచి పెరుగుతుంది, దాన్ని త్రుంచే శ్రమ తప్పుతుంది. అదే విధంగా అనుకున్న పని వేరొక సంఘటన వలన మనకు సౌకర్యంగాను, సులభతరంగాను మారితే ఈ సామెతను వాడుతారు.

దాచి పెట్టిన రొట్టే పొరబాటున విరిగి నేతిలో పడింది. ఇక దాన్ని తిరిగి దాచ లేము. తినాల్సిందే. అసంకల్పితంగా ప్రయోజనం కలిగినప్పుడు ఈ సామెతను వాడుతారు.

రొయ్యకు లేదా మూరెడు మీసం?

మార్చు

రోగ మొకటి - మందొకటి

మార్చు

రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే

మార్చు

రోగానికి మందుందిగానీ మనోవ్యాధికి మందుందా?

మార్చు

రోగాలు మనుషులకు కాక మానులకు వస్తాయా?

మార్చు

రోగికి కోపమెక్కువ

మార్చు

రోగి కోరుకుందీ పాలే వైద్యుడు చెప్పిందీ పాలే

మార్చు

రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట

మార్చు

దొంగతనం నేరం . కర్మసిద్ధాంతం ప్రకారం మహాపాపం కూడా. కానీ ఈ విషయాలేవీ పట్టించుకోకుండా ఒక దొంగ జాతకం ప్రకారం తనకు రోజులు బాగున్నాయని ఆ రోజుల్లో ఏ పనిచేసినా బాగా కలిసి వస్తుందని విశ్వసించి ధైర్యంగా పగటిపూటనే దొంగతనం చేయడానికి వెళ్లాడట.నిత్యం ఏదో ఒక దుర్మార్గాన్ని చేస్తూ ఆ దుర్మార్గ పాపఫలితాన్ని పోగొట్టుకోవడానికి దేవతలకు మొక్కుకుంటూ పూజలు జరిపిస్తుంటారు. తోటిమనిషిని హింసించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి అకారణంగా ధనాన్ని కూడా సంపాదించి ఆ పాపం పోగొట్టుకోవటానికి వారు పూజలు జరిపిస్తారు. కానీ దేవుడి అనుగ్రహం మంచిపనులు చేసే వారికే కలుగుతుంటుంది.చెడుగా ప్రవర్తిస్తూ మంచి ఫలితాలు కలగాలని దేవుడికి మొక్కటం .దొంగ ఎలా పట్టుబడి శిక్ష అనుభవించక తప్పదో, దుర్మార్గాలు చేసి ఎన్ని పూజలు చేసినప్పటికీ దుర్మార్గులు ఏదో ఒకనాడు శిక్షను అనుభవించక తప్పదనేది సామెతలోని అంతరార్ధం.

రోజు చచ్చే వానికి ఏడ్చే వారెవరు ఉండరు

మార్చు

ఎవరైనా ఒకసారికి అవసరానికి సహాయం చేస్తారు. ప్రతి సారి చెయ్యరని చెప్పేదే ఈ సామెత.

రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ తగునా?

మార్చు

రోట్లో తల పెట్టితే రోకటి పోటుకు సిద్ద పడి నట్లే. అందు చేత భయ పడ కూడదు. ఏదైనా పని ప్రారంబించేటప్పుడు దాని పర్వవసానంగా వచ్చే కష్టాలకు వెరవ కూడదు. ఆ సందర్భంలో ఈ సామెత చెప్తారు.

రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు

మార్చు

రొలుకి ఒక పక్కనే వాయిస్తారు కాని మద్ధెలకు రెండు పక్కల వాయిస్తారు. ఒక బాధ ఉన్నవాడు తన బాధలను ..... రెండు బాధలున్న వాడితొ చెప్పుకున్నట్టు.

రోత ముండకైనా రాత బాగుంటే చాలు

మార్చు

ఎంతటి వారికైనా తలవ్రాత బాగుంటే బాగా రాణిస్తారని చెప్పే సామెత ఇది

రోషం లేని మూతికి మీసమెందుకు?

మార్చు

రోషానికి రోలు మెడకు కట్టుకున్నట్లు

మార్చు

రోహిణి ఎండలకు రాళ్ళు పగులుతాయి

మార్చు

అనగా రోహిణి కార్తెలో ఎండలు ఎక్కువగా వుంటాయని అర్థము.

రోహిణిలో విత్తుట రోటిలో విత్తినట్లే

మార్చు

రోహిణిలో రోకళ్ళు చిగుర్చనన్నా చిగురిస్తాయి, రోళ్ళు పగులనన్నా పగుల్తాయి

మార్చు

రోహిణిలో విత్తటం రోళ్ళు నిండని పంట

మార్చు

ఇది వ్యవసాయ దారులకు సంబంధించిన సామెత. రోహిణి కార్తెలు విత్తనాలు చల్లితే పంట సరిగా రాదు అని చెప్పే సామెత ఇది.

రోహిణి ఎండకు రోళ్ళో పాయసం ఉడుకుతుంది

మార్చు

రోహిణిలో రోకళ్ళు చిగిర్చనన్నాచిగిరిస్తవి ,రోళ్ళు పగలనన్నా పగులుతవి

మార్చు

రోహిణిలో జొన్నలు సాహిణిలో గుర్రాలు

మార్చు

రోహిణిలో విత్తులో రోయక వేస్తారు,మృగశిరలో ముంచి పోస్తారు

మార్చు

రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు

మార్చు

రౌతు అనగా గుర్రపు స్వారీ చేసేవాడు. అలాంటి రౌతు మెత్తనివాడైతే గుర్రము అతని ఆదేశాలని సరిగా పాటించదు. అదే విధంగా అధికారంలో ఉన్న వ్యక్తి మెత్తనివాడైతే అతని కింద పని చేసేవాళ్ళు సరిగా పనిచేయరని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.

రౌతు కొద్ది గుర్రం

మార్చు

రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు వంటిదే ఈ సామెత

రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్లమీద నడుస్తుంది

మార్చు

రౌతు మెత్తగా వుంటే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుంది. అనగా నిదానంగా నడుస్తుంది. అదే రౌతు గట్టి వాడైతే... నాలుగు దెబ్బలు తగిలిస్తాడు. దాంతో అది పరుగు అందుకుండుండి. ఏపని చేసేటప్పుడైనా కొంత కఠినంగా వుండాలని ఉద్దేశించినది ఈ సామెత.

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikibooks.org/w/index.php?title=సామెతలు_-_ర&oldid=21463" నుండి వెలికితీశారు