భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "ద" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

దంచలేనమ్మ ఊదూది చూచిందట

మార్చు

దాహం వేసినపుడే, బావి తవ్వుకున్నట్లు.

మార్చు

దంచినమ్మకు బొక్కిందే కూలిట

మార్చు

దంచేదొకరైతే ప్రక్కలెగరేసే వాడింకొకడు

మార్చు

దండించేదాత లేకుంటే, తమ్ముడు చండప్రచండుడు

మార్చు

దండుగలో దండుగ

మార్చు

దంపినమ్మకు బొక్కిందే దక్కుడు

మార్చు

దంపుళ్ళ పాటకు దరిద్రం లేదు

మార్చు

దగ్గరకు పిలిచి నీ కన్ను గుడ్డి అన్నట్లు

మార్చు

దగ్గరకు వస్తే ఎగ్గు లెంచినట్లు

మార్చు

దగ్గర వాళ్ళకే నిక్కు లెక్కువ

మార్చు

దగ్గూ, గజ్జీ దాచినా దాగవు

మార్చు

దగ్గుతూ పోతే సొంటి కూడ ప్రియమే

మార్చు

దడియం గురువుకు మణుగు శిష్యుడు

మార్చు

దత్తత మీద ప్రేమా? దాయాది మీద ప్రేమా?

మార్చు

దప్పిక కొన్నప్పుడు బావి త్రవ్వినట్లు

మార్చు

దమ్మిడీ ఆదాయం లేదు క్షణం తీరికలేదు

మార్చు

దమ్మిడీ పెళ్ళికి ఏగానీ బోగం మేళం

మార్చు

దమ్మిడీ ముండకు ఏగానీ క్షవరం

మార్చు

దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట

మార్చు

దయలేని అత్తకు దణ్ణం పెట్టినా తప్పే - లేకున్నా తప్పే

మార్చు

దయ్యాలతో చెలిమి చేసినట్లు

మార్చు

దరిద్రానికి మించిన బాధ లేదు

మార్చు

దరిద్రానికి మాటలు హెచ్చు - తద్దినానికి కూరలు హెచ్చు

మార్చు

దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

మార్చు

దరిద్రుడైన వ్యక్తి పెళ్ళికి పూనుకోవడమే కష్టం. దానికి తోడు వడగళ్ళ వాన పడితే ఆ పెళ్ళి ప్రయత్నాలు కాస్తా చెడుతాయి. అదే విధంగా ఎవరైనా తమ తలకు మించిన పనికి పూనుకున్నప్పుడు వారికి మరిన్ని అవరోధాలు ఎదురైతే వారి పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు.

దరిద్రుడికి అంటనప్పుడు ఆముదం రాచినా అంటదు

మార్చు

దరిద్రుడికి ఏరేవు కెళ్ళినా ముళ్ళపరిగే

మార్చు

దరిద్రుడికి పిల్లలెక్కువ

మార్చు

దరిద్రుడి చేనుకు వడగండ్ల వాన

మార్చు

దరిద్రుడు తలగడుగబోతే వడగండ్ల వాన కురిసిందట

మార్చు

దరిద్రునికి దైవమే తోడు

మార్చు

దరిలేని బావి - వితరణలేని ఈవి

మార్చు

దర్జీవానిని చూస్తే సాలెవానికి కోపం

మార్చు

దశకొద్దీ దొరికాడు దిసిమొల మొగుడు

మార్చు

దశకొద్దీ పురుషుడు - దానం కొద్దీ బిడ్డలు

మార్చు

దశ దానాలకూ తోటకూర కట్టే

మార్చు

దశ వస్తే దిశ కుదురుతుంది

మార్చు

దానం చేయని చెయ్యి... కాయలు కాయని చెట్టు...

మార్చు

దాగబోయి తలారి యింట్లో దూరినట్లు

మార్చు

దాగబోయిన చోట దయ్యాలు పట్టుకున్నట్లు

మార్చు

దానం చేయని చెయ్యీ - కాయలు కాయని చెట్టూ ఒక్కటే

మార్చు

దానాలలోకెల్లా విద్యాదానం శ్రేష్ఠం

మార్చు

దాన్ని నమ్ముకొని దడి కింద దాక్కొని వుంటే ఈదుర గాలికి ఇచ్చుకొని చచ్చాడట

మార్చు

ఎవరో ఏదో ఇస్తారని ఆశపడి పడిగాపులు పడే వారి గురించి చెప్పే సామెత ఇది.

