సామెతలు - ఓ
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ-ఘ |
చ-ఛ జ ఝ |
ట ఠ డ-ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ-ష స-హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]
ఇక్కడ "ఓ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.
రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.
ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య
మార్చుఎవరైనా చేసిన సహాయాన్ని మరిచిపోయి కృతఘ్నతతో వ్యవహరించే వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు. అవసరం తీరే వరకూ ముఖ స్తుతి చేసి ఆపై హేళన చేసే నీచ బుద్ధి కలవారిని ఉద్దేశించినదీ సామెత.
- రూపాంతరాలు
- ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య
ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి
మార్చుపేదరికంనుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితినుంచి పేదరికానికి మారిన వారినుద్ధేశించి ఈ సామెత వాడతారు. ఎంతో ఉన్నత స్థితిలో బతికిన కుటుంబం కొన్ని కారణాలవల్ల బాగా చితికిపోయి పేదరికాన్ని అనుభవిస్తుంటే అది ఓడ బండి అవటం. అదే ఓ కుటుంబం పేదరికం నుంచి ఆర్థికంగా బాగా ఉన్నత స్థితికి చేరితే దానిని బండి ఓడ అవటం అనీ అంటారు.
ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు
మార్చుఅసూయతో ఇతరుల సుఖాన్ని చూసి ఓర్వలేని వారి ప్రవర్తనని ఈ సామెత ద్వారా వివరిస్తున్నారు. అసూయాపరుల నోటికి కట్టుబాట్లు ఉండవనీ, కోరని వస్తువులు ఉండవనీ వ్యంగ్యంగా చెబుతున్నారు.
ఓబీ ఓబీ నీవు వడ్లు దంచు నేను పక్కలెగురవేస్తా
మార్చుఓర్చినమ్మకు తేటనీరు
మార్చునీరు మలినముగా ఉన్నపుడు పటిక లాటి పదార్థం వేసి, కాసేపు వేచి చూస్తే తేటనీరు పైకి చేరుతుంది. అలాగే జీవితంలో ఓర్పు ఉన్న వాళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి అని ఈ సామెత అర్ధం.
ఓలి సరసమని గిడ్డి దాన్ని పెళ్లాడితే కుండలన్ని ఒక్కలు కొట్టిందట
మార్చుగతంలో ఆడపిల్లలకు ఎదురు డబ్బులిచ్చి పెళ్లాడే వారు. దానినే ఓలి అని అనేవారు. ఒకడు ఓలి తక్కువని ఒక గుడ్డి పిల్లను పెళ్లాడాట. ఆ పిల్ల ఇంటికొచ్చి గుడ్డిదైనందున..... ఇంట్లో వున్న కుండలన్ని పగల గొట్టిందట, ఇది ఈ సామెతకు నిజార్థము. ఏవస్తువైనా కొనే ముందు..... దాని ధరను కాకుండా దాని గుణగణాలు చూడాలని సూచించేదే ఈ సామెత. ఇది సామెతలో వున్న మర్మార్థం.
- ↑ లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం