సామెతలు - న
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ-ఘ |
చ-ఛ జ ఝ |
ట ఠ డ-ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ-ష స-హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]
ఇక్కడ "న" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.
రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.
నక్క ఎక్కడ నాకలోకమెక్కడ?
మార్చునక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట
మార్చునక్క జిత్తులన్నీ నాదగ్గరుండగా తప్పించుకుపోయెరా తాబేటిబుఱ్ఱ
మార్చునక్క జిత్తులవాడు
మార్చుజిత్తుల మారి మోసగాడిని ఈ సామెతతో పోలుస్తారు
నక్కను చూచిన వేటగాడిలాగా
మార్చునక్కను త్రొక్కి వచ్చినట్లు
మార్చుఅదృష్టము కలసి వచ్చినది అర్థము
నక్కపుట్టి నాలుగు వారాలు కాలేదు - నేనింత ఉప్పెన ఎన్నడూ చూడలే దన్నదట
మార్చునక్క పోయిన తర్వాత బొక్క కొట్టుకున్నట్లు
మార్చునక్కలు బొక్కలు వెదుకును
మార్చునక్క వినయం - కొంగ జపం
మార్చునట్టేట చేయి విడిచినట్లు
మార్చునట్టేట చేయి విడిచినట్లయితె మునిగి పోతాడు. అలా చేస్తే నమ్మించి మోసము చేయడమని అర్థము.
నట్టేట పుట్టి ముంచినట్లు
మార్చునట్టేట పడ్డ సొమ్ము నట్టింటికి నడిచి వచ్చినట్లు
మార్చుఅదృష్టము కలిసి వచ్చినదని అర్థము
నగుబాట్ల పెళ్ళికి పెళ్ళినాడే నాగవల్లి అన్నట్లు
మార్చునడచినవాడే పడేది
మార్చునడమంత్రపు సిరి
మార్చునడమంత్రపు సిరికి నెత్తిమీద కళ్ళు
మార్చుమధ్యలో సంపదలు కలిగిన వారికి గర్వ మెక్కువ అని అర్థము
నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది
మార్చునడిచే దారిలో గడ్డి మొలుస్తుందా?
మార్చుఅల్పుడికి ఐశ్వర్యం వేస్తే.. అర్దరాత్రి గొడుగు పట్టమన్నాడట. మధ్యలో సంపదలు కలగ్గానే పొగరెక్కి...... అర్థ రాత్రి గొడుగు అవసరం లేకున్నా..... గొప్ప కోసము గొడుగు పట్టమన్నాడట
నడమంత్రపు సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట
మార్చుమధ్యలో సంపదలు కలగ్గానే పొగరెక్కి...... అర్థ రాత్రి గొడుగు అవసరం లేకున్నా..... గొప్ప కోసము గొడుగు పట్టమన్నాడట
నడమంత్రపు సిరి వస్తే నడుము లిరుగ పడ్డట్లు
మార్చునడువగా నడువగా పైగుడ్డే బరువు
మార్చుఅలసట ఎక్కువైతే...... తనపైనున్న గుడ్డ కూడా బరువని పిస్తుందని అర్థము.
నడుము మునిగేదాకానే చలి - నలుగురూ వినేదాకానే సిగ్గు
మార్చునడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!
మార్చునడిరాత్రి దుప్పట్లో యౌవ్వన మద్దెల మోతలన్నట్లు
మార్చునడి సముద్రంలో నావ లాగ
మార్చుకష్టాల్లో మునిగి ఎటు దిక్కు తోచని స్థితిలోవున్న వారి గురించి ఈ సామెత వాడతారు.
నత్తగుల్లలన్నీ ఒకచోట - ముత్యపు చిప్పలన్నీ ఒకచోట
మార్చుఏగూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అనే సామెత లాంటిదే ఈ సామెత.
నన్ను ఎరిగినవాడు లేకపోతే నా బడాయి చూడమన్నట్లు
మార్చుతనగురించి తెలిసిన వారు లేక పోతే ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చని అర్థము
నన్ను ముట్టుకోకు నా మాలకాకీ అన్నట్లు
మార్చునపుంసకునికి రంభ దొరికినట్లు
మార్చునిరుపయోగమైన పనిని గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను వాడుతారు
నమ్మకానికి రాయబారమెందుకు?
మార్చునమిలేవాడికన్నా మింగినవాడే ఘనుడు
మార్చునమ్మించి గొంతు కోసినట్లు
మార్చునయము నష్టకారి - భయము భాగ్యకారి
మార్చునయాన కాని పని భయాన అవుతుంది
మార్చునయమున పాలుం ద్రావరు, భయంబున విషంబు నైన బక్షింతురుగా.... అనే పద్యమే ఈ సామెత మూలము.
నరకానికి నవ ద్వారాలు - స్వర్గానికి ఒక్కటే
మార్చునరములేని నాలుక ఎటైనా తిరుగుతుంది
మార్చునరునికి నాలుగు దశలు
మార్చునల భీమ పాకములు
మార్చునల్ల బంగారం యిస్తా సాన పెట్తావా అందిట
మార్చునల్లబాపడు నాభికంటే విషం
మార్చునల్లటి కుక్కకు నాలుగు చెవులు
మార్చునల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోమటిని నమ్మకూడదట
మార్చుసామాన్యంగా బ్రాహ్మణులు ఎర్రగానూ, కోమటివారు నల్లగానూ ఉంటారని ఒక నానుడి. అలా కాకుండా, బ్రాహ్మణుడు నల్లగానూ, కోమటి ఎర్రగానూ ఉంటే, సామాన్యంగా జరిగే దానికి వ్యతిరేకముగా ఉండటంవల్ల, అలా ఉన్నవాళ్ళని నమ్మకూడదని సామెతే తప్ప మరింకేమీ కాదు, ఇందులో ఉదహరించబడిన కులాల మీద ఎటువంటి వ్యాఖ్య అంతకన్నాకాదు.
నలిగి వున్నప్పుడు తొలగి వుండమన్నారు
మార్చునలుగురితో చావు పెళ్ళిలాంటిది
మార్చునలుగురి తర్వాత ఆడపిల్ల పుడితే నట్టింట బంగారం -
మార్చునలుగురితో పాటు నారాయణా!
మార్చుఅందరూ వెళ్ళే దారిలోనె వెళ్ళమని దీనర్థము
నలుగురూ వినేదాకానే సిగ్గు
మార్చునలుగురూ నడిచే దారే నడవాలి
మార్చునలుగురూ నడిచిందే బాట - పలికిందే మాట
మార్చుపదుగురాడు మాట పాటియై ధర జెల్లు అనే వేమన పద్యం ఈ సామెతకు ఆధారము
నలుపు నారాయణ స్వరూపం
మార్చునలుపో తెలుపో నలుగురు పిల్లలు - ముతకో సన్నమో నాలుగు చీరలు
మార్చునల్లేరు మీద బండిలాగా
మార్చుఅతిసులభముగా పని జరిగితే ఈ సామెతను వాడుతారు. బండి వెళ్ళే దారిలో నల్లేరు అడ్డు వుంటే బండి కేమి నష్టముండదు.
నవరత్నాలున్నా నారీరత్నం వుండాలి
మార్చునవాబు పొట్టకూ, తమలపాకు కట్టకూ ఎప్పుడూ తడుపు కావాలి
మార్చునవ్వలేని వారిని నమ్మరాదు
మార్చునవ్విన నాపచేనే పండుతుంది
మార్చునవ్వు నాలుగిందాల చేటు
మార్చునవ్వే వాళ్ళ ముందు జారి పడ్డట్టు
మార్చుఏదో కారణంగా వారు ముందుగానే నవ్వుతున్నారు. అంతలో ఆదారిన వెళ్ళే వాడు వారి ముందు కాలి జారి పడ్డాడు. దాంతో వారి నవ్వు పరాకాష్ఠకు అందుకుంది.
నవ్వే ఆడదాన్నీ - ఏడ్చే మగవాణ్ణీ నమ్మరాదు
మార్చునరకానికి నాలుగు ద్వారాలు... స్వర్గానికి ఒకటే దారి
మార్చునరము లేని నాలుక నాలుగు విధాలు
మార్చునోట్లో నాలుక లేక పోవటం అంటే సరిగా మాట్లాడలేకపోవటం.నరము లేని నాలుక నాలుగు విధాలు అంటే మాట నిలకడలేని తనం.మాట నిలబెట్టుకోలేని తనం, నిమిషానికి ఒక రకంగా మాట మారుస్తూ ఉండటం.ఎప్పుడేం మాట్లాడతారో అర్థం కాకుండా ఉండటం.
