భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


మకార పంచకం

మక్కీకి మక్కీ

మార్చు

ఉన్నదున్నట్టుగా అని అర్థం.

మకుటం లేని మహారాజు

మార్చు

ఏవిధమైన అధికారిక హోదా లేకపోయిన పెత్తనం చెలాయించేవారినుద్దేశ్యించి "మకుటం లేని మహారాజు" అనటం వాడుక.

మగవాళ్లు

మార్చు

పౌరుషం ఉన్నవాడే మగవాడు అన్నట్లు

మగులు మీది గడ్డి

మార్చు

కూలీ బతుకులు, అల్పాదాయ వర్గాల వారు.ఇళ్ళ ప్రహరీ గోడలు నానిపోకుండా ఈ గోడ మీద రెండు వైపులా ఏటవాలుగా అంటే త్రిభుజాకారంలో ఉండేలా ఒత్తుగా గడ్డి వేసేవాళ్ళు. ఆ గడ్డి లేవకుండా బరువుగా ఉండేందుకు తాళ్ళతో రాళ్ళను కట్టి అటూ ఇటూ వేలాడదీస్తుండేవారు.ఈ మగుల వల్ల మట్టిగోడ నానకుండా ఉండేది. అయితే వర్షం పడ్డప్పుడు ఆ గడ్డి మీద ఉండే గింజలు మట్టి తగిలి ఉండి నాని మొలకెత్తుతుండేవి. వర్షం పడ్డంతసేపూ నవనవలాడుతూ ఆ గడ్డి మొక్కలు బాగానే ఉండేవి. కానీ ఎండ రాగానే వెంటనే వాడిపోతూ ఉండేవి.

మచ్చ నాలుక

మార్చు

మధ్వవైష్ణవం

మార్చు

మధ్యాహ్న భోగం

మార్చు

తాత్కాలికంగా లభించిన సంపద: ఉదా: వానిది మధ్యాహ్న బోగం. ఎంత కాలముంటుంది లే.

మనసు దోచుకున్నాడు

మార్చు

ప్రేమించాడని అర్థం: ఉదా: అతను నా మనసు దోచు కున్నాడు.

మనసులో మనసు లేదు

మార్చు

మనసంతా కాక వికలంగా వున్నదని అర్థం: ఉదా: ఆ మాట విన్నప్పటినుంది నామనసు మనసులో లేదు.

మబ్బుల్లో తేలి పోతున్నాడు

మార్చు

ఊహల్లో విహరిస్తున్నాడని అర్తం: ఉదా: వాడు ఆ మాట విన్నప్పట్నించి మబ్బుల్లో తేలి పోతున్నాడు.

మబ్బులు వీడడం

మార్చు

మరతుపాకీ తూటా

మార్చు

వెనువెంటనే .మరతుపాకిని పేల్చితే దాని తూటా వెనువెంటనే ఎంత వేగంగా బయటకు వెళుతుందో అంతటి వేగమని

మర్కటముష్టి

మార్చు

మర్యాదరామన్న

మార్చు

మర్రిచెట్టు

మార్చు

అనుచరగణాన్ని ఎదగనీయని నాయకుడు.మర్రిచెట్టు నీడన మరేమొక్క బతకదని, పెరగదని చెబుతారు.

మరీచిక

మల మల మాడుతున్నాడు

మార్చు

ఆకలితో వున్నాడని అర్థం: ఉదా: వాడు ఆకలికి మల మల మాడు తున్నాడు.

మల్ల గుల్లాలు పడుతున్నారు

మార్చు

తీవ్రంగా ఆలోచిస్తున్నారు: ఉదా: వారు పలాన విషయమై మల్ల గుల్లాలు పడుతున్నారు.

మస్కా కొడుతున్నాడు

మార్చు

మాయ మాటలతో ఉబ్బేస్తున్నాడని అర్థం.

మసిబారటం

మార్చు

పరువు, ప్రతిష్ఠలను కోల్పోవటం, పొగచూరటం, మట్టిపట్టటం, పొగకమ్మటం లాగా.

మసి బారి పోయింది

మార్చు

కష్టాలొచ్చాయని అర్థం: ఉదా: వారి జీవితం మసి బారి పోయింది.

మసి పూసి మారేడు కాయను చేయడం

మార్చు

మోసం చేస్తున్నాడని అర్థం.

మండిపడటం

మార్చు

ఆగ్రహించటం ఉదా: వాడునామీద మండి పడుతున్నాడు.

మంటకలపడం

మార్చు

నాశనం చేయడం

మంట కలిసి పోయింది

మార్చు

నాశనమైనది. ఉదా:... ఇంత సేపు ఆ పనిచేశానా? అంతా మంట కలిసి పోయింది.

మంటికి మింటికి ఏక దాటిగా

మార్చు

కిందనుండి పైదాక..., మిక్కిలిగా, ఉదా: వారు మంటికి మింటికి ఏకథాటిగా విలపిస్తున్నారు.

మంటలు చల్లారడం

మార్చు

అల్లర్లు ఆగిపోవడం

మండి పడ్డాడు

మార్చు

కోపంగా వున్నడని అర్థం: ఉదా: వాడు నామీద మండి పడ్డాడు.

మందు నూరటం

మార్చు

చెప్పుడు మాటలతో ఎదుటివారి మనసును మార్చటం

మందల గోవిందా

మార్చు

గుంపులో గోవిందా . సొంత ఆలోచన లేకుండా ఎదుటివారు ఏం చేస్తే అలా చేస్తూపోతూ ఉండే స్థితి. దేవాలయాలలో గుంపులు గుంపులుగా భక్తులున్నప్పుడు ఒకరు గోవిందా అంటే పరిసరాలలో ఉన్నవారు కూడా గోవిందా అని అరుస్తుంటారు. సభలు, సమావేశాలప్పుడు ఎవరైనా ఉపన్యాసం చేస్తున్న సందర్భంలో ఒకరు చప్పట్లు కొడితే మిగతా వారంతా చప్పట్లు చరుస్తుంటారు. ఎందుకు, ఏమిటి అని ఆలోచించకుండా కారణలేవీ తెలుసుకోకుండా ఎదుటివారిని బట్టి చేయటం. మోసం చేయడం: ఉదా: వాడు చేసిన పని బాగా లేదు ఏదో మసి బూసి మారేడు కాయను చేసినట్లున్నది.

మాఊరు మీఊరికెంత దూరమో మీఊరూ మా ఊరికి అంతే దూరం

మార్చు

అంతా ఒకటే నని చెప్పడం

మాఘమాసపు వాన

మార్చు

మాటను మింగేస్తున్నాడు

మార్చు

నిజం చెప్పడం లేదు. ఉదా: వాడు నిజం చెప్పలెక మాటను మింగేస్తున్నాడు.

మాట పడి పోయిందా?

మార్చు

ఉదా: ఇంత సేపు ఏదేదో మాట్లాడావు. ఇప్పుడు నిజం తెలిసే సరికి మాట పడి పోయిందా?

మాట పడడు

మార్చు

ఉదా: వాడు మాట పడడు. చాల నిజాయితీగా వుంటాడని అర్థం.

మాట మీద నిలబడ్డాడు

మార్చు

నిజాయితీ పరుడని అర్థం: ఉదా: అతను ఏదన్నా అన్నాడంటే మాట మీద నిలబడతాడు.

మాటలు కోటలు దాటాయి

మార్చు

గొప్పలు చెప్పుకోవడం: ఉదా: వానిమాటలు కోటలు దాట తాయి. (మాటలు కోటలు దాటాయి కాలు మాత్రం గడప దాటదు." ఇది సామెత. సామెతలో కొంత భాగాన్ని జాతీయంగా వాడడానికి ఇదొక ఉదాహరణ.)

