- అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.

భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

ఆంగ్ల భాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.

హద్దు పద్దు లేకుండా మార్చు

పెద్దా, చిన్నా భేదము లేకుండా

హద్దుల్లో వుంటేనే ముద్దూ ముచ్చటా మార్చు

హద్దుల్లో వుంటేనే ఆడది - హద్దు దాటితే గాడిద మార్చు

హనుమంతుని ముందు కుప్పిగంతులా? మార్చు

హనుమంతుని తోక మార్చు

హనుమంతుడు లంకలో వున్నప్పుడు రారణాసురుని ఎదుట కూర్చోవడానికి రారణుని సింహాసనానికి కన్నా ఎత్తైన వేదికను తన తోకను పెంచి దానితో చేసిన వేధికపై కూర్చున్నాడని పురాణ కథనం. అనగా అతి పొడవైనదని అర్థం. అతి పొడవైనదని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఇలాంటిదే మరొక జాతీయం కూడా ఉంది. కొండవీడు చాంతాంత అని.

హనుమాయమ్మ మొగుడు మార్చు

ప్రత్యేక గుర్తింపు, ప్రతిభ లేని వాడు.అనామకుడు. భార్యచాటు మొగుడు, నారాయణమ్మ మొగుడు అనికూడా అంటారు. స్వంత గుర్తింపు లేని వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడుతారు.

హమ్మయ్య .... మార్చు

ఉదా: హమ్మయ్య వెతుకుతున్నది దొరికింది.ఏదైనా సాధించా విడిచే నిట్టూర్పు

హారతి కర్పూరం అయిపోవడం మార్చు

సులభంగా ఖర్చైపోవడం, తొందరగా అయిపోవడం అనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కర్పూరాన్ని హారతి కోసం వెలిగించినప్పుడు కలిగే స్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.హారతి కర్పూరము అతి తొందరగా హరించుక పోతుంది. ధనం, ఆస్తి తొందరగా ఖర్చైన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. 'ఆస్తంతా హారతి కర్పూరమైంది' అనేలాంటి ప్రయోగాలు ఉన్నాయి.

హరిదాసు, ఉల్లిపాయ మార్చు

హరిదాసుకందరూ తనవారే మార్చు

హరిశ్చంద్రుని నోట అబద్ధం రాదు - నా నోట నిజం రాదు మార్చు

హరిశ్చంద్రునికి వారసుడన్నట్లు మార్చు

హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన మార్చు

హస్తకు ఆదిపంట - చిత్తకు చివరి పంట మార్చు

హస్తకు ఆరుపాళ్ళు - చిత్తకు మూడుపాళ్ళు మార్చు

హస్త, చిత్తలు వరుపయితే అందరి సేద్యం ఒక్కటే మార్చు

హస్తలో అడ్డెడు చల్లేకంటే చిత్తలో చిటికెడు చల్లటం మేలు మార్చు

హస్తలో ఆకులాడితే చిత్తలో చినుకు పడదు మార్చు

హస్తలో చల్లితే హస్తంలోకి రావు మార్చు

హాజరు జవాబు - అదే పోతే మార్చు

హ్యాట్రిక్ సాధించాడు మార్చు

తిరిగి గెలిచాడు అని అర్థం. మూదవ సారి గెలవడాన్ని హ్యాట్రిక్ సాధిచాడు అని అంటారు

హాస్యగానికి తేలు కుట్టినట్లు మార్చు

హీనకాంతి దీపం యింటికి చేటు - మొగమాటపు పెళ్ళాం మొగుడికి చేటు మార్చు

హేతువు లేకుండా తీతువు కూయదు మార్చు

హేమా హేమీల్లాగా మార్చు

హేమా హేమీలు ఏట్లో కొట్టుకుపోతుంటే, నక్క పాటిరేవడిగిందట మార్చు

హేమాహేమీలు మార్చు

హేమాహేములు అనే రూపంగా కూడా కనిపించే ఈ జాతీయం అన్నింటా గొప్పవారు, సమర్థులు అనే అర్థంలో వ్యవహారంలో ఉంది. కొన్నిచోట్ల మోసగాళ్లనే అర్థంలో కూడా వాడడం జరుగుతోంది. ఇవి ఎవరైనా ఇద్దరికి సంబంధించిన పేర్లా? అసలీ హేమా హేముడు అనేవారు ఉన్నారా? వారివల్లనే ఈ జాతీయం వచ్చిందా? అనేవాటిని గురించి ఇంకా పండితలోకంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా కడు సమర్థులు, అందరికంటే గొప్పవారు అనే అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'వారికేమండీ హేమాహేమీలు, ఎలాంటి పనినైనా సాధించగలరు' అనేలాంటి ప్రయోగాలు గమనార్హం.

హృదయం లేని వాడు మార్చు

కఠినాత్ముడని అర్థం: ఉదా: వాడు హృదయం లేని వాడు: దయా గుణం అసలు లేదు. కఠినాత్ముడు. వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతారు.

హే భగవంతుడా..... మార్చు

దీనంగా దేవుడిని ప్రార్థించడము: ఉదా: హే భగవంతుడా ఎన్ని కష్టాలొచ్చాయిరా.....

హేమాహేమీలు మార్చు

హంస ఎగిరి పోయింది మార్చు

ప్రాణం పోయిందని అర్థం, లేదా జీవుడు ఎగిరి పోయాడని అర్థం. (హంస అనగా శరీరంలోని జీవుడు అని అర్థము)

హంగామాల పెళ్ళాం - ఆర్భాటాల మొగుడు మార్చు

హంస నడకలు రాకపోయే - ఉన్న నడకలు మరిచిపోయే మార్చు

హంసపాకం మార్చు

హంసపాదు మార్చు