దాయాది వుంటే నిప్పెందుకు?

మార్చు

దారం లేని సూదిని దయ్య మెత్తుకుపోతుంది

మార్చు

దాసుని తప్పు దండంతో సరి

మార్చు

దారిన పోయె కంపను ముడ్డికి తగిలించు కొన్నట్లు....

మార్చు

అనవసరమైన విషయాలలో తల దూర్చి కష్టాలను కొని తెచ్చుకొనే వారిని ఇలా అంటారు.

దారిన దొరికింది ధర్మానికి పోయింది

మార్చు

దారినపోయే తద్దినాన్ని పిలిచి నెత్తి కెక్కించుకున్నట్లు

మార్చు

దారినిపోయే శనీశ్వరాన్ని పిలిచి పీట వేసినట్లు

మార్చు

దాలి గుంటలో కుక్క మాదిరి

మార్చు

దాసరిపాట్లు దైవాని కెరుక

మార్చు

దాసుని తప్పు దండంతో సరి

మార్చు

దింపుడు కళ్ళాశ

మార్చు

దిక్కులేనివారికి దేవుడే దిక్కు

మార్చు

మనకు సహాయం అవసరమయినప్పుడు ఎవరి సహాయం అందకపొతే ఆ దేవుడి మీదే భారం వేయమని దీని అర్థం.

దిక్కు లేని యిల్లు దయ్యాల నిలయం

మార్చు

దిగంబర సన్న్యాసికి చాకలెందుకు?

మార్చు

దిగితేనేగాని లోతు తెలియదు

మార్చు

సాధారణంగా ఏదైనా చెరువునిగాని మడుగునిగాని బయటినుండి చూసి లోతు అంచనా వేయలేము. అలాగే ఏ విషయమైనా మనం స్వయంగా పాల్గొంటేగాని అందులోని సాధక బాధకాలు తెలీవని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.

దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు

మార్చు

ప్రతి రోజు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో వున్నప్పుడు ఏ రోజుకారోజు ..... ప్రాణాపాయం తప్పిందని బయట పడ్డామని సంతోష పడేవారి నుద్దేసించి ఈ సామెత వాడతారు.

దినబత్తెం దివిటీ వెలగు

మార్చు

దినమూ చచ్చేవాడికి ఏడ్చే దెవరు?

మార్చు

దిబ్బ మీద కూర్చొని మేడమీదున్నట్లు కలలు కనడం

మార్చు

ఎవరి స్థాయికి తగ్గ కోరికలు వారు కోరాలని హితవు చెప్పే సామెత ఇది.

దీని సిగ తరగ

మార్చు

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి

మార్చు

దీపం కాంతులను వెదజల్లుతున్నప్పుడు ఆ వెలుగులో మన పనులను చక్కపెట్టుకుంటాం, కాంతి తోలగిపోతె ఎ పని చేయలేము. అంటే ఏ సమయానికి ఏం చేయాలో ఆలోచించుకొని ఆలస్యం చేయకుండ మనిషి జీవితాన్ని సాగించాలని ఈ సామెత పరమార్దం.

దివిటీ ముందు దీపం పెట్టినట్లు

మార్చు

దీపం ఆరిన తర్వాత దినుసంతా ఒక్కటే

మార్చు

దీపం పేరు చెబితే చీకటి పోతుందా?

మార్చు

దీపం ముడ్డి క్రిందనే చీకటి

మార్చు

దీపావళికి దీపమంత చలి

మార్చు

దీపావళికి వర్షాలు ద్వీపాంతరాలు దాటుతాయి

మార్చు

దుంగ దించి బండ నెత్తుకొన్నట్లు

మార్చు

దుంపతెంచి గంపకెత్తినట్లు

మార్చు

దుక్కి కొద్ది పంట .... బుద్ది కొద్ది సుఖము

మార్చు

దుక్కి వుంటే దిక్కు వుంటుంది

మార్చు

దుక్కికాని చేను తాలింపులేని కూర

మార్చు

దుక్కికొద్దీ పంట - బుద్ధి కొద్దీ సుఖం

మార్చు

దుక్కి చాలని చేనుకు ఎరువు ఎంత పెట్టినా వట్టిదే

మార్చు

దుక్కిటెద్దు చావు పక్కలో పెళ్ళాం చావు వంటిది

మార్చు

దుక్కి దున్నితేనే భూమికి శాంతం

మార్చు

దుగ్గాణి ముండకు దుడ్డు క్షౌరం

మార్చు

దుత్తకు పాల రుచి తెలుసా?

మార్చు

దున్నకుండా చల్లితే కొయ్యకుండా పండినట్లు

మార్చు

దున్నగలిగేవాడికే ధరణి దీవెన

మార్చు

దున్న గలిగితేనే మన్ను ముట్టుకోవాలి

మార్చు

దున్నటం ఎవడైనా దున్నుతాడు - పంట పండించేవాడే కావాలి నాకు అందిట

మార్చు

దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట

మార్చు

దున్నపోతు ఈనదు. ఎవరైనా అది ఈనిందంటే దూడను కట్టెయ్యమనడం అసందర్భ ప్రలాపన. అంటే ఎవరైనా ఒక అసందర్భమైన విషయాన్ని చెప్పినపుడు మరొకరు దానితో ఏకీభవించడం లేదా సమ్మతించడం జరిగితే ఈ సామెతను ఉపయోగిస్తాం.

దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టు

మార్చు

దున్న పోతు మీద వాన పడితే దానికి చాల హాయిగా వుంటుంది. అంతవరకు కాస్తనన్నా తొందరగా నడిచేది వర్షంలో అసలు నడవదు. అనా నిదానంగా పనిచేసే వారి గురించి ఈ సామెత వాడతారు.

దున్నపోతు మీద వాన కురిసినట్లు

మార్చు

దున్నపోతు మీద వానకురిసినట్లు

మార్చు

దున్నపోతు మీద ఎంత వాన కురిసినా వాటికి ఏమీ పట్టదు. అలాగే ఎంత చెప్పినా వినక పోయే వారిని ఈ సామెతతో పోలుస్తారు.

దున్నబోతె దూడల్లో... మేయ బోతె ఎద్దుల్లో

మార్చు

వివరణ: ఇంకా పని నేర్వని పెద్ద కోడెదూడ పని తప్పించుకోవడానికి.... దున్నబోతె తాను దూడనంటూ దూడల్లో కలిసి పోతుంది..... మేతకు వెళ్లేటప్పుడు పనిచేసె ఎద్దులకు మంచి మేత పెడతారు గనుక ఆమేత కొరకు ఎద్దులతో వెళ్లుతుంది.... ఎవరన్నా పని చేయకుండా తిని కూర్చుంటే ఈ సామెతను వాడతారు.

దున్నుతూ వుంటే నాగళ్ళు - పారుతూ వుంటే నీళ్ళు

మార్చు

దున్నే ఎద్దులకు నక్కలను చూపి నట్లు

మార్చు

పని చేసుకునే వారి పనిని చెడగొట్టే వారి గురించి సామెత పుట్టింది. దున్నె ఎద్దులకు నక్కలను చూపితె అవి బెదిరి పనికి ఆటంకం కలుగుతుంది. పని చెడగొట్టే వారి గురించి ఈ సామెత వాడతారు.

దున్నే ఎద్దునే పొడిచేది

మార్చు

దున్నేవాడు లెక్కలేసుకుంటే నాగలికూడా మిగలదు

మార్చు

వ్యవసాయం అంత లాభదాయకం కాదు అనే ఆర్థంలో ఈ సామెతను వాడుతారు.

దున్నేవానికి దడవనా తొక్కేవానికి వెరవనా అన్నదట

మార్చు

దురాశ దుఃఖానికి చేటు

మార్చు

అత్యాశ ఎప్పటికైనా కష్టం కలిగిస్తుందని తెలియ జెప్పడం.

దుర్మార్గానికి తండ్రి బద్ధకం

మార్చు

దుష్టులకు దూరంగా ఉండాలి

మార్చు

దూకుతా దూకుతానన్న సవితే కానీ దూకిన్నా సవితి లేదు

మార్చు

ఊరికూరికే బెదిరిస్తూ అది నిజంగా చేసి చూపని వాళ్ళని సూచిస్తూ వచ్చిన సామెత ఇది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన బాపూరమణల చిత్రం "అందాల రాముడు"లో దీనిని వాడుకున్నారు.

దూకు దూకుమనే వాళ్ళేగానీ, దూకే వాడు ఒక్కడూ లేడు

మార్చు

దూరపుకొ౦డలు నునుపు

మార్చు

దూరాంగా కనిపించే కొండలు నునుపుగానే కనిపిస్తాయి. కొండలమీదున్న ఎగుడుదిగుడు ప్రదేశలు, పెద్ద రాళ్ళు, వృక్షాలు అన్ని కలిపి చదునుగానె కనిపిస్తాయి. దగ్గరికి పోతే గాని అసలు సంగతి తెలియదు. ఏదైనా అంతే.. దగ్గరికిపోతేగాని అసలు సంగతి కనబడడు. ఆ ఉద్దేశంతో చెప్పినదే ఈ సామెత.

దూబర తిండికి తూమెడు

మార్చు

దూస్తే దోసెడు - ఊదితే హుళక్కి

మార్చు

దీపంపేరు చెబితే చీకటి పారిపోతుందా?

మార్చు

దెబ్బకు దెయ్యమైనా వదులుతుంది

మార్చు

మాటలకు లొంగని వారు దెబ్బలకు లొంగుతారని చెప్పే సామెత ఇది.

దెబ్బకు దేవుడైనా దిగి వస్తాడు

మార్చు

మంచి మాటలతోకాకపోతే దెబ్బలతో పని జరిపించ వచ్చని ఈ సామెత అర్థం.

దెబ్బకొడితే దేవేంద్రలోకం కనబడాలి

మార్చు

దేవతలకు దుమ్ము - రాక్షసులకు మన్ను

మార్చు

దేవునికైనా దెబ్బే గురువు

మార్చు

మంచి మాటలతో చెపితే వినని వారు కూడా దెబ్బలకు లొంగు తారని అర్థం.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు

మార్చు

వేదాలు అతి పవిత్రమయినవి. అలాంటి వేదాల్ని దెయ్యాల వల్లిస్తుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో అలానే దుర్మార్గులు, మూర్ఖులు ఇతరులకు సన్మార్గబోధ చేస్తుంటే మనకు విచిత్రంగానే ఉంటుంది. దీనినే దెయ్యాలు వేదాల వల్లించినట్లు అంటారు.

దేవర చిత్తం - దాసుడి భాగ్యం

మార్చు

దేవర తలిస్తే దెబ్బలకు కొదువా?

మార్చు

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అనే సామెత లాంటిదే ఇదీను.

దేవుడని మ్రొక్కితే దయ్యమై పట్టినట్లు

మార్చు

దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

మార్చు

దేవుడు తలిస్తే సంపదలకు కొదవా?

మార్చు

దేవునికి చూపులు - మనకి మేపులు

మార్చు

దేవునికి ముడుపు - దయ్యానికి దెబ్బ

మార్చు

దేవుని పెండ్లికి అందరూ పెద్దలే

మార్చు

గుళ్లో దేవునికి పెళ్ళికి వూరి వారందరు పెద్దలే

దేహి అంటే నాస్తి అనరాదు

మార్చు

దొడ్డివాకిట దయ్యాన్ని తరిమితే, తలవాకిట వచ్చి నిల్చిందట

మార్చు

దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకుపోతే గొడ్డు గేదే శ్రీమహాలక్ష్మి

మార్చు

దొరకని పూలు దేవునికర్పణం

మార్చు

చెల్లని కాసులు దేవునికి అనే సామెత లాంటిదే దీను.

దొరల చిత్తం - చెట్టు నీడ నిలకడ లేనివి

మార్చు

దొరబిడ్డ అయినా ఒకనికి పెండ్లామే

మార్చు

దొరికితే దొంగలు... లేకుంటే దొరలే

మార్చు

ఎక్కడైనా దొంగ తనము చేసిన వాడిని అడిగితే తాను దొంగతనము చేసినట్లు ఒప్పుకొనడు. దొంగతనము చేసినప్పుడు దొరికితేనే అతను దొంగ అని నమ్మకంగా చెప్పగలము. దొరకనంత వరకు అతను దొరే. ఆ సందర్భంలో చెప్పేదె ఈ సామెత.

దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు

మార్చు

అతి నిదానంగా పనిచేసె వారిగురించి ఈ సామెత వాడతారు.

దొంగలు పడ్తారని కొబ్బరి చెట్టుకు మడి బట్ట కట్టిందట

మార్చు

పరమ అమాయకుల గురించి చెప్పే సామెత ఇది.

దొంగకు తేలు కుట్టి నట్లు

మార్చు

దొంగ తనానినికి వెళ్లిన వానికి తేలుకుట్టితే....... నెప్పికి వాడు అరిస్తే.... పట్టు బడి పోతాడు.. నెప్పికి అరవలేకుండా వుండ లేడు...

దొంగకు దొంగే తోడు

మార్చు

దొంగకు తోడు - దొరకు సాక్షి

మార్చు

దొంగకు దొంగ సహవాసం

మార్చు

దొంగకు దొంగబుద్ధి - దొరకు దొరబుద్ధి

మార్చు

దొంగకు దొరికిందే చాలు

మార్చు

దొంగగడ్డి మేసే గొడ్డయినా కట్టుకొయ్య వద్దకు రాక తప్పదు

మార్చు

దొంగకు భయము - లంజకు సిగ్గు లేవు

మార్చు

దొంగ చేతికి తాళ మిచ్చినట్లు

మార్చు

దొంగతనానికి పోతూ డోలు చంకన పెట్టుకుని పోయినట్లు

మార్చు

దొంగపోటు కంటే లింగ పోటెక్కువయిందిట

మార్చు

దొంగ పోయి తలారింట దూరినట్లు

మార్చు

దొంగల సొమ్ము దొరలపాలు

మార్చు

దొంగల సొమ్ము పరులపాలు

మార్చు

దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు

మార్చు

దొంగలూ దొంగలూ కలిసి వూళ్ళు పంచుకున్నట్లు

మార్చు

దొంగిలించపోతే మంగలం దొరికిందట

మార్చు

దొంగలందరూ దుష్టులు కారు - దుష్టులందరూ దొంగలే

మార్చు

దొంగవాడి దృష్టి మూటమీదనే

మార్చు

దొంగవాని తల్లికి ఏడువ భయం

మార్చు

దొంగండీ అంటే ముక్కు కరుస్తాడేమో జాగ్రత్త అన్నాడట

మార్చు

దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు

మార్చు

దొంగాడి పెళ్ళాం ఏనాటికైనా ముండమోపే

మార్చు

దొందూ దొందేరా తొందప్పా

మార్చు

ఎవరో ఇద్దరు మాటలు సరిగ్గా రాని వాళ్ళు మాట్లాడుకుంటుంటే వారిని వెక్కిరిస్తూ మూడవ వ్యక్తి అయిన వాడు వాడి స్నేహితునితో అన్న మాట ఇది "దొందూ దొందేరా తొందప్పా" అని. అసలు వాడు "రెండూ రెండేరా కొండప్పా" అనాలి. కానీ వాడికి కూడా సరిగ్గా అనడానికి నోరు తిరగలేదు. తన చేతకాని తనాన్ని చూసుకోలేని వాడు ఎదుటి వాళ్ళ లోపాలను వెక్కిరించితే వాడే నవ్వుల పాలు అవుతాడు అని నీతిని బోధించే సామెత ఇది.

దోచుకుపోయినవాడు దొర - దొరికినవాడు దొంగ

మార్చు

దోవలో పెట్టి తొక్కొద్దు అన్నట్టుంది

మార్చు

దోసకాయ తిన్న కడుపూ, దొంగలు దోచిన యిల్లూ ఒక్కటే

మార్చు

దోసెడు కాంతులు - వెన్నెల వూసులు

మార్చు

దైవబలం మహాబలం

మార్చు

దైవాన్ని నమ్మి చెడినవాడు లేడు

మార్చు

దౌర్భాగ్యపు దామోదరుడు

మార్చు
  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikibooks.org/w/index.php?title=సామెతలు_-_ద&oldid=34160" నుండి వెలికితీశారు