మాటల తూటాలు

మార్చు

పదునైన మాటలు అని అర్థం.

మాటలు పెగలడంలేదేమి

మార్చు

చెప్పడానికి ఏమి లేదని అర్థం: ఉదా: అప్పుడన్ని మాటలన్నావు? ఇప్పుడు మాట పెగలడం లేదేమి?

మాటలు మింగుడు పడడం లేదేమి

మార్చు

చేసిన తప్పులు బయట పడితే కలిగె పరిస్థిని తెలియ జేసె మాట.

మాటలు వేడెక్కాయ

మార్చు

తిట్టుకుంటున్నారని అర్థం.

మాదాకవళం

మార్చు

మాధవుడు యాచకుడి రూపంలో కూడా వస్తూ ఉంటాడని, అందుకే యాచకులను ఇప్పుడు కాదు, లేదు, పో అని అనకూడదంటారు. యాచకుడు కూడా తనకు వేసిన కబళం (ముద్ద) ఆ దేవునికే చెందుతుందన్నట్టు తీసుకొంటాడు.

మాధవ కబళం

మార్చు

మాధుకరం

మార్చు

యాచన, భిక్షాటన.మాధవ కరం కబళం.మాధవ రూపం నారాయణ రూపం యాచకులు.కష్టించి పని చేయకుండా వారిని, వీరిని అడుక్కునేవాడు మాధుకరుడు.

మాడి మసి కావటం

మార్చు

సంపూర్ణంగా నశించటం

మాడు పగలగొట్టడం

మార్చు

విపరీతంగా బాధించటం

మాడు పగలటం

మార్చు

ఓడటం, అవమానం పాలుకావటం

మామిడికింది సోమరి

మార్చు

మాయదారి రోగం

మార్చు

అంతు తెలియని రోగం: ఉదా: ఈ మాయ దారి రోగంతో చస్తున్నాను.

మార్జాల దాంపత్యం

మార్చు

మాంధాతకాలం

మార్చు

మింగుడుపడడం

మార్చు

అనుకూలంగా ఉండడం, ఇష్టంకావటం

మిటమిట

మార్చు

ఆశతో ఆత్రంగా చూడటం

మిట్ట పెత్తనం

మార్చు

మిడతంభొట్లు

మార్చు

మిడి మిడిజ్ఞానం

మార్చు

తెలివి తక్కువ వాడు:

మిణుకు మిణుకు మంటున్న ఆశ

మార్చు

అడుగిడుతున్న ఆశ

మింతిదీపం

మార్చు

మీది గట్టిన రూపాయి

మార్చు

భద్రత, పవిత్రత.ముడుపు కట్టటం, తమ కోర్కెలను తీర్చమని, తమ కష్టాలను గట్టెక్కించమని దేవుడిని కోరుకుంటూ భక్తులు ఒక నూతన వస్త్రాన్ని పసుపులో ముంచి ధనాన్ని పెట్టి ముడివేస్తుంటారు. దీన్నే మీది కట్టటం అని అంటారు. ఎంత అవసరం వచ్చినా ఆ డబ్బును సొంత ఖర్చుకు వాడకుండా భగవంతుడి హుండీలో వేసేందుకే దాచి ఉంచుతారు.

