జాతీయములు - వ
వ - అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ-ఘ |
చ-ఛ జ ఝ |
ట ఠ డ-ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ-ష స-హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.
ఆంగ్ల భాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.
జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.
వంకర టింకర ఓ
మార్చుమెలికలు, మెలికలుగా ఉండటం, ఎక్కువ వంకరలు తిరిగి ఉండటం అడ్డదిడ్డంగా నడవటం
వంకర్లు తిరుగుతున్నాడు
మార్చుసిగ్గు పడుతున్నాడని అర్థం
వంగి వంగి
మార్చుఅతి వినయంగా బానిసలా వంగి వంగి దణ్ణాలు పెట్టడం
వంటింటి కుందేలు
మార్చుఅనుకోకుండా దొరికింది: కూరకు ఏమి లేదే.... అని అనుకుంటుంటే ఒక కుందేలు వంటింట్లోకి వచ్చినట్ట్లు.
వంత పాడటం
మార్చుఒకరు ఒక విషయాన్ని ప్రతిపాదిస్తే ఇంకొకరు దాన్ని సమర్థించటం . బుర్రకథలో ప్రధాన కథకుడికి అటూఇటూ ఇద్దరు వంత పాడుతూ ఉంటారు.
వంపున మరదలు
మార్చునటన. పదిమంది ముందూ సోదరిగా పిలుస్తూ, అలా భావిస్తున్నట్టు నటిస్తూ ఆమె ఏకాంతంగా దొరికినప్పుడు దుర్భుద్ధితో ప్రవర్తించటం.
వక్క కొరికినంతలో
మార్చువెంటనే, క్షణాలలో, శీఘ్రంగా. ఉదా:.... .... వక్కకొరికినంత సేపట్లో వచ్చేస్తా..... వక్కకొరికినంతలో. అనగా వక్క కొరకడానికి అతి స్వల్ప సమయము పడుతుంది. ఉదా: వక్కకొరికినంతలో వచ్చేస్తా... అని అంటారు. ఈ జాతీయము రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ వాడుకలో ఉంది. ఇలా అతి తక్కువ సమయాన్ని సూచించడానికి ఈ జాతీయాన్ని వాడుతారు.
వకార పంచకం
మార్చువట్టిగొడ్డు తాకట్టు
మార్చువడగట్టడం
మార్చుపనికిరాని వాటిని పక్కన పెట్టి పనికొచ్చే వాటిని మాత్రమే ఎంపిక చేయటం
వడబోసిన బంగారం
మార్చుబంగారమంటేనే అధిక విలువైనది అని అర్థము. కాని బంగారంతో నగలలో కొంతైనా రాగి లాంటి ఇతర లోహాలు కలిసి వుంటాయి. ఆయా వస్తువుల గట్టితనానికి ఆమాత్రం కలపడం తప్పని సరి. అల కాకుండా దాన్ని కూడా వడబోస్తే.... బంగారాన్ని వడపోస్తే వచ్చేది స్వశ్చమైన బంగారం. దానిని అపరంజి బంగారం అని కూడా అంటారు. దానిలో ఏ మాత్రం కల్తీ లేదని అర్థం. అటువంటి స్వశ్చతను తెలియ జేయడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదా: ఒక పురుషున్ని, స్త్రీని గాని పోల్చాలంటే అతను వడబోసిన బంగారం. అని అంటుంటారు.
వడిసెల గుండు
మార్చువేగంగా దూసుకుపోవటం. వాడిని చూడు. వడిసెల రాయిలా దూసుకుపోతాడు' అంటారు
వనమిడిచిన కోతి
మార్చుఅయిన వారందరికీ దూరంగా పోయి కష్టాల పాలవటం.
వనవాసం
మార్చుఅధికారంలో లేకుండా జీవించటం .
వరిగడ్డి మంట
మార్చువరిగడ్డి మంట పెడితే కట్టెలులాగ అది నిలచి మండదు.. మంట పెట్టిన వెంటనే పెద్దగా మండి చప్పున చల్లారి పోతుంది. అలాగే పెద్దగా కోపం వచ్చి వెంటనే తగ్గిపోతే అలాంటి వారిపై ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. దీనికి సమానార్థంలో మరొక జాతీయమున్నది . అది. తాటాకు మంట
వల
మార్చుతమ వైపు ఆకర్షించటానికి చేసే ప్రయత్నం. ఉదా:::::: ఆ పార్టీ వారు మన వాళ్లకు వల వేసి లాగుతున్నారు.
