భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "మ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

మంగలిని చూసి గాడిద కుంటినట్లు

మార్చు

పూర్వ కాలం మంగలి వాళ్లు పల్లె వాసులకు గోళ్లు తీసేవారు: అలాగే కాలిలో ముల్లు గుచ్చుకుని విరిగితే దాన్ని కూడా తీసేవారు. ఆ విధంగా గాడిద మంగలిని చూసి తన కేదో ముల్లు గుచ్చు కున్నట్టు నటించిందట కుంటుతూ:

మంగలిని చూచి ఎద్దు కాలు కుంటినట్లు

మార్చు

పూర్వ కాలం మంగలి వాళ్లు పల్లె వాసులకు గోళ్లు తీసేవారు: అలాగే కాలిలో ముల్లు గుచ్చుకుని విరిగితే దాన్ని కూడా తీసేవారు. ఆ విధంగా ఒక ఎద్దు మంగలిని చూసి తన కేదో ముల్లు గుచ్చు కున్నట్టు నటించిందట కుంటుతూ:

Offensive

మంగలి వాడి దృష్టి అందరి జుట్టుమీదే

మార్చు

Offensive

మంగలివాని యింటివెనుక దిబ్బ తవ్వినకొద్దీ వచ్చేది బొచ్చే

మార్చు

మంచం మీద వున్నంతసేపే మగడు - కిందికి దిగితే యముడు

మార్చు

మంచం మీద రాసలీల చేసుకున్నంత సేపు మంచిగా నటిస్తున్న మొగుడు మంచం దిగగానే సీరియస్ మోడ్ కి వెళ్తాడు.

మంచం వేసేంతవరకే ఇద్దరం - మంచం ఎక్కాక ఒక్కరవుదాం అందట

మార్చు

మంచమంతా మదన రాజ్యమే నడచిరారా ఏలుకుందాం అందట

మార్చు

మంచమెక్కిన తర్వాత విందు లేదన్నట్లు

మార్చు

మంచమెక్కిన మీదట మర్యాదలేల?

మార్చు

మంచమెక్కి వావి వరుస లడిగినట్లు

మార్చు

మంచాల తమకాలకు ఒయ్యారాల నజరానాలన్నట్లు

మార్చు

మంచి ఆలి కొక మాట - మంచి ఎద్దు కొక వాత

మార్చు

మంచికి పోతే చెడు ఎదురైనట్లు

మార్చు

మంచి కొంచమైనా చాలు

మార్చు

మంచి గొడ్డుకొక దెబ్బ - మంచి మనిషికొక మాట

మార్చు

మంచి చెడ్డలు పడుగు పేకలు

మార్చు

మంచి మరణంలో తెలుస్తుంది

మార్చు

మంచి మాటకు మంది అంతా మనవాళ్ళు

మార్చు

మంచివాడు మంచివాడు అంటే యిల్లంతా నాశనం చేశాడట

మార్చు

మంచివాడికి మాటే దెబ్బ

మార్చు

మంత్రం లేని తీర్థం మరి బక్కెడు

మార్చు

మంత్రం లేని సంధ్యకు మరి చెంబుడు నీళ్ళు

మార్చు

మంత్రంలో పస లేకపోయినా తుంపర్లకు కొదవలేదు

మార్చు

మంత్రసాని పనికి ఒప్పుకొన్నాక ఏది వచ్చినా పట్టాలి

మార్చు

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?

మార్చు

మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు

మార్చు

మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట

మార్చు

మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి తూలుతున్నడు

మార్చు

మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి

మార్చు

మందికి నీతి చెప్పాను కానీ - నీకూ నాకూ కాదు అన్నాడట

మార్చు

ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు వున్నాయని చెప్పే సామెత ఇది

మందిని మ్రింగే యిల్లుండాలి గానీ - ఇంటిని మ్రింగే మంది ఉండరాదు

మార్చు

మందిని ముంచి గుడి కట్టినట్లు

మార్చు

మందుకు పథ్యం - మాటకు సత్యం

మార్చు

మందుకు పోయినవాడు మాసికానికి వచ్చినట్లు

మార్చు

మందూ, మాకూ లేదన్నట్లు

మార్చు

మక్కాకు పోయినా టక్కరితనం మానలేదు

మార్చు

మనకి లేదు అని ఏడిస్తే ఒక కన్ను పోయిందంటా ఎదుటి వాడికి ఉందీ అని ఏడిస్తే రెండో కన్ను పోయిందంటా

మార్చు

మంచి వాణ్ణి డబ్బిచ్చైనా కొనుక్కోవాలి, చెడ్డవాణ్ణి డబ్బిచ్చి వదిలించు కోవాలి

మార్చు

మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి

మార్చు

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?

మార్చు

మంత్రాలు పనిచేస్తాయనేది ఒట్టి మూడ నమ్మకమని దీని అర్థం: మంత్రాలకు చింత కాయలు రాలవు. ఇంత చిన్న పని కూడా చేయలేని మంత్రాలు ఇంకేం పని చేయగలవు.

మంది ఎక్కువైతే, మజ్జిగ పల్చనవుతుంది

మార్చు

భోజనాల సమయంలో వచ్చిన అతిథులకు సరిపడా వంట కాలుంటాయి. అను కోకుండా అంతకన్నా ఎక్కువ మంది వస్తే ఉన్న మజ్జిగలో ఇంకో రెండు చెంబుల నీళ్లు పోస్తారు అందరికి సరిపోవడానికి. ఆ విధంగా మందెక్కువయితే మజ్జిగ పలచనవుతుంది. ఆ సందర్భంగా పుట్టినదే ఈ సామెత.

మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట

మార్చు

అసలుకే లేదురా మొగుడా అంటే.... పెసర పప్పు వండ మన్నాడట. అలాంటిదే ఈ సామెత కూడ

మగడు విడిచిన ముండ - మబ్బు విడిచిన ఎండ

మార్చు

మగని చుట్టాలు చెప్పులు ముంగిట్లో విడిస్తే - ఆలి చుట్టాలు వంటింట్లో విడుస్తారు

మార్చు

మగనికి మాడు చెక్కలు - మిండడికి పంచభోజ్యాలు

మార్చు

మగ్గం చేసిన తప్పు సాలె తీర్చాలి

మార్చు

ఏపనిలో తప్పు జరిగితే ఆ పనిలో నేర్పు ఉన్నవారు మాత్రమే సరి చేయగలరు. వేరెవ్వరు చేయలేరు... ఆ సందర్భంగా ఈ సామెతను వాడతారు.

మగ్గంలోని కెండెలాగా కొట్టుకోవడం

మార్చు

మగువే మగవాడికి మధుర భావన

మార్చు

మఘ ఉరిమితే మదురు మీద కర్ర అయినా పండుతుంది

మార్చు

మఘ, పుబ్బలు వరుసయితే క్షామం

మార్చు

మఘలో మానెడు - పుబ్బలో పుట్టెడు

మార్చు

మట్టిపనికైనా స్వంతవాడే కావాలి

మార్చు

మట్టిలో మాణిక్యంలాగా

మార్చు

మట్టెల చప్పుడే కానీ చేసే పనేమీ లేదు

మార్చు

మడికి గట్టు, యింటికి గుట్టు, మాటకు మంచి కావాలి

మార్చు

మడి బీదకాదు - రైతే బీద

మార్చు

మతము తలకు ఎక్కితె బుద్ది పదాలకు దిగులు.

మార్చు

మతి ఎంతో గతి అంత

మార్చు

గతిలేనమ్మకి మతిలేని మొగుడు

మార్చు

మతిలేని మాటకు శృతిలేని పాట

మార్చు

మదిలో ఒకటి - మాటలో ఒకటి

మార్చు

మద్దెల పోయి రోలుతో మొర పెట్టుకున్నట్లు

మార్చు

మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?

మార్చు

తప్పు మన దగ్గర పెట్టుకొని ఇతరులను నిందించ తగదు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత.

మన బంగారం మంచిదయితే కంసాలిని వన్నె అడగడం దేనికి?

మార్చు

==మన్మథ రాజ్యంలో ముద్దుల మద్దెల మోతలే వుంటాయన్నట్లు

మనసుంటే మార్గముంటుంది

మార్చు

ఏపనికైనా మనసు లగ్నము చేసి పని చేయాలని అర్థం.

మనసుకు మనసే సాక్షి

మార్చు

మనసుకు ముఖమే సాక్షి

మార్చు

మనసు మంచిదే - గుణమే గుడిసేటిది

మార్చు

మనసున నాటిన మాటలు చెరుపలేరు

మార్చు

మనసు మనువు కేడిస్తే - వీపు దెబ్బల కేడ్చిందట

మార్చు

మనసు విరిగితే అతుక్కోదు

మార్చు

మనసు మహామేరువు దాటుతుంది - కాలు కందకం దాటదు

మార్చు

మనసు లేని మనువులాగా

మార్చు

మనసులో ఏముంటే సోదిలో అదే వస్తుంది

మార్చు

మనసులో చింతకు మందులేదు

మార్చు

మనసు కుదిరితే మల్లి - కుదరకుంటే ఎల్లి

మార్చు

మనసైన అమ్మాయి నవ్వు మన్మథుని శరమైన పువ్వన్నట్లు

మార్చు

మనసైన చినదాని చూపు కోటి కోర్కెల పిలుపు

మార్చు

మనిషి కాటుకు మందు లేదు

మార్చు

మనిషికి ఉన్నది పుష్టి - గొడ్డుకు తిన్నది పుష్టి

మార్చు

మనిషికి కాక మానులకు వస్తాయా కష్టాలు?

మార్చు

మనిషికి మాటే అలంకారం

మార్చు

మనిషికొక తెగులు మహిలో వేమా

మార్చు

మనిషి చస్తే మాట మిగులుతుంది

మార్చు

మనిషి పేదయితే మాటకు పేదా?

మార్చు

మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు

మార్చు

మనిషి బయటకు ఎలా కనబడుతున్నా... లోన అతని అంతరంగం ఎలా ఉంటుందో బయటకు తెలియదు. అలాగే మానుకు లోన ఎంత చేవ ఉన్నదో బయటకు తెలియదు.

మనిషి సంగతి మాట చెపుతుంది

మార్చు

మనిషికో మాట గొడ్డుకో దెబ్బ

మార్చు

మనిషి తెలివున్న వాడు వానికి మాటలు అర్థం అవుతాయి. పశువుకు మాటలు రావు. తెలివి లేదు. దానికి ఒక దెబ్బ వేస్తే అది చెప్పిన మాట వింటుంది. ఆ విధంగా ఈ సామెతను వాడు తారు.

మనుషులు పోయినా మాటలు వుంటాయి

మార్చు

మనుగుడుపుల అల్లుడూ - చెరకు తోటలో ఏనుగూ ఒక్కటే

మార్చు

మనువాడిన తర్వాతే అందాల విందులు అందిట

మార్చు

మనువొక చోట - మనసొక చోట

మార్చు

మనోవ్యాధికి మందు లేదు

మార్చు

మన్ను తిన్న పామువలె

మార్చు

మన్ను పడితే బంగారం - బంగారం పడితే మన్ను

మార్చు

మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలక బోసుకున్నట్లు

మార్చు

అత్యాశకు పోతే మిగిలేదేమి ఉండదని చెప్పే సామెత ఇది.

మరదలి సరసం మొగలి పువ్వుల వాసన వంటిది

మార్చు

మర్యాదకు పోతే మానం దక్కదు

మార్చు

మర్రి చెట్టుక్రింద మొక్కలు కావు

మార్చు

మర్రి చెట్టు కింద మొక్క మొలవదు

మార్చు

మరుని విందుకు పరదా లెందుకు?

మార్చు

మరులున్నవాడే మగడు

మార్చు

మర్దనం గుణవర్ధనం

మార్చు

మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడతాయి

మార్చు

మృగశిర కురిస్తే ముసలి ఎద్దు రంకె వేస్తుంది

మార్చు

మృగశిరలో ముల్లోకాలు చల్లబడతాయి

మార్చు

మృగశిరలో వేసిన పైరు, మీసాలు రావడంతో పుట్టిన కొడుకు మేలు

మార్చు

మృగశిర కురిస్తే మఖ గర్జిస్తుంది

మార్చు

మరో లోకానికి వెళ్ళినా మారుటి తల్లి వద్దు

మార్చు

మలప బుద్ధులు - పిదప చేష్టలు

మార్చు

మలప సన్యాసి వేషాలు వేసినట్లు

మార్చు

మలుగులు క్రుంగితే మాపటికి ఈనుతుంది

మార్చు

మల్లెల జ్వరానికి అందాల గంధమే మందు అన్నట్లు

మార్చు

మల్లెల మంచం మీదే మన్మథ లంచం అన్నదట

మార్చు

మల్లెల వేళలో వయసు సొగసుల విందు లన్నట్లు

మార్చు

మసి పాత్రలో మాణిక్యంలాగా

మార్చు

మసి పూసి మారేడు కాయ చేసినట్లు

మార్చు

మోసము చేసే వారి గురించి ఈ సామెతను చెప్తారు

మసి మొగంగాడూ, చమురు కాళ్ళవాడూ జతకలిసినట్లు

మార్చు

మహాజనానికి మరదలు పిల్లన్నట్లు

మార్చు

మహారాజని మనవి చేసుకుంటే, మరి రెండు తగిలించమన్నాడట

మార్చు

మహాలక్ష్మి పండుగకు మాడెత్తు చలి

మార్చు

మహా వ్యసనాలుంటే గానీ మహాత్ములు కాలేదన్నట్లు

మార్చు

మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళో వేసుకుంటామా?

మార్చు

మాంసం తినేవాడు పోతే ఎముకలు కొరికే వాడు వస్తాడు

మార్చు

మా ఆయనే ఉంటే మంగలి వాణ్ణయినా పిలుచుకొని వచ్చేవాడు అన్నదట

మార్చు

అమాయకపు స్త్రీల గురించి ఈ సామెత చెప్తారు. వివరణ. పూర్వం మగడు చనిపోయిన స్త్రీలు గుండు గీయించుకునే వారు. ఆ విధంగా ఒక విధవ స్త్రీ గుండు గీయించు కోడానికి మంగలిని పిలవాలని చూసి .... చూసి ఎవరు దొరకలేదట..... అప్పుడు తన మగడు ఉండుంటే మంగలిని పిలుచుక వచ్చే వాడు గదా...... అని వాపోయిందట. మగడు వుంటే గుండు గీయించుకో నవసరము లేదనే జ్ఞానం ఆమెకు లేది.

మా ఇంటి కొస్తే ఏం తెస్తావు? మీ ఇంటి కొస్తే ఏం పెడ్తావు?

మార్చు

అంతా ఎదుటి వారినుండి రాబట్టడమే గాని తననుంచి ఏమి ఇవ్వని వారి గురించి ఈ సామెత పుట్టింది

మా గేదె చస్తే చచ్చిందిగానీ ఎదురింటి గేదె పాలివ్వకపోతే చాలు

మార్చు

ఇతరులకు కష్టాలు రావాలనే వారి నుద్దేశించి ఈ సామెత పుట్టింది

మాఘమాసపు చలి మంటలో పడ్డా తీరదు

మార్చు

మాఘమాసపు వాన మగడు లేని జాణ

మార్చు

మాఘమాసపు చలికి చెట్లుకూడా వణుకుతాయి

మార్చు

మాఘ మాసంలో చలి అత్యధికంగా వుంటుందని ఈ సామెతకు అర్థము.

మాచకమ్మ సౌందర్యంలాగా

మార్చు

మాచకమ్మ అనగా మీసాలున్న స్త్రీ అని అర్థము. అన సౌందర్యవతి కాదని అర్థము.

మాటకారి - నీటుగాడు

మార్చు

మాటకు ప్రాణంగానీ మూటకు ప్రాణమా?

మార్చు

మాటకు మాట తెగులు - నీటికి నాచు తెగులు

మార్చు

మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి

మార్చు

మాటకు ముందు ఏడ్చేవాడిని - నవ్వే ఆడదానిని నమ్మరాదు

మార్చు

మాటకు హరిశ్చంద్రుడి లాగా

మార్చు

హరిశ్చంద్రుడిలాగా అబద్దం చెప్పని వాడని అర్థము.

మాకు జయం - మీకు ఋణం

మార్చు

మాట గొప్ప చెప్ప మాటలు చాలవు

మార్చు

మాట చుట్టమా? పెట్టు చుట్టమా?

మార్చు

మాట పోయాక ప్రాణం వున్నా ఒకటే పోయినా ఒకటే

మార్చు

నిజాయితీగా వుండే వారు మాటకు ప్రాణంకన్న విలువిస్తారని ఈ సామెతకు అర్థము.

మాట మీకు - మూట మాకు

మార్చు

మాటల పసేగానీ చేతల పస లేదు

మార్చు

మాటలు ఎక్కువ పని తక్కువ చేసే వారి గురించి ఈ సామెతను వాడుతారు

మాటలతో మూటలూ, మాన్యాలు సంపాదించవచ్చు

మార్చు

మాటలు కోటలు దాటుతాయ్‌ కాళ్ళు గడప దాటవు

మార్చు

మాటలు చెప్పే మొనగాళ్లేగానీ బత్తెమిచ్చే పుణ్యాత్ములు లేరు

మార్చు

మాటలు నేర్చిన కుక్కల్ని వేటకు తీసుకెళితే యిస్కో అంటే యిస్కో అన్నాయట

మార్చు

మాటలు నేర్చినమ్మ ఏడ్చినా అందమే

మార్చు

మాటలు, పాటలు మాయింట్లో, మాపటి భోజనం మీ యింట్లో

మార్చు

మాట మంచి - చేత చెడ్డ

మార్చు

మాట లేకుంటే చోటే లేదు

మార్చు

మాటలే మంత్రాలు - మాకులే మందులు

మార్చు

మాటల్లోపడి మగణ్ణి మరచినట్లు

మార్చు

మాటల్లో మరులు - చేతల్లో స్వర్గాలు

మార్చు

మాట్లాడితే మల్లెలు - కాట్లాడితే కందిరీగలు

మార్చు

మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు

మార్చు

కొంతమంది వారి తాతలు, ముత్తాతలు, తండ్రుల గూర్చి లేనిపొని గొప్పలు చెబుతారు, కాని ప్రస్తుతం వారేమి చేస్తున్నారో చెప్పారు. వాళ్ళ తాతలు చేసిన గొప్ప పనులకు వీళ్ళని పొగడాలని వీరి కోరిక. అటువంటివారిని ఎవరూ మెచ్చరు. అలాంటివారిని ఉద్దేశించి చెప్పినదే ఈ సామెత.

మానం చూపి ప్రాణం తీసినట్లు

మార్చు

మానం పోయిన తర్వాత ప్రాణం ఎందుకు?

మార్చు

మానవ సేవే మాధవ సేవ

మార్చు

మానిందే మందు - బ్రతికిందే బ్రతుకు

మార్చు

మానిన పుండును రేపినట్లు

మార్చు

మాపటికి మనసు - రేపటికి సొగసు అన్నట్లు

మార్చు

మాపటేళ ఆకలి, పెదవుల దాహం తీరవన్నట్లు

మార్చు

మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు

మార్చు

తన వారి గురించి లేని పోని గొప్పలు చెప్పుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.

.

మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లు

మార్చు

లేని పోని గొప్పలు చెప్పుకునే వారిని బట్టి ఈ సామెత పుట్టింది.

మాటలు కోటలు దాటుతాయి కాని చేతలు గడప దాటవు

మార్చు

ప్రగల్భాలు పలికే వారిని గురించి ఈ సామెతను వాడతారు.

మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట

మార్చు

మాతాకబళం తల్లా అంటే ... మా ఆయనెక్కడైనా కనిపించాడా ? అన్నదట ఆ ఇల్లాలు.

మార్చు

అత్యంత చమత్కార వంతమైన ఈ సామెతకు కొంత వివరణ కావాలి. అదేమంటే::: ఒక బిచ్చగాడు ఒకరి ఇంటి ముందు నిలబడి మాదాకవళం తల్లా అన్నాడట. దానికి ఆ ఇల్లాలు అతనితో.. మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడా అని బదులిచ్చింది. దానికి ఆ బిచ్చగాడు కనిపిస్తే పంపిస్తాలే తల్లీ అని అక్కడి నుండి వెళ్లి పోతాడు. ఆ ఇల్లాలి మాటలోని మర్మం బిచ్చగానికి బాగా అర్థం అయింది. ఆ ఇల్లాలు తన గుట్టును విప్పిచెప్పకుండా చెప్పిన సమాధానం ఎంతో చమత్కార వంతమైనది. అసలు విషయం ఏమంటే.... ఆ ఇల్లాలు భర్త కూడా బిచ్చగాడే. అతను బిచ్చం తెస్తేగాని ఇంట్లో తినడానికి ఏమి లేదు. ఆమె అన్న ఆమాటతో పరిస్థితి అర్థమైన ఆ బిచ్చగాడు సరైన సమాధానం చెప్పి వెళ్లి పోతాడు.

మామ బంతిన కూర్చుని అత్త బంతిన లేచినట్లు

మార్చు

మామా ఒకింటి అల్లుడే

మార్చు

అత్తా ఒకింటి కోడలే అన్న సామెత లాంటిదే ఇదీను

మామిళ్ళకు మంచు చెరుపు - కొబ్బరికి కుడితి చెరుపు

మార్చు

మారులేని తిండి మాలతిండి

మార్చు

మార్గశిరలో మాట్లాడటానికి ప్రొద్దుండదు

మార్చు

మార్గసిరలో సూర్యుడు తొందరగా అస్తమిస్తాడని అర్థము ( పగటి సమయం తక్కువ)

మాలకూటికి పోయినా పప్పు నీళ్ళే

మార్చు

మాల పల్లెలో మంగళాష్టకాలు

మార్చు

మాల బడాయి పాటి మీద - మొగుడి బడాయి ఆలి మీద

మార్చు

మావి మాకిస్తే రాజ్యమిచ్చినట్లే

మార్చు

మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె

మార్చు

తినటానికి తిండి లేనపుడు మీసాలకి సంపెంగ నూనె కావాలనడం వినేవారికి హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే ఉన్నదానితో సంతృప్తి పడక అతిగా ఆశ పడే వారిని ఈ సామెతతో పోలుస్తారు.

మింగ మెతుకులేదు, లంజకు లత్తుకట

మార్చు

మింగ లేక మంగళవారం అన్నాడట

మార్చు

పని చేతకాక పోతే తనకు చేతకాదని ఒప్పుకోడానికి అహం అడ్డు వస్తుంది. అందుకని ఏదో సాకు చెప్పి తప్పించుకుంటారు. అంతే గాని వారి అసమర్థతను బయట పెట్టరు. అలాంటి వారికి ఈ సామెత. ఇదే అర్థంతో మరొక సామెత ఉంది. అది. "ఆడ లేక మద్దెల ఓడు అన్నాడట"

మింటికీ, మంటికీ ముడి వేసినట్లు

మార్చు

మిండలను మరిగినమ్మా, మీగడ తిన్నమ్మా ఊరుకోరు

మార్చు

మిడతంభొట్ల జోస్యంలాగా

మార్చు

మితం తప్పితే హితం తప్పుతుంది

మార్చు

మిధునంలో పుట్టిన మొక్కా, మీసకట్టుతో పుట్టినకొడుకూ అక్కర కొస్తారు

మార్చు

మిన్ను విరిగి మీదపడ్డట్లు

మార్చు

మీ ఇంట్లో తిని మా యింట్లో చేయి కడుగమన్నట్లు

మార్చు

మీఊరు మాఊరికెంత దూరమో మాఊరు మీవూరికంతేదూరం

మార్చు

అంతా ఒకటే ఆనే అర్థంలో చెప్పే సామెత ఇది. ఇలాంటిదే మరొక సామెత కూడా ఉంది. అది: ఈ గుడ్డ ముక్క కూడ ఆ తాను లోనిదే ఈ పేడు కూడ ఆ మొద్దులోనిదే

మీకు మాట నాకు మూట

మార్చు

మీద మెరుగులు - లోన పురుగులు

మార్చు

మీన మేషాలు లెక్క పెట్టినట్లు

మార్చు

ముంజేతి కంకణానికి అద్దమేల ?

మార్చు

ముంజేతి కంకణం అద్దం లేకుండానే మామూలుగా చూసు కోవచ్చు. అనవసరమైన పని చేయకూడదని అర్థం.

ముండకు దొరికేది మోటు మొగుడే

మార్చు

ముండకు దొరికేవి మొండి శిశినాలే

మార్చు

ముండ మొయ్యవచ్చు గానీ నింద మొయ్యరాదు

మార్చు

ముండా కాదు, ముత్తయిదువా కాదు

మార్చు

ముడ్డి తనది కాక పోతే గోదావరి దాక డేక మన్నాడట

మార్చు

ఇతరులు కష్ట పడు తుంటే చూసి ఆనందించే వాళ్ల గురించి ఈ సామెత పుట్టింది.

ముడ్డి తనది కాకపోతే తాడికి ఎదురు దేకమన్నాడట

మార్చు

ఇతరులు కష్ట పడు తుంటే చూసి ఆనందించే వాళ్ల గురించి ఈ సామెత పుట్టింది.

ముంతపాలు కుర్రాడికి - బంతులాట మంచానికి

మార్చు

ముందరికాళ్ళకు బంధాలు వేసినట్లు

మార్చు

ముందరున్నది ముసళ్ళ పండుగ

మార్చు

ముందు ఆకు తెచ్చుకుంటే ఎప్పుడైనా తినవచ్చు

మార్చు

ముందుకు పోతే మురికి ముండ - వెనుకకు పోతే వెర్రి ముండ

మార్చు

ముందు నుయ్యి వెనుక గొయ్యి

మార్చు

ఎటు పోవడానికి దారి లేదని అర్థం. అన్ని దారులు మూసుకపోయాయని దీని అర్థం.

ముందుంది ముసళ్ళ పండుగ

మార్చు

ఇది ఎంత మాత్రము మొసళ్ళ పండగ కాదు. not crocodile.. ముసలం అంటే రోకలి అని అర్థం. రోకళ్ళ పండగ ముందు ఉంది అని అర్థం.

ముందూ నడిచే ముతరాచువాణ్ణీ - వెనుకనడిచే ఏనాది వాడినీ నమ్మరాదు

మార్చు

ముందు పెళ్ళాం బిడ్డలు మెతుకులేక ఏడుస్తుంటే ఉంచుకున్నదానికి పిల్లలులేరని పూజలు చేసాట్ట

మార్చు

ముందు ముచ్చట్లు -వెనుక చప్పట్లు

మార్చు

ముందు మురవబోకురా ముతరాచు వాడా అన్నట్లు

మార్చు

ముందు మురిసినమ్మకు పండుగ గుర్తుండదు

మార్చు

ముందు మూడుముళ్ళ ముచ్చట - తర్వాత సోయగాల జాతర అందట

మార్చు

ముందు వాళ్ళకు మూకుళ్ళు - వెనుక వాళ్ళకు నాకుళ్ళు

మార్చు

ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి

మార్చు

దూడలకు పుట్టి నప్పుడే చెవులు ఉంటాయి. ఆ తర్వాతనే కొమ్ములు మొలుస్తాయి. కాని చెవులకన్నా ఆ తర్వాత వచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయి.

ముక్కు ఉండేంత వరకే పడిశ ముంటుంది

మార్చు

ముక్కు ఏదంటే తల చుట్టూ త్రిప్పి చూపినట్లు

మార్చు

ముక్కు కోసినా మొదటి మొగడే మేలు

మార్చు

ముక్కు మూరెడు సిగ బారెడు

మార్చు

ముక్కు మూసుకుంటే మూడు ఘడియలు

మార్చు

ముక్కులో ఏ వేలు పెట్టినా సరిపోతుంది

మార్చు

ముక్కులో చీమిడుందంటే, నీ చేత్తోనే తీయమన్నట్లు

మార్చు

ముక్కూ మొహం తెలీనట్లు

మార్చు

ముఖం అందం మానానికి చేటు

మార్చు

ముఖం చూచి బొట్టు పెట్టినట్లు

మార్చు

ముఖంలో సుఖంలేదు - మోకాళ్ళలో బిగువు లేదు

మార్చు

ముఖారవిందం - భజగోవిందం

మార్చు

ముగ్గురికి తెలిస్తే మూడు లోకాలకు ప్రాకుతుంది

మార్చు

ఏదైనా రహస్యం ఇద్దరి మద్యలోనే వుండాలని అర్థం. మూడో వానికి తెలిస్తే అందరికి తెలిసిపోతుందని ఈ సామెతకు అర్థము

ముట్టుకుంటే ముత్యం - పట్టుకుంటే బంగారం

మార్చు

ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదే

మార్చు

పిల్లల ఏడుపు ఆపడానికి జోల పాడ తారు. ముడ్డి గిల్లితే పిల్లలు ఏడుస్తారు. అలా ఏడిపించి ఓదార్చడం అంటే చేస్తున్న పనిలో నటన ఉన్నదని అర్థం.

ముడ్డిక్రిందకు నీళ్ళు వస్తే కానీ లేవరు

మార్చు

ముడ్డి మీద తన్నితే మూతి పళ్లు రాలాయట

మార్చు

ముత్యపుచిప్పలన్నీ ఒక చోట - నత్తగుల్లలన్నీ ఒకచోట

మార్చు

ముత్యమంత పదునుంటే మూల కార్తెలో చల్లినా ఉలవచేను పండుతుంది

మార్చు

ముత్యాలు, పగడాలు, ముట్టుకుంటే జగడాలు

మార్చు

ముదిమిన ముచ్చట్లు లావు

మార్చు

ముద్దంటే ఒకింత మత్తు - ఒద్దంటే మరింత కోపం

మార్చు

ముద్ద ముద్దకీ బిస్మిల్లానా!

మార్చు

ముద్దుగుమ్మ కౌగిలింత నిద్రరాని ఆవులింత అన్నట్లు

మార్చు

ముద్దు చేసిన కుక్క మూతి నాకితే - రంకు నేర్చిన రమణి రచ్చ కీడ్చిందట

మార్చు

ముద్దున పేరు, మురిపాన నడక చెడతాయి

మార్చు

ముద్దూ, మురిపెం మావంతు - ముడ్డీ, దొడ్డీ మీవంతు

మార్చు

ముద్దూ మురిపాలు కౌగిళ్ళలోనే అన్నట్లు

మార్చు

ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి

మార్చు

అవకాశం ఉన్నప్పుడే పనులు చక్కబెట్టుకోవాలని ఈ సామెత అర్థం.

మునగానాం తేలానాం మూసివాయనం అన్నట్లు

మార్చు

మునిగితే గుండు - తేలితే బెండు

మార్చు

మునిగి పోయే వాడికి గడ్డి పోచ దొరికినట్లు

మార్చు

ప్రమాదంలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఎంత చిన్న సాయమైనా ఆశిస్తారు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత.

మునిగే వాడికి తెలుసు నీటి లోతు

మార్చు

ముప్పొద్దు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదు

మార్చు

మురిపాలు, ముచ్చట్లు అంటే ముసుగు పెడతాడన్నట్లు

మార్చు

మురిపెం తిరిపెం చేటు - ముసలి మొగుడు మంచానికి చేటు

మార్చు

ముల్లు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముల్లు మీద పడ్డా అరిటాకుకే నష్టం

మార్చు

ఎటు తిరిగి తనకే నష్టం కలిగే పనుల / మాటల గురించి ఈ సామెత పుట్టింది

ముల్లును ముల్లుతోనే తీయాలి

మార్చు

ముళ్ళు వేయటం చేతగాదుగానీ కోక ముడి విప్పనా అంటాడట పాపం!

మార్చు

ముష్టికి నష్టి ఏమిటి?

మార్చు

ముష్టికి నష్టి వీరముష్టి

మార్చు

ముసలి కాలానికి ముప్పుతిప్పలు

మార్చు

ముసలి తనానికి దసరావేషం లాగ

మార్చు

ఏవయసులో చేయాల్చిన పనులు ఆ వయసులోనే చేయాలని లేకుంటే నవ్వుల పాలవుతారని చెప్పే సామెత ఇది.

ముసలివానికి ముండ ముద్దు

మార్చు

ముసలివానికేల దసరావేషాలు

మార్చు

ముసలి ముగ్గురిని మార్చినట్లు

మార్చు

ముసలివాళ్ళ మాట ముళ్ళు లేని బాట

మార్చు

పెద్దల మాట సద్దికూటి మూట అనే సామెత లాంటిదే ఈ సామెత.

ముసుగులో గుద్దులాట

మార్చు

ముహూర్తం చూసుకుని యాత్రకు బయల్దేరితే ముందరి మొగుడు ఎదురు వచ్చాడట

మార్చు

ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు

మార్చు

చింతామణి పాత్రను వెయ్యడానికి నవనవలాడుతూ నాజూకుగా ఉండి యవ్వన ప్రారంభ దశలో ఉన్న స్త్రీలే అర్హులౌతారు. అలాకాక వయసు ఉడిగి, ముసలితనం ముఖంలో స్పష్టంగా కనిపించేవారు చింతామణి పాత్ర వేస్తే ప్రేక్షకులకు చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏ సమయానికి ఏ వయసుకు తగిన పనిని వారుచేయాలికానీ, వేరొకరు చేస్తే బాగుండదు. కొంతమంది ఏ పనికైనా తామేనంటూ ముందుకు వస్తారు. అలా వచ్చేవారు ఆ పనిని తాము చేసినందువల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవడం అవసరమని ఈ సామెత

మూగవాని ముందు ముక్కు గోక్కున్నట్లు

మార్చు

ఎదుటివారికి కోపం తెప్పించే వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు

మూట పోతే పోయింది మాట పోరాదు

మార్చు

మూడు కొప్పులు కూడితే పట్టపగలే చుక్కలు పొడుస్తాయి

మార్చు

మూడు కొప్పులు ఏకమైతే ముల్లోకాలూ ఏకమౌతాయి

మార్చు

మూడు పువ్వులు ఆరు కాయల్లా వెలిగిపోతున్నట్లు

మార్చు

Kudava h

మూడు రోజులుంటే మురికి చుట్టం

మార్చు

మూడునాళ్ళ ముచ్చట

మార్చు

మూడు నెలలు సాముచేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లు

మార్చు

మూడు మాటలు - ఆరు తప్పులు

మార్చు

మూడుముళ్ళ ముచ్చట

మార్చు

మూడొచ్చి ముందుకొస్తే మూడంకె వేసిందట

మార్చు

మూతి ముద్దుల కేడిస్తే వీపు గుద్దుల కేడుస్తుంది

మార్చు

మూచ్చూడను ముక్కాలు దుడ్డు లేదు ముండను చూస్తే దుఖం వస్తుందట

మార్చు

మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది

మార్చు

మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?

మార్చు

మూరెడు పోనేల బారెడు కుంగనేల?సరైన అంచనాలు లేకుండా ముందుకు వెళ్తే బాధపడతారు

మూల కురిస్తే ముంగారు పారు

మార్చు

మూల ముంచు - జ్యేష్ఠ చెరచు

మార్చు

మూల వాన ముంచక మానదు

మార్చు

మూలవిరాట్లు ముష్టెత్తుకుంటూంటే ఉత్సవవిగ్రహాలకు ఊరేగింపట

మార్చు

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు

మార్చు

అసలే జబ్బుపడి మూలుగుతున్న నక్కమీద తాటిపండు పడితే దాని బాధ అధికమౌతుంది. ఇదే విధంగా బాధలతో సతమతమౌతున్న వ్యక్తి మీద మరిన్ని బాధలు పడ్డప్పుడు అతని పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు .

మూలుగులు మునుపటిలాగే - భోజనాలు ఎప్పటిలాగే

మార్చు

మూసి పెడితే పాసి పోయి నట్లు

మార్చు

అనుభవించక దాచి పెట్టి దొంగల పాలు చేసే వారినుద్దేశించి ఈ సామెత వాడుతారు.

మూసివాయనం ముత్తయిదువులాగా

మార్చు

మూసిన ముత్యం - పాసిన పగడం

మార్చు

మెచ్చి మేకతోలు కప్పినట్లు

మార్చు

మెడబట్టి నెడితే చూరుపట్టుకుని వ్రేలాడినట్లు

మార్చు

మెడలో రుద్రాక్షలు - మదిలో మదిరాక్షులు

మార్చు

మెడలో వేసుకున్న పాము ఎప్పటికైనా కరవక మానదు

మార్చు

మెతుకవుతే బ్రతుకవుతుంది

మార్చు

మెత్తగా వుంటే మొత్తబుద్ధి వేస్తుంది

మార్చు

పరుగెత్తే వాడిని చూస్తే తరమాలనిపిస్తుంది అనే సామెత లాంటితే ఈ సామెత

మెత్తని చెప్పుతో కొట్టుము

మార్చు

యాదృశం ముఖం తాదృశీ చపేటికా : సంస్కృతన్యాయములు ముఖమును బట్టియే చెంపకాయ. "... ... ... మెత్తని చెప్పుతో కొట్టుము" అని సామెత.

మెరిసేదంతా బంగారం కాదు

మార్చు

పై మెరుగులు చూసి మోస పోవద్దని అర్థం>

మెరుపు దీపం కాదు - మబ్బు గొడుగు కాదు

మార్చు

మేకకు తెలిసిందంతా మేత సంగతే

మార్చు

మేకపోతు గాంభీర్యంలాగా

మార్చు

మేక వన్నె పులి

మార్చు

పైకి మంచిగా నటిస్తూ లోన మొసపూరిత బుద్ధి గల వారిని గురించి ఈ సామెత చెప్తారు.

మేతకన్నా మసలితేనే బలం

మార్చు

మేత కరణంగానీ కూత కరణం కాదు

మార్చు

మేతకేగాని చేతకు కొరగాడు

మార్చు

తినడం తప్ప పని చేయడని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ సామెత పుట్టింది

మేనత్త పోలిక - మేనమామ చాలిక

మార్చు

మేయబోతే ఎద్దుల్లోకి దున్నపోతే దూడల్లోకి

మార్చు

తిండికి ముందు పనికి వెనుక వుండే వారినుద్దేశించి ఈ సామెత పుట్టింది.

మేలు మరువరాదు - కీడు పలుకరాదు

మార్చు

మేసేగాడిదను కూసేగాడిద వచ్చి చెరచినట్లు

మార్చు

మొండికీ, బండకూ నూరేళ్లాయుష్షు

మార్చు

మొండికి సిగ్గులేదు - మొరడుకు గాలి లేదు

మార్చు

మొండి గురువు - బండ శిష్యుడు

మార్చు

మొండిచేత్తో మూర వేసినట్లు

మార్చు

మొండిచేతి వానికి నువ్వులు తినటం నేర్పినట్లు

మార్చు

మొండివాడు రాజు కన్నా బలవంతుడు

మార్చు

యాచకుల్లో ఒక రకమైన వారున్నారు. వారు రక్త సిక్తమైన తమ పసి బిడ్డను చేటలో పెట్టుకొని ఒకరి ఇంటి ముందు పెట్టి,,, మగ వాడు పెద్ద కొరడాతో తనను తాను కొట్టుకుంటూ భయంకరంగా అరుస్తూ ఉండగా ఒక స్త్రీ ఒక వాయిద్యాన్ని భయంకరంగా వాయిస్తూ వుంటుంది. ఆ ఇంటి వారు బిచ్చం పెట్టునంత వరకు .... వారు అలా భయంకరమైన నృత్యాన్ని చేస్తూనే ఉంటారు. వారి భయంకర కృత్యాలను భరించ లేక ఆ ఇంటి వారు తప్పక బిచ్చం వేస్తారు. అలా వారికి ప్రతి ఇంటి వారు బిచ్చం వేస్తారు. ఆలా వారు బిచ్చం వేయనిదే కదిలి వెళ్ళరు. దీని నుండి పుట్టినదే ఈ సామెత.

మొక్కబోయిన దేవర ఎదురైనట్లు

మార్చు

వెతకబోయిన తీగ కాళ్ళకు అడ్డం పడ్డట్టి అనే సామెత లాంటిదే ఈ సామెత

మొక్కై వంగనిది, మ్రానై వంగునా?

మార్చు

మొక్కగా ఉన్నప్పుడు వంచితే ఏ మొక్కైనా మనకు కావలసిన రీతిలో వంగుతుంది. అదే మొక్క పెరిగి పెద్ద వృక్షమయ్యాక వంచాలని ప్రయత్నిస్తే అది వంగదు. ఆదే విధంగా పిల్లలను బాల్యంలోనే కావలసిన రీతిలో తీర్చిదిద్దుకోవాలి. వారు పెరిగి పెద్దవారైనాక వారి అలవాట్లు, పధ్ధతులు మార్చలేమని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.

మొగమోటానికి పోతే ముండకు కడుపు వచ్చిందట

మార్చు

ఏ విషయంలోనైనా మొగమోటము పనికి రాదని చెప్పే సామెత ఇది. వివరణ: కొండంత రెడ్డి కొంగు పట్టుకున్నాడట.. పాపం ఆమె మొగమోటానికి పోయి సరే నన్నది. దాంతో కడుపు వచ్చింది. మొగమోటానికి పోయినందుకు కలిగిన కష్టం.

మొగబుద్ధి మోటబుద్ధి - ఆడబుద్ధి అపర బుద్ధి

మార్చు

మొగుడికి దిండు - వుంచుకున్న వాడికి దేహం

మార్చు

మొగుడికి మొద్దులు - మిండడికి ముద్దులు

మార్చు

మొగుడికే మగతనం ఉంటే పొరుగింటాయనతో పనేంటి? అందిట

మార్చు

మొగుడి కౌగిలి మొగలి పరిమళం

మార్చు

మొగుడితో పెళ్ళికీ, పిల్లలతో తీర్థానికీ వెళ్ళరాదు

మార్చు

మొగుడిని కొట్టి మొగసాల కెక్కినట్లు

మార్చు

మొగుడిని కొట్టి మొరపెట్టుకున్నట్లు

మార్చు

మొగుడిమీద కోపం ప్రొద్దుగూకేంత వరకే

మార్చు

మొగుడివాసన వచ్చేంతవరకూ ముసలివాసన తప్పదు

మార్చు

మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు

మార్చు

భార్య భర్తల మధ్యన ఎన్నో గొడవలుంటాయి. తిట్టు కుంటారు, కొట్టు కుంటారు. ఆ తర్వాత కొంతసేపటికే ఒక్కటవుతారు. ఇది సహజం. కాని ఈ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇతరులు చూస్తుండగా జరగ రాదు. ఆ వ్యవహారం ఇంటిగుట్టు. ఇతరులు చూస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఆ సందర్భంగా పుట్టినదే ఈ సామెత. తన మొగుడు తనను కొట్టుతుండగా తోడికోడలు చూస్తే ఆ అవమానం భరించ రానిది. అందుకే మొగుడు తనను కొట్టినందుకు కాదు, దీన్ని తన తోటి కోడలు చూసి నవ్వినందుకు బాధ ఎక్కువ.

మొగుడు కొద్దీ వన్నెలు - సిరి కొద్దీ చిన్నెలు

మార్చు

మొగుడు పోయి తానేడుస్తుంటే ఉంచుకున్నవాడు ఊటీవెడదాం అన్నాడట

మార్చు

మొగుడు లేనిదానికి మంత్రసానెందుకు?

మార్చు

మొగుడే ముండా అంటే ముష్టికి వచ్చినవాడూ ముండా అంటాడు

మార్చు

మొదటి దానికి మొగుడులేడు - కడదానికి శోభనమట

మార్చు

మొదటికే మోసమయితే, లాభాలకు గుద్దులాటా?

మార్చు

మొదటి ముద్దుకే మూతి పళ్ళు రాలినట్లు

మార్చు

మొదటి దానికి మొగుడు లేడు కాని, కడదానికి కళ్యాణము అన్నట్లు

మార్చు

మొదలు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు

మార్చు

మొదటే కోతి, పైగా కల్లు తాగింది, ఆపై నిప్పులు త్రొక్కింది

మార్చు

మొద్దు మొహానికి అలంకరణ గూడానా?

మార్చు

మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి జేబులో పెట్టుకున్నాడుట

మార్చు

ఏవస్తువును ఎలా వాడాలో తెలియని తెలివి తక్కువ వాడని అర్థం.

మొరిగే కుక్క కరవదు కరిచే కుక్క మొరగదు

మార్చు

మొరిగే కుక్క లన్నియూ కరిచే ధైర్యము కలవి కావు. అదే విధముగా, పైకి భయంకరముగా మాట్లాడి భయపెట్టు వ్యక్తులందరికి మనలను దెబ్బతేసే సాహసము యుండనవసరము లేదు. అదే చందముగా, కొన్ని కరిచే కుక్కలు మొరగనటులనే మనలను చాటుగా దెబ్బదీయ దలచిన కొందరు ముందుగా హెచ్చరించి రారు. ఈ సామెత వ్యంగ్యముగా ఈ విషయమునే తెలియచేస్తోంది.

మొలది విప్పి తలకి చుట్టుకొన్నట్లు

మార్చు

మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు

మార్చు

మోకాలికి బోడి గుండుకు ముడి వేయడం అసాద్యం. అలా చేశానన్నాడంటే అది అబద్దమని అర్థం.

మోటువాడికి మొగలిపువ్విస్తే మడిచి ముడ్డిలో పెట్టుకున్నాడట

మార్చు

మోచేతి దెబ్బ - మొగుడి కాపురం ఒకటి

మార్చు

మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు

మార్చు

ఎన్నో బరువు బాధ్యతలు మోసే వారిని చూసి ఎదుటివారు తేలికగా తీసుకునే సందర్భంలో ఈ సామెత వాడతాం. కావిడి మోసే వాడికే దాని బరువు తెలిసినట్లు బాధ్యతలని మోసేవాడికే వాటి బరువు తెలుస్తుంది. చూసేవాడికి అది అనుభవంలోకి రాదు.

మోహం లేకపోతే మోదం లేదు

మార్చు

మౌనం అర్ధాంగీకారం

మార్చు

సాధారణంగా మనం నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో మౌనంగా ఉంటాం. అంటే ఆ విషయాన్ని మనం పూర్తిగా తిరస్కరించినట్టూ కాదు, అంగీకరించినట్టూ కాదు. అందుకీ మౌనంగా ఉంటే దానిని ఎదుటివారు అర్ధాంగీకారంగా భావిస్తారు.

మౌనేన కలహం నాస్తి

మార్చు

కలహాలకు కారణము వాగ్వివాదము. అసలు మాట్లాడకుంటే..... వివాదమే లేదు. దీనినే .... ఊరకుండు వాడు ఉత్తమోత్తముడయా అని అన్నారు.

వెలుపలి లింకులు

మార్చు
  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikibooks.org/w/index.php?title=సామెతలు_-_మ&oldid=34525" నుండి వెలికితీశారు