- అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.

భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

ఆంగ్ల భాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.

జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.

సచ్చింది గొర్రె

మార్చు

ఇదొ ఊత పధం: చాల సందర్భాలలో దీన్ని వాడతారు.

సచ్చి చెడీ

మార్చు

చాల కష్టపడి అని అర్థం.. ఉదా: వాడు ఎట్టకేలక్లు సచ్చీ చెడి వచ్చాడు.

సత్యహరిశ్చంద్రుడు

మార్చు

సన్నాయి నొక్కులు నొక్కు తున్నారు

మార్చు

సన్యాసి పళ్ళు

మార్చు

సప్తమీ విభక్తి

మార్చు

స్వస్తి పలకడం

మార్చు

ముగింపు చెప్పడం. స్వస్తి చెప్పడం; = ఉదా: వారు ఆ పనికి స్వస్తి పలికి వెళ్లి పోయారు.

సంపాతి జటాయువులు

మార్చు

స్తన - శల్య పరీక్ష

మార్చు

సరకులు నిండు కున్నాయ

మార్చు

సరకులు అయి పోయాయని అర్థం: ఉదా: ఇంట్లో సరకులన్నీ నిండు కున్నాయి

సర్వం జగన్నాథం

మార్చు

జగన్నాథుడు కొలువుండే పూరీ క్షేత్రంలో అన్ని కులాల వారూ ఆ దేవుడి ముందు సమానమే. అక్కడ ఒకే విస్తరిలో అందరూ కలిసి ప్రసాదం తింటారు.

సర్వభక్షకుడు

మార్చు

అగ్నిదేవుడు, లంచం తీసుకొనే వాడు

సర్వమంగళం

మార్చు

సమస్యేలేదు

మార్చు

ఏమాత్రం వీలు కాదు అని అర్థం: ఉదా: నేనక్కడికి వచ్చే సమస్యే లేదు.

సముద్రంలో కాకి రెట్ట

మార్చు

సముద్రంలో కాకి రెట్ట పడినంత మాత్రాన ఆ నీరు కలుషితం కావు. అటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఇలాంటిదే మరొకటి వున్నది: అది: సముద్రంలో ఇంగువ కలిసినట్లు;

సముద్రంలో ఇంగువ కలిసినట్టు

మార్చు

చాల స్వల్పమైనదని అర్థం:

సమర్పయామి

మార్చు

పూర్తిగా ఇచ్చివేయడం: ఉదా: వాడు ఆ పనికి లంచం సమర్పించుకున్నాడు.

ససేమిరా

మార్చు

సంస్కృతంలోని పంచతంత్రంలో ఈ మాట కనిపిస్తుంది. ఒక రాజకుమారుడు అడవికి వెళ్లి పెద్ద పులి వచ్చేసరికి భయంతో చెట్టుపైకి ఎక్కాడు. ఆ చెట్టుమీద అంతకుముందే ఉన్న ఎలుగుబంటు భయపడకు అని అతనికి ఆశ్రయం ఇచ్చింది. చెట్టుకింద ఉన్న పులి చెట్టు ఎక్కలేక, ఆ ఎలుగుబంటును కిందకి తోసి తన ఆకలి తీర్చమని, ఆలా చేస్తే రాజకుమారుడిని తను ఏమీ చేయనని చెప్పింది. రాజకుమారుడు ఎలుగుబంటును కిందకి తోసేసాడు. అయితే ఆ ఎలుగు అదృష్టం బాగుండి, కొమ్మలను పట్టుకుని కిందపడకుండా ప్రాణాలు కాపాడుకుంది. తనకు నమ్మకద్రోహం చేసిన రాజకుమారుడు తన గతం అంతా మర్చిపోతాడని శపించింది. రాజుగారు అడవిలో వెతికించి రాజకుమారుడిని కోటలోకి చేర్చాడు. కానీ అతను ససేమిరా అనే మాట తప్ప మరొక మాట మాట్లాడేవాడు కాదు. తరువాత మంత్రి ద్వారా జరిగిన విషయం తెలుసుకుంటూ ఉండగా ఆ విషయాలన్నీ రాజకుమారుడు కూడా వింటూ ససేమిరా, సేమిరా, మిరా, రా అంటూ ఒక్కో మాటతో పూర్వ స్థితికి వచ్చాడుట. ఈ గాథ క్రమంగా జనవ్యాప్తిపొంది కథలో శాప ఫలితం వల్ల కాక రాజు కొడుకు మొండితనం వల్ల, అజ్ఞానం వల్ల ససే మిరా అనేవాడని భావించి, ఏం చెప్పినా, ఎవరు చెప్పినా వినని వాడిని ససేమిరా ఒప్పుకోడని చెప్పడం జాతీయంగా మారింది.

సంకనెక్కాడు

మార్చు

ప్రేమ ఎక్కువైతే ఈమాట వాడతారు: ఉదా: వాడు గురువు గారి సంకనెక్కాడు.

సంకెళ్లుతెగడం

మార్చు

అడ్డంకులు తొలగడం: ఉదా: వాడి సంకెళ్లు ఈ నాటికి తెగి పొయాయి. ఇక వానికేఅడ్డంకి లేదు

సంకెళ్ళు వేయటం

మార్చు

నిరోధించటం కదలనివ్వని పరిస్థితి

సంతలో చింతపండు

మార్చు

తనకంటూ ప్రత్యేకత ఏమీ లేనిది

సంత గోల

మార్చు

ఎక్కువగా అల్లరి చేస్తుంటే ఈ మాట వాడతారు. ఉదా: సంత గోల లాగ వున్నది. అందరు కొంత సేపు నిశ్శబ్దంగా వుండండి.

సంతాన గోపాలుడు

మార్చు

సంపతి కుంటు

మార్చు

సందట్లో సమారాధన

మార్చు

అవకాశం చూసి తమపని నెరవేర్చుకోవడం

సచ్చింది గొర్రె

మార్చు

ఇదొక ఊత పదము. ఏదైనా కాస్త నిరుత్సాహానికి గురైతే..... సచ్చింది గొర్రె అని అంటుంటరు.

సర్రలు కొయ్యటం

మార్చు

సొర్రకాయలు కోయటం.గొప్పలు చెప్పుకోవటం, కోతలు కోయటం

ఎక్కువ వేడిగా కాగటం.కోపంతో ఉండటం. ఉదా: నీళ్లు సల సల కాగుతున్నాయి.

స్వయంపాకం

మార్చు

స్వస్తి పలికారు

మార్చు

ఇంతటితో వదిలేశారు అని అర్థం: ఉదా: ఆ పనికి వారు స్వస్తి పలికారు.

సాగ దీయకు

మార్చు

ఇంకా పొడిగించకు అని అర్థం: ఉదా: ఇక ఆపెయ్. దాన్ని ఇంకా సాగదీయకు.

సాగ నంపాలి

మార్చు

పంపించి వేయాలి అని అర్థం: ఉదా: వాడిని సాగనంపాలి.

స్థాలీపులాకం

మార్చు

సారథి

మార్చు

నాయకుడు రథాన్ని తోలేవాడు == ఉదా: ఈ వ్వవహారంలో సారధి వాడె.

సారస్యపుతాడు

మార్చు

సాల్ తీ

మార్చు

ఇదొక ఊత పదం: చాల సందర్బాలలో దీని వాడుతారు.

సాలి గూట్లో చిక్కుకున్నాడు

మార్చు

కష్టాలలో ఇరుక్కున్నాడని అర్థం:.

స్థాలీపులాక న్యాయం

మార్చు

అన్నం అంతా చూడక్కర్లేదు. ఒక్క మెతుకును పట్టిచూస్తే చాలు.స్థూలంగా పరిశీలించినా సులభంగా విషయమంతా అర్థమయ్యే పరిస్థితి.

సావాస ధోషం

మార్చు

ఉదా: ఆర్నెల్లు వానితో కలిసి వుంటే వాడు వీడౌతాడంటారు. ఆ సందర్భంలో ఈ మాట పుట్టింది. ఆర్నెల్లు సావాసం చేస్తే వాడు వీడౌతారంటారు.

సిగపట్లు

మార్చు

అభిప్రాయ భేదాలు జుట్టు జుట్టు పట్టుకొని తన్నుకొనేదాక రావటం

సిడిపోతు

మార్చు

ఏ పనీ చేయకుండా వూరక వూరి మీద పడి తింటూ తిరిగే వాడు.గ్రామదేవతకు సమర్పించేందుకు నిర్దేశించిన గొర్రెపోతును వూరివారంతా తెగ మేపుతుంటారు.