మీదకు రావటం

మార్చు

తగాదాకు రావటం

మీది పిట్టలకు పులుసు కాయటం

మార్చు

సరైన ప్రయత్నం, పథక రచన లేకుండా కార్యసిద్ధి కోసం ప్రయత్నం చేయటం.కార్యసిద్ధిని వూహించి దురాశతో ప్రవర్తించటం .ఓ వేటగాడు తన భార్యను పిలిచి పిట్టమాంసంతో పులుసు పెట్టమన్నాడట. మరి పిట్టమాంసం ఏదయ్యా అని ఆమె అడిగితే అదిగో ఆకాశంలో పిట్టలెగురుతున్నాయి కదా! వాటిని పట్టుకొని తెస్తాను. ఇంతలోపల పులుసు కాస్తూ వుండు అని చెప్పాడట. ఇంటర్వ్యూకు వెళ్ళకుండానే ఉద్యోగం వచ్చేసినట్టు తెగ సంబరపడిపోయినట్టు, ఎదురింటి అట్లకు నెయ్యికాచినట్లు, ఆలూలేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్లు, మబ్బుల్లో నీళ్ళుచూసి ముంతవొలకబోసుకున్నట్లు.

మీది మాటలు

మార్చు

పైపై మాటలు, పనికిరాని వాగ్దానాలు

మీద మీద తిరగటం

మార్చు

ముక్కి మూలిగి వచ్చాడు

మార్చు

కష్ట పడి వచ్చాడు: ఉదా: అప్పుడనంగా రమ్మంటే ఇప్పుడు ముక్కి మూలిగి వచ్చాడు.

ముకుర దీక్ష

మార్చు

ముక్కు తాడు వెయ్యాలి

మార్చు

అదుపులో పెట్టాలని అర్థం: ఉదా: వాడు చాల విర్ర వీగు తున్నాడు. వానికి ముక్కు తాడు వెయ్యాలి.

ముక్కును నేలకు రాయిస్తా

మార్చు

ఒట్టు పెట్టడం: ఉదా:

ముక్కు మీద కోపం

మార్చు

తొందరగా కోపం వస్తుందని అర్థం. ఉదా: వానికి కోపం ముక్కు మీదనె వుంటుంది.

ముక్కు మొఖం తెలియని వాడు

మార్చు

కొత్త వారు: ఉదా: వాని ముక్కు మొఖం నాకు తెలియదు., నేనేం మాట్లాడను వానితో

ముక్కెద్దు తీరు

మార్చు

ఓపిక లేకపోవటం, బలహీనంగా ఉండటం .ముక్కెద్దు అని అంటే ముసలి ఎద్దు అని అర్థం. ముక్కాయన, ముక్కది = ముసలాడు, ముసల్ది

ముక్కోటి దేవతలకు మొక్కుకున్నా

మార్చు

అన్ని దేవుల్లకు మొక్కు కున్నానని అర్థం:

ముఖం చాటేస్తున్నాడు

మార్చు

తప్పించుకో జూస్తున్నాడని అర్థం: ఉదా:

ముఖం తిప్పుకున్నాడు

మార్చు

తప్పించుకోవాలని చూడడం. ఇష్టం లేదని అర్థం. ఉదా: నేను మాట్లాడుతుంటే వాడు ముఖం అటు తిప్పుకున్నాడు. ఇష్టం లేదేమో...

ముఖం వేళ్లాడేసుకొని వచ్చాడు

మార్చు

వెళ్లిన పని కాలేదని అర్థం: ఉదా: వాడు వెళ్లిన పని కాక పోయే సరిగి ముఖం వేళ్లాడేసుకొని వచ్చాడు

ముగ్గులోకి దింపటం

మార్చు

కర్ర పెత్తనం చేయటం, కేవలం పర్యవేక్షిస్తూ, అధికారాన్ని చలాయిస్తున్నట్టు అందరి చేత పనులు చేయిస్తూ తాను మాత్రం తప్పించుకు తిరగటం

మేకు పీకిన కోతి రీతి

మార్చు

వివరణ: ఒక వడ్రంగి ఒక దుంగను సగం వరకు కోసి సమయం అయినందున కోత మధ్యలో ఒక కర్ర మేకును పెట్టి వెళ్లి పోయాడు. ఇంతలో ఒక కోతి వచ్చి కోసిన దుంగ సందులో కాలు పెట్టి మేకును పీకింది. ఇంతలో ఆదుంగ రెండు బాగాలు దగ్గరై కోతి కాలు అందులో ఇరుక్కున్నది. కోతి పనులు అని చెప్పడానికి ఈ సామెతను వాడ్తారు.

ముంగటిత్తారి తీసినట్టు

మార్చు

నోటి ముందరి కూడు తీసేయటం. అవమానించటం.ముంగటి+ఇత్తారి (విస్తరి) .నలుగురితోపాటు భోజనానికి విస్తరి ముందు కూర్చున్నప్పుడు విస్తరిని లాక్కువెళ్ళటం లేదా ఆ కూర్చున్న వ్యక్తిని లేచిపో అని కసురుకోవటం.

ముందరి కాళ్లకు బందం వేశాడు

మార్చు

ఆటంక పరిచాడు: ఉదా: ఈ విషయంలో నేను మాట్లాడదామని వస్తే వాడు నా ముందరి కాళ్లకు బందం వేశాడు.

ముందుకి పోతే ఇరుకు వెనక్కి పోతే కొరుకు

మార్చు

ఎటు వెళ్ళాలో తేల్చుకోలేని సందిగ్ధ స్థితి.అసలు ఎటు వెళ్ళినా, ఏ నిర్ణయం తీసుకొన్నా, ఏదో ఒక ప్రమాదం తప్పదని. ముందు నుయ్యి, వెనుక గొయ్యి

ముందు చూపు వుండాలి

మార్చు

ఉదా: దేనికైనా ముందు చూపు వుండాలి.

ముందూవెనుకా చూడటం

మార్చు

బాగా విశ్లేషించి ఆలోచించటం: ఉదా:... ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడే టప్పుడు ముందు వెనకా చూసి మాట్లాడాలి. అంటరు.

ముడివేయటం

మార్చు

పెళ్లిచేయడం...... దీన్ని నిందా వాచకంగా కూడా వాడతారు. ( వాడు ఇద్దరి జుట్లు ముడివేసే రకం)

ముఖం తిప్పుకోవడం

మార్చు

చూసీ చూడనట్టు ఉండడం, అయిష్టతను ప్రకటించడం

ముఖం నల్లగా చేయటం

మార్చు

అవమానించటం

ముదనష్టం

మార్చు

మృత నష్టం .మృత్యువును మించిన నష్టం కలిగించేది మరొకటేదీ ఉండదు.

ముదనష్టపోడు

మార్చు

చచ్చినోడు తిట్టు, నిందా వాచకము.

ముదనష్టపు పని

మార్చు

తిరుగులేని నష్టంతో కూడుకున్న పని

ముదనష్టపు బతుకు

మార్చు

బతికున్నా చచ్చినట్లుండటం.

ముదిమానుచేవ

మార్చు

చెట్టు ఎంత ముదిమిదైతే అది బాగా చేవ పట్టి అంత గట్టిగాను, ఉపయోగ కరంగాను వుంటుంది. అదే విధంగా ముదిమిన వున్న మనిషి ఎంతో అనుభవం కలిగి వుంటాడని.... అతని సూచనలు అనుసరణీయమైనవని ఈజాతీయాన్ని ఆ అర్థంలో వాడుతారు.

మునిపల్లె వినాయకుడు

మార్చు

ములగ చెట్టెక్కిస్తున్నాడు

మార్చు

ఏదో మాయ మాటలతో ఉబ్బేస్తున్నాడని హెచ్చిరక చేయడం.