నవ్విన నాపచేనే పండుతుంది
మార్చుకాలం అంతా ఒక్కలాగ వుండదు. ఈ రోజు పనికి రాదనుకున్న వస్తువు రేపు విలువైనదిగా వుండవచ్చు. ఆలాంటి దాన్ని గురించి ఈ సామెత.
నంగనాచి తుంగబుఱ్ఱ
మార్చునంగిమాటల వాడినీ - దొంగ చూపుల వాడినీ నమ్మరాదు
మార్చునందనవనంలో నాగుపామున్నట్లు
మార్చునంది అంటే పంది అన్నట్లు
మార్చునందిని చేయబోయి పందిని చేసినట్లు
మార్చునందిని పంది - పందిని నంది చేయగలిగినవాడు
మార్చునంబి కవిత్వం - తంబళ్ళ జోస్యం
మార్చునంబివాడు ఎదురైనా నాగుపాము ఎదురైనా కలిసిరావు
మార్చునంబీ నంబీ నా పెళ్ళికేమి సహాయం చేస్తావంటే నీ పెళ్ళికి ఎదురు రాను పో! అన్నాడట
మార్చునవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు
మార్చుఅన్ని వదిలేసిన వారిని గూర్చి ఈ సామెత వాడతారు. ఎవరు ఏమనుకున్నా నాకేమి అని మొడితనముతో వుండేవారిని ఉద్దేశించినది ఈ సామెత.
నష్టపడ్డా భ్రష్టు కారాదు
మార్చునాకు లేక ఆకులు నాకుతుంటే నీకెక్కడ పెట్టేది?
మార్చునా కోడీ, కుంపటీ లేకుంటే ఎలా తెల్లారుతుందో, నిప్పెట్లా దొరుకుతుందో చూస్తానందట
మార్చుఈ సామెతకు ఆధారంగా ఒక కథ వున్నది: ఒక ఊరిలో ఒక ముసలామె వుండేది. ఆమె వద్ద వంట చేసుకోడానికి ఒక కుంపటి వుండేది. అదే విధంగా ఒక కోడి పుంజు వుండేది. ప్రతి రోజు ఊరివారు ముసలమ్మ కోడి కూయంగానే..... నిద్రలేచి మగవాళ్ళందరూ వారి వారి పనులకు వెళ్ళే వారు. ఆడవారు మాత్రం.... ఈ ముసలమ్మ కుంపటిలోని నిప్పు తీసుకెళ్ళి తమ ఇంట పొయ్యి వెలిగించుకునేవారు. ఇది గమనించిన ఆ ముసలమ్మ..... నా కోడి పుంజు కూత తోటే ఈ వూర్లో తెల్లవారుతుంది...... నా కుంపటిలోని నిప్పుల వల్లనే ఈ వూరి వారందరి పొయ్యి వెలుగు తున్నదని.... భావించి ..... నేనే గనుక లేకుంటే.... ఈ ఊర్లో ఎలా తెల్లవారుతుందో..... వూర్లో వారు వంట ఎలా చేసుకుంటారో..... చూస్తానని ఎక్కడికో వెళ్ళి పోతుంది. కొన్నాళ్ళ తర్వాత ఆ వూరి వారి బ్రతుకులెలా వున్నాయో చూద్దామని తిరిగొచ్చింది ఆ ముసలామె. ఆ వూరిలో ప్రజలు యధావిధిగానె వుండటం చూచి..... నివ్వెర పోతుంది.
నాగరికంలేని మాట నాలుక తీట
మార్చునక్కకూ నాగలోకానికీ పోలికా?
మార్చునాగస్వరానికి లొంగని తాచు
మార్చుఎవరి మాట వినని... మొండి వాని గురించి ఈ సామెత వాడతారు.
నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నాడట
మార్చునా చేను నీకు రాసిస్తా దున్నుకుని పంట పండిస్తావా? అని అడిగిందట
మార్చునాజూకు నయగారాలు - వలపు వయ్యరాలు
మార్చునాటిన పైరుకు నష్టం లేదు
మార్చునాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు
మార్చుఅమాయకత్వం, తెలివి లేని తనం గల వారి గురించిన సామెత ఇది.