సింగడుబూరడు

మార్చు

సింగన్న ప్రయాణం

మార్చు

సింగరాజు లింగరాజు

మార్చు

సింగి నాధం జీల కర్ర

మార్చు

చాల చిన్న విషయం అని అర్థం: వివరణ: గతంలో ఓడ రేవులలో సరుకులతో ఒక ఓడ రేవుకు వచ్చిందంటే దాని రాకను తెలియ జేస్తూ శంఖారావం లాంటి శబ్దం చేసే వారు. దాంతో ప్రజలు, వ్వాపారస్తులు పొలోమని ఓడ వద్దకు వెళ్లి తమకు కావలసిన వస్తువులను తెచ్చుకునె వారు. ఓడ రాకను తెలియచేసేదే సింగి నాదం ఒక ఓడ రేవులో అన్నీ సార్లు జీలకర్రే వచ్చేది. సింగి నాధం వినపడినా ప్రజలు ఓడ వద్దకు వెళ్లే వారు కాదు. ఆ.... ఏ ముంది జీల కర్రే గదా..... అని అనుకుని మిన్నకుండి పోయే వారు. ఆ విధంగా పుట్టినదే ఈ మాట.... సింగినాధం జీలకర్ర.

సింహ తలాటాలు తగిలించటం

మార్చు

ప్రతిభను గుర్తించి సన్మానించటం.రెండువైపులా సింహపు తలల్లా బొమ్మలు ఉండే బోలు కడియాన్ని తొడిగి సత్కరిస్తారు.

సింహనాదం చేయడం

మార్చు

తీవ్రంగా విమర్శించడం, తిరుగుబాటు చేయడం

సింహ బలుడు

మార్చు

గొప్ప భలవంతుడు అని అర్థం. (ఇది జాతీయం కాదేమో?)

సింహావలోకనం

మార్చు

ఒక విషయానికి సంబంధించిన పూర్వాపరాలన్నింటినీ జాగ్రత్తగా ఆలోచించడం

సింహ భాగం

మార్చు

పెద్ద భాగమని అర్థం: ఉదా: ఈ వేటలో వానిదే సింహ భాగం.

సిడిపోతు

మార్చు

సిరి పోయినా చిన్నెలు పోనట్టు

మార్చు

సిరి సంపదలను కోల్పోయినా జీవనశైలి మారకపోవటం.పదవులను కోల్పోయినా, అధికారాలు అంతరించినా డాబు, దర్పం ప్రదర్శించటం.

సుగ్రీవాజ్ఞ

మార్చు

తిరుగు లేనిది అనే అర్థంలో వాడుతారు.

సున్నా చుట్టడం

మార్చు

నిలిపివేయడం . చెయ్యాల్సిన పనులన్నిటినీ ఒక వరుసక్రమంలో రాసుకుని ఏది ముందు, ఏది వెనుక చేయాలి, దేన్ని చెయ్యకుండా వదిలేయాలి అని ఆలోచించేటప్పుడు చెయ్యకుండా వదిలేయాల్సిన పని దగ్గర సున్నా చుట్టడం ఓ అలవాటు

సున్నం ఒకడికి వెన్న ఇంకొకడికి

మార్చు

ఆశ్రిత పక్షపాత ధోరణి.తన వారికే అన్నీ సమకూర్చుకుంటూ ఇతరులను ఇబ్బందులపాలు చేయటం

సుడిగాలి పర్యటన

మార్చు

ఆకస్మిక పర్యటన . ఎక్కడా ఎక్కువసేపు నిలవకుండా పర్యటన

సుత్తి కొడుతున్నాడు

మార్చు

అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతుంటే వాడి ఇలా అంటారు. ఉదా: నీసుత్తి కొట్టుడు భరించలేను ఇక ఆపెయి.

సుదర్శన చక్రం

మార్చు

తిరుగులేనిది == వాడి మాటంటే సుదర్శనం చక్రమే.

సుద్దులు చెప్పుతున్నారు

మార్చు

నీతులు చెప్పడం: తాను చేసేది మంచి పనులు కాకున్నా ఇతరులకు నీతులు చెప్పే వారిని గురించి ఇలా అంటారు. ఉదా: వాడు పెద్ద సుద్దులు చెప్పొచ్చాడు. వాడి బాగోతం ఎవరికి తెలియదు.

సుమతీ శతకం చెప్పటం

మార్చు

నీతులు బోధించటం = వాడు సుమతి శతకం చెపుతున్నాడు.

సుబ్బారాయుడు

మార్చు

సుబ్బారావు

మార్చు

సుందోపసుందులు

మార్చు

సూటి పోటి మాటలంటున్నారు

మార్చు

ఎత్తి పొడుపు మాటలు అంటున్నారని అర్థం: ఉదా: వాని సూటి పోటి మాటలు విన్నావా?