ముళ్లమీద కూర్చున్నట్టుంది

మార్చు

చాల కష్టంగా ఉంది. ఉదా: వాని మాటలు వింటుంటే ముళ్లమీద కూర్చున్నట్లుంది

ములి పుచ్చగింజ

మార్చు

ములి పుచ్చ గింజలు ఎన్నాళ్ళయినా పుచ్చిపోవడం కానీ, కుళ్ళు పోవడం కానీ జరగదు. చుక్క నీరందని బీడు భూముల్లో పడ్డా ఆ గింజలు మొలకెత్తి మొక్కలవుతాయి. ఇలా అన్ని రకాల పరిస్థితులకు తట్టుకుంటూ పుట్టుకొచ్చే ఈ మొక్కల వల్ల ఏ ఉపయోగం ఉండదు.ఎవరికీ ఏ విధంగానూ ఉపకరించక సోమరి పోతుల్లా తిని తిరిగే వాడికి ఏ రోగాలు రానప్పుడు ములిపుచ్చ గింజలాంటి వాడు అంటారు.

ముల్లెగందులతనం

మార్చు

ధనాన్ని కూడబెట్టడం. మరీ పిసినారితనంగా ప్రవర్తిస్తూ, తిండి కూడా సరిగా తినకుండా కూడబెడుతూ ఉంటే దాన్ని ముల్లెగందులతనం అని అంటారు.

ముళ్ల బాట

మార్చు

తాను ఎన్నుకున్న జీవన మార్గం అంత సక్రమమైనది కాదు. అందులో ఎన్నో కష్టాలున్నాయని అర్థం,

ముసలెద్దు

మార్చు

ఓపిక తగ్గి, కదలలేని స్థితి

ముసుగులో గుద్దులాట

మార్చు

అయోమయ పరిస్థితి. ముసుగులో ఎవరు ఎవరిని కొడుతున్నారో తెలియని పరిస్థితి.

ముష్టి

మార్చు

నీచంగా, తక్కువ స్థాయిలో ఉండటం.ముష్టి అంటే పిడికిలి. ముందు చూపు లేని వాడు ఏదేని ఒక కార్యం ప్రారంబించే ముందు దాన్ని గురించి చక్కగా విష్లేచించి తర్వాత దానిలోకి దిగాలి. అలా ముందు చూపుతో వుంటే కార్యం నెరవేరు తుంది.

ముసురుకున్న కష్టాలు

మార్చు

అన్ని కష్టాలు ఒక్క సారె వచ్చాయి: ఉదా: వానికి కష్టాలన్ని ఒక్కసారె ముసురుకున్నాయి.

మూకుడు బోర్లించడం

మార్చు

కప్పి ఉంచడం....ఏదేని విషయాన్ని బయటకు చెప్పకుండ దాచి వుంచడం;

మూగనోము పట్టడం

మార్చు

నిశ్శబ్దంగా ఉండడం, మౌనం వహించడం

మూడు కాళ్ల ముదుసలి

మార్చు

వయసుడిగిన ముసలి.

మూడు - ఆరు

మార్చు

మూడు పువ్వులు ఆరు కాయలు

మార్చు

ఉదా: వానికి అన్ని లాబాలె... వాని వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది.

మూడు చెరువుల నీళ్లు తాగించాడు

మార్చు

చాల కష్ట పెట్టాడు: ఉదా: వాడు నన్ను మూడు చెరువుల నీళ్లు తాగించి గాని ఇచ్చిన డబ్బు ఇవ్వలేదు.

మూడో కన్ను

మార్చు

మూడోకాలు

మార్చు

మూలన పడడం

మార్చు

పని ఆగిపోవడం లేదా ఏదైనా పనికిరాకుండా పోవడం

మూలలీగటం

మార్చు

మూలకు నక్కటం.భయం, బెరుకు ఉన్న వారు నలుగురు ముందుకు వచ్చి ధైర్యంగా నిలుచోవటం కానీ, మాట్లాడటం కానీ చేయలేక ఏ గదిలోనో, మరో చోటనో మూలమూలల్లో నక్కి కూర్చొంటుంటారు.

మూటకట్టుకోవడం

మార్చు

సంపాదించుకోవడం, సమకూర్చుకోవడం ఉదా: వాడు పాపాలన్ని మూట గట్టు కుంటున్నాడు అని అంటారు.