వలలో పడ్డాడు
మార్చుదొరికి పోయాడని అర్థం
వలవల
మార్చువిపరీతంగా ఏడవటం. (వారు వల వల ఏడుస్తున్నారు)
వల్లకాట్లో రామనాథయ్య
మార్చువయసునాటి ముచ్చట్లు
మార్చువయస్సులో ఉన్నప్పుడు తాను ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులు చేశానని ముసలాయన గర్వపడుతూ కబుర్లు చెప్పటం.
వశిష్ఠ వాక్యం
మార్చువాకిలూడపెట్టడం
మార్చుప్రేమకొద్దీ కడుపార తినబెట్టడం . అత్తగారింటికి కొత్త అల్లుడు వచ్చినప్పుడు ఆ అత్త ఆల్లుడికి ప్రేమకొద్దీ తెగ తినపెట్టిందట. దాంతో అల్లుడు బయటకు రావాలంటే ఆ ఇంటి వాకిళ్ళను వూడబెరికి పెద్ద ద్వారాలు పెట్టాల్సి వచ్చిందట.
వానపాము బుసలు
మార్చుశక్తిహీనుల అతిశయం.ఏమాత్రం హానికరం కాని బెదిరింపులు ఎదుటి వారికి ప్రమాదమేమీ లేని శక్తిహీనుల కోప ప్రదర్శన/ చేత కాని వాని కోపము/ ఇలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
వానినోట్లో కరక్కాయ పడ్డది
మార్చుఅనగా మాట్లాడలేక పోతున్నాడని అర్థము. మాట్లాడడానికి సందేహిస్తున్నాడు. అటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.వాని నోట్లో కరక్కాయపడ్డది/వానినోట కరక్కాయ కొట్టినాను
వాములకొద్దీ
మార్చుఎంతో ఎంతో ఎక్కువ అని. 'వాముల కొద్దీ తెచ్చి పడేసినా వీళ్ళు తినడానికి చాలడంలేదు అంటారు.
వాసానికి తగ్గ కూసం
మార్చుసరైన జోడి .వాసానికి తగిన విధంగా కూసాన్ని చెక్కి అమర్చితే తప్ప సరైన అమరిక కుదరదు. గంతకు తగ్గ బొంత లాంటిది
వ్యాసఘట్టం
మార్చువ్యాసప్రోక్తం
మార్చువిడుపు శృంగారం, ముడుపు శృంగారం
మార్చువిత్తు చిన్న విచారం పెద్ద
మార్చుఎంత పెద్ద మర్రిచెట్టు విత్తనమైనా చిన్నదిగానే ఉంటుంది.అలాగే మనసులో విచారం కలిగిందంటే అది మనసంతా ఆవరించే పెద్ద బాధనే కలిగిస్తుంటుంది.
విత్తేసి పొత్తు కూడటం
మార్చుసమానంగా పెట్టుబడి పెట్టకుండా నామమాత్రపు పెట్టుబడి పెట్టి చివరకు లాభాలు మాత్రం అందరితో సమంగా కావాలని కోరటం.ఎదపెట్టే రోజున వచ్చి కాసిని విత్తనాలు చల్లి వెళ్ళిపోయి పంటకుప్ప నూర్చే సమయానికొచ్చి మిగతా అందరితో సమానంగా వాటా కావాలని పట్టుపట్టడం.
విత్తొకటివేస్తే చెట్టొకటి రాదు
మార్చుఏ విత్తనం విత్తితే ఆ మొక్క మొలిచి చెట్టవుతుంది పెద్దలు తమ పిల్లలకు ఎలాంటి అలవాట్లను పద్ధతులను నేర్పితే పెద్దయ్యాక వారు ఆ పద్ధతులతోనే కనిపిస్తారు.
విధి వస్తే పొదలడ్డమా?
మార్చుదృఢ నిశ్చయంతో ఉంటే చిన్న చిన్న చికాకులు, అడ్డకుంలు ఏవీ లెక్కలోకి రావు.డొంకలో దాక్కుంటే పిడుగుపాటు తప్పుతుందా?పిడుక్కి గొడుగు అడ్డమా?
విద్దికంచి రామాయణం
మార్చువిభీషణుడు
మార్చుధర్మపాలన కోసం సొంత వారిని త్యాగం చేసేవాడు. ఒక రాజకీయ పక్షంలో ఉండి అక్కడి విషయాలన్నింటినీ ఎదుటి పక్షం వారికి తెలియజెప్పి స్వపక్షాన్ని దెబ్బ తీసేవాడు. అటువంటి వారినుద్దేసించి ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
విరుచు కోవటం
మార్చుగర్వించటం బోర విరుచుకు తిరగటం, నడ్డి విరుచుకు తిరగటం
విస్సన్న
మార్చువిషం చిమ్మడం
మార్చుద్వేషాన్ని ప్రదర్శించడం, కల్లోలం చేయడం, ఇతరుల గురించి చెడునే ప్రచారం చేయడం
విరగపడి చూడటం
మార్చుఅత్యంత ఆసక్తితో చూస్తుంటే ఈ మాట వాడతారు.
విరగబడి నవ్వడం
మార్చువిపరీతంగా నవ్వుతుంటే ఈ మాట అంటారు
వియ్యాలవారి కయ్యాలు
మార్చుమిత్రపక్షాలవారి మధ్య వచ్చే తగాదా .సరదా కోసం చిలిపి తగాదాలు గొడవలను అంతగా పట్టించుకోవల్సిన పనిలేదు.
వీపుమీద బాకు గుచ్చడం
మార్చువెన్నుపోటు నమ్మకద్రోహం
వీపు విమానం మోత మోగుతుంది
మార్చుపిల్లల్ని కొడతానని బెదిరించడము. ఉదా: పిల్లలూ....... అల్లరిచేస్తే వీపు విమానం మోత మోగుతుంది. సాధారణంగా బడి పిల్లలనుద్దేశించి పంతుళ్ళు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
వీధికెక్కడం
మార్చుఅభిప్రాయ భేదాలు బయటపడడం / అల్లరి చేయడం/ ఇంటి గుట్టు అందరికి చెప్పేయడం.
వీరభద్రుడు కావడం
మార్చుఅధికమైన కోపావేశాలతో ప్రవర్తింఛటం. వీరభద్రావతారం ఎత్తడం .దక్షయజ్ఞం విధ్వంస సమయంలో వీరభద్రుడు మహా ఉగ్రుడుగా ఉంటాడు
వీరవిహారం చేయడం
మార్చువిజయాలను ఎదురులేకుండా సొంతం చేసుకోవడం శత్రువులను జయిస్తూ ఆనందంగా ఎలా ముందుకు వెళ్ళటం, వెళ్ళిన ప్రతిచోటా విజయాలను సాధించటం
వీరాభిమాని
మార్చుమితిమీరినఅభిమానం
వీధిన పడడం
మార్చుఅసహాయ స్థితికి చేరడం. ఇల్లూ వాకిలి అన్నిటినీ పోగొట్టుకుని వీధిలోనే గడపాల్సిన పరిస్థితి
వూకదంపుడు
మార్చుసారంలేని పని, ప్రయోజనంలేని వ్యవహారం, విషయంలేని మాటలు, పొట్టు వూక దంపుడు ప్రయోజన శూన్యమైన పని.ఊక అనగా వడ్లగింజపైనుండే పొట్టు. వడ్లను దంచితే పైపొట్టు పోయి బియ్యం బయడ పడతాయి. అందుకే వడ్లను దంచుతారు. కానీ ఊకను దంచితే ఏమి ఫలితముండడు. ఆ అర్థంలో అనవసరంగా వ్వర్థ ప్రసంగం చేసేవారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఉటంకిస్తారు. వ్వర్థం అనే అర్థంలో.
వూత కర్రలు
మార్చుఅండదండలుగా ఉండేవారు
వూదు పొగ వేయటం
మార్చుసాంబ్రాణి పొగ . పూనకం రావటానికి ఆ వూదు పొగే కారణమన్న భావనతో ఒకరు ఇంకొకరిని ఏదైనా పనికి ఉసికొల్పినప్పుడు 'వాడొచ్చి ఏదో వూదు పొగేశాడు. అప్పటి నుంచి వీడు ఇలా అంటున్నాడు అంటారు.
వూపిరి పీల్చుకోవడం
మార్చువూరట చెందడం తెరిపిన పడటం ఉదా: వాడు నన్ను ఊపిరికూడ పీల్చుకోనివ్వకుండా తొందర పెడుతున్నాడు
వూపిరి పోసుకోవటం
మార్చుఅస్థిత్వం కాపాడు కోవటం . వూపిరులూదటం అంటే ప్రాణం పోయటం.
వూపునివ్వటం
మార్చుప్రోత్సాహాన్ని ఇవ్వటం .చెప్పిన మాటలు వినగానే మంచి వూపు మీద వెళ్ళాడు అంటారు
వూపుమీద ఉండటం
మార్చుఎక్కువ సంతోషంగా ఉండటం అనుకూల పరిస్థితులు ఉండటం
వూరు మీది పని
మార్చునిర్లక్ష్య బుద్ధిని ప్రదర్శించటం, అసమర్థంగా వ్యవహరించటం తన సొంతపనిని బాగా చేసుకోవటం.. పది మందితో కలసి చేసే పనిలో శ్రద్ధ వహించక పోవటం. గుంపులో గోవిందం లాంటిది.
వూరోరి బిడ్డ
మార్చువూరి వారి బిడ్డ ,వేశ్య . అతి సామాన్యులు, అంతగా గుర్తింపు లేనివారికి జన్మించిన సంతానం . వూరి వారి బిడ్డను రాచబిడ్డ కొడితే రాచవారి బిడ్డను దేవుడే కొడతాడు అని సామెత.
వృద్ధవైద్యం
మార్చువెతకబోయిన తీర్థం ఎదురైనట్టు
మార్చువెతకబోయిన తీగ కాలికే తగిలినట్టు.పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలించడం, కాలం కలసిరావడం.కావల్సినవి సమీపంలోనే ఉన్నాయని తెలుసుకోటం,వెతుకున్నవారు ఎదురవటం
వెర్రితీగ తొక్కినట్టు
మార్చుమతిమరుపు సంభవించటం మరులుతీగ తొక్కినట్లు
వెన్ను చలవ
మార్చువెన్నులో చలిపుట్టటం
మార్చుదడపుట్టటం విపరీతమైన భయం కలగటం భయంకరమైన పరిస్థితులు ఎదురవటం
వెన్నెముక
మార్చుప్రధానమైనది, ఆధారమైనది. వెన్నెముక శరీరంలో ప్రధానమైనదే. కాని ఇక్కడి విషయం అది కాకూడదు. ఉదా: ఈ వ్యవహారంలో పలాన వ్వక్తి వెన్నెముక లాంటి వాడు అంటారు.
వెన్ను పోటు పొడిచాడు
మార్చుదొంగ దెబ్బ తీశాడని అర్థం
వెన్ను పోటు పొడిచాడు
మార్చుదొంగ దెబ్బ తీశాడని అర్థం>
వెళ్ళకుండా మొత్తుకున్నట్టు
మార్చుసందర్భానికి తగని పని . మొత్తుకోవటమంటే రోదించటం అని అర్థం. ఇంట్లో దొంగలు పడ్డారని అలికిడై తెలిసినప్పుడు పెద్దగా మొత్తుకుంటే ఆ శబ్దం విని ఇరుగుపొరుగు వారు వచ్చి రక్షించటానికి అవకాశం ఉంటుంది. ఇది సందర్భోచితమైన పని. అదే ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు తగలబడుతుంటే ఎలాగో ఒకలాగా బయటకు పరుగెత్తి రావాలి కానీ, అక్కడే కూర్చొని రోదిస్తూ ఉంటే ఎవరో వచ్చే దాకా మంటలు ఆగవు. కనుక అప్పుడు మొత్తుకోవటం సందర్భోచితం కాదు. అలాంటి వారిని గురించి ఈ జాతీయము పుట్టినది.
వెంబడి లేని సేద్యం
మార్చువేడి తగ్గటం
మార్చుతీవ్రత తగ్గటం, వైరం తగ్గటం, కోపం తగ్గటం
వేన్నీళ్ళకు చన్నీళ్ళు
మార్చుసహాయంగా ఉండటం .తోడ్పడటం. ఉదా: వాడు చేసిన సహాయం మాకు వేన్నీళ్లకు చన్నీళ్లు కలిపినట్లున్నది. "
వేరుకుంపట్లు పెట్టుకోవడం
మార్చుఅంతర్గత కలహాలతో విడిపోవడం వేరుకుంపటి.విడిపోయి ఎవరికి వారు స్వతంత్రంగా ఉండడం ఉమ్మడి కుటుంబం విడిపోయినప్పుడు ఎవరికివారు వేరుగా కుంపట్లు పెట్టుకుని ఎవరి వంట వారు వండుకుంటారు.
వేలంవెర్రి
మార్చువేలుపెట్టిచూపలేరు
మార్చుతప్పు పట్టలేరని అర్థం: ఉదా: వాని పనిలో ఎవరూ వేలు పట్టి చూపలేరు. అంత కచ్చితంగా పని చేస్తాడని అర్థం.
వేలుపెట్టాడు
మార్చుఇతరుల పనులలో అనవసరంగా కల్పించు కున్నాడని అర్థం. ఉదా: వాడు అనవసరంగా వారి పనిలో వేలుపెట్టి మాటలు పడ్డాడు.
వేయికళ్లతో
మార్చుఅతిజాగ్రత్తగా పరిశీలించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మామూలుగా రెండుకళ్లతో సునిశితంగా పరిశీలిస్తేనే చాలా విషయాలు ఇట్టే తెలిసిపోతుంటాయి. అలాంటిది వేయికళ్లతో పరిశీలిస్తే ఏ విషయంలోని సారమైనా ఇట్టే అవగతమవుతుంది.
వెయ్యికళ్లతో
మార్చుఅత్యంత జాగరూకతతో వ్యవహరించడం
వేదవాక్కు
మార్చుతప్పనిసరిగా ఆచరించి తీరాల్సింది . వేదాలు ప్రమాణాలు. అలాంటి వేదాలు చెప్పింది ఎవరైనా ఆచరించి తీరాల్సిందే అనే భావన
వేడినీళ్లు పోస్తే ఇల్లు కాలనట్టు
మార్చుఅసమర్థ ప్రయత్నం, తెలివి తక్కువతనం
వేడెక్కటం
మార్చుఉద్ధృతం కావటం : ఉదా; వారి మాటలు రాను రాను వేడెక్కుతున్నాయి
వేరులో వేణ్ణీళ్ళు పోసినట్టు
మార్చువిపరీతంగా కష్టాలకు గురిచేయటం, బాధలు పెట్టడం .మొక్కపాదులో వేడివేడి నీళ్ళను పోస్తే ఆ మొక్క బతకదు.వేరు తవ్వి వేణ్ణీళ్ళు పోయటం.=
వేలం వెర్రి
మార్చువెనకా ముందు అలోచించ కుండా వెళ్లి పోవడాని వేలం వెర్రి అంటారు.
వేలెడంత లేడు
మార్చుచాల చిన్న వాడని అర్థము..... ఉదా: వాడు వేలెడంత లేడు..... అప్పుడే వాని కెన్ని బుద్ధులో...... అని అంటుంటారు..
వేలు మీద గోరు మొలిచినట్టు
మార్చుఅత్యంత సాధారణం, సహజం అదేమంత గొప్ప విషయం కాదులే అని
వేలు వేలుకు అంతరం
మార్చుచేతికుండే అయిదు వేళ్లూ ఒకలాగా ఉండవు.లావుగా, పొడవుగా ఉండే వేళ్ళను మాత్రమే ఉంచుకుని మిగతా వాటిని తీసేస్తే ఎలా ఉంటుందో మనుషుల మధ్య అంతరాలను పాటిస్తూ పేదవారిని నిరాదరించటం కూడా అలాగే ఉంటుంది. దేని విలువ దానిదే, ఎవరి విలువ వారిది.
వేసిందే ఒక గంతు విరిగిందే ఒక కాలు
మార్చుఅనుభవ రాహిత్యం.శాస్త్ర బద్ధంగా కాక ఏదో వచ్చీరానట్టు చేయటం.అరకొరగా పనిచేశానని అనిపించటం.
వేళ్ళపై లెక్కించగలిగినన్ని
మార్చుచాలా మితంగా, పరిమిత సంఖ్యలో ఉండేవి: ఉదా: ఆ సభకు వచ్చిన వారిని వేళ్లపై లెక్కించ వచ్చు.
వేలు పెట్టి చూపలేర
మార్చుచేసిన పనిలో వంకలు పెట్టలేరని అర్థం; ఉదా: వాడు పని చేస్తే ఎవరు వేలు పెట్టి చూప లేరు.
వేయించుక తింటున్నారు
మార్చుచాల బాదిస్తున్నారని అర్థం. ఉదా: వారు తన తండ్రిని బాక వేయించుక తింటున్నారు.
వేషాలేస్తున్నారు
మార్చుఉదా: ఎరా....? చెప్పిన పని చేయ కుండా వేషాలేస్తున్నారు.