సూరేకారం

మార్చు

సురసురలాడుతూ త్వరగా మండే లక్షణాలున్నవాడు = ఉదా: వాడు సురె కారం లాంటి వాడు.ఉట్టిగనె కోపం వస్తుంది.

సూత్రధారి

మార్చు

ప్రధాన కారకుడు, ప్రధాన వ్యక్తి . నాటక ప్రదర్శనలో నాయికా నాయకులు, ప్రతినాయకుడు, విదూషకుడు...ఎంత మంది ఉన్నా వారందరినీ ఎవరు ఎప్పుడు ఏం చెయ్యాలో నిర్దేశించి చెప్పేవాడు సూత్రధారుడు.

స్నానం

మార్చు

స్థూలారుంధతి

మార్చు

సూదిమొన మోపినంత

మార్చు

అత్యంత అల్పం. కౌరవ సభలో ధుర్యోధనుడు పాండవులకు సూది మొన మోపినంత స్థలం కూడ ఇవ్వనన్నాడు.

సూరమ్మ మొగుడు

మార్చు

ప్రత్యేక గుర్తింపు లేని వాడు. ఉదా: ఎవడో సూరమ్మ మొగుడు వచ్చాడు ఎవరికేంతెలుసు.

సొప్ప దంటు ప్రశ్నలు వేస్తున్నారు

మార్చు

చెత్త ప్రశ్నలు వేస్తున్నారు.. ఉదా: పిల్లలూ సొప్ప దంటు ప్రశ్నలు వేయకండి రా?

సొమ్ముపోయి దిమ్ముపట్టినట్టు

మార్చు

నష్టం కలగడం, పెట్టుబడిసొమ్మంతా నష్టమై మానసికంగా వ్యధ మిగలటం.

సొరకాయలు బాగా కోస్తున్నాడు

మార్చు

తన గురించి గొప్పలు చెప్పుకోవడము... కోతలు కోయడం. ఉదా: వాడు సొరకాయలు బాగా కోస్తాడు. వాని మాటలు నమ్మకండి.

సొంగ కార్చుకుంటున్నాడు

మార్చు

చాల ఆశగా చూస్తున్నాడని అర్థం: ఉదా: చూడు వాడు ఆ అమ్మాయిలను చూసి ఎలా సొంగ కారుస్తున్నాడో.

సొంత గూటికి చేరుకున్నారు

మార్చు

తమ ఇంటికి వచ్చారని అర్థం: ఉదా: తుపానుకు చెల్లాచెదురైన ప్రజలు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.

సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు

మార్చు

తన గురించి తానె గొప్పలు చెప్పుకోవడం: ఉదా: వానికి అసలు లేదు గాని సొంత డబ్బా బాగా కొట్టుకుంటాడు.

సోది చెప్పుతున్నాడు

మార్చు

అనవసరపు విషయాలను చెప్పుతున్నాడు: ఉదా: వాడు ఒట్టి సోది చెప్పుతున్నాడు.

సోదిలోక్కూడా రాకపోవటం

మార్చు

ఆనవాలు ఏమాత్రం లేకపోవటం .సోదిలోకి మరణించినవారు, దేవతలు వస్తూ ఉంటారు.సోదిలో పోయిన వస్తువుల గురించి తెలుసుకుంటారు.అలాంటి సోదిలోకి కూడా రాకుండా పోవటమంటే సంపూర్ణంగా ఏమాత్రం ఆనవాళ్ళు లేకుండా నశించటం

సోపు రాస్తున్నాడు

మార్చు

మస్కా కొడుతున్నాడు, ములగ చెట్టెక్కిస్తున్నాడు, చార్మీనార్ ఎక్కిస్తున్నాడు, పైకి లేపుతున్నాడు, .... ఇవన్ని ఒకే అర్థాన్ని ఇస్తాయి. వీటన్నింటికి అర్థం ఎదుటి వాడి మెప్పు పొందడానికి అతన్ని పొగడడము.

సౌబరిన్యాయం

మార్చు

ఒక వ్యక్తి ఒకే సమయంలో అనేక ప్రాంతాలలో ఉండటం. మాంధాత చక్రవర్తి కుమార్తెలు అందరినీ సౌబరి అనే ఋషి పెళ్ళాడి భార్యలందరి దగ్గర ఒకే సమయంలో ఒక్కొక్కడిగా ఉంటూ ఉండేవాడట.పరమాత్ముడు ఒకడే అనేక శరీరాలను ఆశ్రయించుకొని ఉండటం సౌబరిన్యాయం.