మూడో కంటికి తెలియకుండా

మార్చు

అతి రహస్యంగా; ఉదా: ఈ పని మూడో కంటికి తెలియకుండా చేయాకి.

మూడోకాలు

మార్చు

ముసలివాళ్ళు తూలిపడిపోకుండా ఊతంగా వాడే చేతి కర్రే మూడోకాలు.

మూణ్ణాళ్ల ముచ్చట

మార్చు

మధ్యాహ్న బోగం లాంటిదే.

మూర్తి కొంచెం కీర్తి విస్తారం

మార్చు

చూపులకు చిన్న ప్రతిభాశక్తి ఎంతో ఎక్కువ

మూలాలు కదులుతున్నాయి

మార్చు

అసలు విషయం బయట పడుతున్నది. ఉదా: మూలాలు కదులుతున్నాయి. ఇక తొందరలోనె అసలు విషయం తెలుస్తుంది.

మూడు విధాల నష్టం జరిగింది

మార్చు

అన్ని విధాల నష్టం జరిగిందని అర్థం:

మూతి నల్లగా పెట్టుకొని వచ్చాడు

మార్చు

అయిష్టంగా వచ్చాడని అర్థం.

మూతి మూరెడు పొడవు పెట్టుకొని వచ్చాడు

మార్చు

అసంతృప్తిగా వచ్చాడని అర్థం.

మూతి మీద మీసం వుంటే.....

మార్చు

నిజంగా మగవాడివే అయితే........ అని అర్థం.

మూతి విరుపులు

మార్చు

తిరస్కారాలు అని అర్థం.

మూతి ముక్కు విసరటం

మార్చు

అసంతృప్తిని తెలపటం .

మూతులు నాక్కుంటున్నారు

మార్చు

చాల అన్యోన్నంగా కలిసి మెలిసి వుంటున్నారని అర్థం.

మెడ నెట్టించుకోవడం

మార్చు

బహిష్కార శిక్షను అనుభవించడం

మెత్తటి కత్తి

మార్చు

ఉండదు.అసంభవం, అసమంజసం.

మెత్త బడ్డాడు

మార్చు

శాంతించాడు అని అర్థం: ఉదా: వాడు ఇప్పటికి శాంతించి మెత్త బడ్డాడు.

మెదడు మోకాళ్లలొ వుంది

మార్చు

తెలివి తక్కువ వాడు: ఉదా: వానికి మెదడు మోకాళ్లలో ఉంది.

మెరుగు తగ్గడం

మార్చు

గొప్పతనం నశించడం

మెరుపు దీపమవుతుందా?

మార్చు

తాత్కాలికమైనవి ఏవీ శాశ్వత ప్రయోజనాలను చేకూర్చలేవు. క్షణకాలంపాటు మెరిసే మెరుపులు దీపాలకు ప్రత్యామ్నాయంగా వాడాలంటే సాధ్యమయ్యే పనికాదు.

మెడలు వంచడం

మార్చు

బలవంతంగా లొంగదీయడం (గర్వం అణచాలి అనే అర్థంలో కూడా వాడతారు)

మేకపోతు గాంభీర్యం

మార్చు

పైకి మాత్రమే ధైర్యంగా కనబడే వారు

మేడికాయ బోనం

మార్చు

మేనమామ పోలిక

మార్చు

మేషపుచ్ఛం

మార్చు

మొక్కుబడిగా పని చేస్తున్నారు

మార్చు

పని మీద ద్యాస లేకుండా పనిచేస్తున్నారు: ఉదా: పని చేయడం ఇష్టంలేకుంటే మానేయండి. మొక్కుబడిగా పని చేయడమెందుకు?

మొగ్గలోనే నేలరాలటం

మార్చు

ప్రారంభ దశలోనే అంతమైపోవటం, పండుస్థాయి దాకా వెళ్ళకుండానే మొగ్గగా ఉన్నప్పుడే రాలిపోవటం, జరగాల్సిన పనంతా ఆగిపోవటం

మొగలిపొద

మార్చు

మొత్తు కుంటున్నాడు

మార్చు

చాల బాధ పడుతున్నాడు/అరుస్తున్నాడని ..... అర్థం.,

మొట్టి కాయలేశారు

మార్చు

చీవాట్లు పడ్డాయని అర్థం: ఉదా: ఆ విషయంలో వారికి కోర్టు వారు మొట్టికాయలేశారు.

మొరాయించాడు

మార్చు

మొండి కేస్తున్నాడు: ఉదా: ఆ పిల్లవాడు బడి కెళ్లడానికి మొరాయిస్తున్నాడు.

మొసలి కన్నీరు కారుస్తున్నారు

మార్చు

దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు అని అర్థం:

మోకాల్లో మెడ నరం పట్టిందన్నట్టు

మార్చు

అసంబద్ధమైన కారణాలు చూపటం

మోకాళ్ళు ముందుకు, మోచేతులు వెనక్కు

మార్చు

వార్ధక్యం వచ్చిందని చెప్పటం.వయస్సులో ఉండి ఓపిగ్గా ఉన్న వ్యక్తులు నిటారుగా నిలుచుంటారు. అదే వయస్సుడిగి ముసలితనం వస్తే బాగా వంగిపోతారు. అప్పుడు మోకాళ్ళు ముందుకు, మోచేతులు వెనక్కు వచ్చినట్లు కనిపిస్తాయి.

మోచేతి నీళ్ళు తాగటం

మార్చు

ఇంకొకరిమీద ఆధారపడటం.హీన స్థితిలో ఒకరి కింద బతుకుతూ ఉండటం. దోసిలి పట్టి ఓ వ్యక్తి నీరు తాగుతుంటే అతడి చేతి నుంచి నేలకు జారే కొద్దిపాటి ఎంగిలి నీళ్ళ చుక్కలను మరో వ్యక్తి తాగే ప్రయత్నం చేస్తుండే స్థితి ఎంత నీచమైందో

మోచేతి బెల్లం

మార్చు

మోతెక్కిపోవటం

మార్చు

బాగా ప్రచారంలో ఉండటం

మోపు చేయటం

మార్చు

ప్రోత్సహించటం, సహకరించటం

మెత్తబడటం

మార్చు

అంగీకరించటం, ఒప్పుకోవటం

మోక్షం కలగడం

మార్చు

పూర్తికావడమనే అర్ధం. ఉదా: ఈపనికి ఈ నాటికి మోక్షం కలిగింది అంటుంటారు.

మొండిరావి

మార్చు

ముందు, వెనుక ఎవరూ లేకపోయినా మహా మొండిగా ప్రవర్తిస్తూ ఎవరినీ లెక్కచేయకుండా తిరిగేవాడిని మొండి రావిచెట్లు అంటుంటారు.

మింగుడుకళ

మార్చు

దోచుకోవడం

మోదుగుల అడవి-మొగుడున్న ఇల్లు

మార్చు

మోదుగ చెట్లు ఆకులతో, బాగా పూసిన పూలతో నిండుగా ఉంటాయి. అది వైద్యానికి కూడా ఉపకరిస్తుంది. ఆ చెట్లుంటే అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ చెట్టు ఆకులు నేలరాలి మట్టిలో కలిస్తే భూమి సారవంతంగా అవుతుంది. మొగుడున్న ఇల్లు కూడా సంపాదనతో కళకళలాడుతుంటుంది. అందుకనే అడవిలో మొదుగ ఉంటే ఎంత విలువో ఇంటికి మొగుడు ఉంటే అంతే విలువ.

మౌన వ్రతం పట్టారా?

మార్చు

మాట్లాడం లేదు: ఉదా: మౌన వ్రతం పట్టారా? ఒక్కరు మాట్లాడరు.

మంచిని సమాధి చేశారు

మార్చు