నాతి బలం నాలుకే
మార్చునాతోనే అంతా వున్నది అన్నట్లు
మార్చునాది కాదు - నా అత్త సొమ్ము అన్నట్లు
మార్చునా దెబ్బకు గోలకొండ కూడా అబ్బా అంటుంది
మార్చునానాటికీ తీసికట్టు నాగంభొట్లు
మార్చునా నోట్లో నీ వేలు పెట్టు - నీ కంట్లో నా వేలు పెడతా అన్నట్లు
మార్చునా పాతివ్రత్యం గూర్చి నా మొదటి మొగుణ్ని అడగరా రెండో మగడా అందిట
మార్చునా పెనిమిటికి లేనిది నీకుంది అందుకే నీ పక్కలోకొచ్చా అందిట
మార్చునామాలవారే గానీ, నియమాలవారే లేరు
మార్చునా మొగుడికే పసవుంటే నీ దగ్గరెందుకు పడుకుంటానని అందిట
మార్చునాయనకు పెళ్ళి సంబరం - అమ్మకు సవతి సంకటం
మార్చున్యాయదేవత వింటుందేగానీ చూడలేదు
మార్చున్యాయదేవత కళ్ళు విప్పనంతవరకే అన్యాయం ఆగడాలు
మార్చున్యాయానికి కూడు లేదు
మార్చున్యాయానికి రోజులు లేవు
మార్చున్యాయాన్ని రక్షిస్తే, అది నిన్ను రక్షిస్తుంది
మార్చునారా అనరా అంటే పీచు అనే వాడు
మార్చునారి తెగినా కష్టమే - నారి తిరిగినా కష్టమే
మార్చునారి అనగా వింటి నారి అని అర్థం. మరొక అర్థము స్త్రీ అని. వింటి నారి తెగితే.... విల్లు నిరుపయోగము..... అలాగే స్త్రీ బయట తిరిగితే పరువుండదని అర్థము
నారు పోసిన వాడు నీరు పోయక పోతాడా?
మార్చునాలిముచ్చు వెధవనీ, నీళ్ళు నమిలేవాణ్నీ నమ్మరాదు
మార్చునాలుక కటువు - ఎద మెత్తన
మార్చునోటి మాత్రమే కఠినంగా వుండి మనస్సు మెత్తనయితే ఈ సామెతను వాడుతారు
నాలుక దాటితే నరకము
మార్చునాలుకా! నాలుకా! వీపుకు దెబ్బలు తేకే
మార్చునాలుక మీద తేనె - మనసులో విషం
మార్చునాలుక వుంటే అన్ని దిక్కులూ తిరుగగలడు
మార్చునా వ్రేలితో నా కన్నే పొడిచినట్లు
మార్చునాశనమూ - నల్ల బొగ్గులూ
మార్చునా సింగారం చూడరా నా బంగారు మగడా! అన్నట్లు
మార్చునిండా మునిగిన వానికి చలేంటి
మార్చుచన్నీళ్లలో దిగేటప్పుడు మొదట్లో చలిగా వుంటుంది. పూర్తిగా దిగాక చలి వుండదు. కష్టాలు ఒకటి రెండు వస్తే మనిషి తమాయించుకోగలడు. అన్ని కష్టాలు ఒక్కసారిగా వస్తే అతనికి తెగింపు వచ్చేస్తుంది. ఆ అర్థంతో ఈ సామెత పుట్టింది.
నిండిన కడుపుకు అన్నం - బట్టతలకు నూనె అన్నట్లు
మార్చునిండిన కడుపుకు నిక్కెక్కువ
మార్చునిండు కుండ తొణకదు
మార్చుఅన్ని వున్న విస్తరి అణిగి మెణిగి వుంటుంది ఎంగిలాకు గాలికి ఎగిరి పడుతుంది. అనే సామెతె లాంటిదే ఇది కూడ. గొప్పవారు చిన్న చిన్న విషయాల గురించి పట్టించు కోరు అని చెప్పే సామెత ఇది.
నిండుటేరు నిలిచి పారుతుంది
మార్చుగంగ పారు చుండు కదలని గతి తోడ.... మురుగు పారు మ్రోత తోడ .... అనే పద్య పాదమే ఈ సామెతకు మూలం.
నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి
మార్చునిజం కురచ - బొంకు పొడవు
మార్చునిజం నిలకడమీద తెలుస్తుంది
మార్చుఅప్పటికప్పుడు అసలు విషయం తెలియకున్నా... తర్వాతన్నా నిజం తెలుస్తుందని ఈ సామెత అర్థం.
నిజం మాట్లాడితే నిస్టూరం
మార్చుకొన్ని సార్లు నిజం చెపితే కూడా తగువులు వస్తాయి అని చెప్పే సామెత ఇది.
నిజమైన బంగారం నిప్పుకు వెరవదు
మార్చునిజంచెపితే నమ్మరు
మార్చునిజంనిప్పులాంటిది
మార్చునిజం మాట్లాడితే ఉన్న ఊరు అచ్చిరాదు
మార్చునిత్య కళ్యాణం, పచ్చ తోరణం
మార్చుఅన్ని సక్రంగ జరుగుతూ సంసారం సక్రమంగా జరుగుతుంటే ఈసామెత వాడుతారు
నిత్య దరిద్రుడు.... నిచ్చింత పురుషుడు
మార్చునిద్ర పోయేవాణ్ని లేపొచ్చు గాని నిద్ర నటించే వాణ్ణి లేప లేము
మార్చునిజముగా నిద్ర పోయే వాడు కాస్త అలికిడికి లేస్తాడు. అలా కాకుండా నిద్ర పోతున్నట్టు నటిస్తున్న వాడిని బలవంతంగా లేపాలని ప్రయత్నించినా వాడు లేవడు. ఎందుకంటే అది కపట నిద్ర.
నిదానమే ప్రధానం
మార్చునింద లేనిదే బొంది పోదు
మార్చునింద వస్తుంది గానీ అవమానం రాదు
మార్చునిన్న ఉన్నవాడు నేడు లేడు
మార్చునివురు కప్పిన నిప్పువలె
మార్చునిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది
మార్చునిప్పుకు చెదలంటుతుందా?
మార్చునిప్పుకూ నీటికీ ఉన్నంత స్నేహం
మార్చునిప్పు త్రొక్కిన కోతిలాగా
మార్చునిప్పు ముట్టనిదే చేయి కాలదు
మార్చునిప్పులేనిదే పొగరాదు
మార్చుదేనికయినా ఒక కారణముంటుందని చెప్పేదే ఈ సామెత.
నిప్పులో ఉప్పు వేసినట్లు
మార్చునివురు గప్పిన నిప్పులా
మార్చుబయటకు కనబడని ప్రమాదమని అర్థం. నిపురు కప్పిన నిప్పు..... నిప్పుగా పైకి కనిపించదు. అలాగని దాన్ని ముట్టుకుంటే కాలక మానదు.
నిమ్మకు నీరెత్తినట్లు
మార్చునిమ్మ చెట్టు నీడా కాదు... నిండు మనిషి తోడు కాదు
మార్చుఉపయోగము లేని పని అని అర్థం.
నియమం కోసం నామం పెడితే, నామం నా కొంపముంచింది అన్నట్లు
మార్చునియోగి నిక్కులు
మార్చునియోగపు ముష్టికి బనారసు సంచి
మార్చునిర్భాగ్యపు దామోదరుడికి అభాగ్యపుటల్లుడు
మార్చునిలకడ లేని మాట నీళ్ళ మూట
మార్చునిలుచోటానికి చోటిస్తే పడగ్గది ఎక్కడన్నాడట
మార్చునిష్ఠ నీళ్ళపాలు - మంత్రం మాలలపాలు
మార్చునిష్ఠ మాలలపాలు - మానం సాయిబుపాలు
మార్చునీ ఎడమ చెయ్యి తియ్యి - నా పురచెయ్యి పెడతాను అన్నట్లు
మార్చునీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట
మార్చుఆమె కాపురము కూలిపోయిన తర్వాతనే రంకు మొగుడయ్యాడు. ఇక ప్రత్యేకంగా ఆమె కాపురం కూల్చాల్చిన పని లేదు. ఆ సందర్భానికి ఈ సామెత వాడతారు.
నీకు ఎక్కడ సంశయమో, నాకూ అక్కడే సందేహం
మార్చునీకు బెబ్బెబ్బే - నీ యబ్బకు బెబ్బెబ్బే
మార్చునీ కూడు తింటూ, నీ బట్ట కడుతూ, నాతో కాపురం చెయ్యి అన్నట్లు
మార్చునీకో దణ్ణం - నీ పెద్దకొక దణ్ణం
మార్చునీకోసం పుట్టా, నీకోసం పూచా, దొరలా దోచుకో అందట
మార్చునీతల్లో తేజమ్మ రావాలి
మార్చునీటికి కలువ - మాటకు చలువ
మార్చునీటికి నాచు తెగులు - మాటకు మాట తెగులు
మార్చునీటికి నాచు తెగులు - నాతికి రంకు తెగులు
మార్చునీటి మూటలు - గాలి మాటలు
మార్చునీటిలో జాడలు వెతికినట్లు
మార్చునీటిలో రాతలు రాసినట్లు
మార్చుఅబద్దాలు అని అర్థం.
నీడలకు నోళ్ళుంటాయి
మార్చునీతి లేని మాట రాతి వేటు
మార్చునీతిలేని పొరుగు నిప్పుతో సమానం
మార్చునీతి లేని వారు పొరుగున వుంటే ఏనాటికైనా ముప్పే. జాగ్రత్తగా వుండమని హెచ్చరిక
నీతి లేనివాడు కోతికంటే పాడు
మార్చునీతో కాపురం ఒంటికి కంపరం అన్నట్లు
మార్చునీతోడిదే లోకం అన్నట్లు
మార్చునీ పప్పు నా పొట్టు కలిపి ఊదుకు తిందాం రా! అన్నట్లు
మార్చుఎదుటివారి సొమ్మును ఏదో ఒక విధంగా కాజేద్దామని ఎదుటివారికి మేలు చేసి పెడతామంటూ వారికి మాయమాటలు చెప్పి వారి చేత ఖర్చు పెట్టించి తమ పని చేసుకుపోవటం.ఎదుటివారి చేత ఖర్చు చేయించి చివరకు డబ్బంతా తామే సమకూర్చినట్లుగా ప్రచారం చేసుకోటం.
నీ పెండ్లాం ముండమొయ్యా!
మార్చుపెండ్లాం ముండ మొయ్యడమంటే.... భర్త చావడమని అర్థము. కాని మొగుడే ఆ మాటంటే...... అతడొక అమాయకుడని అర్థము
నీ పెండ్లి ఎట్లాగో పాడయింది, నా పెండ్లికి రా అన్నాడట
మార్చునీరు వుంటేనే పల్లె - నారి వుంటేనే యిల్లు
మార్చునీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
మార్చునీవు నేర్పిన విద్యయే నీర జాక్ష
మార్చునీవు పాడిందానికీ, నేను విన్నదానికి సరి. తలవూపిన దానికి తంబూర పెట్టిపో! అన్నట్లు
మార్చునీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో
మార్చుఉపకారికి అపకారం చేసిన సందర్భాన్ని ఈ సామెతతో పోలుస్తాం. నీ వేలితో నాకు తినిపిస్తే నా వేలితో నీ కంట్లో పొడుస్తా అన్నట్లు!!
నీవు ఒక అందుకుపోస్తే, నేను ఒకందుకు తాగుతున్నా
మార్చునీళ్ళ మూట - వంచకుడి మాట ఒక్కటే
మార్చునీళ్లు నమిలేవాడికి నిలకడ లేదు
మార్చుఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పకపోవటం, సంబంధం లేని మాటలు ఏవేవో చెబుతూ అసలు విషయం చెప్పకపోటం.ఒకవేళ ఏదైనా చెప్పినా ఆ మాటలో కచ్చితమైన విషయాలుండవు. అలాంటివారి మాటలను నమ్మవద్దని ఆ మాటల ఆధారంగా గట్టి నిర్ణయాలు ఏవీ తీసుకోవద్దని
నీళ్ళు లేని పైరు - నూనె లేని జుట్టు
మార్చునీ సరి వేల్పులు - నా సరి దాసులు లేరు
మార్చునీ సొమ్ము ఆదివారం - నా సొమ్ము సోమవారం
మార్చునుదుట వ్రాయనిదే నోటరాదు
మార్చునువ్వు దంచు నేను బుజాలెగరేస్తాను
మార్చువడ్లు నువ్వు దంచు, నేను దంచుతున్నట్లు అభినయిస్తూ భుజాలు ఎగరేస్తాను .పని నువ్వు చెయ్యి, నేను ఎగ్గొడతాను అనటం.
నువ్వు దంచుతూ వుండు - నేను పక్కలెగరేస్తాను అన్నట్లు
మార్చునుయ్యి తియ్యబోతే భూతం బయటపడ్డట్లు
మార్చునూటికీ కోటికీ ఒకడు
మార్చునూటికి పెట్టి కోటికి గొరిగినట్లు
మార్చునూతి కప్పకు సముద్రపు సంగతేం తెలుస్తుంది?
మార్చునూరు అబద్ధాలాడి అయినా ఒక యిల్లు నిలుపమన్నారు
మార్చుఒక మంచి పని చెయ్యడానికి అబద్దం ఆడినా తప్పు లేదని అర్థము ఈ సామెతకున్నది
నూరు కీళ్ళు ఓరిస్తేగానీ ఒక మేలు దక్కదు
మార్చునూరు కొరడా దెబ్బలైనా ఒక బొబ్బట్టుకు సరిరావు
మార్చునూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లు
మార్చుఎంతటి భలవంతుడైనా కాలం కలిసి రాకపోతే ఒక్కోసారి కుక్కచావు చస్తాడని అర్థం.
నూరు చిలుకల ఒకటే ముక్కు
మార్చుపల్లె ప్రాంత ప్రజల ఉహా ధోరణి విచిత్రంగా ఉంటుంది. వారికి తెలిసిన వస్తువులను వారికి తెలిసిన వాటితో పోల్చి చెపుతుంటారు. ఈ పొడుపు కథ కూడా అలా ఒక వస్తువుతో పోల్చి చెప్పుకొనగా ఉద్భవించినదే. నూరు చిలకలు ఉంటే వాటికి ఒకటే ముక్కు ఉండటం సృష్టిలో చాలా విచిత్రమైన విషయమే. ద్రాక్షపండ్ల గుత్తిలోని ద్రాక్ష పళ్ళన్నీ పచ్చగా గుత్తిగా ఒద్దికగా ఒకే చోట ఉండటం పొడుపు కథ. ద్రాక్ష పళ్ళన్నీ చిలకలుగా వాటిని కలుపుతూ ఉన్న ఒకే తొడిమ ముక్కుగా సృష్తికర్త భావం. అందుకే దీనిని విడుపు ద్రాక్ష గుత్తి అంటుంటారు.
నూరు నోములు ఒక్క రంకుతో సరి
మార్చునూరు మాటలు ఒక వ్రాతకు సరికావు
మార్చునూరేళ్ళు వచ్చినా నుదుటి వ్రాతే గతి
మార్చునూఱు వ్రతములు ఒకఱంకుతో పోయినట్లు
మార్చులక్షసద్గుణములను ఒక దోషము తుడిచివేయును. "నూఱు వ్రతములు ఒకఱంకుతో పోయినట్లు" అని తెనుఁగు సామెత. కడవెఁడు పాలు ఒకవిషబిందువుతో పాడయినట్లు. ఏకోఽపి హన్తి గుణలక్ష మపీహ దోషః సంస్కృత న్యాయములు
నెత్తిన రూక పెట్టినా కాసుకు కొరగాడు
మార్చునెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది
మార్చుతన క్రింది వారితొ కొంత కఠినంగా వ్వవరిస్తేనె సంస్థ అభివృద్ధి చెందు తుందని అర్థం.
నెత్తీబోడి తిత్తీబోడి, తిరుపతికెందుకు?
మార్చునెమలికంటిలో నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు
మార్చునెమలిని చూచి కుక్క నాట్యమాడినట్లు
మార్చునెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట
మార్చునెయ్యానికైనా - వియ్యానికైనా - కయ్యానికైనా సమానంగావుండాలి
మార్చునెల తక్కువైనా రాజింట పుట్టాలి
మార్చునెల తక్కువైనా మగవాడిగా పుట్టాలి
మార్చునెల బాలుడికి నూలు పోగన్నట్లు
మార్చునేడు చస్తే రేపటికి రెండు
మార్చునేతి కుండను నేలబెట్టి, ఉత్త కుండను ఉట్టి మీద పెట్టినట్లు
మార్చునేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు
మార్చుపేరుకేగాని అసలు సరకు లేదనే అర్థంలో ఈ సామెత చెప్తారు. నేతి బీరకాయలో నెయ్యి లేదు, మైసూరు పాకులో మైసూరు లేదు.
నేతిబీరలో నేతి చందంలా
మార్చునేతిబీర అనేది ఒక బీరకాయ రకము. పేరుకే ఇందులో నేతి అని ఉంది కానీ బీరకాయలో నెయ్యి (నేతి) ఉండదు. కేవలం పేరుకే ఏదైనా ఉంటే దాన్ని నేతి బీరకాయలో నేతి చందానా అంటారు.
- గొప్ప కోసం కబుర్లు చెప్పేవార గురించి నీతి బీరకాయ కబుర్లు చెపుతాడు అంటారు.
నేను పుట్టకపోతే నువ్వెవరిని పెళ్ళి చేసుకునేవాడివని అడిగితే, నీతల్లిని పెళ్ళాడేవాడిని అన్నాడట
మార్చునేను వెళితే లేదుగానీ నా పేర చీటీ పంపితే పని జరుగుతుందా?
మార్చునేల విడిచి సాము చేసినట్లు
మార్చుఅసాద్యమని అర్థము
నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు
మార్చుఇక్కడ "నోటికి అదుపు" అన్న మాటకు రండు అర్ధాలు తీసుకొనవచ్చును. ఒకటి నోటితో మనము ఏది మాట్లాడినా ఎంత పడితే అంత మాట మాట్లాడ రాదు ఐతే సందర్భానికి తగినట్లుగా ఆలోచించి మాట్లాడాలి.రెండవది నోటితో మనము తినేది తగినంత కన్నా ఎక్కువ తిన రాదు. అలా చేయకున్న అది మనిషికి చేటు తెచ్చును. అలాగే ఇంటిలోని వారికి కూడా పొదుపు వుండాలి. అది లేకపొయిన మొత్తం కుటంబానికే కాక వారి తరువాతి తరాల వారికి కూడా మంచిది కాదు.
నేలచూపు పోతే వాలుచూపు సై అంటుంది
మార్చునేలది తీసి నెత్తికి రాసుకున్నట్లు
మార్చునేలరాయి నెత్తికెత్తుకున్నట్లు
మార్చునేల విడిచి సాము - నీరు విడిచి ఈత
మార్చునేర్చి చెప్పిన మాట నెరవాది మాట
మార్చునేర్చినమ్మ ఏడ్చినా బాగానే వుంటుంది
మార్చునేర్చిన బుద్ధి ఏడ్చినా పోదు
మార్చునేసేవాణ్ని నమ్ముకుని పొలిమేర జగడం ఒప్పుకోరాదు
మార్చునొప్పించక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు
మార్చుఇది సుమతీ శతక పద్య భాగము.
నొసట నామాలు - నోట్లో బూతులు
మార్చునొసట వ్రాసిన వ్రాతని చెరిపే దెవరు?
మార్చునోటి తీట పొట్టకు చేటు
మార్చునోటితో లేదనేది చేతితో లేదంటే సరి
మార్చునోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించినట్లు
మార్చునోట్లో నువ్వుగింజ దాగదు
మార్చునోట్లో ముద్ద గూట్లో దీపం
మార్చునోట్లో వేలు పెట్టినా కరవలేని నంగనాచి
మార్చునోరు అప్పాల పిండి - చెయ్యి బలుసు ముల్లు
మార్చునోరున్న తలగాచును
మార్చునోరున్నవాడిదే రాజ్యం
మార్చునోరుంటే ఊరుంటుంది
మార్చునోరు చేసే అఘాయిత్యాన్ని పొట్ట భరించలేదు
మార్చునోరు నవ్వటం - నొసలు వెక్కిరించటం
మార్చుమనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడే వారినుద్దేశించి ఈ సామెత వాడతారు
నోరు మూస్తే మూగ - నోరు తెరిస్తే గయ్యాళి
మార్చునోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
మార్చుతాను మంచిగా వుంటే ఎదుటివారుకూడ మంచిగానె వుంటారని అర్థం. అందరూ స్నేహ భావంతో వుండాలని అర్థం ఈ సామెతలో ఉంది.
నొసట పళ్ళు - నోట్లో కళ్ళు లేవు
మార్చునోరు మాట్లాడుతుంది... నొసలు వెక్కిరిస్తుంది
మార్చుమనసులో ఒకటి పెట్టుకొని, పైకి మరొకటి మాట్లాడె వారినిగురించి ఈ మాట పుట్టినది.
- ↑ లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం