భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "క్ష" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు

మార్చు

కొంత మంది ఎప్పుడు చూసినా చాలా హడావుడిగా వుంటూ తీరికేలేనట్లే కనిపిస్తారు, కానీ వారు చేసేపని వల్ల కొంచెం కూడా ఉపయోగం ఉండదు. అటువంటి వాళ్ళను ఉద్దేసించి అనేదే ఈ సామెత దీనిలో దమ్మిడీ అంటే అతి తక్కువ ధనం. పాతకాలంలో డబ్బును దమ్మిడీ, కానీ, అర్దణా, అణా ఇలా లెక్కపెట్టేవారు. ఎంత కష్టపడినా ఫలితం రానప్పుడు కూడా ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇలాంటిదే మరో సామెత వున్నది: అరకాసు ఆదాయం లేదు అర గడి తీరుబడి లేదు. కాసు అనగా గతంలో చలామణిలో వున్న ఒక నాణెం.

క్షణం చిత్తం - క్షణం మాయ

మార్చు

క్షణమొక యుగంలా గడిచింది

మార్చు

పొద్దు పోవడం చాల కష్టంగా ఉంది. ఉదా: ఈ నాలుగు రోజులు నాకు క్షణమొక యుగంలా గడిసింది.

క్షవర కళ్యాణంలాగా

మార్చు

క్షామానికి జొన్న - వర్షానికి వరి పండుతాయి

మార్చు

క్షేత్రమెరిగి విత్తనం వేయాలి

మార్చు

క్షేమం కోరితే క్షామం లేదు

మార్చు

క్షేమ సమాచారాలడిగినట్లు

మార్చు

క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం వెయ్యాలి

మార్చు

క్షేమంగా పోయి లాభంగా రండి

మార్చు

ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆశీర్వచనంగా ఈ మాట అంటారు.

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం