సామెతలు - చ, ఛ

(సామెతలు - చ నుండి మళ్ళించబడింది)
భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "చ, ఛ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు

మార్చు

తెలివి తక్కువ వారిని గురించి చెప్పిన సామెత ఇది. ఇలాంటిదె మరొకటి: 'చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికిందట ఒక అమ్మ' అలాంటి మతిమరుపు వారిని గురించి ఈ సామెత వాడతారు.

చంకన పిల్ల - కడుపులో పిల్ల

మార్చు

చంక బిడ్డకు దండం అన్నట్లు

మార్చు

చంకలో పిల్లను వుంచుకుని సంతంతా వెతికినట్లు

మార్చు

మతి మరుపు వారిని గురించి ఈ సామెతను వాడుతారు. "నా బిడ్డేది?, నా బిడ్డేది" అని వెనకటికి ఒకామె ఊరంతా వెతకసాగిందంట. చివరకి ఎవరో చెప్తే కానీ చూసుకోలేదు, బిడ్డ తన చంకలోనే ఉందని!

చేతిలోనే ఏదన్నా ఉంచుకోని వెతికేవారిని చూసి, ఇలా అంటారు. కళ్ళజోడు, పెన్ను, టెలివిజన్ రిమోట్ వంటి వస్తువులను వెతికేవారికి ఈ అనుభవం తరచు ఎదురవుతుంటుంది.

ఇలాంటిదే మరొక సామెత: అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...

చంకెక్కిన పిల్ల చచ్చినా దిగదు

మార్చు

చంద మామను చూసి కుక్కలు మొరిగినట్లు

మార్చు

మంచికి, చెడుకి ఒకే విధంగా స్పందించే వారి గురించి ఈ మాట అంటారు. కుక్కలు దొంగలు వచ్చినా మొరుగుతాయి, చందమామము చూసి కూడా మొరుగు తాయి. వాటికి ఆ తేడా తెలియదు.

చందాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు

మార్చు

చంద్రునికో నూలుపోగు

మార్చు

దానం, ధర్మం, తమ శక్తానుసారం చేసే వారి గురించి ఈ సామెత చెప్తారు.

చక్కదనానికి లొట్టిపిట్ట - సంగీతానికి గాడిద

మార్చు

చక్కనమ్మ చిక్కినా అందమే

మార్చు

అందమైన స్త్రీ ఏ కారణం చేతనైనా సన్నబడినా ఆమెలోని అందం, ఆకర్షణ తగ్గవని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు

మార్చు

దోసకాయ (దీనిని పొడుపు కథలు జాబితాలో చేర్చ వచ్చు)

చక్కని రాజమార్గం వుండగా గోడలు దూకట మెందుకు?

మార్చు

చక్కనైన చుక్క కోసం లెక్కలేని యిక్కట్లన్నట్లు

మార్చు

చక్రవర్తి చేస్తే శృంగారం - చాకలాడు చేస్తే వ్యభిచారం

మార్చు

చచ్చిన తరువాత తెలుస్తుంది శెట్టిగారి బండారం

మార్చు

చచ్చినదాని పిల్లలు వచ్చినదాని కాళ్ళ క్రింద

మార్చు

చచ్చిన పామును కొట్టటానికి అందరూ మొగాళ్ళే

మార్చు

చచ్చిన పామును కొట్టినట్లు

మార్చు

చచ్చిన బిడ్డకు చారడేసి కండ్లు

మార్చు

చచ్చినా............... పంచాంగం బ్రాహ్మణుడు వదలడు

మార్చు

చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం

మార్చు

ఇస్తానన్న కట్నం ఇవ్వకుండానె చచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు ఎంతో కొంత ఇస్తానన్న దాంతో తృప్తి పడి తీసుకోవడం ఉత్తమం అని దీని అర్థం.

చచ్చినోడి కళ్లు చారిడేసి

మార్చు

చని పోయిన వారి గురించి అన్ని మంచి విషయాలు మాత్రమే చెప్పతారు. వారు జీవించి వున్నప్పుడు చేసిన తప్పుడు పనులను చెప్పారు. అలా చెప్పేదె ఈ సామెత.

చచ్చే కాలానికి సత్యభామ వేషం వేసినట్లు

మార్చు

చచ్చేదాకా బ్రతికితే పెళ్ళి చేస్తామన్నట్లు

మార్చు

చచ్చేదాకా వైద్యుడు వదలడు

మార్చు

చచ్చే రోగికి మందు పట్టదు

మార్చు

చదవేస్తే ఉన్న మతి పోయినట్లు

మార్చు

బాగా చదివినవాడు, చిన్న చిన్న తప్పులు చేస్తే ఉపయోగంచే సామెత ఇది. చదివేస్తే ఉన్నమతి పోయింది అని

చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ

మార్చు

చదువు రాక ముందు అందరి లాగె కాకర కాయ అన్నాడు. చదువుకున్నాక అందరిలాగె కాకరకాయ అని అంటె తన ప్రత్యేకత ఏముంటుందని దాన్ని కీకరకాయ అన్నాడట. ఎవరైనా బడాయికి పోయి నప్పుడు ఈ సామెతను వాడుతారు.

చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు

మార్చు

చదువు రాని చాకలి ఊరందరి బట్టలు వుతికి వాటిని తిరిగి వారికెచ్చే టప్పుడు ఎక్కడ పొరబడకుండా ఎవరి బట్టలు వారికె ఇస్తాడు. ఎంత చదివిన వాడైన ఇలా కలిసి పోయిన బట్టలను ఎవరివి వారికి గుర్తించి ఇవ్వలేదు. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత.

చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు

మార్చు

తాను మాత్రం సుఖంగా ఉండేందుకు కావల్సిన ఏర్పాట్లన్నీ సరిచూసుకొని ఎదుటి వారు ఏమైపోతే నాకెందుకు అని అనుకునే వారిని విమర్శిస్తున్నట్లు కనిపిస్తుంది ఈ సామెత. ఈ సామెత రూపకల్పనలో అచ్చ తెలుగుతనం, జానపద హృదయ స్పందన, తెలుగింటి ఆహార అలవాట్ల వివరణ కనిపిస్తుంటాయి. ఉదయాన్నే చద్దెన్నం తినడమనేది పల్లెటూళ్ళలో నిత్యం కనిపించే ఒక విషయం. నేటి ఆధునిక సమాజంలో తిన్నట్లుగా 'టిఫిన్‌'ల పేరుతో ఏవేవో వంటకాలు తినడం కాక ఆరోగ్యానికి హాని కలిగించని విధంగా రోజంతా మనిషికి ఉత్సాహాన్ని కలిగించేందుకు దోహదం చేసే చద్దెన్నం తినడం ఎంతో మంచిది. ఈ అన్నం తిన్న వారికి మళ్ళీ మిట్ట మధ్యాహ్నం వరకు ఆకలీ, అలుపు ఉండవు. ఒక ఇంట్లో కొద్దిగా స్వార్థపరురాలైన ఒక ఇల్లాలు ఉదయాన్నే తాను మాత్రమే చద్దెన్నం తిని ఎంతసేపైనా తన భర్త ఆకలిని గుర్తించక వేరే ఆహార పదార్థాలు వండక కూర్చున్నదట. ఈ విషయాన్ని కొంత నిశితంగా పరిశీలిస్తే తన స్వార్థం తాను చూసుకొని ఎదుటివారు ఎంత ఇబ్బంది పడుతున్నా చూస్తూ కూర్చొనే వారు ఎంత మతిమాలిన వారోననే విషయం అర్థమవుతుంది.

చదివింది, చదవనిది ఒకటిగా ఉండటమే పండిత లక్షణం

మార్చు

చదివిన వాడికన్నా చాకలాడు మేలు - చాకలాడికన్నా మేకలాడు మేలు

మార్చు

చద్దికంటే ఊరగాయ నయం

మార్చు

చద్దికూడు తిన్నమ్మ మగడి ఆకలి ఎరుగదు

మార్చు

చద్దిమూటలో సారం చాకలెరుగును

మార్చు

చదువక ముందు కాకర కాయ - చదివిన తర్వాత కీకరకాయ

మార్చు

చదువరి మతికన్నా చాకలి మతి మేలు

మార్చు

చదువా లేదు - మరువా లేదు

మార్చు

దున్నబోతే దూడా -మెయ్యబోతే ఎద్దు

మార్చు

చదువు చన్ను విడిచి చన్ను పట్టుకునే లోపలే రావాలి

మార్చు

ఏమి తెలియని వయసులో అమ్మ చన్ను ఆసరాగా ఉంటాడు పిల్లాడు. కల్మషము తెలియని ఆ వయసు నుండి పెద్దయ్యాక భార్య వచ్చే వరకే బాధ్యతారహితంగా ఉండగలడు.

ఈ మధ్య సమయంలోనే చదువు మీద ఏకాగ్రత చూపగలడు. అందుకే ఈ సమయంలోనే చదువు ఒంటబట్టాలని పెద్దలు హితవుగా చెప్పే సామెత ఇది.

చదువు చారెడు - బలపాలు దోసెడు

మార్చు

చదువు మా యింటా వంటా లేదు

మార్చు

చదువురాని మొద్దు - కదలలేని ఎద్దు

మార్చు

చదువూ లేదు - సంధ్యా లేదు

మార్చు

కనీసం సంధ్యావందనం కూడా లేదని దానర్థము.చదువు లేకపోయినా కనీసం ఆచారమన్న ఉందా అని!లేదా కనీసము అది కూడా లేదు అని భావం

చదువు సన్నమయ్యె - అయ్య లావయ్యె

మార్చు

చనిపోయిన వారి కళ్ళు చారెడు

మార్చు

చని పోయిన వారెవరైనా వాని మంచి గుణాలను మాత్రమే చెప్తారు. చెడుగుణాలను చెప్పారు. ఇది ఒక సంప్రదాయం. ఆ చనిపోయిన వాడు తన జీవిత కాలంలో ఎలాంటి ఘన కార్యాలు చేయక పోయినా... కనీసం అతని కన్నులనైనా పొగడాలనే అర్థం ఈ సామెతలో ఉంది. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత.

చనువిస్తే చంక కెక్కినట్లు

మార్చు

చన్ను కుడిచి రొమ్ము గుద్దినట్లు

మార్చు

చన్ను, తోటకూర చేయి తగలందే పెరగవు

మార్చు

చన్ను, తోటకూర చేయి తగలందే పెరగవు

మార్చు

చలికి జడిసి కుంపటి ఎత్తుకున్నట్లు

మార్చు

చల్ల ఎట్లా వున్నయిరా అంటే చల్లకన్నా గొల్లదే బావుంది అన్నాట్ట

మార్చు

చల్ల కుండకు, చంటి బిడ్డకు చాటుండాలి

మార్చు

చల్లకొచ్చి ముంత దాచినట్లు

మార్చు

కొంతమంది మజ్జిగ కోసం పొరుగింటికెళ్ళి, మొహమాటంవల్లగాని వేరే ఏదైనా కారణంవల్లగాని అడగలేక తీసుకొచ్చిన ముంతను దాస్తుంటారు. ఎవరైనా ఈ విధంగా ఏదైనా సహాయంకోరి వచ్చి ఆఖరి నెముషంలో విషయాన్ని నానుస్తున్నప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

చలిరాత్రి విరహాలకు కౌగిళ్ళే దుప్పట్లు అన్నట్లు

మార్చు

చళ్ళు జారిన ముండకు వట్టలు జారిన విటుడు

మార్చు

చళ్ళు జారిన ముండకు వట్టలు జారిన విటుడు

మార్చు

చస్తే గానీ బర్రెపాడి బయటపడదు

మార్చు

చాకలి కొత్త -మంగలి పాత

మార్చు

చాకలి దానితొ చెప్పి చాలుకున్నదట

మార్చు

వివరణ: ఒక భర్త తన భార్యకు ఒక రహస్యంచెప్పి ఎవ్వరికి చెప్పవద్దన్నాడట. ఆమె ఒక్కచాకలి దాంతో మాత్రమే చెప్పి ఇంకెవ్వరికి చెప్పలేదట. తెల్లారె సరికి ఆ విషయం ఊరంతా తెలియడంతో... అతను తన భార్యను ఆరా తీశాడు. దానికి ఆమె ఒక్క చాకలి దానికి మాత్రమె చెప్పాన ని అన్నదట. చాకలిది ప్రతిరోజు ప్రతి ఇల్లు పలుమార్లు తిరిగే వ్వక్తి. అలాంటి వారికి చెప్పితే ఊరంతా తెలియకుంటుందా?? ఈ సామెత ఆ విధంగా పుట్టింది.

చాకలి తెలుపు, మంగలి నునుపు తప్ప అయ్యవద్ద పసేంలేదు

మార్చు

చాకలిది సందె ఎరుగదు - మాలది మంచమెరుగదు

మార్చు

చాకలి వాడు ఏ రేవున వుతికితేనేం?

మార్చు

చాకలి-మంగలి పొత్తు - ఇంటికి రాదు సొత్తు

మార్చు

చాదస్తపు మొగుడు చెపితే వినడు - చెప్పకపోతే కరుస్తాడు

మార్చు

చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు

మార్చు

ఈ సామెత కొద్దిగా అమాయకపు మొగుడి గురించి, పది మందిలో ఉన్నప్పుడు ప్రక్కవారిని అర్ధం చేసుకోకుండా, ప్రక్కవారి సున్నితపు సంకేతాల్ని పట్టించుకోకుండా, లౌక్యం లేకుండా ప్రవర్తించె వారిని ఉద్దేశించి అసహంగా వాడుతారు. ఇది నిజానికి శృంగారానికి సమయం అయినప్పుడు మెల్లిగా చెవిలో గొణుగుతుంది. అది పట్టించుకోని భర్తకు పైకి గట్టిగా చెప్పలేక పది మందిలో ఉన్న భర్తను పడక గదికి పిలువలేక తొడగిల్లుతుంది. దానిని అర్ధంచేసుకోలేని భర్త "అబ్బ ఏమిటే అలా గిల్లావు" అని ఏడుపు మోఖం పెడతాడు. ఆ సందర్భం నుండి పుట్ట్టిన సామెత ఇది. నర్మగర్భంగా చెబుతున్న విషయాన్ని అర్ధం చేసుకొని వారి పట్ల ఈ సామెతను వాడుతారు. అసలు సామెత "ఛాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు"

చాప క్రింది నీరులా

మార్చు

చాప కింద నీరు దాని మీద కూర్చున్న వారికి తెలియ కుండా వస్తాయి. ఆ విధంగా ఎవరికీ తెలియ కుండా.... తన ఉనికిని తెలియనీయకుండా ఇరువురి మధ్య కలహాలు పెట్టడాన్ని.... ఈ సామెతతో ఉదహరిస్తారు.

చారలపాపడికి దూదంటి కుచ్చు

మార్చు

ఉడుత పాపడుకి చారల శరీరంతోపాటు తోక దూదితో చేసిన కుచ్చులాగా ఉంటుంది.

చారాణా కోడికి భారాణా మసాలా

మార్చు

అసలు కన్నా కొసరెక్కువని ఈ సామెతకు అర్థం: ఇలాంటి అర్థాన్నిచ్చేదే ఇంకొక సామెత: గేదె పాతిక, బందె ముప్పాతిక

చాలని బట్ట కొంటే చినిగేవరకూ దుఃఖం - చాలని మగడిని చేసుకుంటే చచ్చేవరకూ దుఃఖం

మార్చు

చాలుపై చాలు దున్నితే చచ్చుచేనైనా పండుతుంది

మార్చు

చావా చావడు ప్రాణాలు తీస్తున్నాడన్నట్లు

మార్చు

చావుకంటే గండం లేదు

మార్చు

చావు కబురు చల్లగా చెప్పమన్నారు

మార్చు

చావు కాలానికి సమర్త కట్నాలు

మార్చు

చావుకు చావుందా?

మార్చు

చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు

మార్చు

ఏదైనా ప్రమాదం నుండిగాని, విపత్కర పరిస్థితి నుండిగాని ఎవరైనా అతి కష్టమ్మీద బయటపడినప్పుడు తమ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు.

చావుకు పెడితే గానీ లంఖణాలకు దిగడు

మార్చు

చావుకు ముదురు, లేతా వుంటాయా?

మార్చు

చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు

మార్చు

చింతకాయలమ్మేదానికి సిరిమానమొస్తే, చింతకాయను చూసి టుంకిరి బింకిరికాయ ఇదేమి కాయ అన్నదట

మార్చు

చింతకాయలు బేరం చేస్తూ వంకాయల్ని ఏరినట్లు

మార్చు

చింత చచ్చినా పులుపు చావనట్టు

మార్చు

చింత చెట్టు చచ్చినంత మాత్రాన అదివరకే దానికి కాచిన చింతకాయల పులుపు చావదు. కొంత మంది వయసు మీద పడినవారు కూడా ఇంకా యౌనపు వేషాలెఏస్తుంటే ఈ సామెత చెప్తారు.

చింత చెట్టు టూటిందంటే టూటేకాలమొస్తే టూటదా అన్నదట

మార్చు

చింతలు లేక పోతే సంతలో నైనా నిద్ర పోవచ్చు

మార్చు

ఎంతటి మెత్తటి పరుపులపై పడుకున్నా.... మనస్సు నిలకడగా లేక పోతే నిద్ర పట్టదు. కాని మనస్సులో ఏలాంటి కలతలు లేకుంటే సంతలోకూడ నిద్ర పోవచ్చుననేది ఈ సామెత అర్థం. సంత అన అనేక రణగొణుల ద్వని మయం. అయినా సరే నిద్ర పోవచ్చుననేది ఈ సామెత అంతరార్థం.

చింతలేనమ్మ సంతలో నిద్ర పోయిందట

మార్చు

చింతాకంత బంగారంతో మెడచుట్టూ గొలుసు కావాలన్నట్లు

మార్చు

చిక్కితే దొంగ - చిక్కకుంటే దొర

మార్చు

చిక్కినవానికి సిగ్గేమిటి?

మార్చు

చిక్కినవాడు సిగ్గెరుగడు - బలిసిన వాడు వావి ఎరుగడు

మార్చు

చిచ్చుగలవారి కోడలు చిత్రాంగి

మార్చు

చిచ్చు అంటుకొంటే చేతులతో ఆర్పగలమా?

మార్చు

చిచ్చును ఒడినికట్టి తెచ్చినట్లు

మార్చు

చిటికెలతో పందిరి వేసినట్లు

మార్చు

చిత్తం వనితల మీద - ధ్యానం దేవుడి మీద

మార్చు

చిత్తకార్తె కుక్కలాగా

మార్చు

చిత్త కురిస్తే చింతలు కాస్తాయి

మార్చు

చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పంటిస్తాను అంటుంది వరి

మార్చు

చిత్త చినుకు తన యిష్టమున్న చోట పడుతుంది

మార్చు

చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే వీసానికి పుట్టెడు పండుతానంటుంది జొన్న

మార్చు

చిత్త జల్లు - చిత్త ఉబ్బ

మార్చు

చిత్త జల్లు - స్వాతి వాన

మార్చు

చిత్తకు చిరుపొట్ట వరికి

మార్చు

చిత్తరువుకు జీవం వచ్చినట్లు

మార్చు

చిత్తలో చల్లితే చిట్టెడు కాపు

మార్చు

చిత్తలో పుట్టి స్వాతిలో చచ్చినట్లు

మార్చు

చిత్తశుద్ధిలేని శివపూజ లెందుకు?

మార్చు

చిత్త, స్వాతీ సంధించినట్లు

మార్చు

చిత్త స్వాతులు చిత్తగించి విశాఖ విసురుతే మొదలు తంతే ఏడు గింజలు రాలుతాయి

మార్చు

చితి చచ్చినవాణ్నీ, చింత బ్రతికిన వాణ్నీ కాలుస్తుంది

మార్చు

చిత్తం చెప్పులమీద దృష్టేమో శివుడిమీద

మార్చు

దేవుడి దగ్గరకు వెళ్ళినపుడు కొంతమందికి దృష్టి దేవుడి మీద కన్నా బయట వదలిన చెప్పుల మీదనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళను ఉద్దేశించి చెప్పినదే ఈ సామెత.

చిత్తం చెప్పుల మీద - భక్తి శివుడి మీద

మార్చు

చిత్తం మంచిదయితే వూరూ మంచిదవుతుంది

మార్చు

చిత్తం వనితల మీద - ధ్యానం దేవుడి మీద

మార్చు

చిత్తశుద్ది లేని శివపూజలేల

మార్చు

పూజా సమయంలో మనసు దేవునిమీద నిలిపి వుంచాలి. అలా లేనప్పుడు ఆ పూజ ఫలితానివ్వదు. ఏపని చేసినా దాని మీద ద్యాస వుంచాలి. ఇది ఈ సామెత అర్తం.

చిదంబర రహస్యం

మార్చు

చిన్ననోటికి పెద్దమాట

మార్చు

చిన్నమ్మ సింహద్వారాన వస్తే - పెద్దమ్మ పెరటిద్వారాన పోతుంది

మార్చు

చిన్నమ్మ చిందేస్తే, చీరదారి చీరది ,సింగారందారి సింగారానిది

మార్చు

చిన్న యిల్లు - పెద్దకాపురం

మార్చు

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి

మార్చు

ఎంత చిన్న పనైనా పూర్తి శక్తితో శ్రమించాలని ఈసామెతలోని అర్థం:

చిన్న రాయితో ముడ్డి తుడుచుకొని చెయ్యంతా పియ్యి చేసుకున్నట్లు

మార్చు

చిన్నవాళ్ళు తింటే చిరుతిండి - పెద్దవాళ్ళు తింటే ఫలహారం

మార్చు

చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష

మార్చు

చినుకులకు చెరువు నిండుతుందా?

మార్చు

చిమడకే చిమడకే ఓ చింతకాయా! నీవెంత చిమిడినా నీ పులుపు పోదే!

మార్చు

చిలకకు చెప్పినట్లు

మార్చు

చిలకను పెంచి బావురుగానికి అప్పజెప్పినట్లు

మార్చు

చిల్లర దేవుళ్ళలాగా

మార్చు

చిల్లరదేవుళ్ళకు మొక్కీ చిత్తం చెడగొట్టుకున్నట్లు

మార్చు

చిల్లి బాగాలేదని బెజ్జం వేశాడట

మార్చు

చిలిపి వూహల వయ్యారికి చిలిపిదనాల శృంగారం అన్నట్లు

మార్చు

చిలుం పట్టేవాడికి చిత్తం కుదరదు

మార్చు

చిలుం వదిలితేగానీ ఫలం దక్కదు

మార్చు

చిలుం వదిలిస్తే గానీ చీద్రం వదలదు

మార్చు

చిలుకపోతే పంజరం ఎందుకు?

మార్చు

చిల్లి బాగాలేదని బెజ్జం వేసినట్లు

మార్చు

చివికి చివికి గాలివాన అయినట్లు

మార్చు

చీకటింట్లో చిందులు వేసినట్లు

మార్చు

చీకటింట్లో సివాలాడినట్లు

మార్చు

చీకటింటికి పోతే సిగ్గైతది అంటే,అట్లైతే సంసారమెట్లైతది అన్నారట

మార్చు

చీకటి కొన్నాళ్లు వెన్నెల కొన్నాళ్లు

మార్చు

కష్టాలు కొన్నాళ్లు సుఖాలు కొన్నాళ్లు అని అర్థం. ఎల్లప్పుడు కష్టాలె వుండవని చెప్పే సామెత ఇది.

చీకితే లేనిది నాకితే వస్తుందా?

మార్చు

చీకటి లేకపోతే దీపమెందుకు?

మార్చు

చీకు లావుకం తొక్కినట్లు

మార్చు

ఛీ! కుక్కా అంటే, ఏమక్కా! అని అన్నదట

మార్చు

చీటీకి ప్రాణం వ్రాలు

మార్చు

చీడ అంటుతుందిగానీ, సిరి అంటదు

మార్చు

చీద్రానికి చీరపేలు - దారిద్ర్యానికి తలపేలు

మార్చు

చీదితే ఊడిపోయే ముక్కు తుమ్మితే ఉంటుందా!

మార్చు

శాశ్వతము కానికి అని అర్థం. శాశ్వతము కాని విషయము చెప్పేటప్పుడు ఈ సామెతను వాడుతారు.

చీదితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళుంటుంది?

మార్చు

చీమ ఒళ్ళు చీమకు బరువు - ఏనుగు ఒళ్ళు ఏనుగుకు బరువు

మార్చు

చీమలు చెట్టెక్కితే భూములు పండుతాయి

మార్చు

చీమలు పాకితే రాళ్లరుగుతాయా

మార్చు

అల్పులకు సహాయం చేసినందువల్ల సంపన్నులకు ఎలాంటి నష్టమూ ఉండబోదు.

చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలు

మార్చు

చీర కట్టినమ్మ శృంగారం చూడు - గుడ్డ కట్టినమ్మ కులుకు చూడు

మార్చు

చీరపోతులేరేయటంకంటే బొంతను కాల్చేయటం మేలు

మార్చు

చీర సింగారించేటప్పటికి ఊరు మాటు మణిగింది

మార్చు

చీరకు సిగ్గులు - రవికకు ముద్దులు నేర్పినట్లు

మార్చు

చీరే శృంగారం స్త్రీకి

మార్చు

చుట్టు అయినా సులువు దారే మంచిది

మార్చు

చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు

మార్చు

చుట్టుగుడిసె అనగా అతి చిన్న నివాసము. అది వుంటే దాన్ని శుభ్రం చేసుకోవడము చాల సులభము. అలాగే బోడి గుండు వుంటే తల స్నానము చేయడము అతి సులభము.. అలా పుట్టినదే ఈ సామెత.

చుట్టతాగి చూరులో పెడితే ఇల్లు కాలిందట

మార్చు

చుట్టమై చూడవస్తే దయ్యమై పట్టుకున్నట్లు

మార్చు

చుట్టూ చూరు మంగళం - నడుమ జయమంగళం

మార్చు

చుట్టూ శ్రీవైష్ణవులే - కల్లుకుండ కనబడటం లేదు

మార్చు

ఇలాంటిదే మరో సామెత: అందరూ వైష్ణవులే....... రొయ్యల బుట్ట మాయమైనదట......

చూచేవారుంటే సొమ్ములు పెట్టాలి - చేసేవారుంటే పిల్లల్ని కనాలి

మార్చు

చూడవమ్మ సుతారం - ఇంటావిడ అవతారం

మార్చు

చూడ చుట్టము లేదు - మ్రొక్క దైవము లేదు

మార్చు

చూపితే మానం పోయె - చూపకపోతే ప్రాణం పోయె

మార్చు

చూపులకు సుందరి - మాటలకు మంధర

మార్చు

చూపులకే ఆబోతు రూపం - పనిలో నీరసాలరాజు

మార్చు

చూడబోతే చుట్టాలు రమ్మంటే కోపాలు

మార్చు

అవసరంలో ఆదుకోకుండా ముఖం తిప్పుకొని వెళ్లి పోయే బంధువులు. అలాంటివారిగురించి ఈ సామెత పుట్టింది

చూపుడాబేగానీ చేతడాబు లేదు

మార్చు

పైన పటారం లోన లొటారం లాంటిదే ఈ సామెత.

చూపులకు కడుపులొస్తాయా? ముద్దులతో ఆకలి తీరుతుందా?

మార్చు

చూపులు దేవుని మీద చిత్తం బయట వదిలిన చెప్పుల మీద

మార్చు

దేవుని మీత చిత్తం నిలపలేక పోవటము. వారినుద్దేసించిన సామెత ఇది. జనం గుడిలోనికెళ్ళెటప్పుడు చెప్పులు బయట వదిలేసి లోపలికి వెళ్ళతారు. ఇదే అదనుగా భావించి కొందరు ఆ చెప్పులను ఎత్తుకొని వెళుతుంటారు. అలా చెప్పులు బయట వదిలి లోనికి వచ్చిన భక్తులకు మనసులో వారు బయట వదిలిన చెప్పులు ఎవరైనా ఎత్తుకెళ్ళారో యని అలోచిస్తూ దేవునిపైన మనస్సు నిలుపలేక పాతారు. ఆ విధంగా పుట్టినది ఈ సామెత.

చూపులకే కడుపొస్తే మొగుడెందుకు అందిట

మార్చు

చూపుల మగవాడే కానీ - సుఖాల మగడు కాదు అన్నట్లు

మార్చు

చూపుల పసే గానీ చేతల పసలేదన్నట్లు

మార్చు

చూపులో చుక్కలు -కోకలో సోకులు

మార్చు

చూపే శృంగారం - ఊపే వయ్యారం

మార్చు

చూరుకత్తి తెగుతుంది కానీ చూపుకత్తి తెగుతుందా?

మార్చు

చూసి త్రొక్కు - తెలిసి మ్రొక్కు

మార్చు

చూసి మురుసుకొని - చెప్పి ఏడ్చుకొని

మార్చు

చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు

మార్చు

రామాయణంలో రాముడు హనుమంతున్ని సీత ఎక్కడుందో చూసి రమ్మని పంపితే, హనుమంతుడు లంకలో ఉన్న సీతను చూడటమేకాకుండా లంకానగరం మొత్తాన్ని కాల్చి రావడం మనకు తెలిసిందే. అదే విధంగా, ఎవరైనా చెప్పిన పని మాత్రమే కాకుండా చెప్పని పనులు కూడా చేసి వచ్చినప్పుడుగాని, అలా చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పడు గాని ఈ సామెతను వాడుతారు

చూస్తూ వూరుకుంటే మేస్తూ పోయిందట

మార్చు

చూస్తే పొరపాటు - చూడకుంటే గ్రహపాటు

మార్చు

చూస్తే చుక్క - లేస్తే కుక్క

మార్చు

చూస్తే చుక్క రేగితే కుక్క

మార్చు

సౌమ్యంగా కన్పిస్తూ భయంకరంగా పోట్లాడేవారిని గురించి ఈ సామెతను వాదతారు.

చెంబు అమ్మి తపేలా - తపేలా అమ్మి చెంబు

మార్చు

చెంబు చేతిలో ఉంటే కంభము వరకు పోయిరావచ్చు

మార్చు

చెక్కెర పందిట్లో తేనెల వాన కురిసి నట్లు

మార్చు

అన్ని విషయాలు కలిసి వస్తుంటే ఈ సామెత వాడతారు. అతనికి పట్టిందల్లా బంగారమె.. అనే సామెత లాంటిదె ఇది.

చెట్టు ఎక్కేవాడికి ఎంతదాకా ఎక్కుడు మెట్లు పెట్టగలం?

మార్చు

చెట్టు ఎక్కనిచ్చి నిచ్చెన తీసినట్లు

మార్చు

చెట్టు చచ్చినా చేవ చావదు

మార్చు

చెట్టు చెడు కాలానికి కుక్క మూతి పిందెలు కాస్తుందట

మార్చు

విపరీత కాలానికి విపరీతమైన బుద్ధులు పుడుతాయని అర్థం. అలా విపరీతంగా ప్రవర్తించే వారి గురించి ఈ మాట వాడతారు.

చెక్కకపోతే దిమ్మ - చెక్కితే బొమ్మ - గుళ్ళో వుంటే అమ్మ అన్నట్లు

మార్చు

చెట్టు నాటేదొకడు - ఫలం అనుభవించే దొకడు

మార్చు

చెట్టు నీడకు పోతే కొమ్మ విరిగి మీద పడ్డట్లు

మార్చు

చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకొన్నట్లు

మార్చు

చెట్టునుబట్టే కాయ

మార్చు

చెట్టులేని చేను - చుట్టాలు లేని ఊరు

మార్చు

చెట్టెక్కి చేతులు విడిచినట్లు

మార్చు

చెట్టు వెనుకాల చందమామ తొంగి తొంగి చూస్తుందని, గుడిసె వెనుకాల కోడి గుడ్డు పెట్టనందట

మార్చు

అత్యంత అమాయకుల గురించి ఈ సామెత పుట్టింది.

చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం

మార్చు

మోసకారి మాటలతో మోసంచేసె వారి గురించి ఈ సామెత పుట్టింది.

చెట్టు ముందా విత్తు ముందా

మార్చు

అసంబద్దమైన ప్రశ్నలు వేసె వారిని గురించి ఈ సామెత పుట్టింది

చెడదున్ని శనగలు చల్లమన్నారు

మార్చు

చెడపకురా చెడేవు

మార్చు

ఇతరులకు చెడు తలపెడితె తానె చెడి పోతాడనె అంతరార్థం ఈ సామెత భోదిస్తున్నది.

చెడిన కాపురానికి ముప్పేమిటి? చంద్రకాంతలు వండవే పెళ్ళామా అంటే

మార్చు

చెడిన చేనుకు ముప్పేమిటి? మొండికాలికి చెప్పేమిటి?

మార్చు

చెడిన శ్రాద్ధం చెడనే చెడింది - పిత్తరా పీట పగుల అన్నట్లు

మార్చు

చెడినా, పడినా చేసుకున్న మొగుడు తప్పడు

మార్చు

చెడినా శెట్టి శెట్టే - చినిగినా పట్టు పట్టే

మార్చు

చెడి బ్రతికినమ్మ చేతలు చూడు - బ్రతికి చెడ్డమ్మ చేతులు చూడు

మార్చు

చెడి స్నేహితుని ఇంటికి పోవచ్చుకానీ చెల్లెలింటికి పోరాదు

మార్చు

చెడుకాలానికి చెడు బుద్ధులు

మార్చు

చెడుచెడుమనే వారేగానీ చేతిలో పెట్టేవారు లేరు

మార్చు

చెన్నంపల్లి పంచాయతీ చెరిసగం

మార్చు

చెప్పటం తేలిక - చేయటం కష్టం

మార్చు

చెప్పటం కంటే చేయడం మేలు

మార్చు

చెప్పి నేర్పినమాట మంచిమాట

మార్చు

చెప్పింది చేయకు - చేసేది చెప్పకు

మార్చు

చెప్పి చెప్పి చెప్పుతో తన్నించుకో - మళ్ళీ వచ్చి మాతో తన్నించుకో

మార్చు

చెప్పితే సిగ్గు - దాస్తే రోగం

మార్చు

చెప్పుక్రింద తేలులాగా

మార్చు

చెప్పుడు మాటలకన్నా తప్పుడు మాటలు నయం

మార్చు

చెప్పుడు మాటలు చేటు

మార్చు

చెప్పులున్న వాడితోనూ, అప్పులున్న వాడితోనూ పోరాదు

మార్చు

చెప్పులు కుట్టేవాడి దృష్టి నడుస్తున్న వాళ్ళ కాళ్ళమీదే

మార్చు

చెప్పులోని రాయి - చెవులోని జోరీగ

మార్చు

చెప్పులోని రాయి - ఇంటిలోని పోరు ఒక్కటే

మార్చు

చెప్పేవాడికి చేసేవాడు లోకువ

మార్చు

ఇలాంటిదె మరొక సామెత: చెప్పే వాడికి వినే వాడు లోకువ

చెప్పేవాడికి చాదస్తమయితే వినేవాడికి వివేకం ఉండొద్దా?

మార్చు

చెప్పేవి నీతులు - తీసేవి గోతులు

మార్చు

చెప్పేవాడికి వినేవాడు లోకువ

మార్చు

చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు

మార్చు

శ్రీరంగడు అంటే శ్రీ మహా విష్ణువు. శ్రీరంగనీతులు అంటే శ్రీ మహా విష్ణువు పేరుతో చెప్పే నీతులు. దొమ్మరి కులస్తులలో కొంత మంది పేదరికం, ఆకలి వల్ల మనసు చంపుకుని వ్యభిచారం చేస్తారు. కొంత మంది తాము గౌరవంగల మనుషులమని చెప్పుకుంటూనే అందుకు విరుద్ధంగా వ్యభిచారిణులతో పడుకుంటారు. శ్రీరంగ నీతులు చెపుతూ దొమ్మరి గుడిసెలలో దూరడం అంటే దేవుని పేరుతో నీతులు చెపుతూ అందుకు విరుధ్ధముగా పాడు పనులు చెయ్యడం అని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు.

చెముడా అంటే మొగుడా అన్నట్టు

మార్చు

చెరుకా బెల్లం పెట్టమంటే పెడుతుందా?

మార్చు

కఠినంగా ప్రవర్తించటానికి వెనకాడితే ఫలితాలు చేతికందవు.బెల్లం కావాలి అంటే చెరకు గడను పిండి పిప్పి చేసి రసం తీసి వండాలి.

చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు

మార్చు

చెవిటివాడి ముందు శంఖం ఊదితె అందులోని మాధుర్యం వాడు గ్రహించ లేడు. అలా నిరర్థకమైన పనులు చేసే వారి గురించి ఈ సామెత చెప్తారు.

చెవిలో జోరీగ

మార్చు

చెవిలో దూరిన జోరీగ మనిషికి నాన ఇబ్బంది పెడుతుంది. ఆవిధంగా తనకు ఉపయోగం లేకున్న ఇతరులను ఇబ్బంది పెట్టె వారి గురింది ఈ సామెత పుట్టింది.

చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు...

మార్చు

చెరపుకరా చెడేవు

మార్చు

ఎదుటి వాడికి చెడు చేయాలని తలిస్తే తానె చెడి పోతాడు. అనే అర్థంతో ఈ సామెత పుట్టింది.. ఇలాంటిదే ఇంకో సామెత వుంది: అది. తాను తీసిన గోతిలో తానె పడ్డట్టు

చెప్పేవి శ్రీరంగనీతులు - చేసేవి దొమ్మరి పనులు

మార్చు

చెమటే చందనం - అధరమే అమృతం అన్నట్లు

మార్చు

చెయ్యంగా లేంది చెపితే తీపరమా?

మార్చు

చెయ్యి చూసి అవలక్షణ మనిపించుకున్నట్లు

మార్చు

చెయ్యిని దాచుకుంటాం గానీ కులం దాచుకుంటామా?

మార్చు

చెయ్యి పుచ్చుకు లాగితే రాలేదుగానీ రమ్మని చీటీ వ్రాశాట్ట

మార్చు

చెరపటానికి చేతులు వస్తాయి గానీ నిలపడానికి చేతులు రావు

మార్చు

చెరపకురా చెడేవు - ఉరకకురా పడేవు

మార్చు

చెరకు తోటలో ఏనుగు పడట్లు

మార్చు

చెరకు పిప్పికి ఈగలు మూగినట్లు

మార్చు

చెరకు వంకరపోతే తీపి చెడుతుందా?

మార్చు

చెరువు ఎండితే చేపలు బయటపడ్డట్లు

మార్చు

చెరువు ఓడు - ఊరు పాడు

మార్చు

చెరువుకు గండిపడి నీళ్ళు పోతుంటే, పీత బొక్కలు పూడ్చినట్లు

మార్చు

చెరువుకు చేరువ - చుట్టాలకు దూరం ఉండాలి

మార్చు

చెరువు నిండితే కప్పలు చేరవా?

మార్చు

సుమతీ శతకంలో పద్యం: తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ.......

చెరువు నిండితే కప్పలు చేరుతాయి

మార్చు

చెరువు నిండితే కప్పలు - సంపదలోనే చుట్టాలు

మార్చు

సుమతీ శతక పద్యం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బందువులొత్తురు, తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ......

చెరువు మీద అలిగి ముడ్డి కడుక్కోవటం మానినట్లు

మార్చు

చెరువు మీద అలిగి....స్నానం చేయనట్లు

మార్చు

చెరువు మీద అలిగి స్నానం చేయకపోతె చెరుకేమి నష్టం లేదు. అది గ్రహించని అమాయకుల గురించి ఈ సామెత పుట్టింది.

చెరువు ముందు చలివేంద్రం పెట్టినట్లు

మార్చు

చెరువులో వున్న గేదెను కొమ్ములు చూసి బేరమాడినట్లు

మార్చు

చెలి మాట తేనెల వూట

మార్చు

చెల్లని కాసుకు కాంతులు మెండు

మార్చు

చెల్లని కాసుకు గుర్తు లెక్కువ

మార్చు

చెల్లని కాసూ - ఒల్లని మొగుడూ ఒక్కటే

మార్చు

చెల్లని దాన్ని చేనికాడ పెడితే అయిన కంకులన్నీ అమ్మగారింటికి పంపిందట

మార్చు

చెల్లీ చెల్లడాలకు శెట్టిగారున్నారు

మార్చు

చెల్లెలు మొగుణ్ణి చూసుకొని చెయ్యిరగ బడిందట

మార్చు

చెవి తెగిన మేకవలె

మార్చు

చెవిటి చెన్నప్పా అంటే సెనగల మల్లప్పా అన్నట్లు

మార్చు

చెవిటిదానా సేసలు పట్టమంటే బియ్యం తినిఉంటే అశుద్ధం తిన్నట్లే అందట

మార్చు

చెవిటివానిముందు శంఖ మూదినట్లు

మార్చు

చెవిటివాని ముందు శంఖమూదితే దాన్ని కొరకను నీ తాతలు దిగి రావాలన్నాడట

మార్చు

చెవిటి వానికి వినిపించాలంటే శంఖు చక్రాలవాడు దిగిరావాలి

మార్చు

చెవి దగ్గర కందిరీగలాగ

మార్చు

చెవులను బట్టి గాడిదను పోల్చుకోవచ్చు

మార్చు

చెవులు కోసుకు పోతుంటే కుట్టుపోగులకేడ్చినట్లు

మార్చు

చెవిలో గుబిలికి ఏ పుల్లైతేనేం గెలుక్కోను ?

మార్చు

చేటలో వెలగకాయల్లాగా

మార్చు

చేటు కాలానికి చేటు బుద్ధులు

మార్చు

చేటూ పాటూ లేనమ్మ ఇల్లెక్కి పిండి కొట్టిందట

మార్చు

చేతకానమ్మకు రోష మెక్కువ

మార్చు

చేతకానివాడికి చేష్టలు ఎక్కువ

మార్చు

చేతలు శూన్యం - మాటలు బహుళం

మార్చు

చేతికర్ర చేదోడు వాదోడు

మార్చు

చేతికి గడియారం - ఇంట్లో పొడివారం

మార్చు

చేతికి పట్టిన జిడ్డు లెక్కకు రాదు

మార్చు

చేతి చమురు వదిలినట్లు

మార్చు

చేతిలో వుంటేనే అర్థం - పక్కలో వుంటేనే పెళ్ళాం

మార్చు

చేతిలో విషమున్నా తినందే చావరు

మార్చు

చేతి వ్రేళ్ళు అయిదూ ఒక రీతిగా ఉన్నాయా?

మార్చు

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు

మార్చు

చేతకాక మంగళవారమన్నాడంట

మార్చు

ఏదైనా ఒక పని చేయడానికి చేత కాక పోతె తప్పించు కోడానికి ఏదో సాకు చెప్పే వారిని గురించి ఈ సామెత పుట్టింది.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు

మార్చు

జరగాల్సిన నష్టం జరిగి పోయాక ఆ తర్వాత తీరిగ్గా నివారణ చర్యలు చేపట్టే అమాయకులను మేల్కొనడానికి ఈ సామెతను చెప్తారు.

చేతిలో చిల్లిగవ్వ లేదు మీసాలకు సంపెంగ నూనె

మార్చు

చేతిలోని అన్నం చెరువులోకి విసిరి చెయ్యి నాకి చెరువునీళ్ళు తాగినట్లు

మార్చు

చేతి సొమ్ము ఇచ్చి చెప్పుతో కొట్టించుకున్నట్లు

మార్చు

చేతైన మగోడు చాలా పొద్దున లేచి ఊడ్చుకొని చల్లుకొని ఇంకోచోట పడుకున్నాడట

మార్చు

చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి

మార్చు

మనిషికైనా... ఊరికైనా మరేదేనికైనా ఒక పద్ధతి కట్టు బాటు వుండాలని ఈ సామెత నిర్థేసిస్తున్నది.

చేపపిల్లకు ఈత నేర్పాలా?

మార్చు

చేయని చేతులు - కుడవని నోరు

మార్చు

చేయని శృంగారం - మాయని మడత

మార్చు

చేయలేనమ్మకు చేతినిండా పని

మార్చు

చేయలేనమ్మకు కులుకులు మెండు - వండలేనమ్మకు వగపులు మెండు

మార్చు

చేలో పుట్టిన బీడు ఎక్కడికి పోను?

మార్చు

చేలో పొత్తు కళ్ళంతో సరి

మార్చు

చేలో లేనిది చేతిలో కెలా వస్తుంది?

మార్చు

చేసింది పోదు - చేయంది రాదు

మార్చు

చేసినదంతా అనుభవించాలి

మార్చు

చేసిన చేష్టలు ఎవరూ చూడరు, కోసిన ముక్కు అందరూ చూస్తారు

మార్చు

చేసిన చేతికి చేవ - చేయనిచేతికి చీకు

మార్చు

చేసిన చేతికే వెన్న ముద్దలు

మార్చు

చేసిన పాపం చెపితే పోతుందా?

మార్చు

చేసిన పాపాలకూ పెట్టిన దీపాలకూ సరి

మార్చు

చేసిపోయిన కాపురం చూసిపోను వచ్చినట్లు

మార్చు

చేసిన మేలు వృధా కాదు - చేసిన కీడు వృధా పోదు

మార్చు

చేసిన వారికి చేసినంత మహదేవ!

మార్చు

చేసుకున్న తర్వాత వండిపెట్టక తప్పుతుందా?

మార్చు

చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ

మార్చు

ఎవరు చేసుకున్న పాప పుణ్యాల మేరకు వారికి ఫలితము వస్తుందని ఈ సామెత చెప్పుతున్నది.==

చేసుకున్న కడుపు దింపుకోక తప్పదు

మార్చు

చేసేదేమో బీదకాపురం - వచ్చేవేమో రాజరోగాలు

మార్చు

చేసేది శివ పూజ - దూరేది దొమ్మరి గుడిసె

మార్చు

చేసే పని చేయమంటే - నేసేవానివెంట పోతానన్నట్లు

మార్చు

చేసేవి నాయకాలు, అడిగేవి తిరుపాలు, పెట్టకుంటే కోపాలు

మార్చు

చేసేవి లోపాలు - చెపితే కోపాలు

మార్చు

చేసేవి శివపూజలు - చెప్పేవి అబద్ధాలు

మార్చు

చేస్తే మంచిపని చేయాలి - బ్రతికితే మంచిగా బ్రతకాలి

మార్చు

చోటే లేదంటే మూల కూర్చోనా అన్నట్లు

మార్చు

చొప్పవామిలో నిప్పు దాచుకొన్నట్టు

మార్చు

శత్రువును తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నష్టమే కలుగుతుందని తెలిపే సామెత ఇది. చొప్ప వామిలో నిప్పు దాచుకుంటే ఆ వామి అంతా కాలిపోతుందు. అనగా అలాంటి అమాయకపు పనుల వలన విపరీతమైన నష్టము వస్తుందని చెప్పడము ఈ సామెత ముఖ్యోద్దేశము.

ఛారాన కోడికి బారాన మసాల.

మార్చు

మూలాలు

మార్చు
  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం